Eastern Power Distribution Company of AP Limited

Call Website Contact the organization

Eastern Power Distribution Company of AP Limited APEPDCL - Eastern Power Distribution Company of Andhra Pradesh Limited.

08/10/2026

రోడ్లు ఎందుకు తవ్వుతున్నారు? అసలు ఈ పనుల వల్ల ప్రజలకు కలిగే ప్రయోజనాలేంటి? ⚡

ప్రజలకు మరింత సురక్షితమైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు చేస్తారు. విద్యుత్ ప్రమాదాలను తగ్గించడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలను నివారించడం, విద్యుత్ పంపిణీ వ్యవస్థను మరింత పటిష్టం చేయడమే ఈ పనుల ప్రధాన ఉద్దేశం. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, మెరుగైన విద్యుత్ సేవలను అందించడమే ఏపీఈపీడీసీఎల్ లక్ష్యం.

📞 విద్యుత్ సంబంధిత ఫిర్యాదుల కోసం 1912కు కాల్ చేయండి.

వైర్‌తో ప్రయోగం వద్దు.. ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు!Plug లేకుండా Wire‌ను నేరుగా Socket‌లో పెట్టడం వల్ల Electric Shock...
07/10/2026

వైర్‌తో ప్రయోగం వద్దు.. ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు!

Plug లేకుండా Wire‌ను నేరుగా Socket‌లో పెట్టడం వల్ల Electric Shock, Sparking, Short Circuit వంటి ప్రమాదాలు సంభవించవచ్చు. ప్రతి విద్యుత్ పరికరానికీ సరైన Plug, సురక్షితమైన Wiring మాత్రమే ఉపయోగించండి. విద్యుత్ విషయంలో Shortcuts వద్దు — భద్రతకే ప్రాధాన్యం ఇవ్వండి. ⚡

విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ...
06/10/2026

విద్యుత్ సరఫరాలో అంతరాయాలను తగ్గించి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు విశాఖపట్నంలోని APEPDCL 1912 కాల్ సెంటర్‌ను సందర్శించారు. వినియోగదారుల ఫిర్యాదులపై సిబ్బంది స్పందిస్తున్న తీరును పరిశీలించి, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. విద్యుత్ సేవల్లో నాణ్యత, పారదర్శకత, వినియోగదారుల సంతృప్తికి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.

విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తూ, 43 మంది అర్హులైన అభ్యర్థులకు కారుణ్...
06/10/2026

విద్యుత్ శాఖలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలుస్తూ, 43 మంది అర్హులైన అభ్యర్థులకు కారుణ్య నియామక పత్రాలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు అందజేశారు. గత మూడేళ్లలో విద్యుత్ శాఖ పరిధిలో 445 మందికి పైగా కారుణ్య నియామకాలు కల్పించి, బాధిత కుటుంబాలకు ఉపాధి అవకాశాలు, ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ⚡

ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘సేవా సేతు అభియాన్’ పోస్టర్‌ను మంత్రి గొట్టిపాటి రవ...
06/10/2026

ప్రజలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలను మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ‘సేవా సేతు అభియాన్’ పోస్టర్‌ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి, సేవలను ప్రజలకు మరింత చేరువ చేయనున్నారు.

Energy Minister Gottipati Ravi Kumar garu emphasized strengthening Andhra Pradesh’s power supply through improved infras...
06/10/2026

Energy Minister Gottipati Ravi Kumar garu emphasized strengthening Andhra Pradesh’s power supply through improved infrastructure, increased generation capacity and workforce expansion. He highlighted over 445 compassionate appointments, plans to fill 629 Assistant Engineer vacancies and additional staffing to meet rising electricity demand, while reaffirming the government’s commitment to reliable power supply without increasing electricity tariffs. ⚡

Energy Minister Gottipati Ravi Kumar garu highlighted the appointment of over 445 employees on compassionate grounds in ...
06/10/2026

Energy Minister Gottipati Ravi Kumar garu highlighted the appointment of over 445 employees on compassionate grounds in the power sector over the past three years, supporting families who lost their loved ones in service. He also emphasized employee safety, mandatory training for staff and contractors, and strengthening the power sector through recruitment and workforce development. ⚡

Energy Minister Gottipati Ravi Kumar garu emphasized efficient electricity consumption, daylight usage, renewable energy...
06/10/2026

Energy Minister Gottipati Ravi Kumar garu emphasized efficient electricity consumption, daylight usage, renewable energy adoption and rooftop solar under the PM Surya Ghar scheme. He reviewed APEPDCL’s 1912 call centre to improve grievance redressal, highlighted recruitment and compassionate appointments, and underscored strengthening power generation, transmission and distribution, including the commissioning of a 220-kV substation at Achutapuram. ⚡

06/10/2026

వినియోగదారులకు మరింత మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే లక్ష్యంగా... ⚡

విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ 1912 కాల్ సెంటర్‌ను విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవి కుమార్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. 1912 కాల్ సెంటర్‌లో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార వేగం, సిబ్బంది స్పందనను పరిశీలించడంతో పాటు... ‘డయల్ యువర్ సీఎండీ’ ద్వారా పరిష్కారమైన ఫిర్యాదు గురించి వినియోగదారుడితో నేరుగా మాట్లాడి, ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్నారు.ప్రతి ఫిర్యాదుకు సత్వర పరిష్కారం, ప్రతి వినియోగదారుడి సంతృప్తే లక్ష్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. ⚡

# Poweringpeople

విద్యుత్ వినియోగదారుల సమస్యలకు పరిష్కారం అందించేందుకు APEPDCL ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు డివిజన్‌లో CGRF ...
05/10/2026

విద్యుత్ వినియోగదారుల సమస్యలకు పరిష్కారం అందించేందుకు APEPDCL ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు డివిజన్‌లో CGRF క్యాంపు కోర్ట్ నిర్వహించబడుతుంది.

📅 తేదీ:06.10.2026
🕙 సమయం: ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు
📍 వేదిక: నిడదవోలు డివిజన్, తూర్పు గోదావరి జిల్లా

దీర్ఘకాలంగా పరిష్కారం కాని విద్యుత్ సంబంధిత సమస్యలపై CGRF క్యాంపు కోర్ట్‌లో వినియోగదారులు నేరుగా పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు.

🔹 సరఫరాలో అంతరాయాలు
🔹 మీటర్ లోపాలు
🔹 కాలిపోయిన మీటర్లు
🔹 ఓవర్‌లోడ్‌లో హెచ్చుతగ్గులు
🔹 సర్వీస్ లోపాలు
🔹 కనెక్షన్ మార్పు
🔹 కొత్త కనెక్షన్ జారీలో ఆలస్యం
🔹 బిల్లింగ్ సమస్యలు
🔹 బిల్లుల్లో తప్పులు

తదితర విద్యుత్ సంబంధిత సమస్యలపై ఫిర్యాదులను CGRF క్యాంపు కోర్టుకు తెలియజేయవచ్చు.

ఏపీ ఈపీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు CGRF క్యాంపు కోర్టుకు హాజరై సమస్యల పరిష్కారం పొందవచ్చు.

📞 విద్యుత్ సమస్యల కోసం: 1912 టోల్ ఫ్రీ నంబర్
📱 WhatsApp: 9493681912

Address

Corporate Office, P&T Colony, Seethammadhara
Visakhapatnam

Alerts

Be the first to know and let us send you an email when Eastern Power Distribution Company of AP Limited posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Eastern Power Distribution Company of AP Limited:

Shortcuts

Share