02/09/2026
అద్దంకిలో ఘనంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు
భారీ బైక్ ర్యాలీ.. నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం.. 1,500 మందికి అన్నదానం
అద్దంకి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను అద్దంకి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా, కోలాహలంగా నిర్వహించారు. జనసేన శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొనడంతో అద్దంకిలో పండుగ వాతావరణం నెలకొంది.
జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని తొలుత సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, పార్టీ అధినేతకు ఆయురారోగ్యాలు, ప్రజలకు మరింత సేవ చేసే శక్తిని ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు.
అనంతరం సింగరకొండ నుంచి అద్దంకి రాంనగర్‌లోని నూతన జనసేన పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జనసేన జెండాలతో, పార్టీ నినాదాలతో ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జనసేన పార్టీపై తమకున్న అభిమానాన్ని, అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై ఉన్న విశ్వాసాన్ని చాటుకున్నారు.
రాంనగర్‌లోని నూతన జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు శ్రీ గనిమిశెట్టి శ్రీనివాస నరహరి కృష్ణ గారి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమం, నూతన కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 1,500 మందికి భోజన సదుపాయాలు కల్పించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్ధాంతాలు, ప్రజాసేవా లక్ష్యాలను క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే జనసేన శ్రేణుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు నియోజకవర్గ IT కో-ఆర్డినేటర్ శ్రీ నల్లపునేని కాళేశ్వరరావు , జనసేన నాయకులు గోరంట్ల సాయి, బత్తుల చందు, సాదు వెంకటేష్,, మూరగొండి రామ కోటేశ్వరరావు, పల్లపోతుల పూర్ణ చంద్రరావు, వీరమహిళ అన్నపూర్ణ గారు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జై జనసేన!
జై పవన్ కళ్యాణ్!