BDYF KNL
Democratic Youth Federation of India(DYFI)
04/01/2026
22/12/2025
22/12/2025
18వ అఖిల భారత మహాసభల నిర్వహణ కోసం జిల్లా కమిటీ కి నగరంలో మాస్ ఫండ్స్ కాంపెయిన్ ద్వారా న్యూసిటి కమిటీ నుండి 50 వేలరూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది.
Citu old city Knl CITU - Centre of Indian Trade Unions
02/11/2025
కొత్త పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి ........డివైఎఫ్ఐ....ఆదోని.
ఆదోని పట్టణ మండీగిరి పరిధిలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా డివైఎఫ్ఐ పతాకాన్ని పట్టణ అధ్యక్షుడు మోహన్ ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు తిప్పన్న, లక్ష్మన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్, సతీష్, వీరు మాట్లాడుతూ రెండవ ముంబైగా ప్రసిద్ధిగాంచిన ఆదోని పట్టణంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకై కొత్త పరిశ్రమలు స్థాపించి ఉపాధి అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాయలసీమ జిల్లాల లోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ ఉన్న ఆదోని ప్రాంతంలో కాటన్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు, అధికారులు పూర్తిగా విఫలం చెందారని వారు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ యువకులు పాల్గొన్నారు
28/07/2025
*ఆదోని పట్టణంలో ఆదివారాలలో అర్బన్ హెల్త్ సెంటర్ ల నందు వైద్యులు, సిబ్బందిని ఉండే విధంగా చూడాలని ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇంచార్జ్ డిఎంహెచ్ఓ రఘునాథ్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు*
ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్ మాట్లాడుతూఆదోని పట్టణంలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో ఆదివారం సెలవు ఉండే విధంగా అర్బన్ హెల్త్ కేంద్రాలు దర్శనమిస్తున్నాయి. దీంతో అక్కడి పేద, మధ్యతరగతి ప్రజలు ఆదివారం అర్బన్ హెల్త్ కేంద్రాలలో సరైన వైద్యం అందడం లేదు. వైద్యం కొరకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి రావాల్సిన పరిస్థితి ఉంది. అర్బన్ హెల్త్ కేంద్రాలలో కేవలం ఒకరు లేదా ఇద్దరు సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. దీంతో పేద ప్రజలకు వైద్యం అందే పరిస్థితి లేదు. కావున అధికారుల వెంటనే స్పందించి అర్బన్ హెల్త్ కేంద్రాలలో ఆదివారము కూడా వైద్యులు,వైద్య సిబ్బంది ఉండేవిధంగా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
22/06/2025
ఆదోని డివైఎఫ్ఐ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అధ్యక్ష కార్యదర్శులు ఎం మోహన్ బి వెంకటేష్
22/06/2025
కొత్త పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి...DYFI...ఆదోని
ఆదోని నియోజకవర్గం లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనపై కొత్త పరిశ్రమల స్థాపించి యువతకు ఉపాధి కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేష్ పిలుపునిచ్చారు. ఆదోని పట్టణం డివైఎఫ్ఐ జనరల్ బాడీ సమావేశం వీరేష్ అధ్యక్షతన జరిగింది. సమావేశం ఉద్దేశించి మీరు మాట్లాడుతూ రాష్ట్రంలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆదోనిలో ఉంది. రైతులు పండించిన కాటన్ (పత్తి) ఇక్కడ నుండి రాష్ట్రాలు దాటి వేరే ప్రాంతాలకు ఎగమతి అవుతూ ఉంది. అయితే ఆదోని నియోజకవర్గం లో కాటన్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో పాలకులు ఏమాత్రం శ్రద్ధ పెట్టడం లేదని వారు తెలిపారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఆదోనిలో కొత్త పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ ,ఉపాధి అవకాశాలు కల్పనకై ప్రత్యేకమైన కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా యువత నిరుద్యోగ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు యువగలం పేరుతో లోకేష్ వేలాది కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించి యువకుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని హామీలు ఇచ్చి సంవత్సరం పూర్తి అవుతున్నప్పటికీ యువతకు ఎటువంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని వారు తెలిపారు. కావున పట్టణంలో కొత్త పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ ,ఉపాది అవకాశాల కల్పనకై యువత ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు.
అనంతరం డివైఎఫ్ఐ ఆదోని పట్టణ నూతన కమిటీ ఎన్నిక చేయడం జరిగింది.
డివైఎఫ్ఐ ఆదోని పట్టణ అధ్యక్ష, కార్యదర్శులుగా మోహన్, వెంకటేష్ సహాయ కార్యదర్శిలుగా సతీష్ ,నాగరాజు, నవీన్, ఉపాధ్యక్షులుగా వీరేష్, వినోద్, సూరి, వేరే తో పాటు మరో 13 మందిని కమిటీ సభ్యులుగా ఏకీగ్రవంగా ఎన్నుకోవడం జరిగింది.
09/06/2025
ఆదోని పట్టణం 8వ వార్డు సచివాలయం ఆధార్ కేంద్రం దగ్గర అధిక వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి ....DYFI.
ఆదోని పట్టణం ఎనిమిదో వార్డు అరుణ్ జ్యోతి నగర్ నందు ఉన్న సచివాలయం ఆధార్ కేంద్రం దగ్గర ప్రజల నుండి ప్రభుత్వం నిర్ణయించిన రుసుము కాకుండా అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు వీరేష్, నాయకులు వెంకటేష్, మోహన్ తదితరులు సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
08/06/2025
**ఆదోని వన్ టౌన్ సీఐ శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన డివైఎఫ్ఐ బృందం**
26/05/2025
ఆదోని మున్సిపాలిటీలోని పర్వతాపురం లో నీటి పైపు లీకేజ్ సమస్య పరిష్కరించాలని మరియు కొత్త పైపు లైన్ కనెక్షన్ ఇవ్వాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అనంతరo పట్టణ అధ్యక్షుడు వీరేష్,వెంకటేష్,మోహన్ మాట్లాడుతూ నీటి సమస్య వలన కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి కొత్త పైప్ లైన్ వేయాలని కోరారు లేని పక్షంలో కాలినివాసులను కలుపుకొని మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించడం జరిగింది..
26/05/2025
ఆదోని పట్టణం, గ్రామాలలో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై, కర్ణాటక మద్యం విక్రయిస్తు కాలనీలలో ప్రజలకు ఇబ్బందులు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ సిఐ సైదులు గారికి వినతిపత్రం ఇచ్చిన డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు వీరేష్, నాయకులు వెంకటేష్, మోహన్ తదితరులు....
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Adoni
