Sub collector & Returning Officer Adoni

Sub collector & Returning Officer Adoni

Share

Sub Collector, Adoni and Returning Officer - 146 Adoni Assembly Constituency Sub Collector & Returning Officer, Adoni Assembly Constituency

Photos from Sub collector & Returning Officer Adoni's post 17/09/2024

ఆదోని 17-09-2024

స్వచ్ఛతా హీ సేవా 2024 కార్యక్రమంలో భాగంగా ఆదోని మున్సిపల్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి జిజిహెచ్ హాస్పిటల్ వరకు ర్యాలీ మరియు భీమా కూడలి నందు మానవహార కార్యక్రమాన్ని ప్రారంభించిన సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు మరియు ఆదోని ఎమ్మెల్యే డా" పార్థ సారధి గారు.

కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ బి. శాంత, మున్సిపల్ కమిషనర్ (ఇన్చార్జి) అనుపమ, తదితరులు పాల్గొన్నారు.

Photos from Sub collector & Returning Officer Adoni's post 10/09/2024

పత్రికా ప్రకటన.

ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించండి.:-

పి.జి.ఆర్.ఎస్ వచ్చిన అర్జీలను గడవు లోపు పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకోండి.

అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి.

ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు

ఆదోని, సెప్టెంబర్:-09.

పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం - పిజిఆర్ఎస్ కార్యక్రమంలో వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు పేర్కొన్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం - పిజిఆర్ఎస్ లో స్థానిక ఎమ్మెల్యే పార్థ సారధి గారు సబ్ కలెక్టర్ పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. .మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.

మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని. :-

1. ఆదోని మండలం పెద్దహరివనం గ్రామానికి చెందిన హనుమంతుకు సంబంధించి సర్వేనెంబర్ 85 ఏ నందు 1.37 మరియు 9ఏ నందు 2.21 ఎకరాల భూమి ఉన్నది ప్రస్తుతం సదరు భూమి ఆన్లైన్ నందు వేరే వారి పేరు నమోదైనది దయతో విచారణ చేసి నా యొక్క పేరు నమోదు చేయవలసిందిగా అర్జీ సమర్పించుకున్నారు.

2. ఆదోని మండలం కల్లుబావి గ్రామానికి చెందిన మల్లయ్య కు సంబంధించి సర్వేనెంబర్ 200 నందు 0.77 సెంట్ల భూమి ఉండగా వారసత్వంగా నాకు రావలసిన 0.2 0 భూమి ఆన్లైన్ నందు నమోదు చేయవలసినదిగా అర్జ సమర్పించుకున్నారు.

3. ఆదోని మండలం పెద్ద హరివాణం గ్రామానికి చెందిన దేవమ్మకు సంబంధించి సర్వే నంబర్ 589 హెచ్1 పైకి 0.25 సెంట్లు భూమి మరణించిన నా యొక్క భర్త గారి పేరు మీద పట్టాదారు పాస్ పుస్తకం కలిగి ఉన్నది ప్రస్తుతం సదరు భూమి నందు ఆన్లైన్ నందు వేరే వారి పేరు నమోదు అయినది దయచేసి విచారణ చేసి ఆన్లైన్ నందు మా యొక్క పేరు నమోదు చేయవలసినదిగా అర్జ సమర్పించుకున్నారు.

ఈ కార్యక్రమానికి కార్యాలయపు పరిపాలన అధికారి కే. వసుంధర, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వాయర్ వేణు సూర్య, శ్రీనివాస రాజు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ సత్యవతి, డిఎల్పివో నూర్జహాన్, డి ఎల్ డి వో నాగేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్, ఆర్ అండ్ బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ మహమ్మద్ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

Photos from Sub collector & Returning Officer Adoni's post 06/09/2024

పత్రికా ప్రకటన

అక్టోబరు 29వ తేది డ్రాఫ్ట్ ఎలెక్ట్రోల్ రోల్ ను తయారు చేసుకోవాలి

బిఎల్వోలు హౌస్ టు హౌస్ సర్వే తప్పక నిర్వహించాలి.

ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం మరియు సబ్ కలెక్టర్ ఆదోని మౌర్య భరద్వాజ్ గారు.

Photos from Sub collector & Returning Officer Adoni's post 06/09/2024

పత్రిక ప్రకటన

గణేష్ ఉత్సవాలను విజయవంతంగా చేపట్టండి.

గణేష్ నిమజ్జనంకు ప్రతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయండి.

గణేష్ ఉత్సవాల నిర్వహణపై అధికారులు, ఉత్సవ కమిటీలతో సమీక్ష సమావేశం.

ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు.

Photos from Sub collector & Returning Officer Adoni's post 04/09/2024

అధిక వర్షంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారు.:-

ఆదోని/సెప్టెంబర్ :- 04

గత కొద్ది రోజులుగా డివిజన్ పరిధిలో విస్తారంగా వర్షాలు కురవడంతో పలు రకాల పంటలు దెబ్బతిన్నాయి. చేతికి రావాల్సిన పంటలు అధిక వర్షం ప్రభావంతో దెబ్బ తినడంతో బుధవారం ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, తహసిల్దార్ మల్లికార్జున, వ్యవసాయ శాఖ అధికారి ఉమా కుమారి అధికారులు, కౌతాళం మండలంలో ఉప్పరాల, రౌడూరు, బపురం గ్రామాలలో క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కలెక్టర్ మాట్లాడుతూ... అధిక వర్షపాతానికి నష్టపోయిన పంటల వివరాలను మరియు రైతుల వివరాలు నివేదికలను పూర్తి నివేదికలను సమర్పించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు పంట నష్టం జరిగిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరఫున పరిహారం అందేటట్టుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.

Photos from Sub collector & Returning Officer Adoni's post 04/09/2024

Sri Mantri Mourya Bharadwaj, IAS assumed charge as Sub Collector, Adoni.

Want your business to be the top-listed Government Service in Adoni?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Sub Collector Office, Railway Station Road
Adoni
518301