Anakapalli District Police

Directions Website

Anakapalli District Police The official handle of ANAKAPALLI DISTRICT POLICE.... Please don't report Crime here. In case of eme ANAKAPALLI DISTRICT POLICE

బైకు చోరీ కేసును ఛేదించిన అనకాపల్లి టౌన్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్వాధీనం ​పోలీస్ సిబ్...
07/10/2026

బైకు చోరీ కేసును ఛేదించిన అనకాపల్లి టౌన్ పోలీసులు – ఇద్దరు నిందితుల అరెస్ట్, రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ స్వాధీనం

​పోలీస్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS గారు

అనకాపల్లి పట్టణం, అక్టోబర్ 7: అనకాపల్లి పట్టణ పరిధిలో జరిగిన ద్విచక్ర వాహన చోరీ కేసును అనకాపల్లి టౌన్ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
​జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS గారి ఆదేశాల మేరకు, అనకాపల్లి టౌన్ సీఐ జి.ప్రేమ కుమార్ గారి పర్యవేక్షణలో, ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు మరియు వారి సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.

నిందితుల వివరాలు:
సిద్ధాంతపు హరీష్ @ హనోక్ (24 సం.), వృత్తి: కూలీ, నివాసం: పుష్ప లీలా నగర్, తెంగళ్లమూడి, ఏలూరు.
పెద్దసింగ్ రేవంత్ @ సాయి (22 సం.), వృత్తి: వంట మాస్టర్, నివాసం: నామవరం గ్రామం, శాటిలైట్ సిటీ, రాజమండ్రి రూరల్.

​నేర నేపథ్యం & వివరాలు:
​పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం... నిందితుడైన సిద్ధాంతపు హరీష్ తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించడంతో తణుకులోని బంధువుల వద్ద పెరిగాడు. అనంతరం రాజమండ్రి పరిధిలోని నామవరం గ్రామానికి చేరుకుని టైల్స్ కంపెనీలో పనిచేసేవాడు. ఆ సమయంలో జల్సాలు, మద్యం, ధూమపానం వంటి దురలవాట్లకు బానిసయ్యాడు. అదే ప్రాంతానికి చెందిన రెండవ నిందితుడు పెద్దసింగ్ రేవంత్ @ సాయితో పరిచయం ఏర్పడటంతో, తమ జల్సాల కోసం డబ్బు సంపాదించేందుకు ఇద్దరూ కలిసి బైకు దొంగతనాలు చేయాలని పథకం వేశారు. వీరు గతంలో రాజమండ్రి, ఏలూరు-1 టౌన్, తొండంగి (అన్నవరం సమీపంలో) పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారు.

​ఇదే క్రమంలో, గత సెప్టెంబర్ 21వ తేదీన అనకాపల్లి పట్టణం, శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వెనుక పార్క్ చేసి ఉన్న AP39 QY 5309 నంబర్ గల క్రోమ్ రెడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ వాహనాన్ని దొంగిలించి పరారయ్యారు. దీనిపై బాధితుడు వేగి అజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనకాపల్లి టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అరెస్ట్ & రికవరీ:
​దర్యాప్తులో భాగంగా రాజమండ్రి, ఏలూరులలో ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులకు, ఈరోజు (07.10.2026) అందిన విశ్వసనీయ సమాచారం మేరకు అనకాపల్లి పట్టణంలోని కొత్తూరు జంక్షన్ వద్ద నిందితులు పట్టుబడ్డారు. మధ్యవర్తుల సమక్షంలో వారిని అదుపులోకి తీసుకుని, దొంగిలించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను స్వాధీనం చేసుకుని, రిమాండ్ నిమిత్తం అనకాపల్లి సబ్ జైలుకు తరలించారు.
​
పోలీస్ సిబ్బందికి ప్రశంసలు:
​కేసు నమోదు అయిన వెంటనే సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టి, నిందితులను పట్టుకుని చోరీ సొత్తును రికవరీ చేయడంలో చురుగ్గా వ్యవహరించిన అనకాపల్లి టౌన్ ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు, కానిస్టేబుళ్లు ఎం.సముద్రం, ఆర్.పి.నాయుడు లను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, IPS గారు ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.
​


Andhra Pradesh Police

అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌బీడబ్ల్యూ (NBW) వారెంట్ల అమలు – ఒకరికి రిమాండ్ అనకాపల్లిపట్టణం, అక్టోబర్ 6: అ...
06/10/2026

అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్‌బీడబ్ల్యూ (NBW) వారెంట్ల అమలు – ఒకరికి రిమాండ్

అనకాపల్లిపట్టణం, అక్టోబర్ 6:
అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీ ఈ.శ్రీనివాసులు గారి పర్యవేక్షణలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ గోవిందరావు మరియు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి రెండు నాన్-బెయిలబుల్ వారెంట్లను (NBW) పరిష్కరించారు.

​ఈ సందర్భంగా సీఐ గోవిందరావు వివరాలను వెల్లడిస్తూ:
నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్:
అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ క్రైమ్ నం. 06/2021 (సెక్షన్ 498-A IPC మరియు సెక్షన్ 3, 4 వరకట్న నిషేధ చట్టం) కేసులో నాన్-బెయిలబుల్ వారెంట్ ఎదుర్కొంటున్న నిందితుడు శ్రీరంగం లోవరాజు (32 సం.), తండ్రి: బాబులు, నివాసం: చిన కొట్టూరు గ్రామం, నక్కపల్లి మండలంను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నిందితుడిని అనకాపల్లి 13వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
వారెంట్ రీ-కాల్:
మహిళా పోలీస్ స్టేషన్ క్రైమ్ నం. 24/2023 (సెక్షన్ 498-A IPC మరియు సెక్షన్ 3, 4 వరకట్న నిషేధ చట్టం) కేసులో నిందితురాలైన కోణతాల సూర్యకుమారి (63 సం.), భర్త: దివంగత అప్పారావు, నివాసం: అనకాపల్లిపై గతంలో జారీ అయిన ఎన్‌బీడబ్ల్యూ అమలుపై చర్యలు తీసుకున్నారు. సదరు మహిళ అనారోగ్యంతో పూర్తిగా మంచానికే పరిమితమైన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, అనకాపల్లి 13వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఆమెపై ఉన్న ఎన్‌బీడబ్ల్యూను రీ-కాల్ (రద్దు) చేసింది.

​కోర్టు ఆదేశాలు, పెండింగ్ వారెంట్ల విషయంలో చట్టపరమైన చర్యలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.



Andhra Pradesh Police

16 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడి (NBW) అరెస్ట్ — రిమాండ్‌కు తరలింపు నక్కపల్లి, అక్టోబర్ 6: ​అనకాపల్లి జిల్లా ...
06/10/2026

16 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడి (NBW) అరెస్ట్ — రిమాండ్‌కు తరలింపు

నక్కపల్లి, అక్టోబర్ 6: ​అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ శ్రీ పోతిరెడ్డి శ్రీనివాసరావు గారి సూచనలతో, నక్కపల్లి సీఐ మురళి గారి పర్యవేక్షణలో నక్కపల్లి ఎస్ఐ సన్నీ బాబు మరియు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి 16 ఏళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న నిందితుడిని అరెస్ట్ చేశారు.

కేసు వివరాలు:
నక్కపల్లి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 107/2010 U/s 498(A) IPC మరియు సెక్షన్ 3, 4 DP యాక్ట్ (కోర్టు కేసు CC No. 676/2015) లో A-3 నిందితుడైన దేవర అప్పారావు (తండ్రి: గంగరాజు @ గొర్ల అప్పారావు, తండ్రి: అప్పన్న) పై నాన్ బెయిలబుల్ వారంట్ (NBW) జారీ అయి ఉంది. సదరు నిందితుడు గత 16 సంవత్సరాలుగా పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్నాడు. ఛార్జ్‌షీట్ సైతం పరారీ (Absconding) గానే దాఖలు చేయడం జరిగింది. గతంలో రెండు మూడు సార్లు వారంట్లు వచ్చినప్పటికీ, అతని ఆచూకీ లభించకపోవడంతో కోర్టుకు వీఆర్ (VR) రిపోర్టు సమర్పించడం జరిగింది.

​సుమారు 10 రోజుల క్రితం గౌరవ న్యాయస్థానం నుండి మరోసారి ఎన్‌బీడబ్ల్యూ జారీ కావడంతో, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ సన్నీ బాబు మరియు పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా ఉంచి గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంతో ఈరోజు నిందితుడు దేవర అప్పారావును అదుపులోకి తీసుకున్నారు.

​అనంతరం నిందితుడిని గౌరవ ఏజేఎఫ్‌సీఎం ఎలమంచిలి (AJFCM) కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వారంట్‌ను విజయవంతంగా అమలు చేసి నిందితుడిని పట్టుకున్న ఎస్ఐ సన్నీ బాబు మరియు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.



Andhra Pradesh Police

అనకాపల్లిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు – ఇద్దరు నిందితుల అరెస్ట్ ​రెండు స్నాచింగ్ కేసుల ఛేదన – 4.5 తుల...
06/10/2026

అనకాపల్లిలో అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా గుట్టురట్టు – ఇద్దరు నిందితుల అరెస్ట్

​రెండు స్నాచింగ్ కేసుల ఛేదన – 4.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం

గతంలో 36కు పైగా నేరాలకు పాల్పడిన పాత నేరస్థుడు

​టౌన్ సీఐ ప్రేమ కుమార్ & సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్
​
అనకాపల్లి పట్టణం, అక్టోబర్ 6: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, అనకాపల్లి టౌన్ సీఐ జి.ప్రేమ కుమార్ గారి పర్యవేక్షణలో, ఎస్ఐ
ఎ.వెంకటేశ్వరరావు మరియు క్రైమ్ సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పట్టణంలో సంచలనం సృష్టించిన చైన్ స్నాచింగ్ కేసులను విజయవంతంగా ఛేదించారు.
​
నిందితుల వివరాలు:
A-1: మహేందర్ సింగ్ @ మహేంద్ర (40 సం.), తండ్రి: ఖిమ్ సింగ్ చౌడా, స్వస్థలం: పంచవటి, నాగౌర్ జిల్లా, రాజస్థాన్; ప్రస్తుతం నివాసం: చంద్రంపాలెం, మధురవాడ, విశాఖపట్నం (వృత్తి: రాపిడో బైక్ రైడర్).
​A-2: మండ్రు లత రత్నాకర్ (52 సం.), భర్త: రత్నాకర్, నివాసం: శ్రీ కృష్ణ గాయత్రి వైభవ నగర్, కొమ్మాది జంక్షన్, మధురవాడ, విశాఖపట్నం.
​నేర చరిత్ర – నేరం జరిగిన తీరు:
పాత నేరస్థుడు: ప్రధాన నిందితుడు మహేందర్ సింగ్ 2007లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా పనిచేసి, అనంతరం జల్సాలు, మద్యానికి బానిసయ్యాడు. 2013-2015 మధ్య కాలంలో జీడిమెట్ల, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఒంటరి మహిళల మెడల నుంచి సుమారు 36 బంగారు గొలుసుల స్నాచింగ్ నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు.

​జైలు నుంచి విడుదలైన తర్వాత విశాఖపట్నం మధురవాడకు మకాం మార్చి, రాపిడో బైక్ నడుపుతూనే విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు తదితర ప్రాంతాలలో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడేవాడు.
​చోరీ చేసిన బంగారాన్ని A-2 మండ్రు లత రత్నాకర్‌కు ఇవ్వగా, ఆమె తనకు తెలిసిన నగల దుకాణాలలో విక్రయించి వచ్చిన సొమ్మును ఇద్దరూ పంచుకునేవారు.

అనకాపల్లిలో ఘటనలు: ఇదే ఏడాది మే 22న సాయంత్రం సమయంలో అనకాపల్లి బొడ్డేడువారి వీధిలో విశ్వనాథ నాగరత్నం అనే మహిళ వద్ద నుండి 1.5 తులాల బంగారు గొలుసును, అదే రోజు గాంధీనగర్‌లో పల్లా సత్యవతి అనే వృద్ధురాలి మెడ నుండి 3 పేటల బంగారు గొలుసును హెల్మెట్ ధరించి బైక్‌పై వచ్చి లాక్కెళ్లాడు.
స్వాధీనం చేసుకున్న సొత్తు: ​విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ మరియు అనకాపల్లి టౌన్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేపట్టి నిందితులను కోర్టు అనుమతితో పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. నిందితురాలు A-2 మండ్రు లత రత్నాకర్ నుండి రెండు కేసులకు సంబంధించిన సుమారు 4.5 తులాల బంగారు ఆభరణాలను రికవరీ చేసి, ఆమెను రిమాండ్‌కు తరలించారు.

పోలీస్ బృందానికి జిల్లా ఎస్పీ అభినందనలు:
​కేసును చాకచక్యంగా ఛేదించి, సొత్తును రికవరీ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన:
​అనకాపల్లి టౌన్ సీఐ జి.ప్రేమ కుమార్
​ఎస్ఐ ఎ.వెంకటేశ్వరరావు
​హెడ్ కానిస్టేబుల్: జి.గాంధీ
​కానిస్టేబుళ్లు: ఎం.సముద్రం, ఆర్.పి.నాయుడు, టి.ఎస్.నాయుడు
​లను జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.



Andhra Pradesh Police

అనకాపల్లి జిల్లాలో గంజాయి స్మగ్లర్‌పై ఉక్కుపాదం: PIT NDPS చట్టం కింద పాత నేరస్థుడి రిమాండ్ అనకాపల్లి (కే.డీ.పేట), అక్టోబ...
05/10/2026

అనకాపల్లి జిల్లాలో గంజాయి స్మగ్లర్‌పై ఉక్కుపాదం: PIT NDPS చట్టం కింద పాత నేరస్థుడి రిమాండ్

అనకాపల్లి (కే.డీ.పేట), అక్టోబర్ 5: జిల్లాలో గంజాయి సాగు, అక్రమ రవాణా, విక్రయాలను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నర్సీపట్నం డీఎస్పీ శ్రీ పి.శ్రీనివాసరావు పర్యవేక్షణలో వరుస నేరాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌పై PIT NDPS చట్టం (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances Act, 1988) కింద డిటెన్షన్ ఉత్తర్వులు అమలు చేశారు.

నిందితుడి వివరాలు – నేర చరిత్ర:
గొలుగొండ మండలం, పాత కే.డీ.పేట గ్రామానికి చెందిన ఉప్పాటి వెంకటేశ్ (23), తండ్రి: రాజు, అలవాటుపడ్డ నేరస్థుడిగా (Habitual Offender) గుర్తించబడ్డాడు. ఇతను అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతాల నుంచి విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు భారీ ఎత్తున అక్రమంగా గంజాయిని తరలిస్తున్నాడు. ఇతనిపై గతంలో పలు పోలీస్ స్టేషన్లలో 4 గంజాయి కేసులు నమోదయ్యాయి:
​కే.డీ.పేట పోలీస్ స్టేషన్ – 01 కేసు
​కాకినాడ జిల్లా, ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ – 02 కేసులు
​కాకినాడ జిల్లా, అన్నవరం పోలీస్ స్టేషన్ – 01 కేసు
​గతంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినప్పటికీ నిందితుడి ప్రవర్తనలో మార్పు రాలేదు. నిరంతరం గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతూ సమాజ శాంతిభద్రతలకు, యువత భవిష్యత్తుకు ముప్పుగా మారడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇతనిపై PIT NDPS చట్టం కింద ముందస్తు నిర్బంధ (Preventive Detention) ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అరెస్ట్ – జైలుకు తరలింపు:
నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, NDPS సెల్ ఇన్‌‌స్పెక్టర్ పిల్లా రమేష్, కే.డీ.పేట ఎస్సై వి.రుషికేశ్వరరావు మరియు సిబ్బంది పకడ్బందీ ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు.

జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐ.పి.ఎస్. హెచ్చరిక:
​"జిల్లాలో గంజాయి దందాలకు పాల్పడే వారిపై నిరంతర నిఘా కొనసాగుతోంది. గంజాయి సాగు చేసినా, నిల్వ ఉంచినా, కొనుగోలు చేసినా లేదా రవాణా చేసినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు. పదేపదే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై PIT NDPS చట్టం మరియు పీడీ యాక్ట్ వంటి అత్యంత కఠినమైన చట్టాలను ప్రయోగిస్తాం."




Andhra Pradesh Police

7 రోజుల్లో న్యాయం జరగాలి: పోలీస్ అధికారులకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు! అనకాపల్లి, అక్టోబర్ 5: బాధితులకు అందే...
05/10/2026

7 రోజుల్లో న్యాయం జరగాలి: పోలీస్ అధికారులకు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు!

అనకాపల్లి, అక్టోబర్ 5: బాధితులకు అందే న్యాయమే పోలీస్ వ్యవస్థ పనితీరుకు అసలైన కొలమానమని అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ స్పష్టం చేశారు.

సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక' (PGRS) కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి బాధితులు తరలివచ్చారు. ఎస్పీ గారు స్వయంగా అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మొత్తం 45 ఫిర్యాదులు అందాయి.
​స్వీకరించిన 45 ఫిర్యాదుల్లో ప్రధానమైనవి:
​సివిల్ వివాదాలు: భూ తగాదాలు, ఆస్తి వివాదాలు, ఆర్థిక మోసాలు.
​కుటుంబ సమస్యలు: భార్యాభర్తల గొడవలు, వేధింపులు, గృహ కలహాలు.
​ఇతర సమస్యలు: శాంతిభద్రతల సమస్యలు, పౌర సమస్యలు.
​ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి కింది ఆదేశాలు జారీ చేశారు:
​ప్రతి ఫిర్యాదుపై గరిష్టంగా వారం రోజుల్లోపు దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం అందించాలి.
​ఎటువంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విచారణ జరపాలి.
​ఫిర్యాదుపై తీసుకుంటున్న చర్యలను, కేసు పురోగతిని ఎప్పటికప్పుడు బాధితులకు తెలియజేస్తూ వారిలో నమ్మకాన్ని కలిగించాలి.
​విచారణ ముగిసిన వెంటనే తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను జిల్లా కార్యాలయానికి సమర్పించాలి.
​"మహిళల రక్షణ, భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. మహిళలను, సామాన్యులను మోసగించే వారిపై చట్టపరంగా ఉక్కుపాదం మోపుతాం. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ సమస్యలను తెలియజేయవచ్చు. వారికి అండగా నిలవడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది."
— శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ (జిల్లా ఎస్పీ)

​ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు, ఎస్సై శ్రీనివాసరావు, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు.



Andhra Pradesh Police

విదేశీయులకు ఆశ్రయం కల్పించే వారు తప్పనిసరిగా డిజిటల్ రూపంలో వివరాలు నమోదు చేయాలి: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస...
05/10/2026

విదేశీయులకు ఆశ్రయం కల్పించే వారు తప్పనిసరిగా డిజిటల్ రూపంలో వివరాలు నమోదు చేయాలి: జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు

ఫారం-సి (Form-III / Form-C) ద్వారా 24 గంటల్లోగా ఆన్‌లైన్ నమోదు తప్పనిసరి

ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, రూ. 50 వేల నుండి లక్ష వరకు జరిమానా, జైలు శిక్ష

ఓసీఐ (OCI), నేపాల్, భూటాన్ పౌరుల బస వివరాలూ నమోదు చేయాల్సిందే

అనకాపల్లి, అక్టోబర్ 5: అనకాపల్లి జిల్లా పరిధిలోకి విద్య, వైద్యం, పర్యాటకం, వ్యాపారం, ఉపాధి లేదా వ్యక్తిగత పనుల నిమిత్తం వచ్చే విదేశీయులకు ఆశ్రయం లేదా వసతి కల్పించే అన్ని యాజమాన్యాలు, వ్యక్తులు తప్పనిసరిగా వారి రాక, నిష్క్రమణ వివరాలను డిజిటల్ విధానంలో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

​కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BoI), హైదరాబాద్ వారి ఆదేశాలు, ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్, 2025 (Section 8) నిబంధనల ప్రకారం జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ చట్టపరమైన బాధ్యతను తప్పక పాటించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన నిబంధనలు & మార్గదర్శకాలు:
​పరిధిలోకి వచ్చే వసతి కేంద్రాలు (Accommodators): ​హోటళ్లు, రిసార్టులు, లాడ్జీలు, గెస్ట్ హౌస్‌లు.
​ఎయిర్‌బీఎన్‌బీ (Airbnb), హోమ్‌స్టేలు, సర్వీస్ అపార్ట్‌మెంట్లు.
​ప్రైవేట్ అద్దె ఇళ్లు, పేయింగ్ గెస్ట్ (PG) వసతులు, బంధువుల ఇళ్లు.
​ఆసుపత్రులు, మెడికల్/ఆయుష్ చికిత్సా కేంద్రాలు.
​విద్యాసంస్థలు, కాలేజీలు, యూనివర్సిటీలు, పాఠశాలల హాస్టళ్లు.
​మఠాలు, ఆశ్రమాలు, మదర్సాలు, కాన్వెంట్లు వంటి మతపరమైన సంస్థలు.
​వాణిజ్యపరమైన (Commercial) లేదా వాణిజ్యేతర (Non-commercial) ప్రాతిపదికన విదేశీయులకు బస కల్పించే ప్రతి ఒక్కరికీ ఈ నిబంధన వర్తిస్తుంది.

​24 గంటల్లోగా ఫారం-సి (Form-III/Form-C) సమర్పణ:
​విదేశీయులు చేరిన (Check-in / Arrival) సమయం నుండి 24 గంటల లోపు పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాలి.
​అలాగే వారు ఖాళీ చేసి వెళ్లేటప్పుడు (Departure) కూడా నిష్క్రమణ వివరాలను తప్పక అప్‌డేట్ చేయాలి.
​అతిథుల రికార్డులను సంబంధిత యాజమాన్యం కనీసం 1 సంవత్సరం పాటు భద్రపరచాలి.
​విదేశీయులతో పాటు ఓసీఐ (OCI) కార్డుదారులు, నేపాల్ మరియు భూటాన్ దేశస్థులు బస చేసినప్పటికీ ఈ వివరాలు సమర్పించాలి.

రిజిస్ట్రేషన్ మరియు పోర్టల్ వివరాలు:
అధికారిక పోర్టల్: https://indianfrro.gov.in లేదా సంబంధిత Form-C పోర్టల్.
నమోదు విధానం:
​పోర్టల్‌ను సందర్శించి "Sign Up / Registration" పై క్లిక్ చేయాలి.
​యూజర్ ఐడీ, పాస్‌వర్డ్, చిరునామా, హోస్ట్ వివరాలు నమోదు చేయాలి.
​దరఖాస్తును ప్రింట్ తీసి, సంతకం చేసి అవసరమైన పత్రాలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.
​ఎఫ్.ఆర్.ఆర్.ఓ (FRRO) ఆమోదం పొందిన తర్వాత వచ్చే లాగిన్ వివరాలతో 24 గంటల్లోగా అతిథుల వివరాలు నమోదు చేయవచ్చు.
ఉల్లంఘనలకు చట్టపరమైన శిక్షలు (Section 23b ప్రకారం):
​విదేశీయుల వివరాలు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించినా లేదా నిబంధనలు అతిక్రమించినా తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు:
​వ్యక్తులు/ప్రైవేట్ లేదా వాణిజ్యేతర వసతుల నిర్వాహకులకు: కనీసం రూ.50,000/- నుండి జరిమానాతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్.
​ఆసుపత్రులు, విద్యాసంస్థలు, హోటళ్లకు: కనీసం రూ.1,00,000/- నుండి జరిమానాతో పాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్.
​చెల్లుబాటు అయ్యే వీసా/పాస్‌పోర్ట్ లేకుండా ఆశ్రయం కల్పించినా లేదా నకిలీ పత్రాలకు సహకరించినా: 2 నుండి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు రూ.1,00,000/- నుండి రూ.10,00,000/- వరకు భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.
విదేశీయులు పాటించాల్సిన అంశాలు (Do's & Don'ts):
​భారతదేశ చట్టాలను తప్పనిసరిగా గౌరవించాలి.
​అనుమతించిన వీసా గడువు ముగిసిన తర్వాత (Overstaying) దేశంలో ఉండకూడదు.
​సరైన వీసా అనుమతులు లేకుండా ఎలాంటి అనధికారిక వ్యాపారాలు లేదా ఉద్యోగాలు చేయరాదు.
​విదేశాల్లో స్థిరపడిన ఓ.సి.ఐ. (OCI) కార్డుదారులు దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడం, పోటీ చేయడం లేదా వ్యవసాయ భూములు (Agricultural Land) కొనుగోలు చేయడం చట్టరీత్యా నిషేధం.
​చిరునామా మారినట్లయితే వెంటనే FRRO కి తెలియజేయాలి.

ప్రజలకు విజ్ఞప్తి:
​జాతీయ భద్రత దృష్ట్యా, స్థానిక ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా నివసిస్తున్న విదేశీయులను గమనిస్తే వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 112 / జిల్లా పోలీస్ కార్యాలయానికి సమాచారం అందించాలని ఎస్పీ గారు కోరారు.

అధికారిక సంప్రదింపుల వివరాలు (FRRO Hyderabad):
​ఈ-మెయిల్: [email protected]
ఫోన్ నంబర్లు: 040-29880374, 040-29880375
కార్యాలయం: బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ (BoI), SVP BoI కాంప్లెక్స్, శంషాబాద్, హైదరాబాద్ - 501218.




Andhra Pradesh Police

జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్.బి డీఎస్పీ శ్రీ వి.బాబ్జీరావు అనకాపల్లి, ...
05/10/2026

జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎస్.బి డీఎస్పీ శ్రీ వి.బాబ్జీరావు

అనకాపల్లి, అక్టోబర్ 5: ​ 1995 ఎస్సై బ్యాచ్‌కు చెందిన శ్రీ వి.బాబ్జీరావు గారు ఇటీవల సీఐడీ విభాగంలో సీఐగా సేవలందిస్తూ డీఎస్పీగా పదోన్నతి పొందారు. అనంతరం అనకాపల్లి జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్.బి) డీఎస్పీగా ప్రభుత్వం నుండి పోస్టింగ్ ఉత్తర్వులు అందుకున్న ఆయన, తన బాధ్యతల స్వీకరణ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారికి ఆయన హరిత సంకేతంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

​శ్రీ వి.బాబ్జీరావు గారు గతంలో అనకాపల్లి ట్రాఫిక్ సీఐగా విశేష సేవలందించి ప్రజలు, ఉన్నతాధికారుల ప్రశంసలు పొందారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో అనుభవజ్ఞుడైన ఆయన ఎస్.బి డీఎస్పీగా బాధ్యతలు చేపట్టడం పట్ల పోలీసు అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపారు.

​ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారు మాట్లాడుతూ:
​"జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు స్పెషల్ బ్రాంచ్ (ఎస్.బి) విభాగం గుండెకాయ వంటిది. సమస్యాత్మక ప్రాంతాలు, సంఘటనలపై ముందస్తు సమాచారాన్ని (ఇంటెలిజెన్స్) ఎప్పటికప్పుడు సేకరించి అప్రమత్తం చేయడంలో ఎస్.బి కీలక పాత్ర పోషిస్తుంది. ఆధునిక సాంకేతికతను జోడించి, సమాచార నెట్‌వర్క్‌‌ను మరింత పటిష్టం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి."
​నూతన బాధ్యతలు చేపట్టిన శ్రీ వి.బాబ్జీరావు గారు తన అనుభవంతో సమర్థవంతంగా పనిచేసి జిల్లా పోలీసు శాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేయాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు.

​ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, స్పెషల్ బ్రాంచ్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.




Andhra Pradesh Police

బాలికలు, మహిళల భద్రతే పోలీసుల ప్రధాన ధ్యేయం: ‘శక్తి టీమ్’ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం పాయకరావుపేట, అక్టోబర్ 3: అనకాపల్ల...
04/10/2026

బాలికలు, మహిళల భద్రతే పోలీసుల ప్రధాన ధ్యేయం: ‘శక్తి టీమ్’ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

పాయకరావుపేట, అక్టోబర్ 3: అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, పాయకరావుపేట స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO) వినోద్ బాబు గారి పర్యవేక్షణలో స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలికల ఉన్నత పాఠశాల మరియు కార్తికేయ జూనియర్ కళాశాలల్లో "శక్తి టీమ్" (Shakti Beat) ప్రత్యేక పర్యటన నిర్వహించింది.

​ఈ సందర్భంగా శక్తి బృందం సభ్యులు పాఠశాల మరియు కళాశాల విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి, వారి భద్రత కోసం ప్రభుత్వం, పోలీస్ శాఖ అమలు చేస్తున్న వివిధ సేవలపై విస్తృతంగా అవగాహన కల్పించారు:
ఈవ్-టీజింగ్ & ర్యాగింగ్ నిరోధం: పాఠశాల, కళాశాలల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా, వేధింపులకు గురిచేసినా భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
​శక్తి యాప్ & టోల్ ఫ్రీ నంబర్లు: అత్యవసర సమయాల్లో విద్యార్థినులు ఉపయోగించుకోవడానికి ‘డైల్ 112’, 100 మరియు మహిళా హెల్ప్‌లైన్ నంబర్ల వినియోగం గురించి వివరించారు.
సైబర్ నేరాలపై మెలకువలు: సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అపరిచితులతో వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదనే అంశాలపై స్పష్టతనిచ్చారు.
​మహిళలు మరియు విద్యార్థినుల రక్షణకు పాయకరావుపేట పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటారని, ఎలాంటి సమస్య ఎదురైనా ధైర్యంగా స్టేషన్‌ను గానీ, పెట్రోలింగ్‌లో ఉన్న శక్తి టీమ్‌‌ను గానీ సంప్రదించవచ్చని ఎస్‌హెచ్‌ఓ వినోద్ బాబు తెలిపారు.




Andhra Pradesh Police

పోలీస్ సిబ్బంది, హోంగార్డుల సంక్షేమమే ధ్యేయం: అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు ​జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి...
03/10/2026

పోలీస్ సిబ్బంది, హోంగార్డుల సంక్షేమమే ధ్యేయం: అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు

​జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాలతో పోలీస్ సిబ్బందికి హెల్త్ ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాలపై అవగాహన సదస్సు

హాజరైన వివిధ ప్రముఖ బ్యాంకుల ప్రతినిధులు

అనకాపల్లి, అక్టోబర్ 3: పోలీస్ సిబ్బంది మరియు హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో ఎదురయ్యే భారీ వైద్య ఖర్చుల భారం నుంచి కుటుంబాలకు పూర్తి రక్షణ కల్పించే లక్ష్యంతో అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం వివిధ బ్యాంకులతో కుదుర్చుకున్న ఒప్పందాలు (ఎంఓయూ) మరియు పోలీస్ శాలరీ ప్యాకేజీ (PSP) ఆధారంగా ఈ కార్యక్రమం జరిగింది.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు ఎస్పీ శ్రీ ఎల్.మోహనరావు గారు మాట్లాడుతూ:
"జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సిబ్బంది, వారి కుటుంబాల ఆరోగ్య భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య చికిత్సల వ్యయం భారీగా పెరిగినందున, సాధారణంగా లభించే వైద్య ఖర్చుల కంటే అదనపు రక్షణ అవసరం ఎంతైనా ఉంది. ఇందుకోసం వివిధ బ్యాంకులు అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్, టాప్-అప్ పాలసీలు ఉద్యోగుల కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలైన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), అటల్ పెన్షన్ యోజన (APY) వంటి పథకాలను ప్రతి ఒక్క సిబ్బంది, హోంగార్డు సద్వినియోగం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు.

​ఈ సందర్భంగా ఎస్‌బీఐ (SBI), బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకుల ప్రతినిధులు హాజరై, పోలీస్ శాలరీ ప్యాకేజీ ద్వారా లభించే హెల్త్ పాలసీలు, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లు, తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీ, క్యాష్‌లెస్‌‌ ట్రీట్‌మెంట్ నెట్‌వర్క్ ఆసుపత్రుల వివరాలు, టాప్-అప్ ప్లాన్ల వివరాలను సిబ్బందికి సమగ్రంగా వివరించారు. సిబ్బంది సందేహాలను నివృత్తి చేసి నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.

​ఈ కార్యక్రమంలో డీఎస్పీలు శ్రీ బాబ్జీరావు, శ్రీ రవికుమార్, సీఐలు రామకృష్ణారావు, లక్ష్మి, శ్రీనివాసరావు, రమేష్ మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, హోంగార్డులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



Andhra Pradesh Police

Address

Office Of The Supdt Of Police, Anakapalli District
Anakapalle
531002

Alerts

Be the first to know and let us send you an email when Anakapalli District Police posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share