Cpmanakapalli

Directions

Cpmanakapalli “The CPI(M) is a party that stands not for profit, but for the rights of the people.

It is a people’s party that stands by those in distress and acts as their voice.”

13/10/2026

మిట్టల్ పోర్టు ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలి!
మత్స్యకారుల జీవనోపాధిని కాపాడాలి!
సిపిఎం నేత ఎం అప్పలరాజు పై గృహ నిర్బంధాన్ని ఎత్తివేయాలి.
మిట్టల్ పోర్టు నిర్మాణంతో మత్స్యకారుల జీవనోపాధికి, తీరప్రాంత పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతుందని సీపీఎం అనకాపల్లి జిల్లా కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. పోర్టు ప్రాంతంలో అక్టోబర్ 12న సిపిఎం బృందం పర్యటించింది. వెంటనే ఈరోజు తెల్లవారుజామున 4 గంటల నుంచి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం. అప్పలరాజును గృహనిర్బంధం చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామిక హక్కులను కాలరాయకుండా అప్పలరాజు గృహనిర్బంధాన్ని ఎత్తివేయాలని, అక్టోబర్ 15న జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి. కోటేశ్వరరావు డిమాండ్ చేశారు.

అధిక ధరలు అరికట్టాలని, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని, స్మార్టు మీటర్లు బిగించవద్దని డిమాండ్ చేస్తూ అనకాపల్లి గవరపాలెం...
13/10/2026

అధిక ధరలు అరికట్టాలని, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని, స్మార్టు మీటర్లు బిగించవద్దని డిమాండ్ చేస్తూ అనకాపల్లి గవరపాలెం పార్కు సెంటర్ వద్ద సిపిఎం అనకాపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ధర్నా ను ఉద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు..

09/06/2026
విశాఖ ఉక్కు  ప్రమాదంపై సీపీఐ (యం) దిగ్భ్రాంతి..
08/06/2026

విశాఖ ఉక్కు ప్రమాదంపై సీపీఐ (యం) దిగ్భ్రాంతి..

చీడికాడ మండలం అడవిలఅగ్రహారం, జి. కొత్తపల్లి, చిన్న గోగోడ ప్రాంతంలో సోలార్ ప్లాంట్ నిర్మాణం పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలంట...
08/06/2026

చీడికాడ మండలం అడవిలఅగ్రహారం, జి. కొత్తపల్లి, చిన్న గోగోడ ప్రాంతంలో సోలార్ ప్లాంట్ నిర్మాణం పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలంటూ జి. కొత్తపల్లి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర. అనంతరం నిరసన.

పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలి.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు( డబల్ ఇంజన్ సర్కార్ ) ఈ రోజు పెంచిన గ్యాస్ రూ.29/-లు అలాగే ...
07/06/2026

పెంచిన గ్యాస్ ధరలను రద్దు చేయాలి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు( డబల్ ఇంజన్ సర్కార్ ) ఈ రోజు పెంచిన గ్యాస్ రూ.29/-లు అలాగే పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే రద్దు చేయాలని, మన రాష్ట్రంలోని కృష్ణ గోదావరి నదులలో లభ్యమవుతున్న గ్యాస్ లో మన రాష్ట్రానికి 50% వాటా ఇవ్వాలని కోరుతూ ఈరోజు అనకాపల్లి నాలుగు రోడ్లు జంక్షన్ జీవీఎంసీ కార్యాలయం వద్ద సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో గ్యాస్ బండను మోస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న కేంద్ర కమిటీ సభ్యులు కె లోకనాథం, జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు.

కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరయి విజయన్ పై ఇడి దాడులను ఖండించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో నిర...
28/05/2026

కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ పినరయి విజయన్ పై ఇడి దాడులను ఖండించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో అనకాపల్లి జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం, పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించడం జరిగింది. దీని ఉద్దేశించి మాట్లాడుతున్న జిల్లా కార్యదర్శి జి కోటేశ్వరరావు.

కేరళలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ CPI(M) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి...
27/05/2026

కేరళలో ప్రతిపక్ష నాయకులపై కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారంటూ CPI(M) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మాజీ ముఖ్యమంత్రి, CPI(M) పొలిట్‌బ్యూరో సభ్యుడు మరియు కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన పినరయి విజయన్ నివాసాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేసిన దాడులను పార్టీ “రాజకీయ కక్షసాధింపు”గా అభివర్ణించింది.
బుధవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ED అధికారులు ఒకేసారి పినరయి విజయన్ త్రివేండ్రంలోని అద్దె నివాసం, కన్నూరులోని ఆయన కుటుంబ గృహం, మాజీ పర్యాటక శాఖ మంత్రి పి.ఏ. మహ్మద్ రియాస్ కోచికోడ్ నివాసాలపై సోదాలు ప్రారంభించారు. భారీ సంఖ్యలో అధికారులు గోప్యత మధ్య ఈ దాడులు నిర్వహించారు.
ఈ దాడులు CPI(M)తో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలను రాజకీయంగా వేధించేందుకు, వారి ప్రతిష్టను దెబ్బతీయడానికి జరుగుతున్న విస్తృత కుట్రలో భాగమని పార్టీ ఆరోపించింది. ఈ పరిణామంపై కేరళ వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. పలు జిల్లాల్లో ఆందోళనలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

కాంగ్రెస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కూడా BJPతో చేతులు కలిపి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉపయోగిస్తోందని CPI(M) విమర్శించింది. రాజకీయ ప్రయోజనాల కోసం దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా మార్చే ప్రయత్నాన్ని కేరళ ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారని పార్టీ తెలిపింది.
ఈ చర్యలకు వ్యతిరేకంగా కేరళ వ్యాప్తంగా ప్రజలను సమీకరించి ప్రజాస్వామ్య పద్ధతుల్లో భారీ నిరసనలు కొనసాగిస్తామని CPI(M) స్పష్టం చేసింది.

పెట్రోల్,డీజిల్ రేట్లు తగ్గించాలని నక్కపల్లి మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
26/05/2026

పెట్రోల్,డీజిల్ రేట్లు తగ్గించాలని నక్కపల్లి మండలంలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.

Address

Anakapalli
Anakapalle
531001

Website

Alerts

Be the first to know and let us send you an email when Cpmanakapalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Nearby government services