05/10/2026
🚔 జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘PGRS’ 🚔
✳️ జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, IPS గారి ఆదేశాల మేరకు...
📌 గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసరావు, అనంతపురం డీఎస్పీ కరుణాకర్ రావు ఆధ్వర్యంలో 90 వినతుల స్వీకరణ
🔹 జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్, IPS గారి ఆదేశాల మేరకు సోమవారం అనంతపురంలోని జిల్లా పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ‘ప్రజల ఫిర్యాదుల పరిష్కార వేదిక’ (PGRS) కార్యక్రమం నిర్వహించారు.
🔹 ఈ కార్యక్రమంలో గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసరావు, అనంతపురం డీఎస్పీ కరుణాకర్ రావు పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు.
📝 90 వినతులు నమోదు
ఈ సందర్భంగా నిర్వహించిన PGRS కార్యక్రమంలో మొత్తం 90 పిటీషన్లు నమోదయ్యాయి.
వీటిలో ప్రధానంగా:
🔸 కుటుంబ తగాదాలు
🔸 సివిల్ వివాదాలు
🔸 ఆర్థిక మోసాలు
🔸 సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి.
⚖️ వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారం
డీఎస్పీలు మాట్లాడుతూ... ఎస్పీ గారి మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల సమస్యలకు వేగవంతమైన, పారదర్శకమైన పరిష్కారం చూపడమే లక్ష్యంగా PGRS నిర్వహిస్తున్నామని తెలిపారు.
అందిన ప్రతి వినతిపై సమగ్ర విచారణ జరిపి, చట్టపరిధిలో బాధితులకు త్వరితగతిన న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.
📞 అర్జీలపై వెంటనే స్పందించి, నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఫోన్ ద్వారా ఆదేశించారు.
🍱 పిటీషనర్లు, సహాయకులకు ఉచిత భోజనం
ఇస్కాన్ సంస్థ సహకారంతో PGRS కార్యక్రమానికి విచ్చేసిన పిటీషనర్లు, వారి సహాయకులకు ఉచితంగా భోజనం ఏర్పాటు చేయించారు.
🤝 ప్రజల సమస్యలకు స్పందన... పరిష్కారమే లక్ష్యం.