Telugu Desam Party: Atmakur

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Atmakur Official Page of TDP Atmakur

30/10/2026

ప్రభుత్వ సిబ్బంది రెండు రోజుల్లోనే రోడ్లపై కూలిన చెట్లన్నీ తొలగించారు. ఎక్కడా ఒక్క చెట్టు లేదు. అదీ గ్రామీణ ప్రాంతాలు, పేద ప్రజల పట్ల మా ప్రభుత్వానికి ఉన్న నిబద్దత. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా కరెంటు ఇస్తాం. రాజీ లేదు.



30/10/2026

తుఫానుపై రెండు రోజులుగా సమీక్షిస్తూనే ఉన్నా. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు రేయింబవళ్లు పనిచేశాం. చాలా మేరకు ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏడుగురు చనిపోవడం బాధాకరం.



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి! రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ లలో మేయర్ స్థానాలకు పోటీచేస్తున్న తెలుగుదేశం,...
30/10/2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి! రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ లలో మేయర్ స్థానాలకు పోటీచేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించండి. స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన కొనసాగనివ్వండి.


•అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రానికి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ...
30/10/2026

•అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రానికి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గురువారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు

•సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం వర్చువల్‌గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో 45కు పైగా అంశాలపై చర్చించి, 48 కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు

•అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ రెండో విడత నిధులను శుక్రవారం విడుదల చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది

•స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఖరారు చేసిన అభ్యర్థులే పోటీలో ఉంటారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని, అభ్యర్థిని కాకుండా ఎన్డీఏను చూసి ఓటు వేయాలని కోరారు

•నవంబర్ 1న జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/k02Lr


29/10/2026

ప్రజల రక్షణ కోసం తమ కుటుంబాలను వదిలి కష్టపడిన ఈ క్షేత్ర స్థాయి సిబ్బంది నిజమైన హీరోలు. తుఫాను, భారీ వర్షాల కారణంగా పలు చోట్ల చెట్లు నేలకూలి, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పోలీసు, ప్రభుత్వ, విద్యుత్ శాఖ సిబ్బంది ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు శ్రమించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు వీరు చూపిన ధైర్యం, నిబద్ధత అభినందనీయం.


29/10/2026

తుఫాను ప్రభావిత ప్రజలకు అండగా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చేందుకు, వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు బయలుదేరారు సీఎం చంద్రబాబు నాయుడు గారు.



29/10/2026

ఒకవైపు భారీ వర్షం.. తుఫాన్ ధాటికి టిఫిన్ సెంటర్లన్నీ మూతపడ్డాయి. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అప్పుడే కడుపు నింపే అమ్మలా కనిపించింది అన్న క్యాంటీన్. భారీ వర్షంలోనూ అభాగ్యులు, పేదల కడుపు నింపుతోంది. కేవలం 5 రూపాయలకే టిఫిన్ అందిస్తున్నారు.



29/10/2026

జాతీయ, రాష్ట్ర రహదారులు, గ్రామాలు, పట్టణాల్లో పడిపోయిన చెట్లన్నింటినీ రాత్రికి రాత్రే తొలగించి, రవాణాకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చేస్తున్నాం. విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నాం. తుఫాను తదనంతరం అంటువ్యాధులు వ్యాపించకుండా శానిటేషన్ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.



29/10/2026

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలు కొనసాగించాలి. గురువారం నేనే స్వయంగా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలిస్తా. బాధితులకు వేగంగా సహాయం అందించి, ప్రజల్లో భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.



29/10/2026

తుఫాను సహాయక చర్యల్లో విశాఖ జీవీఎంసీ సిబ్బంది, అగ్నిమాపక శాఖ పనితీరు అద్భుతం. మా ఇంటిపై చెట్టు, విద్యుత్ స్తంభం కూలిందని చెప్పిన వెంటనే వచ్చి తొలగించారు. తుఫాను సమయంలో ఇంత ఫాస్ట్ గా స్పందించినందుకు సిబ్బందికి, ప్రభుత్వానికీ ధన్యావాదాలు.


Address

Atmakur
502291

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Atmakur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Atmakur:

Shortcuts

Share

Nearby government services