23/09/2026
*ఉత్తమ సేవలు అందించిన ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే సన్మానం*
మోపిదేవి: ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించిన ప్రజాప్రతినిధులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఘనంగా సత్కరించారు. బుధవారం మోపిదేవిలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ పాలకవర్గ పదవి కాలం పూర్తయిన సందర్భంగా ఆత్మీయ అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఎంపీపీ రావి దుర్గావాణి, జడ్పీటీసీ సభ్యులు మెడబలిమి మల్లికార్జునరావు, చల్లపల్లి ఎంపీపీ కోట విజయ రాధికలను ఘనంగా సత్కరించారు. మోపిదేవి, చల్లపల్లి మండలాల అభివృద్ధిలో వారి పాత్ర ప్రశంసనీయమన్నారు. కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.