itdp Pedanandipadu

Directions

itdp Pedanandipadu

07/09/2026

*మాజీ సైనికుడి, ఉపాధ్యాయుడిపై 'సాక్షి' గూండాయిజం*

*పారదర్శకంగా జరిగిన డీఎస్సీపై బురదజల్లడమే లక్ష్యంగా పాత్రికేయ ముసుగులో అరాచకాలు*

దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన ఒక మాజీ సైనికుడిపై, సమాజానికి విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయుడిపై 'సాక్షి' మీడియా ప్రతినిధులు సాగించిన అరాచకాన్ని, బరితెగింపు చర్యలకు పాల్పడుతోంది. ఉపాధ్యాయ దినోత్సవం నాడే, చిన్నారులకు పాఠాలు చెబుతున్న తరగతి గదిలోకి అక్రమంగా చొరబడి, చొక్కా పట్టుకుని ప్రాణభయం కలిగించేలా బెదిరించడం పాత్రికేయ విలువలకే మాయని మచ్చ. ఇది జర్నలిజం ముసుగులో సాగించిన రౌడియిజం, గూండాయిజం.

భారత సైన్యంలో హవల్దార్‌గా పనిచేసి రిటైర్ అయిన వి. చక్రపాణి రెడ్డి గారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, రోజుకు 16 గంటలకు పైగా కష్టపడి చదివి, మెగా డీఎస్సీలో ప్రతిభ ఆధారంగా, నిబంధనల ప్రకారం ఎక్స్-సర్వీస్‌మెన్ కోటాలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించారు. కుప్పం మండలం నడిమూరు పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా తన విధులను నిబద్ధతతో నిర్వహిస్తుంటే, రాజకీయ దురుద్దేశంతో ఆయనపై కక్షగట్టి వేధించడం క్షమార్హం కాని నేరం. అక్రమంగా పాఠశాలలోకి ప్రవేశించి, సర్టిఫికెట్లు చూపించకపోతే తప్పుడు వార్తలు రాస్తామని బ్లాక్‌మెయిల్ చేయడం, విద్యార్థుల ముందే చొక్కా కాలర్ పట్టుకుని భౌతిక దాడికి దిగడం సమాజం తలదించుకునే దుశ్చర్య.

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, అవినీతి లేకుండా, కేవలం మెరిట్ ప్రాతిపదికన నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాలపై విషం చిమ్మాలనే దుగ్ధతోనే ఈ విధమైన కుట్రలకు తెరలేపారు. కష్టపడి మెరిట్‌తో ఉద్యోగాలు సాధించిన సామాన్యులను మానసికంగా క్షోభకు గురిచేసి, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు 'సాక్షి' పత్రిక, ఛానల్ ఎంతటి నీచానికైనా దిగజారుతున్నాయనడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం.

దేశానికి సేవలందించిన సైనికుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి, తరగతి గది పవిత్రతను కాలరాసిన సాక్షి రిపోర్టర్ గణేష్, కెమెరామన్ శ్రీకాంత్‌లపై చట్టప్రకారం చర్యలు.



25/05/2026
25/05/2026

డిజిటల్ వేదికపై పసుపు జెండా రెపరెపలాడే వేళ..!

మహానాడు - 2026

పొదుపు చర్యలకు ప్రాధాన్యత ఇస్తూ.. మే 27, 28 తేదీలలో వర్చువల్ మహానాడు వేడుకలు

ఎన్టీఆర్ భవన్‌లో ప్రత్యేక స్టేజ్ ఏర్పాటు చేసి ఆన్‌లైన్ ద్వారా నిర్వహించేలా ఏర్పాట్లు

రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో LED స్క్రీన్లు ఏర్పాటు

ప్రపంచం ఎక్కడున్నా తెలుగు తమ్ముళ్లందరినీ ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకువచ్చే మహోత్సవం – మహానాడు 2026!

డిజిటల్ గళంతో పసుపు సైన్యం శక్తిని ప్రపంచానికి చాటుదాం..!

25/05/2026

ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలందరికీ ఒక ముఖ్య గమనిక

రాష్ట్రవ్యాప్తంగా ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గౌరవ ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డా.బూర్ల రామాంజనేయులు గారు సూచించారు.

అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న కారణంగా ప్రజలు ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎమ్మెల్యే గారు కోరారు.

ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు మరియు అనారోగ్య సమస్యలు ఉన్న వారు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

మధ్యాహ్నం 11 గంటల నుండి 4 గంటల వరకు అత్యవసర పనులు లేకపోతే బయటకు వెళ్లకుండా ఉండాలని సూచించారు. ప్రజలు ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని తెలిపారు. రైతులు, కూలీలు మరియు బయట పనులు చేసే వారు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎండ తీవ్రత నుండి తమను తాము రక్షించుకోవాలని కోరారు.

ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్య సమస్యలు కనిపించిన వెంటనే సమీప వైద్య కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.

ప్రజల ఆరోగ్యం మరియు భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు.

25/05/2026

Address

Bapatla

Website

Alerts

Be the first to know and let us send you an email when itdp Pedanandipadu posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share