21/03/2026
To
ఇక్కడ జనాల రక్తంతో పక్క రాష్ట్రం నాది అనే సినిమా హీరోకి,
పేరు రాద్దాం అంటే ఆయన పేరు పెట్టి అనేవాళ్ళా మీరు అని ఒక సెకండ్ హ్యాండ్ గూడ్స్ అమ్మే సైట్ లో రాళ్ళు అమ్మే ఆయన వస్తాడు అందుకే, ఎందుకులే చెవి కింద కుక్కల గోల అని, ఎలాగూ సదరు హీరోనే ఒక రాష్ట్రాన్ని పేరు తలిస్తే అవమానం కిందే అని పేరు చెప్పకుండా ఫీల్ అయినప్పుడు(ఒక రాష్ట్ర ప్రజలని అందరినీ అవమానించినప్పుడు), అలాంటి చిరు మనస్తత్వం కలిగిన వాళ్ళని వాళ్ళ పేరుతో పిలవడం ఎందుకు, ఎవరి గురించి అనేది చదివే వాళ్ళకి తెలుస్తుంది కదా, BTW అతను పేరు రాస్తే మాకు, చదివితే మీకు అవమానం అని మేము కూడా ఫీల్ అయిన కారణంగా, అతని పేరుని మేము కూడా పిలవదలుచుకోలేదు. మా రాష్ట్రం పేరు పలకడానికి అవమానంగా భావించే మనిషి పేరు పలకడం మాకు కూడా అవమానమే. ఏదో కుల, పార్టీ, ప్రాంతం అడ్డం వచ్చి చెప్పుకోడానికి ఇబ్బందిగా ఉన్నా, పుట్టి పెరిగి, సినిమాల్లో, రాజకీయంగా జన్మని ఇచ్చిన రాష్ట్రం పేరు తలచడానికి ఇబ్బందిగా భావించే మనిషి పేరు పలకడం మాకు కూడా ఇబ్బందే.
సదరు చిరు హృదయ జీవి అదే అండి, కుంచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి అని ఇప్పుడే మా chat GPT చెప్పింది, చెప్పింది ఏంటి అంటే పక్క రాష్ట్రంలో కూడా అవార్డులు ఇవ్వాలి, ఆపేశారు అని. ఒకసారి మనం క్రోనాలజీ లోకి వెళ్దాం. చివరిసారిగా నంది అవార్డులు ఇచ్చింది ఎప్పుడూ? 2017లో చివరి సారిగా 2014,15,16 సంవత్సరాలకి సంబంధించి నంది అవార్డులు ప్రకటించారు.
సరే అప్పుడు ఆ అవార్డులను పరిశ్రమ నుంచీ బాహాటంగా వ్యతిరేకించింది, విమర్శలు చేసింది, ఎప్పుడూ లేనిది వాటికి కులం రంగు పూసింది ఎవరండీ? మన కాంపౌండ్ నుంచీ సన్నీ బాసు, మల్లనలుపు జుబ్బి నే కదా. అదీ కూడా పైకి చెప్పిన కారణం ఏమిటిది అండి, నాగేశ్వరరావు గారి చివరి సినిమా కాబట్టి మనం సినిమాకి ఇవ్వాలి, చారిత్రక సినిమా కాబట్టి రుద్రమదేవిలో సహాయక పాత్రలో నటించిన బన్నీకి ఉత్తమ నటుడు ఇవ్వాలని కదా.
మీ కాంపౌండ్ చెప్పిన ప్రకారం రామారావు గారు నటించిన చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ కి నంది అవార్డు వచ్చిందా? పోనీ SV రంగారావు గారు చేసిన చివరి సినిమాకి వచ్చిందా? పోనీ శోభన్ బాబు? కైకాల సత్యనారాయణ? ఆ సంవత్సరం వచ్చిన సినిమాల్లో మంచి సినిమాని ఉత్తమ సినిమాగా ప్రకటిస్తారు అని పిలిచి చెప్పాలి కదా నువ్వు. ఎందుకంటే అప్పటికి పరిశ్రమ పెద్దగా ఉన్న దాసరి నారాయణ రావు గారు లేరు, ఆయన పరమపదించిన వెంటనే పరిశ్రమకి నేనే పెద్ద దిక్కు అని నీ వర్గంతో ప్రకటించుకున్న నువ్వు, నీ వర్గంలో వాళ్ళే గొడవ చేస్తుంటే పిలిచి మందలించాల్సింది పోయి, వాళ్ళు పెట్టిన మంటలో చలి కాచుకున్నావు.
ఇక పోతే మా సాధారణ ప్రజల మెదడును తొలుస్తున్న మరొక ప్రశ్న ఏంటీ అంటే, కూటమి ప్రభుత్వంలో నీ తమ్ముడు ముఖ్యమైన మనిషిగా ఉన్నాడు, అలానే సినిమాటోగ్రఫీ శాఖకి మంత్రిగా నీ తమ్ముడి పార్టీ మనిషి(PS అతనికి సీటు కోసం నీ వర్గం అంతా కూడా సోషల్ మీడియాలో చేసిన రచ్చని, అప్పటి సిట్టింగ్ MLA గా ఉన్న బుచ్చయ్య గారిని సీటు వదులుకోవాలని రాసిన పోస్టులను ప్రస్తావించదలచుకోవడం లేదు) ఉన్నప్పుడు, సినిమా పరిశ్రమతో దగ్గరగా ఉండే చంద్రబాబు గారికి అని చెప్పినప్పుడు, ఇంట్లో ఉన్న నీ మనిషి, గెలిచిన వెంటనే నీ ఆశీర్వాదం తీసుకున్న తమ్ముడు నీ మాట వినలేదా? లేదంటే బయట అనుకున్నట్లు నా తమ్ముడికి నాకు సైద్ధాంతిక(పర్సనల్ ఇగో) ప్రాబ్లం ఉంది, అందుకే నా తమ్ముడిని అడగలేదు అని చెప్పదలుచుకున్నావా?
ఏదీ ఎలా ఉన్నా మీ సినిమాలకి హైకూలు ఇచ్చేది, స్పెషల్ షోస్ కి పర్మిషన్ ఇచ్చేది, మీ సినిమా షూటింగ్ లకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేది, ఇక్కడ తీసిన సినిమాలకి టాక్స్ బెనిఫిట్స్ ఇచ్చేది, అసలు మీ సినిమాలకి అత్యధిక రెవెన్యూ ఇచ్చేది నువ్వు చెప్పిన అదే పక్క రాష్ట్రం అని తేలియజేస్తున్నాం. ఇవన్నీ మామూలుగా అయితే నీకు తెలిసేవి, కానీ నిర్మాతల నుంచీ వచ్చే చెక్కులు తప్ప, వాళ్ళ తిప్పలు తెలియని నీకు ఇలాంటివి తెలిసే అవకాశం ఉన్నా, నువ్వు తెలుసుకోవు కాబట్టి చెప్తున్నాం.
ఇట్లు,
మీ క్రికెట్ టీమ్ సినిమాలకి క్రమం తప్పకుండా 500కి తగ్గకుండా చదివించుకునే ఒక సగటు సినీ అభిమాని.