TDP Chilakaluripet

Directions

TDP Chilakaluripet TDP Chilakaluripet

సోషల్ మీడియా వేదికగా సమరశంఖం పూరిద్దాం...​రానున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో మన ప్రియతమ శాసనసభ్యులు Prathipatiఫోటోతో కూ...
10/10/2026

సోషల్ మీడియా వేదికగా సమరశంఖం పూరిద్దాం...

​రానున్న మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో మన ప్రియతమ శాసనసభ్యులు Prathipatiఫోటోతో కూడిన సరికొత్త వాట్సాప్ DP విడుదల చెయ్యడం జరిగింది

​కార్యకర్తలు, నాయకులు మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులందరూ ఈ DPని మీ వాట్సాప్ మరియు సోషల్ మీడియా ఖాతాలలో ప్రొఫైల్‌గా పెట్టుకొని, మన ఐక్యతను మరియు బలమైన నాయకత్వాన్ని చాటిచెప్పాలని కోరుతున్నాం

​మీ DP ని మార్చండి – ఎన్నికల శంఖారావం మోగించండి




09/10/2026

మాజీ మంత్రి విడదల రజనీ కి ఓటు వెయ్యడానికి చిలకలూరిపేట ప్రజలు సిద్ధంగా లేరు

శాసనసభ్యురాలిగా తన పదవీ కాలం మరో ఆరు నెలలు ఉండగానే నియోజకవర్గాన్ని వదిలేసి గుంటూరు పారిపోయిన ఘనత ఆమెది... ఆమె ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఎవ్వరికీ తెలియదు

నేను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా... ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తా... Prathipati




09/10/2026

ఆయన వేసే ప్రతి అడుగులోనూ ఆయన చేసే ప్రతి ఆలోచనలోనూ పేద ప్రజల ఆనందం ఉంటుంది




"డిజిటల్ వార్‌ఫేర్‌కు చిలకలూరిపేట iTDP సైన్యం సిద్ధం"​రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డిజిటల్ మాధ్యమాల్లో తిరుగులేని ఆధ...
09/10/2026

"డిజిటల్ వార్‌ఫేర్‌కు చిలకలూరిపేట iTDP సైన్యం సిద్ధం"

​రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో డిజిటల్ మాధ్యమాల్లో తిరుగులేని ఆధిక్యం సాధించే లక్ష్యంతో, గౌరవ ఎమ్మెల్యే శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి దిశానిర్దేశంలో చిలకలూరిపేట నియోజకవర్గ iTDP వారియర్స్‌కు సమగ్ర శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది

​ప్రజా సమస్యలపై గళమెత్తడం, ప్రభుత్వ సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రత్యర్థుల దుష్ప్రచారాలను వాస్తవాలతో తిప్పికొట్టే వ్యూహాలపై సోషల్ మీడియా సైనికులకు " Prathipati" దిశానిర్దేశం చేశారు

​ఈ సందర్భంగా సరికొత్త డిజిటల్ క్యాంపెయిన్ "మన వార్డు - మన ప్రత్తిపాటి" ప్రత్యేక పోస్టర్‌ను "ప్రత్తిపాటి" ఆవిష్కరించారు

ప్రతి వార్డులో... ప్రతి గడపకూ... మన నాయకుడు "ప్రత్తిపాటి" నిరంతర సేవలు, అభివృద్ధి సంక్షేమ బాటలను డిజిటల్ వేదికల ద్వారా మరింత బలంగా చేరవెయ్యాలని సంకల్పించడం జరిగింది

మూడు గంటల పాటు సాగిన ఈ కార్యక్రమానికి iTDP సైన్యం చేయాల్సిన విధివిధానాలపై అవగాహన కల్పిస్తూ Sivakrishna Devabhaktuni గారు, సోషల్ మీడియా పై అవగాహన కల్పిస్తూ Apparao Marella పాల్గొన్నారు

చిలకలూరిపేట నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు పిల్లి కోటి గారి ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు Mani Kumar Amara గారి నేతృత్వంలో సాగిన ఈ సమావేశాన్ని సక్సెస్ చేసిన "అమరా మణి" ని ప్రత్తిపాటి నుండి ప్రత్యేక ప్రశంసలు లభించాయి

అలానే ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన చిలకలూరిపేట నియోజకవర్గ ITDP సభ్యులైన M Venkata Rao గారు, Dasarada Ramaiah Gadipudi గారు, Bharath Peravali గారు, నాగ భరత్ గార్లను "ప్రత్తిపాటి" ప్రత్యేకంగా అభినందించారు

ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి మాకు ఆద్యంతం సహకరించి మాకు వెన్నుదన్నుగా నిలిచిన తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు Samadhkhan Pathan గారికి, తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి Siva Maddiboina గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు Murakonda Mallibabu గారికి ITDP వేదికగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాం




కార్యకర్తను గుండెల్లో పెట్టుకునే నిజమైన నాయకత్వం… మన నారా లోకేష్ గారిది ​మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న క...
09/10/2026

కార్యకర్తను గుండెల్లో పెట్టుకునే నిజమైన నాయకత్వం… మన నారా లోకేష్ గారిది

​మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న కార్యకర్తల శిక్షణా తరగతుల్లో ట్రైనర్ గా పాల్గొంటున్న నాకు, నిన్న మన యువనేత Nara Lokesh గారు ఇచ్చిన విందు సమావేశంలో ఎదురైన ఒక అపురూపమైన అనుభవం మీముందుకు

​ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చిన నన్ను, ఏమాత్రం హోదా అడ్డురాని నిరాడంబరతతో స్వయంగా లోకేష్ గారు తన చేతులతో లంచ్ ప్లేట్ అందిస్తూ పలకరించారు

అంతేకాదు, ఇటీవల నాకు ఆపరేషన్ జరిగిన విషయాన్ని తెలుసుకుని, ప్రత్యేకంగా నాతో మీ ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు

"ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, మేమంతా ఉన్నాం" అని ఆయన ఇచ్చిన ఆత్మీయ భరోసా నా కళ్లల్లో ఆనంద భాష్పాలు నింపింది

​ఒక సామాన్య కార్యకర్తగా పార్టీలో అడుగుపెట్టిన నాకు ఇంతటి గౌరవం, ఆత్మీయత దక్కడం కేవలం Telugu Desam Party (TDP) లోనే సాధ్యం

నాయకుడంటే ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, తనను నమ్ముకున్న ప్రతి కార్యకర్త క్షేమాన్ని కుటుంబ సభ్యుడిలా పట్టించుకోవడమే అని లోకేష్ గారు మరోసారి నిరూపించారు

​కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలు అనే సిద్ధాంతాన్ని ప్రతి క్షణం ఆచరించే నాయకత్వం ఉండటం మన అదృష్టం

ఈ ప్రేమ, ఈ భరోసా పార్టీ కోసం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి కొండంత బలాన్నిచ్చింది

​థాంక్యూ లోకేష్ గారు … మీ ఆత్మీయత ఎప్పటికీ మరువలేనిది




09/10/2026

Telugu Desam Party (TDP) కార్యకర్తలపై ప్రధాని మోదీ ప్రశంసలు... తిరుపతి నుండి వారణాసి వరకూ వారు చేసిన బైక్ యాత్ర నన్ను కదిలించిందంటూ భావోద్వేగ పోస్ట్

08/10/2026

ఆంధ్రప్రదేశ్ ఇంతగా అభివృద్ధి చెందుతుంది అంటే అది అద్భుతమైన నాయకత్వం వల్లే... రాబోయే ఐదు, పది సంవత్సరాల్లో ఆకాశమే హద్దుగా ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతిని సాధించబోతుంది




06/10/2026

వీరి ముగ్గురిని విడదీయడం ఇప్పట్లో ఎవ్వడి తరం కాదు

ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం దృఢమైన వారి అనుబంధాన్ని క్రింది స్థాయిలో కూటమి శ్రేణులు కూడా ఈగోలను పక్కనపెట్టి రామలక్ష్మణుల్లా కలిసి పోవాలని ఆశిస్తూ... 🙏

ఇక్కడ మనకు రాజకీయం కాదు కావాల్సింది ఈ రాష్ట్ర ప్రగతి

రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించాలని కోరుకుంటూ... 🙏




Address

Chilakalurupet

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Chilakaluripet posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share