Nani TDP

Directions

Nani TDP Iam Nani katikarla from kamavarapukota

09/09/2026
09/09/2026

2024 - 2026 MPLAD's రివ్యూ మీటింగ్...




స్వర్గీయ శ్రీ పెండ్యాల వెంకట కృష్ణారావు గారు (దొమ్మేరు కృష్ణబాబు) ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ముఖ్యంగా కొవ్వూరు నియోజక...
30/08/2026

స్వర్గీయ శ్రీ పెండ్యాల వెంకట కృష్ణారావు గారు (దొమ్మేరు కృష్ణబాబు) ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్న అరుదైన ప్రజా నాయకుడు.
ఆయన రాజకీయ ప్రస్థానం & విశేషాలు:
ఐదుసార్లు ఎమ్మెల్యే: కొవ్వూరు శాసనసభ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదు పర్యాయాలు (1983, 1985, 1989, 1994, 1999) తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించి ప్రజల తిరుగులేని ఆదరణను చాటుకున్నారు.
ప్రజా నాయకత్వం: వివాదరహితుడిగా, నిరాడంబర జీవితాన్ని గడిపిన నేతగా, పార్టీలకతీతంగా నియోజకవర్గ ప్రజలందరినీ ఆత్మీయంగా పలకరించే స్వభావం ఆయన సొంతం.
మౌలిక సదుపాయాల అభివృద్ధి: గోదావరి తీర ప్రాంత రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, పాఠశాలల అభివృద్ధిలో ఆయన వేసిన ముద్ర నేటికీ కనిపిస్తుంది.
నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పరితపించిన ఆ మహనీయుని విగ్రహ ఆవిష్కరణ జరగడం, ఆయన ఆశయాలను భావితరాలకు గుర్తుచేసే గొప్ప సందర్భం. ఆ ప్రజానేత స్మృతికి ఘన నివాళులు.
కృష్ణ బాబు గారి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ #శాసనసభ #స్పీకర్ శ్రీ #అయ్యన్నపాత్రుడు గారితో

కామవరపుకోట (కొత్తూరు)లో పింఛన్ల పంపిణీ:                        పేదల సంక్షేమమే ధ్యేయం  మాజీ ఎమ్మెల్యే ఘంటాకామవరపుకోట,మే 1...
01/05/2026

కామవరపుకోట (కొత్తూరు)లో పింఛన్ల పంపిణీ: పేదల సంక్షేమమే ధ్యేయం మాజీ ఎమ్మెల్యే ఘంటా

కామవరపుకోట,మే 1: మండలంలోని కొత్తూరు గ్రామంలో శుక్రవారం పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి రామకృష్ణ, మండల టీడీపీ అధ్యక్షులు కిలారు సత్యనారాయణ లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి మాట్లాడారు.. రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే తమ లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటికీ లబ్ధి చేకూరుస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ నెలలో కామవరపుకోట పంచాయతీ పరిధిలో కొత్తగా 7 పింఛన్లు మంజూరయ్యాయని, అందులో 2 డయాలసిస్ రోగులకు ఆసరాగా ఉండగా, మరో 5 స్పౌస్ పింఛన్లు ఉన్నాయని తెలిపారు. కష్టాల్లో ఉన్న వారికి ప్రభుత్వం ఇచ్చే ఈ భరోసా ఎంతో ఊరటనిస్తుందని ఆయన ఆకాంక్షించారు.అనంతరం మండల టీడీపీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, అర్హులకు త్వరితగతిన పింఛన్లు అందేలా కృషి చేస్తున్నామని, ప్రజల కష్టాల్లో ఎల్లప్పుడూ తోడుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ అధ్యక్షుడు ఘంటా సత్యంబాబు,కర్రిపోతు అనూష, వజీర్ ఖాన్, రెబ్బా పరాత్పర రావు, కటికర్ల నాని, కలిదిండి పుల్లం రాజు, బండి వర్మ, కారే సాల్మన్ రాజు, కర్రిపోతు కృష్ణ, దొంగల అంజి తదితరులు పాల్గొన్నారు.

రాజకీయాల్లో ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ నెంబర్ వన్‌గా ఎదిగారు.
28/04/2026

రాజకీయాల్లో ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్స్ నెంబర్ వన్‌గా ఎదిగారు.

27/04/2026

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మార్గనిర్దేశకత్వం, విద్యాశాఖ మంత్రి లోకేశ్ గారి కార్యదక్షతల కారణంగా ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వ వైభవం వచ్చింది. రాజకీయాలకు, కుల పక్షపాతాలకు అతీతంగా చేసిన వీసీ నియామకం యూనివర్సిటీ ప్రక్షాళనకు నాంది పలికింది.



Address

Kanavarapukota
Chintalapudi
534449

Website

Alerts

Be the first to know and let us send you an email when Nani TDP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share