Telugu Desam Party: Dhone

Call Directions Website Contact the organization

Telugu Desam Party: Dhone Official Page of TDP Dhone

30/10/2026

నిన్నటి వరకు సరైన నిద్రలేకుండా తుపాను పరిస్థితిని సమీక్షించుకుంటూ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు కాపలా కాసిన ఏపీ సీఎం చంద్రబాబుగారు... ఆ వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ప్రత్యక్షంగా కలుసుకుని వారి కష్టాలను తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వేట్లపాలెంలో బాధితులతో సీఎం మాట్లాడుతున్న దృశ్యాలివి.



•అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రానికి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ...
30/10/2026

•అర్నబ్ తుఫాన్ వల్ల రాష్ట్రానికి ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.4,600 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. గురువారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను సమీక్షించారు

•సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం వర్చువల్‌గా జరిగిన క్యాబినెట్ సమావేశంలో 45కు పైగా అంశాలపై చర్చించి, 48 కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు

•అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ రెండో విడత నిధులను శుక్రవారం విడుదల చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది

•స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఖరారు చేసిన అభ్యర్థులే పోటీలో ఉంటారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని పాటించాలని, అభ్యర్థిని కాకుండా ఎన్డీఏను చూసి ఓటు వేయాలని కోరారు

•నవంబర్ 1న జరగనున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/k02Lr


30/10/2026

అర్నబ్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు వద్ద కాన్వాయ్ దిగి, పనుల పురోగతిని సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు శ్రమిస్తున్న విద్యుత్ శాఖ సిబ్బంది, కార్మికులను అభినందించారు.



30/10/2026

తుఫాను ప్రభావం తర్వాత మూడో రోజు విశాఖలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. జీవీఎంసీ, విద్యుత్, శానిటేషన్ సిబ్బంది రాత్రి, పగలు తేడా లేకుండా శ్రమించి సాధారణ పరిస్థితులు తీసుకొచ్చారు. కేవలం 3 రోజుల్లోనే నగరాన్ని సాధారణ పరిస్థితికి తీసుకొచ్చిన సిబ్బందిని అసలైన హీరోలు అంటూ ప్రజలు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.


30/10/2026

పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందిస్తామని నాడు యువగళం పాదయాత్రలో మాటిచ్చాం. చెప్పినట్టే లక్షలాది చేనేత కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం తెచ్చేందుకు నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలుచేస్తున్నాం. పవర్ లూమ్ కి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ కి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం.




30/10/2026

తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు గారు పర్యటించారు. బాధితుల కష్టాలు విని.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.



30/10/2026

డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గచ్చకాయలపొర గ్రామంలో తుఫాన్ బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పరిశీలించారు.



ప్రజాస్వామ్య చరిత్ర పేజీల పై ఐదేళ్ల జగన్ పాలన ఒక మరకలాంటిది. ఐదేళ్ల పాటు తాను చేసిన ఘోరాలను ఏపీ మర్చిపోయింది అనుకుంటున్న...
30/10/2026

ప్రజాస్వామ్య చరిత్ర పేజీల పై ఐదేళ్ల జగన్ పాలన ఒక మరకలాంటిది. ఐదేళ్ల పాటు తాను చేసిన ఘోరాలను ఏపీ మర్చిపోయింది అనుకుంటున్నాడు జగన్. కాబట్టి రాష్ట్ర ప్రజలారా! స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను సంచలన మెజారిటీతో గెలిపించి "నువ్వు చేసిన అరాచకాలను ఏపీ మర్చిపోలేదు జగన్" అని గట్టిగా చెప్పండి.





30/10/2026

ప్రజల రక్షణ కోసం తమ కుటుంబాలను వదిలి కష్టపడిన ఈ క్షేత్ర స్థాయి సిబ్బంది నిజమైన హీరోలు. తుఫాను, భారీ వర్షాల కారణంగా పలు చోట్ల చెట్లు నేలకూలి, విద్యుత్ స్తంభాలు దెబ్బతిని తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో పోలీసు, ప్రభుత్వ, విద్యుత్ శాఖ సిబ్బంది ప్రాణాలకు తెగించి రాత్రింబవళ్లు శ్రమించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు వీరు చూపిన ధైర్యం, నిబద్ధత అభినందనీయం.


Address

Dhone

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Dhone posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Dhone:

Shortcuts

Share