I&PR

Call Directions

I&PR Information & Public Relation Department DIPRO_ELURU
Eluru,Andhra Pradesh,India

9.10.2026_  శుక్రవారం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్,  ప్రత్యేక ...
09/10/2026

9.10.2026_ శుక్రవారం అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి & రాష్ట్ర నోడల్ అధికారి శంషేర్ సింగ్ రావత్, రాష్ట్ర జనగణన కార్యకలాపాల సంచాలకులు జె. నివాస్ లతో కలిసి భారత రిజిస్ట్రార్ జనరల్ మరియు జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ నిర్వహించిన ‘జనగణన–2027 జనాభా గణనపై రాష్ట్రస్థాయి ప్రధాన జనగణన అధికారులు, జిల్లా కలెక్టర్ల సదస్సు’లో మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జనగణన కమిషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ మాట్లాడుతూ జనగణన-2027 రెండో దశను ఖచ్చితత్వం, నాణ్యత, సమయపాలనతో పూర్తి చేయాలన్నారు. ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి జనగణనలో నమోదు కావాలన్నారు. జనగణన–2027 స్వాతంత్య్రానంతరం ఎనిమిదో జనగణన కాగా, మొత్తంగా పదహారో జనగణన అని ఆయన తెలిపారు. మొదటి దశలో గృహాలకు సంబంధించిన వివరాలు సేకరించగా, రెండో దశలో దేశంలోని ప్రతి వ్యక్తికి సంబంధించిన జనాభా వివరాలను 40 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి ద్వారా నమోదు చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ ఆంధ్రప్రదేశ్‌లో జనగణన–2027 మొదటి దశను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులను అభినందించారు. ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) వంటి క్లిష్టమైన కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ, జనగణన రెండో దశ అయిన జనాభా గణనను కూడా నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు..
#జనగణన2027

8.10.2026_  అమరావతిలోని ఏపీ ఎలక్షన్ కమీషన్ కార్యాలయం నుంచి గురువారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ లు...
08/10/2026

8.10.2026_ అమరావతిలోని ఏపీ ఎలక్షన్ కమీషన్ కార్యాలయం నుంచి గురువారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలు, ఆయా శాఖల జిల్లా అధికారులతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ మాట్లాడుతూ ప్రతి జిల్లాలో వార్డుల వారీగా, పంచాయతీల వారీగా తుది ఓటర్ల జాబితాలను లోపాలు లేకుండా సిద్ధం చేయాలని కలెక్టర్లకు సూచించారు.సమస్యాత్మక మరియు అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అక్కడ అవసరమైన అదనపు భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీలను ఆదేశించారు.

8.10.2026_ ఏలూరు జిల్లాలో 5700 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుండి తొలగించి  5937 మంది రైతులకు లబ్ది చేశామని రాష్ట్ర పౌర సరఫరా...
08/10/2026

8.10.2026_ ఏలూరు జిల్లాలో 5700 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుండి తొలగించి 5937 మంది రైతులకు లబ్ది చేశామని రాష్ట్ర పౌర సరఫరాలు శాఖ మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశపు హాలులో గురువారం జిల్లా సమీక్షా సమావేశం అనంతరం 22ఏ జాబితా నుండి భూములను తొలగించిన రైతులకు ఉత్తరువులను మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ 22ఏ జాబితా నుండి జిరాయితీదారుల భూముల తొలగింపునకు రాష్ట్రంలోనే ఏలూరు జిల్లా ఆదర్శంగా నిలిచిందన్నారు. ఏలూరు జిల్లాలో తీసుకున్న చర్యలను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలోనూ ముఖ్యమంత్రి అమలు చేసారన్నారు. ఏలూరు జిల్లాలో పలుమార్లు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఇంతవరకు 5700 ఎకరాల భూమిని 22ఏ జాబితా నుండి తొలగించి, 5937 మంది రైతులకు లబ్ది కలిగిందన్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కానీ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ కారణంగా తమ భూ సమస్యలకు విముక్తి కలిగిందని ప్రజలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారన్నారు. జిల్లాలో 22ఏ భూ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె. అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ బి.వినూత్న, ఆర్డీఓలు లక్ష్మి ప్రసన్న, రమణ లను, రెవిన్యూ అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

8.10.2026_*ప్రకృతి సాగు ఉత్పత్తులకు మరింత మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి* *సూపర్ ఎల్నినో పరిస్థితులు సమర్థవంతం...
08/10/2026

8.10.2026_*ప్రకృతి సాగు ఉత్పత్తులకు మరింత మెరుగైన మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి*

*సూపర్ ఎల్నినో పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకోవాలి*

*ఖరీఫ్ లో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ధాన్యం సేకరణకు రైతుసేవా కేంద్రాల స్థాయిలో ముందస్తు సన్నద్ధత ప్రణాళిక రూపొందించాలి*

*పిఎం సూర్యఘర్ లో మరింత ప్రగతి సాదించాలి*

*12వ తేదీ నుండి జిల్లాలో సబ్సిడీ పై ఉల్లి అమ్మకాలు*

*పీ4 బంగారు కుటుంబాలకు అభ్యున్నతికి మరింత కృషి చేయాలి*

*నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచండి*

*అవినీతి నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతాం, అవినీతి అధికారులను కఠినంగా శిక్షిస్తాం*

*జిల్లా సమీక్షా సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాలు, జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో సమీక్ష*

8.10.2026_*2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం*.*...
08/10/2026

8.10.2026_*2027 మార్చి నాటికి ప్రభుత్వ పరిధిలోని భూసమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వం లక్ష్యం*.

*వీబీ జీరామ్‌జీ (VB-G RAM G) ద్వారా నియోజకవర్గానికి అదనంగా రూ 25 కోట్లు నిధులు మంజూరు*.

*రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ రైతులు, ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు*.

*ఆభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని అన్ని వర్గాలు ప్రజలు ఆశీర్వదించాలి*.

*రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి* ...
#రైతు_సంక్షేమం #రెవెన్యూ_సేవలు
#భూసమస్యల_రహిత_రాష్ట్రం
#కొలుసు_పార్థసారథి #ఆంధ్రప్రదేశ్

8.10.2026_ జిల్లాలోని  ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యా బోధన అందిస్తున్నామని, అందుకు తగిన విధంగా విద్యార్థుల...
08/10/2026

8.10.2026_ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యా బోధన అందిస్తున్నామని, అందుకు తగిన విధంగా విద్యార్థులు కష్టంతో కాక ఇష్టంతో విద్య నభ్యసించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి విద్యార్థులకు ఉద్బోధించారు. దెందులూరు మండలం సింగవరంలోని శ్రీ మావులేటి సోమరాజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల బోధన , విద్యార్థుల ప్రతిభ స్థాయిలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ విద్యాభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నదన్నారు. విద్యార్థులకు అవసరమైన పాఠ్య, నోట్ పుస్తకాలూ, యూనిఫామ్, బూట్లు, స్కూల్ బ్యాగ్ లు వంటివి ఉచితంగా అందిస్తూ, మధ్యాహ్న భోజనం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నదన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు డిజిటల్ క్లాస్ రూంలు, క్రీడా మైదానాలు, ల్యాబ్ లు, వంటి మౌలిక సదుపాయాలు అన్నీ ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన టీచర్స్ విద్యా బోధనా చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి అందిస్తున్న చేయూతతో విద్యార్థులు విద్యపై దృష్టి కేంద్రీకరించి ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.

#పాఠశాలఆకస్మికతనిఖీ
#దెందులూరుమండలం #సింగవరం
#చింతమనేనిప్రభాకర్ #కెవెట్రిసెల్వి




8.10.2026_*మార్చి , 2027లోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ**సింగవరంలో ఎమ్మెల్యే చ...
08/10/2026

8.10.2026_*మార్చి , 2027లోగా జిల్లాలో రైతులందరికీ రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ*

*సింగవరంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేసిన కలెక్టర్ వెట్రి సెల్వి*
మార్చి , 2027లోగా జిల్లాలోని రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. దెందులూరు మండలం సింగవరంలో గురువారం దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తో కలిసి పట్టాదారు పాస్ పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎటువంటి తప్పులు లేకుండా, 13 పటిష్టమైన భద్రతా ఫీచర్లతో పట్టా దారు పాస్ పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు. మార్చి , 2027లోగా జిల్లాలోని రైతులందరికీ పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేయాలనీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రతీ నెల 20, నుండి 30 గ్రామాలలో రీసర్వే పనులను పూర్తిచేసి, తదుపరి నెలలో రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలను ముద్రించి రైతులకు అందిస్తున్నామన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకాల ముద్రణలో చేపట్టిన భద్రతా ఫీచర్స్ కారణంగా నకిలీ పాస్ పుస్తకాలను రూపొందించడం, జిరాక్స్ కూడా తీసేందుకు కుదరదన్నారు. పుస్తకంలోని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే రైతు పేరు, ఆస్తివివరాలు, భూమి మ్యాప్ అన్ని తెలుస్తాయన్నారు. ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా వీలులేకుండా భద్రత కల్పించామన్నారు. పట్టాదార్ పాస్ పుస్తకంలో రైతు పేరు, తండ్రిపేరు, విస్తీర్ణం, సర్వే నెంబర్, భూమి ఉన్న ప్రదేశం మ్యాప్, తదితర వివరాలన్నీ పొందుపరచడం జరిగిందన్నారు.
#పట్టాదార్‌పాస్‌పుస్తకాలు
#రాజముద్రపట్టాదార్‌పాస్‌పుస్తకాలు #రైతులసంక్షేమం
#రైతుభరోసా #భూహక్కులు
#రెవెన్యూశాఖ #పట్టాదారుపాస్‌బుక్స్

7.10.2026_*గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌళిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ద...
08/10/2026

7.10.2026_*గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూ మౌళిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి*.

*రాష్ట మంత్రి కొలుసు పార్థసారథి* ...

నూజివీడు మండలం కొన్నంగుంట గ్రామంలో బుధవారం డ్రైనేజీ నిర్మాణ పనులను గ్రామస్తులతో కలసి రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాలు శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పరిశీలించారు. గ్రామస్తులను పేరుపేరున పలకరించి, జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంకా పెండింగులో ఉన్న పనులుపై గ్రామస్తులను అడిగి మంత్రి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ​గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలతో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు వాడుకలోకి తీసుకు రావాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజారోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యత నిస్తూ మౌళిక వసతులు కల్పనను ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. మురుగునీరు నిలవకుండా, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వాలుతో శాస్త్రీయంగా డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ​నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాల్లో ఎలాంటి రాజీ పడకూడదని, నిబంధనల ప్రకారమే మెటీరియల్ వినియోగించాలని స్పష్టం చేశారు. ​గ్రామీణ మౌళిక వసతులు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి గ్రామంలోనూ రక్షిత మంచినీటిని, రోడ్లు, డ్రైనేజీ, తదితర మౌలిక సదుపాయాలకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
I &PR

7.10.2026_అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఈనెల 8వ తేదీ నుండి జిల్లాలో ఇంటింటికీ వెళ్లి, ఆ ఓటర్ల ప్రస్...
08/10/2026

7.10.2026_అర్హులైన ప్రతీ ఒక్కరిని ఓటర్ల జాబితాలో చేర్చేందుకు ఈనెల 8వ తేదీ నుండి జిల్లాలో ఇంటింటికీ వెళ్లి, ఆ ఓటర్ల ప్రస్తుత స్థితిని పునఃపరిశీలిస్తారని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. 'ప్రత్యేక సమగ్ర సవరణ - 2026' (Special Intensive Revision)లో భాగంగా నోటీసు దశలో ASDD (గైర్హాజరైన, స్థానచలనం చెందిన, మరణించిన లేదా ద్వంద్వ నమోదు కలిగిన) ఓటర్లు/అనర్హ ఓటర్ల స్థితిని పునఃపరిశీలించడం మరియు కొత్త ఓటర్లు/జాబితాలో చేరని ఓటర్ల నమోదు కోసం ఒక 'ప్రత్యేక కార్యక్రమాన్ని' (Special Drive) చేపట్టాలని కమిషన్ నిర్ణయించిందన్నారు. తొలగించిన ఓటర్లను స్థితిని బిఎల్వోలు పరిశీలిస్తారని, తొలగించిన ఓటర్ల జాబితాను పోలింగ్ కేంద్రాల్లో పరిశీలనకు ఉంచుతారన్నారు. ఈ సందర్భాలలో ఏదైనా ఓటరు పేరు పొరపాటున తొలగించబడినట్లు గుర్తిస్తే, వారికి 'ఫారం-6' నింపే అవకాశం కల్పించబడుతుందన్నారు. "అర్హులైన ప్రతి ఓటరు పేరును ఓటర్ల జాబితాలో చేర్చడం మరియు అనర్హుల పేర్లను తొలగించడం కార్యక్రమంలో భాగంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. 'నిరంతర అప్‌డేషన్' (continuous updation) ప్రక్రియ ద్వారా వారి పేరు ఓటర్ల జాబితాలో చేర్చబడుతుందన్నారు. .జిల్లాలో SIR, 2026 (ప్రత్యేక సారాంశ సవరణ) కింద తుది ఓటర్ల జాబితా 16.10.2026న ప్రచురించబడుతుందన్నారు. ఈనెల 16వ తేదీన ప్రచురించబడే తుది జాబితాలో పేరు లేని ఓటర్లు మరియు తదుపరి అర్హత తేదీలలో అర్హత సాధించే వ్యక్తులు, 'నిరంతర అప్‌డేషన్' సమయంలో తమ పేరు నమోదు కోసం 'ఫారం-6'ను సమర్పించవచ్చన్నారు.



6.10.2026_జిల్లాలో  స్థానిక  సంస్థల ఎన్నికలకు సంసిద్ధులు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు....
06/10/2026

6.10.2026_జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధులు కావాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివకిశోర్ తో కలిసి ఎంపిడిఓ లు, పోలీసు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో పురపాలక సంఘాలు, జిల్లా పరిషత్ , గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం త్వరలో ఆదేశాలు ఇవ్వనున్న దృష్ట్యా ఏలూరు జిల్లాలో గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు, పోలింగ్ సామాగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూములు ముందుగా సిద్ధం చేసుకొని, తనిఖీ చేసుకోవాలన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రెండు విడతలుగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందన్నారు.





Address

Deputy Executive Information Engineer, I&PR Dept.
Eluru
534001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

08812231061

Website

Alerts

Be the first to know and let us send you an email when I&PR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share