District Collector Eluru

Directions Website

District Collector Eluru Official Page of the Collector & District Magistrate of Eluru District, Andhra Pradesh.

14.8.2026_రాష్ట్రపతి ఉత్తరువుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపు అంశంపై  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప...
14/08/2026

14.8.2026_రాష్ట్రపతి ఉత్తరువుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపు అంశంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏలూరు జిల్లా నుండి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్ లో పాల్గొని, రాష్ట్రపతి ఉత్తరువుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల కేటాయింపు అంశంపై జిల్లా నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ కు తెలియజేసారు.
#ఏలూరు #జిల్లాకలెక్టర్ #కెవెట్రిసెల్వి #ప్రభుత్వఉద్యోగులకేటాయింపు #రాష్ట్రపతిఉత్తర్వులు #రాష్ట్రప్రభుత్వప్రధానకార్యదర్శి #జిసాయిప్రసాద్

14.8.2026_ రాష్ట్రంలో వెదురు సాగు ,  వెదురు తోటల విస్తరణ ప్రణాలికను రూపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల కార్యాలయ క...
14/08/2026

14.8.2026_ రాష్ట్రంలో వెదురు సాగు , వెదురు తోటల విస్తరణ ప్రణాలికను రూపొందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యుల కార్యాలయ కార్యదర్శి ప్రద్యుమ్న ఆయా జిల్లా కలెక్టర్లతో శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

24.8.2026_*80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించూ ఏలూరు జిల్లా కలెక్టరేటులో ప్రత్యేక విద్యుత్తు దీపాలు అలంకరణ*.   ...
14/08/2026

24.8.2026_*80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పురస్కరించూ ఏలూరు జిల్లా కలెక్టరేటులో ప్రత్యేక విద్యుత్తు దీపాలు అలంకరణ*.
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఏలూరు జిల్లా ప్రజల్లో దేశభక్తిని, జాతీయ స్ఫూర్తిని పెంపొందించేలా జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏలూరులోని జిల్లా కలెక్టరేటు భవనాన్ని త్రివర్ణ పతాక రంగులు విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
#ఏలూరు #జిల్లాకలెక్టరేట్ #స్వాతంత్ర్యదినోత్సవం #80వస్వాతంత్ర్యదినోత్సవం

14.8.2026_ప్రజలు నుండి స్వీకరించిన ప్రతి అర్జీని ఛాలెంజీగా తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలి.ఈ రోజు స్వీకరించిన అర్జీలు 5...
14/08/2026

14.8.2026_ప్రజలు నుండి స్వీకరించిన ప్రతి అర్జీని ఛాలెంజీగా తీసుకుని శాశ్వత పరిష్కారం చూపాలి.

ఈ రోజు స్వీకరించిన అర్జీలు 57.

మూడవ విడత "ఒక నెల - ఒక నియోజకవర్గం - నాలుగు పర్యటనలు" కార్యక్రమంలో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన గ్రామసభను నిర్వహించారు.

జిల్లా కలెక్టరుతో పాటు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం. జె.అభిషేక్ గౌడ లు పాల్గొన్నరూ

14.8.2026_*జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ని మర్యాద పూర్వకంగా కలిసి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పుష్పగుచ్చా...
14/08/2026

14.8.2026_*జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ని మర్యాద పూర్వకంగా కలిసి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పుష్పగుచ్చాన్ని అందజేశారు* ...

14.8.2026_*పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు ఆరోగ్యకరమైన  వాతావరణాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపై ఉంది*.*80వ స్వాతంత...
14/08/2026

14.8.2026_*పర్యావరణాన్ని పరిరక్షించి భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవలసిన బాధ్యత మనందరిపై ఉంది*.

*80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సందర్భంగా దెందులూరు అన్నాక్యాంటీన్ వద్ద జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మొక్కలు నాటారు. జిల్లా కలెక్టరుతో పాటు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడలు పాల్గొన్నారు*.

13.8.2026_ ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 లో ముసాయిదా జాబితాలో   క్లెయిమ్‌లు మరియు అభ్యంతరా...
13/08/2026

13.8.2026_ ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 లో ముసాయిదా జాబితాలో క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలపై అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎలెక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ కు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు.

13.8.2026_*ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యత పట్ల గౌరవాన్ని చాటాలి*. *ఏలూరులో ఉత్సాహంగా పండుగ ...
13/08/2026

13.8.2026_*ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తి, జాతీయ సమైక్యత పట్ల గౌరవాన్ని చాటాలి*.

*ఏలూరులో ఉత్సాహంగా పండుగ వాతావరణంలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ 100 అడుగులు జాతీయ జెండాతో, 1200 మంది విద్యార్థిని, విద్యార్థులతో భారీ ర్యాలీ*.

*ర్యాలీని జెండా ఊపి ప్రారంభించి, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిశోర్, జిల్లా జాయింటు కలెక్టరు డా.యం.జె. అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సి.హెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి స్వయంగా సైకిల్ త్రొక్కుతూ ర్యాలీలో పాల్గొన్నారు, రెండవ సారి జాతీయజెండా చేతబట్టి నడకతో ర్యాలీని నిర్వహించారు.*.

#హర్‌ఘర్‌తిరంగా #జాతీయజెండా #దేశభక్తి #స్వాతంత్ర్యదినోత్సవం #ఏలూరు

12.8.2026_*ఏలూరులో  'హర్ ఘర్ తిరంగా'  ర్యాలీ*స్వాతంత్ర   దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లావ్యాప్తంగా జాతీయ సమైక్యత, సమగ్ర...
12/08/2026

12.8.2026_*ఏలూరులో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ*
స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లావ్యాప్తంగా జాతీయ సమైక్యత, సమగ్రతలను చాటిచెప్పే విధంగా "హర్ ఘర్ తిరంగా ర్యాలీ"లు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ప్రతీ ఒక్కరిలో దేశభక్తిని, జాతీయ భావాన్ని పెంపొందించేలా ర్యాలీ నిర్వహించాలన్నారు.
#దేశభక్తి #జాతీయసమైక్యత #జాతీయసమగ్రత #స్వాతంత్ర్యదినోత్సవం #ఏలూరు

12.8.2026_ జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 లో ముసాయిదా జాబితాలో   క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలపై అం...
12/08/2026

12.8.2026_ జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 లో ముసాయిదా జాబితాలో క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలపై అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు.

Address

Eluru

Alerts

Be the first to know and let us send you an email when District Collector Eluru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category