All India Dalit Christian Rights Protection Committee

Directions

All India Dalit Christian Rights Protection Committee Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from All India Dalit Christian Rights Protection Committee, Social service, Guntur.

The All India Dalit Christian Rights Protection Committee (AIDCRPC) works to safeguard the rights of Dalit Christians, a community historically excluded from Scheduled Caste (SC) benefits under Indian law.

30/08/2026

ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో గుం...

30/08/2026

30/08/2026

ప్రచురణార్థం/ప్రసారార్ధం:•••••••••••••••••••••••••-దళిత క్రైస్తవుల SC హోదాకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలి.-1950 రాష...
29/08/2026

ప్రచురణార్థం/ప్రసారార్ధం:
•••••••••••••••••••••••••
-దళిత క్రైస్తవుల SC హోదాకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలి.

-1950 రాష్ట్రపతి ఉత్తర్వును వెంటనే సవరించాలి.

-సచార్ కమిటీ, రంగనాథ మిశ్రా కమిషన్ నివేదికలనే ప్రాతిపదికగా తీసుకోవాలి.

-జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను సైతం సత్వరమే కేంద్రానికి పార్లమెంటుకు సమర్పించాలి.

-సుప్రీం కోర్టులో పెండింగ్ వ్యాజ్యాలన్నిటిని త్వరితగతిన డిస్పోజ్ చేయాలి.

-వచ్చే 26 నవంబర్ నుంచి బస్సు యాత్ర.

-రాజకీయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నించాలి.

-రాజ్యాధికారం సాధించే దిశగా సాగాలి.

- పాలక సమాజంగా మారెందుకు కూడా ప్రయత్నించాలి.

-AIDCRPC దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనంలో జాతీయ నేతలు.

గుంటూరు: అణగారిన దళిత క్రైస్తవుల SC హోదాకు పార్లమెంటులో చట్టబద్ధత కల్పించాలని, అంతకంటే ముందు 1950 రాష్ట్రపతి ఉత్తర్వును వెంటనే సవరించాలని, సచార్ కమిటీ రంగనాథ మిశ్రా కమిషన్ నివేదికలనే ప్రామాణికంగా కొలమానంగా ప్రాతిపదికగా తీసుకోవాలని, సంబంధిత అడ్డంకులను సకాలంలో అధిగమించడానికి కాలయాపన కోసం వేసిన జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదికను కూడా వెంటనే కేంద్రానికి పార్లమెంటుకు సమర్పించాలని, ఓవరాల్ గా దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టులో పెండింగ్ వ్యాజ్యాలన్నిటిని త్వరితగతిన డిస్పోజ్ చేయాలని: ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ (AIDCRPC) జాతీయ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంగటి చిన్నయోసేపు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యస్ జోయల్ రిచర్డ్ సన్, రాష్ట్ర సమన్వయకర్త చిన్నం డేవిడ్ విలియమ్స్, గౌరవాధ్యక్షులు సంగటి మనోహర్ మహాజన్ లు.. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈమేరకు ఇందుకు సంబంధించి గుంటూరు నగరంలోని స్థానిక మధర్ థెరిసా భవన్ లో, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ (AIDCRPC) ఆధ్వర్యంలో, జిల్లా సమన్వయకర్త, చిన్నం డేవిడ్ విలియమ్స్ అధ్యక్షతన "దళిత క్రైస్తవ సమ్మేళనం" జరిగింది.
ఈ సందర్భంగా అల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ (AIDCRPC) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంగటి చిన్నయోసేపు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, డాక్టర్ యస్ జోయల్ రిచర్డ్ సన్, AIDCRPC రాష్ట్ర సమన్వయకర్త చిన్నం డేవిడ్ విలియమ్స్, మహాజన రాజ్యం పార్టీ (MRP) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు సంగటి మనోహర్ మహాజన్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ రాష్ట్ర అధ్యక్షులు బషీర్ అహ్మద్, BC మహాజన సభ, రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు, అంబేద్కర్ విద్యార్థి అసోసియేషన్ (ASA) రాష్ట్ర నాయకులు, వద్దిముక్కల. సురేష్ మాట్లాడుతూ.. దళిత క్రైస్తవుల న్యాయమైన చిరకాల డిమాండ్ల సాధన జాతీయ ఉద్యమంలో భాగంగా, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ (AIDCRPC) ప్రతిపాదించిన డిమాండ్లను.. కేంద్రప్రభుత్వం సానుకూలంగా నిర్దిష్టకాలపరిమితిలోపు పరిష్కరించకపోతే, తామే అందరిని నూటికి 90 శాతం పైబడి వుంటున్న అణగారిన బలహీన సబ్బండ మెజారిటీ బహుజన మహాజన వర్గాలను కలుపుకుని బలమైన మూడో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి, రాజ్యాధికారం సాధించి, పాలక సమాజంగా మారేందుకు కూడా వెనుకాడే ప్రసక్తిలేదని హెచ్చరించారు. ఈ సమూహాన్ని సమాజాన్ని మేల్కొల్పేందుకు వచ్చే 26 నవంబర్ 2026 నుంచి, వచ్చే సంవత్సరం 26 జనవరి 2027 వరకు దళిత క్రైస్తవ చైతన్య బస్సు యాత్రను చేపట్టాలని కూడా ఈ సదస్సులో నిర్ణయించామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ (AIDCRPC) జాతీయ ఉపాధ్యక్షులు బండి నెల్సన్ విజయ్ కుమార్, జాతీయ ప్రధాన కార్యదర్శి కటారి ప్రసాద్, గౌరవాధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షులు సంగటి మనోహర్ మహాజన్, దళిత క్రైస్తవ నాయకులు దాసరి కిశోర్ గారు, మహిళా నాయకురాలు రావినూతల కమల కుమారి, దళిత పారిశ్రామికవేత్తల రాష్ట్ర నాయకులు ఈరి రాజశేఖర్, RCM ప్రతినిధి చుక్క చంద్రపాల్, భీమ్ సేనా సేవాదళ్ వ్యవస్థాపక అధ్యక్షులు నల్లపు నీలాంబరం, సుప్రీంకోర్టు న్యాయవాది TJG. శ్రీనివాస రావు, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులు బత్తుల అనిల్, ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ (AIDCRPC) గుంటూరు జిల్లా సమన్వయకర్త నడా కిరణ్ కుమార్ , తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమ అనంతరం 5 ప్రముఖులకు సత్కారం కూడా చేయడం జరిగింది.

హృదయపూర్వక నమస్కారాలతో.....

(సంగటి చిన్నయోసేపు)
వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు,
ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ (AIDCRPC);
ఆంధ్రప్రదేశ్ దక్షిణభారతదేశం ఇండియా - 9182361339

(చిన్నం డేవిడ్ విలియమ్స్)
రాష్ట సమన్వయకర్త,
ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ (AIDCRPC);
గుంటూరు, ఆంధ్రప్రదేశ్ దక్షిణభారతదేశం ఇండియా.

Address

Guntur
522 ###

Website

Alerts

Be the first to know and let us send you an email when All India Dalit Christian Rights Protection Committee posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category