Nikhil Yarapathineni

Directions

Nikhil Yarapathineni సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు

జై తెలుగుదేశం🚲✌️

25/09/2026

గురజాలకు చెందిన విమల రాణి గారి తల్లిగారైన పద్మ గారు క్యాన్సర్ తో బాధపడుతున్నారు. వారి కుటుంబం సాయం కోసం ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారిని ఆశ్రయించగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం మంజూరు చేయించి అందుకు సంబంధించిన ఎల్ఓసీ పత్రాన్ని ఎమ్మెల్యే యరపతినేని గారు అందజేశారు. తన తల్లి పద్మ గారికి ప్రస్తుతం మెరుగైన చికిత్స అందుతోందని విమల రాణి గారు తెలిపారు. అడిగిన వెంటనే స్పందించి,సాయం చేసి అండగా నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఎమ్మెల్యే యరపతినేని గారికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు.






22/09/2026

ఐదేళ్లపాటు గురజాల ఎమ్మెల్యేగా పనిచేసిన కాసు మహేష్ రెడ్డికి కనీసం గురజాల నియోజకవర్గ సరిహద్దులపై కూడా అవగాహన లేకపోవడం విచారకరం..

రాజకీయంగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారిని ఎదుర్కోలేక, అసత్య ఆరోపణలు చేస్తూ శవ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి.

సత్తెనపల్లి నియోజకవర్గంలోని కోట నెమలిపురి గ్రామ పంచాయతీ పరిధిలో నిరుపయోగంగా ఉన్న మైనింగ్ గుంతలో ప్రమాదవశాత్తు పడి ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోతే, ఆ ఘటన గురజాల నియోజకవర్గంలోని పిడుగురాళ్లలో జరిగిందని, దీనికి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారే కారణమని కాసు మహేష్ రెడ్డి అసత్య ప్రచారానికి తెరలేపారు.

ఐదేళ్లపాటు గురజాల ఎమ్మెల్యేగా పనిచేసిన కాసు మహేష్ రెడ్డికి కనీసం గురజాల నియోజకవర్గ సరిహద్దులపై కూడా అవగాహన లేకపోవడం సిగ్గుచేటు. వాస్తవాలను తెలుసుకోకుండా రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.





నా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా, వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు, అభిమా...
21/09/2026

నా పుట్టినరోజు సందర్భంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా, వివిధ మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గురజాల నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

అదేవిధంగా వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు. నాపట్ల మీరు చూపుతున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి, ఎప్పటికీ మరువలేనివి🙏

~మీ నిఖిల్ యరపతినేని

ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా..  నాకు ఎంతో ఇష్టమైన, నేను నమ్మే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిన...
20/09/2026

ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా.. నాకు ఎంతో ఇష్టమైన, నేను నమ్మే కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను

ఆ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో, పార్టీలకతీతంగా గురజాల నియోజకవర్గ కుటుంబ సభ్యులందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించాను

నా పుట్టినరోజు సందర్భంగా మీరు చూపిస్తున్న అపారమైన ప్రేమాభిమానాలు, అందిస్తున్న ఆత్మీయ శుభాకాంక్షలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. మీరు చూపిస్తున్న ఈ ప్రేమను దేవుడిచ్చిన అమూల్యమైన వరంగా భావిస్తున్నాను. మీ ప్రేమాభిమానాలే నా బలం, మీ ఆశీస్సులే నన్ను మరింత బాధ్యతతో ముందుకు నడిపించే స్ఫూర్తి

మీ అందరి అభిమానం, ఆశీస్సులు నాపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ…

~ మీ నిఖిల్ యరపతినేని

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్ అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.పార్టీ బలోపేతానికి, రాష్ట...
19/09/2026

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్ అన్నకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

పార్టీ బలోపేతానికి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం నారా లోకేష్ గారు చేపట్టిన చారిత్రాత్మక యువగళం పాదయాత్ర విజయవంతం కావడంలో మీ కృషి, చురుకైన పాత్ర, నాయకత్వ పటిమ మరువలేనివి.

మీరు ఆ భగవంతుని ఆశీస్సులతో ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.




టీడీపీ సీనియర్ నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు ఇటీవల ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంగా వారికి అభినందనలు త...
19/09/2026

టీడీపీ సీనియర్ నాయకులు, పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గారు ఇటీవల ఎమ్మెల్సీగా నియమితులైన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేసేందుకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఆత్మీయ అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీ వర్ల రామయ్య గారితో పాటు పామర్రు ఎమ్మెల్యే శ్రీ వర్ల కుమార్ రాజా గారిని ఘనంగా సత్కరించనున్నారు..


​సెప్టెంబర్ 20, 2026 ఆదివారం ఉదయం 10:00 గంటలకు పిడుగురాళ్ల మార్కెట్ యార్డ్‌లో జరగనున్న ఈ సభకు కూటమి పార్టీల నాయకులు,కార్యకర్తలు,దళిత సోదరులు, అభిమానులందరూ పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము.





ఈ వినాయక చవితి నాడు ఆ గజముఖుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, హేరంబుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దీవించి, జీవితంలోని విఘ్న...
14/09/2026

ఈ వినాయక చవితి నాడు ఆ గజముఖుడు, ఏకదంతుడు, శూర్పకర్ణుడు, హేరంబుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను దీవించి, జీవితంలోని విఘ్నాలను తొలగించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఓం గం గణపతయే నమః 🙏




13/09/2026

గురజాల నియోజకవర్గ కుటుంబసభ్యులందరికీ హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు.

ఆ గజముఖుడు, ఏకదంతుడు మిమల్ని,మీ కుటుంబ సభ్యులను దీవించి, జీవితంలోని విఘ్నాలను తొలగించి, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను.

మీ అందరి సహకారంతో గత రెండున్నరేళ్ల ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోంది. కక్షలు, ఫ్యాక్షన్ రాజకీయాలకు తావులేకుండా నియోజకవర్గం ప్రశాంతంగా ఉంటుంది.

రాబోయే రోజుల్లో వినాయకుడి ఆశీస్సులతో గురజాల నియోజకవర్గం సుభిక్షంగా ఉండి, ప్రతి కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

– మీ యరపతినేని శ్రీనివాసరావు, శాసనసభ్యులు,గురజాల నియోజకవర్గం






If the ’80s had AI, this would be us… A retro moment with Nara Lokesh Anna! 😎
11/09/2026

If the ’80s had AI, this would be us… A retro moment with Nara Lokesh Anna! 😎

09/09/2026

నిజం గెలిచింది… ప్రజాస్వామ్యం నిలిచింది!

సెప్టెంబర్ 9, 2023… తెలుగుజాతి చరిత్రలో అదొక చీకటి రోజు. అధికార అహంకారంతో రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ, అక్రమ కేసులతో మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన వేళ ప్రతి తెలుగువాడి గుండె తల్లడిల్లింది.

ఆయనను అరెస్ట్ చేసి మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించినప్పుడు ఆ రోజంతా ఎంతో మంది ఆందోళనతో ఆయన కోసం ఎదురుచూశారు. సెప్టెంబర్ 10వ తేదీన తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో చంద్రబాబు గారిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల కోసం తీసుకువెళ్తున్న సమయంలో ఆయనను చూసిన క్షణం… గుండె ఆవేదనతో నిండిపోయింది, కళ్లు చెమ్మగిల్లాయి. ఆ రోజంతా ఆయన వెంటే నిలిచిన జ్ఞాపకాలు ఇప్పటికీ నా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి.

చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నాడు పౌర సమాజం భగ్గుమంది… మహిళా లోకం కదం తొక్కింది… యువత తిరగబడింది. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాల్లోని తెలుగువారంతా ఏకతాటిపైకి వచ్చి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మహోద్యమంగా నిలిచారు.

ప్రజలు సాగించిన ఆ శాంతియుత పోరాటమే నిరంకుశ సైకో పాలనకు చరమగీతం పాడింది. ‘నిజం గెలవాలి’ అంటూ నాడు మొదలైన ప్రజా ఉద్యమం… చివరకు నిజాన్ని గెలిపించి, చంద్రబాబు గారిని జనహృదయ విజేతగా నిలిపింది.

ఆ చీకటి రోజును మరచిపోలేం…
ప్రజాస్వామ్యం గెలవాలని ప్రజలు చూపిన పోరాట స్ఫూర్తి చరిత్రలో నిలిచిపోతుంది!







Address

Gurazala

Website

Alerts

Be the first to know and let us send you an email when Nikhil Yarapathineni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share