Warangal Police Commissionerate

Warangal Police Commissionerate

Share

Warangal Police Commissionerate

Photos from Warangal Police Commissionerate's post 04/06/2026

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిబ్బంది సమస్యల పరిష్కారం కై అడుగులు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ సిబ్బంది సంబందించిన శాఖ పరమైన సమస్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS ప్రత్యేక చర్యలు చేపట్టారు. సామాన్య ప్రజానీకంతో పాటు పోలీస్ సిబ్బందికి సైతం పని దినాల్లో మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు సీపీ స్వయంగా తన కార్యలయంలో వారి నుండి దరఖాస్తులను స్వీకరిస్తూ సిబ్బంది సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నారు.

04/06/2026

విద్యా సంస్థల పరిసరాల్లో పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జైలుకే
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపిఎస్.

వ్యాపారస్తులు ఎవరైనా పాఠశాల, కళాశాల, ఇతర విద్యా సంస్థల పరిసరాల్లో పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జైలు జీవితం తప్పదని వరంగల్ పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
మరి కొన్ని రోజుల్లో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు రీఓపెనింగ్కు సిద్ధమవుతున్నాయి. అయితే, స్కూళ్లు, కాలేజీల పరిసరాల్లోని పాన్ షాపులు, ఇతర దుకాణాలు స్టూడెంట్లను చెడు అలవాట్ల వైపు మళ్లిస్తున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గుట్కా, సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులను విక్రయించడం ద్వారా విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల వమేరకు వరంగల్ కమిషనరేట్ పరిధిలో 'ఆపరేషన్ సేఫ్ స్కూల్' పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహి స్తున్నారు. మైనర్లు, స్కూల్ స్టూడెంట్లకు గుట్కా, సిగరెట్లు వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మకుండా విద్యాసంస్థల సమీపంలోని పాన్ షాపులు, ఇతర దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి స్కూళ్లు, కాలేజీల పరిసరాలను టొబాకో ఫ్రీ జోన్లుగా మార్చేందుకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో పోలీసులు చర్యలు తీసుకొనేందుకు సిద్ధమాయ్యారు.
ఇందులో భాగం విద్యా సంస్థ పరిసరాల్లో పోగాకు ఉత్పత్తులను నిషేధమని తెలియజేస్తూ రూపొందించిన గోడ పత్రికను వరంగల్ పోలీస్ కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనందరిపై వుందని ముఖ్యంగా విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలుగా మారకుండా చేపడుతున్న చర్యల్లో భాగంగా విద్యా సంస్థ పరిసరాల్లో పోగాకు విక్రయాలు నిషేదించబడ్డాయని ఎవరైనా విద్యా సంస్థల వద్ద విక్రయాలపాల్పడితే సిగరెట్ అండ్ అదర్ టాబాకో ప్రొడక్ట్స్ - 2003 యాక్ట్ క్రింద చర్యలు తీసుకోబడుతాయని, అలాగే మైనర్లకు కూడా పోగాకు ఉత్పత్తులు విక్రయిస్తే జస్టిస్ జువైనల్ యాక్ట్ 2015 యాక్ట్ 77 ప్రకారం చట్ట పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎవరైన విద్యా సంస్థల వద్ద పోగాకు ఉత్పత్తులను విక్రయిస్తే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని పోలీస్ కమిషనర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ జితేందర్ రెడ్డి, సిసిఆర్ బి ఏసీపీ డేవిడ్ రాజు, వరంగల్ ట్రాఫిక్ ఇన్స్ స్పెక్టర్ సుజాత, ఏ.ఎస్.ఐ రాజేందర్ ప్రసాద్ పాల్గొన్నారు


04/06/2026
03/06/2026

వరంగల్ సైబర్ పోలీస్ స్టేషన్ డిఎస్పీగా వెంకటరమణ

సైబర్ ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. వరంగల్ సైబర్ పోలీస్ స్టేషన్ నూతన డి.ఎస్పీ గా నియమించబడిన యం.వెంకటరమణ బుధవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పాగుచ్చాలను అందజేశారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ప్రజల్లో సైబర్ నేరాలపై మరింత అవగహన కల్పించాలని సీపీ పేర్కొన్నారు. గతంలో ఇక్కడ సైబర్ క్రైమ్ డి.ఎస్పీగా పనిచేసిన కె. గిరికుమార్ మహబూబ్నగర్ సైబర్ క్రైమ్ డిఎస్పీగా బదిలీ అయ్యారు.

Photos from Warangal Police Commissionerate's post 03/06/2026

భూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేసేవారికి “కౌన్సిలింగ్” ఇవ్వండి
-వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.

భూతగాదాల కేసుల్లో మధ్యవర్తిత్వం వహిస్తూ సెటిల్‌మెంట్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లకు “కౌన్సిలింగ్” నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ స్టేషన్ అధికారులను ఆదేశించారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ బుధవారం కెయూసి పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఈ ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు సెంట్రల్ జోన్ డిసిపి దార కవిత, ఏసిపి నర్సింహరావు, ఇన్స్‌స్పెక్టర్ రవికుమార్ పుష్పాగుచ్చాలను అందజేసి స్వాగతం పలికాలికారు. పోలీస్ కమిషనర్ ముందుగా స్టేషన్ పరిసరాలు, స్టోర్, కేసు ప్రాపర్టీగదులు, స్టేషన్ పరిధిలోని వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, బాలమిత్ర పోలీస్ స్టేషన్ క్రీడా ప్రాంగణాన్ని పోలీస్ కమిషనర్ పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ సంబంధించిన రికార్డులను, రౌడీ షీటర్లు, అనుమానితుల రికార్డులను పరిశీలిస్తూ, పోలీస్ స్టేషన్ పరిధిలో యాక్టివ్‌గా వున్న రౌడీ షీటర్లు, అనుమానితులు ఎవరు, ప్రస్తుతం వాళ్ళు ఎలావున్నారు..ఏం చేస్తున్నారు మొదలైన వివరాలను పోలీస్ కమిషనర్ స్టేషన్ ఇన్స్‌స్పెక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తగాదాల్లో తలదూర్చే రౌడీ షీటర్లతో పాటు బెదిరింపులకు పాల్పడే వారికి ప్రత్యేక “కౌన్సిలింగ్” ఇవ్వాలని, రౌడీ షీటర్లపట్ల సానుభూతి ధోరణి ప్రదర్శించవద్దని, యాక్టివ్‌గా వున్న రౌడీపై నజర్ పెట్టాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా ముఖ్యంగా స్థానికంగా వున్న సామాజిక రుగ్మతలపై అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని, విద్యా సంస్థల్లో సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ట్రాఫిక్ నిబంధనలపై ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, స్టేషన్ ఎస్.ఐలు అప్పగించిన సెక్టార్ పరిధిలో నేరాల నియంత్రించడంతో పాటు, ముందస్తూ సమాచారాన్ని సేకరించాలని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. ఈ కార్యక్రమములో ఎస్.ఐలు నవీన్ కుమార్, కళ్యాణ్‌కుమర్, రాజమౌళి పాల్గోన్నారు.

-వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయము

Photos from Warangal Police Commissionerate's post 02/06/2026

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న వరంగల్ సిపి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించే గ్రామ సభలను విజయవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు, డీజీపీ సి.వి. ఆనంద్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య తదితర ఉన్నతాధికారులతో కలిసి హైదరాబాద్ నుంచి సీపీ లు, ఎస్పీలు, కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయం నుండి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

Photos from Warangal Police Commissionerate's post 02/06/2026

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానము లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించారు.

02/06/2026

పతకాలను అందుకున్న పోలీస్ అధికారులను అభినందించిన వరంగల్ పోలీస్ కమిషనర్

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా మహోన్నత సేవా పతకం, ఉత్తమ సేవా పతకం సేవ పతకాలను అందుకున్న పోలీసు అధికారులను మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిజాయితీగా కష్టపడి పనిచేసే పోలీస్ అధికారులకు శాఖా పరమైన గుర్తింపుతో పాటు ప్రభుత్వ నుండి పతకాలు కూడా అందుతాయని పోలీస్ కమిషనర్ తెలియజేశారు.

పతకాలను అందుకున్న వారిలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ మహోన్నత సేవ పతకాన్ని అందుకోగా, ఉత్తమ సేవా పతకాలను క్రైమ్ ఏసీపీ సదయ్య, ఎస్. ఐ వేణుగోపాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ రమేష్, సేవా పతకాలను ఎస్. ఐ కనకచంద్రం, ఏ.ఎస్. ఐలు జయదేవ్, పాపయ్య, చేరాలు, అర్జున్, శ్యాం సుందర్, హెడ్ కానిస్టేబుళ్ళు అమీర్ పాషా, నర్సింగ రావు, స్వర్ణ లత వున్నారు.

Photos from Warangal Police Commissionerate's post 02/06/2026

వరంగల్ కమీషనరేట్ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను వరంగల్ పోలీస్ కమిషనర్ కాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి అదనపు డీసీపీ రవి ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణ లో జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అధికారులు సిబ్బంది చిన్నారులకు మిఠాయిలను పంపిణీ చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు డీపీపీ సురేష్, ఏసీపీలు నాగయ్య, డేవిడ్ రాజు, పరిపాలనాదికారి సంపత్ కుమార్తో పాటు ఇన్స్ స్పెక్టర్లు, ఆర్.ఐలు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది, పరిపాలన పాలన సిబ్బంది పాల్గొన్నారు.

Photos from Warangal Police Commissionerate's post 02/06/2026

తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన వరంగల్ పోలీస్ కమిషనర్

తెలంగాణ సాధనకై తమ త్యాగాలు చేసిన తెలంగాణ అమరవీరులకు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ హనుమకొండ అదాలత్ సెంటర్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపం చేరుకొని స్తూపం వద్ద వద్ద పూలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను మరువద్దని, వారి ఆశయ సాధనకై మనమందరం కలిసి పనిచేస్తూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

Want your business to be the top-listed Government Service in Hanumakonda?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Hanumakonda
506001