AHK Sreekanth Janasena

AHK Sreekanth Janasena

Share

To bring change in the public we have to first change ourselves....Rome has not built in one night and Your desired change may take many days.

Just try to reduce the time it takes from the time you are in currently.

24/04/2026

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి మరణం తీరని లోటు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి, నా ఆత్మీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని కలిసి వారిని పరామర్శించడం జరిగింది. భాస్కరరావు గారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. 🙏
JanaSena Party JanaSena Shatagni

Photos from AHK Sreekanth Janasena's post 02/04/2026

ఉత్తరాంధ్రకు న్యాయం వైపు మరో ముందడుగు – పలాస డివిజన్‌పై ఆశలు!!

రైల్వే శాఖ తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుండి ఇచ్ఛాపురం వరకు ఉన్న రైల్వే స్టేషన్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నుండి దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర అభివృద్ధి దిశగా ఒక సానుకూల నిర్ణయం.

ఈ నిర్ణయం తీసుకున్నందుకు గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఈ అంశంపై నేను కూడా పలుమార్లు కేంద్ర మంత్రిత్వ శాఖకు ఇమెయిల్స్ మరియు పోస్టల్ లెటర్స్ ద్వారా వినతిపత్రాలు సమర్పించిన విషయం సంతోషంగా తెలియజేస్తున్నాను.

అయితే, ఉత్తరాంధ్రలోని చివరి ప్రాంతాలైన ఇచ్ఛాపురం, పలాస మరియు పరిసర ప్రాంతాల ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన పలాసను రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయడం పై కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

పలాసను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయడం ద్వారా ఈ వెనుకబడిన ప్రాంతానికి రైల్వే సదుపాయాలు మెరుగుపడి, ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి దోహదం అవుతుందని ఆశిస్తున్నాము.
త్వరలోనే పలాస డివిజన్ ఏర్పాటు చేసి, ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరికను నెరవేర్చుతారని నమ్మకం వ్యక్తం చేస్తున్నాము.














24/03/2026

చాలా కాలం తర్వాత శ్రీ శ్రీ శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులు అందరిపై సదా ఉండాలని ప్రార్థిస్తున్నాను. ఈ దర్శనం మనసుకు ఎంతో ప్రశాంతతను అందించింది. 🙏

17/03/2026

పలాస కాశీబుగ్గ మున్సిపల్ ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసిన సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు💐💐💐.*


ఇప్పటివరకు చేసిన సేవల మాదిరిగానే ఇకపై కూడా ప్రజల కోసం ముందుండి పనిచేస్తూ, మీ సేవలు మరింత మంది ప్రజలకు మేలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.

ధన్యవాదాలు 🙏🙏🙏
JanaSena Party
Deputy CMO, Andhra Pradesh
Pawan Kalyan

Photos from AHK Sreekanth Janasena's post 15/03/2026

పలాస మున్సిపాలిటీ పరిధిలో అనంతపురం రెవెన్యూ – సర్వే నంబర్లు 253-4, 253-8, శ్రీ సత్యసాయి ట్రస్టు ఎదురుగా జరుగుతున్న అక్రమాలపై వస్తున్న వార్తలు ప్రజల్లో చర్చకు దారి తీస్తున్నాయి.

“30 ఇయర్స్ ఇండస్ట్రీ” అంటూ గొప్పలు చెప్పుకునే స్వయం ప్రకటిత నాయకులకు అంగుళం దూరంలో జరుగుతున్న ఈ వ్యవహారం మాత్రం కనిపించకపోవడం నిజంగా ఆశ్చర్యమే!

నిజంగా ప్రజల కోసం పనిచేసే నాయకత్వం ఉంటే వెంటనే పరిశీలించి అక్రమాలను అడ్డుకుని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. ఈ విషయంలో అధికారులకు కూడా ఎలాంటి ఒత్తిడులు కనీసం చెయ్యకుండా స్వేచ్ఛగా చర్యలు తీసుకునే అవకాశం ఇవ్వాలి.

ప్రజల ఆస్తి పరిరక్షణలో మాటలు కాదు… చర్యలే అసలు పరీక్ష.

14/03/2026

జనసేన పార్టీ సభ్యులందరికీ నా హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు! 💐 ఈ రోజు మనందరికీ ప్రత్యేకమైనది. 🥳 కలిసికట్టుగా మన లక్ష్యాలను సాధిద్దాం. 💪 భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆశిస్తున్నాను. ✨

Pawan Kalyan
Nagaraj Harikrishna
JanaSena Party
JanaSena Shatagni
Naga Babu

07/03/2026

⚠️ “మద్యం ఆరోగ్యానికి హానికరం” – కానీ MRP కంటే ఎక్కువ ధరలకు అమ్మడం చట్ట విరుద్ధం!

ముందుగా ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను.
నేను వ్యక్తిగతంగా మద్యం సేవించడాన్ని ప్రోత్సహించను. ప్రతి బాటిల్ మీద కూడా స్పష్టంగా రాసి ఉంటుంది — “మద్యం ఆరోగ్యానికి హానికరం”.

అయితే పలాస ప్రాంతంలో కొన్ని మద్యం దుకాణాలలో MRP ధరల కంటే ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి అనే విషయంపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మనము ఒక విషయం గుర్తుంచుకోవాలి —మద్యం కొనుగోలు చేసే వారిలో పేదలు, రోజంతా ఎండలో కష్టపడి పని చేసే కార్మికులు కూడా ఉంటారు.
వారు సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసే వస్తువుపై MRP కంటే ఎక్కువ ధరలు వసూలు చేయడం సరైనది కాదు.

మన సమాజంలో కార్మిక సంఘాలు, వివిధ సంఘాల నాయకులు మరియు గౌరవ అధ్యక్షులు ఉన్నారు.
వారు కేవలం కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రమే కాకుండా, తమ సంఘాలకు చెందిన ప్రజల సమస్యలపై కూడా ముందుకు వచ్చి స్పందించాలి.

👉 MRP కంటే ఎక్కువ ధరలకు అమ్మకాలు వెంటనే ఆగాలి.వినియోగదారులు కూడా తమ హక్కులను వినియోగించుకోవచ్చు.

అవసరమైతే ఈ శాఖలకు ఫిర్యాదు చేయవచ్చు:
• Excise Department (ఎక్సైజ్ శాఖ)
• Consumer Affairs / National Consumer Helpline
• District Collector / Revenue అధికారులు

చివరిగా నా వ్యక్తిగత అభిప్రాయం —సాధ్యమైతే మద్యం సేవనే తగ్గించుకోవడం లేదా మానేయడం మంచిది. అదే వ్యక్తి ఆరోగ్యానికి, కుటుంబానికి, సమాజానికి మంచిది.

– ఒక బాధ్యత గల పౌరుడిగా నా అభిప్రాయం

Want your business to be the top-listed Government Service in Hyderabad Shah Guda?

Click here to claim your Sponsored Listing.

Website

Address


Hyderabad Shah Guda