PM Shri leads from the front at the India AI Impact Summit 2026, unveiling a bold AI roadmap for the world.🇮🇳🚀
From policy to innovation, India is determined to define the next era of AI leadership!🤖✨
BJP ST Morcha Telangana
BJP Telangana State President Shri. Naraparaju Ramchander Rao Garu #ExMLC
|| BJP (Girijana) ST Morcha Telangana State President Shri.
Nenavath Ravi Bjp Anna Garu ||
With Nitin Nabin – I just got recognized as one of their top fans!
19/01/2026
భారతీయ జనతా పార్టీకి ‘సంఘటన్ పర్వ్’ కేవలం ఒక ప్రక్రియ మాత్రమే కాదు — అది ప్రజాస్వామ్యానికి ఒక మహోత్సవం.
ఇతర రాజకీయ పార్టీలు కుటుంబ కేంద్రిత రాజకీయాలకే పరిమితమై ఉన్న సమయంలో, బూత్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పారదర్శకత, భాగస్వామ్యంతో కూడిన, పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నాయకత్వాన్ని ఎన్నుకునే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ.
జనసంఘ్ స్థాపన నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం వరకు, అలాగే ఇప్పటివరకు ఎన్నుకోబడిన జాతీయ అధ్యక్షుల పరంపర గమనిస్తే.. బిజెపిలో ఉన్నత పదవులు మరియు గొప్ప బాధ్యతలు వారసత్వంగా కాదు.. అంకితభావం, ప్రజాసేవ, కృషి మరియు దేశసేవ ఆధారంగా మాత్రమే లభిస్తాయి అన్న సత్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి.
19/01/2026
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవం..
* ఐదుసార్లు ఎమ్మెల్యే
* బీహార్ ప్రభుత్వంలో కీలక శాఖల నిర్వహణ
* పార్టీ సంస్థాగత నిర్మాణంలో కీ రోల్
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు
నితిన్ నబీన్ ను ప్రతిపాదిస్తూ 37 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వేరెవరూ పోటీకి నిలవలేదు. దీంతో నబీన్ అధ్యక్ష పదవి లాంఛనంగా మారింది. ఒకవేళ ఎవరైనా పోటీకి దిగితే రేపు ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ నిర్ణయించింది. అయితే ఎవరూ అధ్యక్ష పదవికి పోటీలో నిలవకపోవడంతో బీజేపీ కొత్త దళపతిగా నబీన్ ఎన్నిక ఏకగ్రీవమైంది. నబీన్ రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు.
భారతీయ జనతా పార్టీ తన అగ్ర సంస్థాగత నాయకత్వంలో మార్పును చూడబోతోంది. నితిన్ నబీన్ పార్టీ తదుపరి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పని చేస్తున్నారు. 45 ఏళ్ల నబిన్ బీజేపీకి నాయకత్వం వహించే అతి పిన్న వయస్కుడైన నాయకుడిగా అవతరిస్తారు. జనవరి 2020 నుండి ఈ పదవిలో ఉన్న జేపీ నడ్డా తర్వాత ఆయన పదవిని చేపడతారు. బీజేపీ 12వ జాతీయ అధ్యక్షుడిగా జనవరి 20న ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
నితిన్ నబిన్ ముందు కీలక సవాళ్లు..
పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి వంటి రాష్ట్రాలలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార పార్టీ జాతీయ స్థాయిలో ఒక ప్రధాన సంస్థాగత పునర్నిర్మాణానికి సిద్ధమవుతున్న తరుణంలో నాయకత్వ మార్పు వస్తుంది. డీలిమిటేషన్, పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో 33 శాతం మహిళా కోటా అమలు వంటి ముఖ్యమైన మార్పుల మధ్య జరగనున్న 2029 లోక్‌సభ ఎన్నికల వైపు పార్టీని నడిపించే బాధ్యత కూడా నబిన్‌పై ఉంది.
నబిన్ మే 23, 1980న జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించారు. ఆయన తండ్రి నబిన్ కిషోర్ ప్రసాద్ సిన్హా బీజేపీ సీనియర్ నాయకుడు. పాట్నా వెస్ట్ నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. నబిన్ తల్లి పేరు మీరా సిన్హా.
నితిన్ నబిన్ విద్యాభ్యాసం- పాట్నా నుండి ఢిల్లీ వరకు..
నబిన్ 1996లో టెన్త్ పాసయ్యారు. పాట్నాలోని CBSE అనుబంధ సెయింట్ మైఖేల్స్ హై స్కూల్ లో చదువుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీలోని CSKM పబ్లిక్ స్కూల్ లో చదువుకున్నారు. 1998లో ఇంటర్ పూర్తి చేశారు. దీప్ మాల శ్రీవాస్తవను నితిన్ వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు, కుమార్తె.
రాజకీయ నేపథ్యం..
బీహార్ లోని బంకిపూర్ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2006లో పాట్నా వెస్ట్ నుండి ఉప ఎన్నికలో గెలిచి ఎన్నికల రాజకీయాల్లోకి ప్రవేశించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత, ఆయన బంకిపూర్‌కు మారారు. అప్పటి నుండి 2010, 2015, 2020, 2025 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ స్థానాన్ని నిలుపుకున్నారు. 2025 ఎన్నికలలో నబిన్ నిర్ణయాత్మక విజయాన్ని సాధించారు. 98వేల 299 ఓట్లను సాధించి, రాష్ట్రీయ జనతాదళ్ అభ్యర్థి రేఖ కుమారిని 51వేల కంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడించారు.
బీహార్ ప్రభుత్వంలో కీలక శాఖలను నిర్వహించారు..
నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వంలో నబిన్ అనేక కీలక శాఖలను నిర్వహించారు. ఫిబ్రవరి 2021 నుండి ఆగస్టు 2022 వరకు రోడ్డు నిర్మాణ మంత్రిగా పని చేశారు. ఫిబ్రవరి 2025 నుండి డిసెంబర్ 2025 వరకు అదే శాఖకు తిరిగి వచ్చారు. మార్చి 2024 ఫిబ్రవరి 2025 మధ్య చట్టం న్యాయ మంత్రిత్వ శాఖతో పాటు పట్టణాభివృద్ధి గృహనిర్మాణ శాఖను కూడా నిర్వహించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ గృహనిర్మాణ కార్యక్రమాలు, సంక్షేమ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో జర్నలిస్టులకు మద్దతిచ్చే పథకాలు, ఆశా-మమతా కార్మికులకు ప్రోత్సాహకాలు ఉన్నాయి.
బీజేపీలో మూలాలు..
బీజేపీ యువజన విభాగం నుండి వచ్చిన నబిన్.. పార్టీ సంస్థాగత నిర్మాణంలో గణనీయమైన పాత్ర పోషించారు. గతంలో భారతీయ జనతా యువ మోర్చా (బిజెవైఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా, బిజెవైఎం బీహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. యువత సమీకరణ ప్రచారాలలో చురుకుగా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో జాతీయ ఐక్యతా యాత్ర, 1965 యుద్ధంలో అమరవీరులను గౌరవిస్తూ గౌహతి నుండి తవాంగ్‌కు జరిగిన కవాతుతులో పాల్గొన్నారు.
సిక్కింకు బిజెపి ఇన్‌చార్జ్‌గా, ఛత్తీస్‌గఢ్‌కు కో-ఇంచార్జ్‌గా సంస్థాగత బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణ, పార్టీ విస్తరణకు దోహదపడ్డారు. డిసెంబర్ 2025లో, బిజెపి పార్లమెంటరీ బోర్డు ఆయనను పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది.
19/01/2026
భారతీయ జనతా పార్టీ – సంగఠన్ పర్వ్
భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న సంగఠన్ పర్వ్ కార్యక్రమంలో భాగంగా, పార్టీ జాతీయ అధ్యక్షుని నామినేషన్‌కు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన, పారదర్శకమైన ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది.
పార్టీ నిబంధనల ప్రకారం, దేశవ్యాప్తంగా ఉన్న 36 రాష్ట్రాలలో.. 30 రాష్ట్రాలలోని సంస్థాగత ఎన్నికల అనంతరం, నామినేషన్ దాఖలు, పరిశీలన మరియు ఉపసంహరణ వంటి అన్ని ప్రక్రియలు క్రమబద్ధంగా నిర్వహించబడ్డాయి.
దేశవ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తల నుండి విస్తృత మద్దతు లభించడంతో, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి శ్రీ Nitin Nabin గారి పేరుని ఏకగ్రీవంగా ప్రతిపాదించబడింది.
- డా. Dr K Laxman గారు, జాతీయ రిటర్నింగ్ ఆఫీసర్ - బిజెపి సంగఠన్ పర్వ్
09/10/2025
🔴 BREAKING NEWS 🔴
🛑 జాతీయ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ గారు 🛑
📍 కొడంగల్ అసెంబ్లీ - మద్దూరు మండలం,బోడ మర్రిగడ్డ తండా కు చెందిన
😔 గిరిజన బిడ్డ రమేష్ నాయక్ మిస్సింగ్ నేటికి 16 రోజుల కావస్తున్నా స్పందించని అధికారులు ,ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు నేనావత్ రవి నాయక్ గారు,
🧾 జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ గారిని కలసి అధికారికంగా ఫిర్యాదు చేశారు.
💬 ఈ సందర్భంగా రవి నాయక్ గారు మాట్లాడుతూ —
“మిస్సింగ్ అయిన రమేష్ నాయక్ ఆచూకీ తక్షణమే వెలికితీయాలి.
జిహాదీ ఉగ్ర ముఠా సభ్యులు తాజుద్దీన్, యాసిన్ వంటి వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరులు మరియు జిహాదీల అరాచకాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది!” ⚖️🔥
🕊️ గిరిజన సమాజ భద్రత, న్యాయం కోసం బిజెపి ఎస్టీ మోర్చా నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.
✊🏽
07/10/2025
“For any nation, the greatest test of self-respect is its self-reliance.”
- PM Shri
Narendra Modi
🔴 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలో గిరిజనులపై
జిహాదీ మూకల మతమార్పిడి అరాచకాలు!
🟠 బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ పర్యటన అనంతరం నారాయణపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన
డా కళ్యాణ్ నాయక్, నేనావత్ రవి నాయక్
📢 గిరిజన బిడ్డ రమేష్ నాయక్ నీ ఆచూకీ ఎక్కడ..?
🔴 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాకాలో జిహాదీల అరాచకాలను తీవ్రంగా ఖండించిన ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి నాయక్ నేనావత్
🟠 బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ పర్యటన 🚩
📢 బంజారా బిడ్డ ఆచూకీ ఎక్కడ..?
మద్దూరు మండలంలోని రేణివట్ల రోడ్డులో ప్రైవేటు కంటి ఆసుపత్రి నడిపే
పతులవత్ రమేష్ నాయక్ (కొడంగల్ — ముఖ్యమంత్రి నియోజకవర్గం)
తన మరణ పత్రం రాసి కనబడుటలేదు!
ఆ లేఖలో రమేష్ నాయక్ గారు పేర్కొన్నారు —
👉 “మద్దూర్ తాజుద్దీన్, RMP యాసీన్ ల బెదిరింపులు, అరాచకాలు తట్టుకోలేక పోతున్నాను...” అని.
ఇది ఒక వ్యక్తి సమస్య కాదు —
ఇది బంజారా సమాజం మరియు అనగారిన వర్గాలపై జరుగుతున్న దౌర్జన్యం!
💥 ప్రభుత్వం తక్షణం స్పందించి నిజానిజాలు వెలికితీయాలి
💥 బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
💥 బంజారా సమాజం మేల్కొని ఐక్యంగా నిలబడాల్సిన సమయం ఇది!
🧡 రమేష్ నాయక్ కుటుంబ సభ్యులకు మద్దతుగా
బిజెపి రాష్ట్ర శాఖ మరియు బిజెపి ఎస్టీ మోర్చా నాయకులు సంఘీభావం తెలిపారు.
ఈ కార్యక్రమంలో —
🔹 బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు
🔹 బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ గారు
పాల్గొని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు వారి పక్షాన ఉంటామని హామీ ఇచ్చారు.
✊
✊
🕊️
గిరిజన బంజారా హిందూ బిడ్డ పాత్లవత్ రమేష్ నాయక్ ఆచూకీ ఎక్కడ ???
కొడంగల్ నియోజకవర్గం, మద్దూరు మండలం
మారిబోడి గడ్డ తండా చేరుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచరుల ఆగడాలకు , దౌర్జన్యాలకు , దాడులకు , మతమార్పిడిలకు భయపడి 17 పేజీల ఆత్మహత్య పత్రాన్ని రాసి మిస్సింగ్ ఐన పాత్లవత్ రమేష్ నాయక్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వాస్తవ పరిస్థితులను అడిగి తెలుసుకొని భరోసా ఇస్తున బీజేపీ ST మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రవి నాయక్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు , నారాయణపేట జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్ గారు , నాగురావు నామోజి గారు
గిరిజన బిడ్డా గత 15 రోజుల క్రితం RMP తాజుద్దీన్,యాసిన్ ల బెదిరింపులకు భయపడి
ఆత్మహత్య పత్రం రాసి మిస్సింగ్ ఐనటువంటి పాత్లవత్ రమేష్ నాయక్ పట్టించుకోని ప్రభుత్వం పోలీసులు...
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Website
Address
Door No 5-4-18/E, Drive Shyam Prasad Mukharji Bhavan, Main Road, Nampally, Hyderabad/, Opposite Exhibition Grounds
Hyderabad
500001
