MDR Foundation

MDR Foundation

Share

Our mission focuses on doing crematory rituals for orphans and plethora of social
services for people

Photos from MDR Foundation's post 21/11/2025

మరో అనాథకు గౌరవప్రదమైన చివరి సంస్కారాలు నిర్వహిస్తూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నది MDR ఫౌండేషన్.ఈ అంత్యక్రియల కోసం అవసరమైన సంపూర్ణ ఆర్థిక సహకారం MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారు అందించారు.సమాజ సేవ అంటే పుస్తకాల మాట కాదని, అది మానవత్వం ముందుండి నడిపే పథమని నిరూపిస్తూ MDR ఫౌండేషన్ ఇంతవరకు 582 మంది అనాధలకు అంత్యక్రియలు నిర్వహించింది. అలాగే పేద, అసహాయ, అభాగ్య కుటుంబాలకు ఆర్థిక సహాయం, రేషన్ కిట్లు, వైద్య సహాయం అందిస్తూ నిరంతరం సాయం చేస్తోంది.ఈ సేవా కార్యక్రమాల లో భాగంగా, ఈరోజు కూడా MDR ఫౌండేషన్ తరపున మరో అనాథ శవానికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది.పటాన్‌చెరు నూతన మార్కెట్ సమీపంలో చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలు కింద పడిన విషయం స్థానికులకు తెలిసి, ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.ఆమె మృతదేహాన్ని స్వీకరించడానికి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఆ వృద్ధురాలి చివరి ప్రయాణానికి తోడుగా నిలవడం MDR ఫౌండేషన్ తమ బాధ్యతగా భావించింది.మనుషులు మరణిస్తారు… కానీ మనిషితనం మాత్రం నిలిచేలా చేయడం MDR ఫౌండేషన్ ధర్మంగా తీసుకుంది.ఇలాంటి సేవా కార్యక్రమాలకు తోడుగా నిలుస్తున్న అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.


MDR Foundation | NGO | Patancheru

Photos from MDR Foundation's post 06/11/2025

Heartfelt thanks to the brothers for donating blood — your kindness brings hope and life to others. True heroes roll up their sleeves! ❤️

— MDR Foundation, Patancheru.

20/10/2025

*★ దీపావళి పండుగ సందర్భంగా MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రిథ్వీరాజ్ గారు బొల్లారంలోని డేసిరే సొసైటీ లోని చిన్నారులతో పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. పటాకీలు పంపిణీ చేసి, పిల్లలతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ప్రిథ్వీరాజ్ గారు, “చిన్నారుల చిరునవ్వే నిజమైన దీపావళి వెలుగు” అన్నారు.

MDR Foundation | NGO | Patancheru | Maadri PrithviRaj

Photos from MDR Foundation's post 20/10/2025

● చిన్నారులతో దీపావళి సంబరాలు జరిపిన ప్రిథ్వీరాజ్ గారు.

● MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి దీపావళి పండుగన చిన్నారులకు ఆనందం పంచుతూ వస్తున్న ప్రిథ్వీరాజ్ గారు, ఈ సంవత్సరం కూడా అదే ఆనందాన్ని పునరావృతం చేశారు.

● పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంలోని డేసిరే సొసైటీలో నివసిస్తున్న చిన్నారులకు పటాకీలు పంపిణీ చేస్తూ, వారు ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. MDR ఫౌండేషన్ ద్వారా ప్రతివార్షికంగా నిర్వహించబడే ఈ సానుకూల కార్యక్రమాలు సమాజంలో ఆనందం, సానుకూలతను పెంపొందించడంలో సహాయపడుతున్నాయి.ఈ సందర్భంగా ప్రిథ్వీరాజ్ గారు మాట్లాడుతూ, “చిన్నారుల చిరునవ్వుకన్నా విలువైనది ఏమీ లేదు. వారి ఆనందం నాకు దీపావళి వెలుగుల్లా అనిపిస్తుంది” అని చెప్పారు. చిన్నారులు హర్షంతో ప్రిథ్వీరాజ్ గారికి “థాంక్యూ అన్నా… హ్యాపీ దీపావళి!” అని కృతజ్ఞతలు తెలిపారు.MDR ఫౌండేషన్ — వెలుగులు పంచే చేతులు, చిరునవ్వులు సృష్టించే మనసులు.



Madiri Devender Raju | MDR Foundation | Maadri PrithviRaj | Patancheru

31/07/2025

● MDR ఫౌండేషన్‌కు మరో అవార్డు.

● హైదరాబాద్ బాచుపల్లి SVM గ్రాండ్ హోటల్‌లో విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన గేమ్ చేంజర్ అవార్డు 2025 కార్యక్రమంలో MDR ఫౌండేషన్‌ కు గేమ్ చేంజర్ అవార్డు ను ప్రధానం చేశారు గౌరవించారు. ఈ కార్యక్రమంలో MDR ఫౌండేషన్ అధ్యక్షులు మధు సుధన్ గారు సంస్థ తరఫున అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, MDR ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు గారి ప్రోత్సాహం మరియు కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ గారి సహకారంతో ఫౌండేషన్ అనేక సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఫౌండేషన్ చేపట్టిన ముఖ్యమైన సేవలలో గుర్తు తెలియని మృతదేహాల దహన కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్య శిబిరాలు, ఆర్థికంగా బలహీనులైన విద్యార్థులకు విద్యా సహాయం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, అలాగే ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక, నిత్యావసర సరుకులు మరియు మానసిక మద్దతు వంటి సేవలు ఉన్నాయి. ఈ అవార్డు మా సేవా కార్యక్రమాల పట్ల సమాజం చూపిన అంగీకారానికి నిదర్శనం. ఇది మా బాధ్యతను మరింత పెంచింది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రజాపయోగ సేవలతో ముందుకు సాగుతాం.

16/07/2025
Photos from MDR Foundation's post 02/07/2025

ఒకేరోజు రెండు అనాధ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్.

పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలో ఎన్నో అనాధ శవాలకు అంత్యక్రియలు నిర్వహించిన MDR ఫౌండేషన్, ఈరోజు లింగంపల్లి ఫ్లైఓవర్ కింద చనిపోయి పడి ఉన్న ఒక శవాన్ని గుర్తించిన పోలీసులు అంత్యక్రియల కోసం MDR ఫౌండేషన్ ను సంప్రదించడం జరిగింది, అలాగే కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యాచకుడు చనిపోయిన విషయం తెలిసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వాళ్లకి ఎవరూ లేకపోవడంతో MDR ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. సమాజం పట్ల మాకు ఉన్న బాధ్యతను నిర్వర్తించడానికి ఎప్పటికీ దేవేందర్ రాజు గారు మరియు పృథ్వీరాజ్ గారి సహకారంతో కృషి చేస్తామని MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు అన్నారు.

Photos from MDR Foundation's post 16/06/2025



15/06/2025



Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


St. No:443, New Market Road Patancheru, Sangareddy Dist
Hyderabad
502319