Madiga Hakkula Dandora

Madiga Hakkula Dandora

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madiga Hakkula Dandora, Social service, Hyderabad, Telangana, India, Hyderabad.

01/05/2026
Photos from Madiga Hakkula Dandora's post 14/04/2026

*ఎడ్యుకేట్ కాదు …అగిటేట్ కూడా కావాలి!: మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ*

ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మాదిగ స్టూడెంట్ యూనియన్ స్టేట్ కో-ఆర్డినేటర్ బొర్ర శాంతి కుమార్ మాదిగ గారి ఆధ్యర్యంలో నిర్వహించిన భారత రత్న,రాజ్యాంగ నిర్మాత *ప్రపంచ మేధావి,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి *135 వ జయంతి వేడుకలలో ముఖ్య అతిథి గా మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ* గారు పాల్గొని పూలమాలవేసి ఘనమైన నివాళులు అర్పించారు.అనంతరం టపాకాయలతో అంబేద్కర్ గారి జయంతి వేడుకలు ఘనంగా జరుపుకొని, ఆర్ట్స్ కాలేజీ నుండి ట్యాంక్ బండ్ వరకు బైక్ ర్యాలీ
నిర్వహించారు,అనంతరం ట్యాంక్ బండ్ లో గల అంబేడ్కర్ గారి విగ్రహానికి పూలమాల తో నివాళి అర్పించారు …
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు సాధారణ రోజు కాదు!
ఈ రోజు చరిత్రను మళ్లీ గుర్తు చేసుకునే రోజు...చరిత్రను మళ్లీ రాసే సంకల్పం తీసుకునే రోజు!ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ శిల్పి,సమానత్వానికి ప్రతీక అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో సభలో మీతో పాటు పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది!అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు…ఆయన ఒక విప్లవం ఆయన ఒక సిద్ధాంతం!ఆయన ఒక యుద్ధం! రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది .ఆయన మనకు చెప్పినది ఒక్కటే —
“Educate, Agitate, Organize”
కానీ మనం అడగాలి…
ఈ రోజు మన సమాజం ఎక్కడ ఉంది?మాదిగల హక్కులు ఎక్కడ ఉన్నాయి?సమానత్వం ఎక్కడ ఉంది?ఇప్పటికీ మాదిగలకు న్యాయం జరగలేదు!ఇప్పటికీ మాదిగలు దోపిడీకి గురవుతున్నారు!ఇప్పటికీ మన హక్కులను ఎవరో దోచుకుంటున్నారు!మేము ఇక మౌనం పాటించం! మాదిగల కు రావలసిన sc సబ్ ప్లాన్ నిధులను మళ్లించకుండా వారి సంక్షేమం కోసమే వాడాలి. మాదిగల హక్కుల కోసం వీధుల్లోనైనా… యూనివర్సిటీల్లోనైనా… అసెంబ్లీల ముందు అయినా పోరాటం చేస్తాం!విద్యార్థులారా…
మీ చేతుల్లోనే భవిష్యత్తు ఉంది!
మీరు చదవాలి…కానీ చదువు కేవలం ఉద్యోగం కోసం కాదు చదువు ఒక ఆయుధం సమాజాన్ని మార్చే శక్తి!మీరు ప్రశ్నించాలి!మీరు ఎదిరించాలి!
మీరు వ్యవస్థను కదిలించాలి అంబేద్కర్ గారు మనకు ఇచ్చిన రాజ్యాంగం పుస్తకాలలో ఉండటానికి కాదు…ప్రజల జీవితాల్లో అమలు కావడానికి!
కానీ ఈ దేశంలో…అంబేద్కర్ పేరు చెప్పేవాళ్లు చాలా మంది ఉన్నారు…ఆయన ఆలోచనలు అమలు చేసే వాళ్లు ఎంత మంది?
ఇది మిమ్మల్ని ఆలోచింప చేయాలి!
ఇది మిమ్మల్ని కదిలిలించాలి. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు మాసమ్ పల్లి అరుణ్ కుమార్ గారు,ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ,మరియు విద్యార్థులు నితిన్ మాదిగ ,శశి కుమార్ మాదిగ,మల్లేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

14/04/2026

భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అణగారిన వర్గాల జీవితాలలో వెలుగులు నింపిన సూర్యుడు ,సామాజిక న్యాయం, సమానత్వ రూపశిల్పి, భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన డా౹౹ బి.ఆర్ అంబెడ్కర్ గారి 135 వ జయంతి శుభాకాంక్షలు

Photos from Madiga Hakkula Dandora's post 11/04/2026

*సమానత్వ పోరాటానికి చిహ్నం ఫూలే*

*- మాదిగ హక్కుల దండోరా జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ గారు*
- *రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ గారు*

మానవ సమానత్వానికి శాసనంలా నిలిచిన మహనీయుడు, శతాబ్దాలుగా మూఢనమ్మకాల పేరుతో అణచివేతకు గురైన బహుజనుల గుండెల్లో వెలుగుదీపంలా వెలిగిన మహాత్ముడు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి సందర్భంగా మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో అంబర్పేట పరిధిలోని అలీకేఫ్ చౌరస్తాలో గల ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ గారు, రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ గారు పాల్గొని ఫూలే గారి మహోన్నతమైన ఆలోచనలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ—
“సమాజంలో పుట్టుక ఆధారంగా మనిషిని కొలిచే క్రూర వ్యవస్థకు ఎదురు నిలిచిన తొలి విప్లవకారుడు ఫూలే. చదువు కొందరికే అనే దురవస్థను ఛేదించి ‘విద్య హక్కు’ అనే శబ్దాన్ని బహుజనుల నోళ్లలో పెట్టిన మహోన్నత చరిత్ర ఆయనది. అణగారిన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు విద్య అందించాలనే సంకల్పంతో చేసిన పోరాటం ఈరోజు కూడా మార్గదర్శకంగా నిలుస్తోంది” అని పేర్కొన్నారు.
ఫూలే గారు కేవలం ఒక వ్యక్తి కాదు—ఒక ఆలోచన, ఒక ఉద్యమం, ఒక శక్తి. శతాబ్దాలుగా చీకటిలో మగ్గిన సమాజానికి విద్య అనే ఆయుధాన్ని అందించి, దాస్య బంధనాలపై తిరుగుబాటు చేయడానికి ప్రేరేపించిన నాయకుడు. కులవ్యవస్థ పేరుతో జరుగుతున్న అన్యాయాలను బహిర్గతం చేసి, సమాన హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన నిజమైన ప్రజా యోధుడు పూలే
“ఫూలే కలలుగన్న సమాజం నిజంగా సాధ్యమైందా? ఇంకా ఎందుకు బహుజనులు అన్యాయానికి గురవుతున్నారు? ఎందుకు విద్య ఇంకా కొందరి సొత్తుగా మారుతోంది?” అని. సమాజంలో కొనసాగుతున్న అసమానతలను ఎత్తిచూపుతూ, ఫూలే గారి ఆలోచనలను కేవలం జయంతి రోజుల్లో మాత్రమే గుర్తు చేసుకోవడం కాకుండా, ప్రతి రోజూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
“ఫూలే చూపిన దారిలోనే బహుజన సమాజం ముందుకు సాగాలి. హక్కులు అడిగేవాళ్లుగా కాదు—దక్కించుకునే వారిగా మారాలి. చదువు, స్వాభిమానము, సమానత్వం—ఈ మూడు ఆయుధాలతోనే నిజమైన విముక్తి సాధ్యమవుతుంది” అని స్పష్టం చేశారు. ఫూలే గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత యువకులు తీసుకొని సమాజంలో ఉన్న ప్రతి అన్యాయానికి ఎదురు నిలిచి, బహుజనుల హక్కుల కోసం నిరంతరం పోరాడాలి అని తెలిపారు.
“ఫూలే ఒక జ్ఞాపకం కాదు… ఒక జ్వాల. ఆ జ్వాలను మనలో మేల్కొలిపితేనే సమానత్వ సమాజం నిర్మాణం సాధ్యం” అని అన్నారు

Photos from Madiga Hakkula Dandora's post 05/04/2026

దళితుల గర్వకారణం, సమానత్వానికి ప్రతీక, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం గారి జయంతి సందర్భంగా ఈ రోజు మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బషీర్బాగ్ ఎక్స్ రోడ్స్ వద్ద గల వారి విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించిన జాతీయ అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ గారు .
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.....
బాబు జగ్జీవన్ రాం గారి జీవితం ఒక ఉద్యమమని పేర్కొన్నారు.అణగారిన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రాత్మకమని అన్నారు.సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గంస్ఫూర్తిదాయకం.కానీ నేటి పరిస్థితుల్లో దళితులపై అన్యాయం కొనసాగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వాలు మాటల్లోనే పరిమితం అవుతున్నాయని విమర్శించారు.
హక్కులు ఇవ్వాల్సిన చోట హామీలు మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు."దళితుల హక్కులు అడిగేది కాదు – సాధించేది!” అని స్పష్టం చేశారు."సామాజిక న్యాయం అమలు చేయకపోతే పోరాటం తప్పదు!” అని హెచ్చరించారు.విద్య, ఉపాధి, రాజకీయాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని అన్నారు.చట్టాలను కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అణగారిన వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు.దళితుల గౌరవం కోసం మాదిగ హక్కుల దండోరా ఎప్పటికీ వెనుకడుగు వేయదని తెలిపారు.ప్రతి గ్రామంలో ఉద్యమాన్ని బలపరుస్తామని అన్నారు.
యువత ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.సమానత్వం సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. జగజ్జివన్ రాం గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు.దళితుల ఐక్యతే శక్తి అని నినదించారు.సమాజంలో మార్పు తీసుకురావాలని సంకల్పించారు.
చివరిగా నాయకులు మరోసారి తెలిజేశారు.ప్రభుత్వాలు దళితుల హక్కులను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.దళితుల గౌరవమే మా లక్ష్యం – పోరాటమే మా మార్గం! బాబు జగ్జీవన్ రాం ఆశయాల సాధనే మా సంకల్పం! అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ స్టేట్ కోఆర్డినేటర్ బొర్ర శాంతి కుమార్ మాదిగ,గుగ్గిళ్ళ కర్ణ మాదిగ ,మల్లేష్ మాదిగ ,క్రాంతి మాదిగ ,శేశి కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Hyderabad, Telangana, India
Hyderabad
500016