05/10/2026
ఉప్పల్ మాజీ శాసనసభ్యులు, బిజెపి రాష్ట్ర నాయకులు శ్రీ NVSS ప్రభాకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BRS నాయకుడు సాయి జెన్ శేఖర్ పై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన డివిజన్ బిజెపి నాయకులు.ఇప్పటికే పలుమార్లు వివాదాలు సృష్టించి ఇతర పార్టీ నాయకులు, స్థానికులను బెదిరించి పలు వివాదాల్లో కేసులు నమోదు చేయడం జరిగింది కావున నాచారం డివిజన్ పరిధిలో వివాదాలు సృష్టిస్తూ శాంతి భద్రతలకు విఘతం కలిగిస్తున్న సాయి జెన్ శేఖర్ అనే ఈ వ్యక్తిపై వెంటనే రౌడీషీట్ నమోదు చేయాలని ఇన్స్పెక్టర్ గారిని కోరిన బిజెపి నాయకులు. అదేవిదంగా గత 10 సంవత్సరాల కాలంలో ప్రజలను పీడించుకొని సంపాదించిన కోట్లాది రూపాయల సంపాదన గురించి అధికార పార్టీ నాయకులు విచారణ జరిపించి తమ చిత్తశుద్ధిని తెలపాలని డిమాండ్ చేయటం జరిగింది.