KalabhairavaTemple

Call Website Contact the organization

KalabhairavaTemple KalabhairavaGuru Annaprasada Seva. Kalabhairava Swamy Temple http://www.facebook.com/kalabhairavaTV

🛕2026నవంబర్_లో📍రాజమండ్రి🔱 శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవాలయ దర్శనం తేదీలు👇దర్శనం సమయం 🔯ఉ.6:45 నుండి మ.11:45 వరకు మా...
27/10/2026

🛕2026నవంబర్_లో📍రాజమండ్రి🔱 శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి దేవాలయ దర్శనం తేదీలు👇
దర్శనం సమయం 🔯ఉ.6:45 నుండి మ.11:45 వరకు మాత్రమే ఉంటుంది
🔴01-11-2026 ఆదివారం
🔱02-11-2026 కాలాష్టమి సోమవారం,
🌑08-11-2026🎆దీపావళి అమావాస్య ఆదివారం (తగులు ఉదయం11:27 నుండి)
🌑09-11-2026 అమావాస్య సోమవారం (మిగులు మధ్యాహ్నం 12:31వరకు)
🔴15-11-2026 ఆదివారం 41రోజుల📿కాలభైరవ దీక్షలు ప్రారంభం,
🔱17-11-2026 అష్టమి మంగళవారం,
⚪24-11-2026 కార్తీకపూర్ణిమ మంగళవారం,
🔴29-11-2026 ఆదివారం
🔥31-12-2026 గురువారం కాలభైరవ జయంతి కాలభైరవాష్టమి🔥

🛕Kalabhairava Temple లొకేషన్ 🔗 Link క్లిక్ చేయండి 📍
https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=ac 🚩

🏵️గురువుగారి వాట్సాప్ ఛానల్ 🔗 🧲 Follow 👍
https://whatsapp.com/channel/0029VbB1h4dBfxoE9wSgyq0L 🚩

🚩మన ఆత్మబంధువులందరికీ తెలియజేయగలరు 🚩

🚩Kalabhairava Swamyji page 🔗 🧲
https://www.facebook.com/kalabhairavaTV

🔯 Kalabhairava Guru Youtube Channel 🔗
https://www.youtube.com/c/KALABHAIRAVAGURU 🚩

🔯KalabhairavaTV YouTube Channel 🔗 https://youtube.com/c/Kalabhairavatv 🚩

🚩🚩శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామికి జయము జయము జయము 🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Find local businesses, view maps and get driving directions in Google Maps.

 #కాలభైరవుడ్అంటేశివుడు కి ఎందుకు ఇష్టం ?చదివితే గ్రామ సింహంను పూజిస్తారు.🔱   శ్రీ కాలభైరవ స్వామి పరమేశ్వరుని యదార్థ స్వర...
17/10/2026

#కాలభైరవుడ్అంటేశివుడు కి ఎందుకు ఇష్టం ?
చదివితే గ్రామ సింహంను పూజిస్తారు.🔱

శ్రీ కాలభైరవ స్వామి పరమేశ్వరుని యదార్థ స్వరూపం. రౌద్రస్వరూపుడు. రక్షాదక్షుడు. దుష్టగ్రహబాధలు నివారించగల శక్తి మంతుడు. కాలభైరవుడు అనగానే హేళనగా కుక్కఅనేస్తాం. కుక్కను వాహనంగా చేసుకుని తిరిగే వాడే తప్ప ఆయనే కుక్క కాదు. కుక్కఅంటే విశ్వసనీయతకు మారుపేరు. రక్షణకు కూడా తిరుగులేని పేరు. అందుకే ధర్మపరులైన కాలభైరవ సాధకుల, గురువుల పండితుల జోలికి అనవసరంగా ఎవరూ రారు. యదార్ధమైనటువంటి కాలభైరవ సాధకులు గురువులు ఎవరు జోలికి వెళ్లరు వారి పరిమాతరం వారు చేసుకుంటారు చాలా మితంగా మాట్లాడుతారు. వారి జీవితాన్ని ధర్మబద్ధంగా గడుపుకుంటూ లాభాపేక్ష లేకుండా జీవితాన్ని గడుపుతూ ఉంటారు అందరికీ శుభాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు లోక శ్రేయస్సు కోసం వారు ఎన్నో బృహప్ర కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వారి దృష్టి లోకంలో అందర్నీ కూడా జ్ఞానవంతులను చేయాలి ధర్మాత్ములను చేయాలి అధర్మాన్ని ఖండించే ధీరులుగా మార్చాలి అనే భావన చేస్తూ ఉంటారు అటువంటి గురువులు మహోన్నతమైన గురువుగా పేరు పొందుతున్నారు పరమ పూజ్య శ్రీ కాలభైరవ స్వామీజీ వారు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటానుకోట్ల మంది భక్తులను కలిగినటువంటి వీరు వారి యొక్క ప్రవచనాలతో కష్టాలలో ఉన్నటువంటి ఎంతో మందిని ఉద్ధరిస్తూ ఉన్నారు వారికి మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు. వారికి దరమైన మార్గాన్ని బోధిస్తూ వారి జన్మను సార్ధకతం చేస్తూ ఉన్నారు. దుఃఖ రహిత సమాజం కోసం పోరాడుతూ ఉన్నారు.

సమయోచిత జ్ఞానానికి ప్రతీక. కాలస్వరూపం ఎరిగిన వాడు. కాలంలాగే తిరుగులేనివాడు. ఎంత వ్యయమైనా తరిగిపోని వాడు. శాశ్వతుడు, నిత్యుడు. కాలభైరవుడు మన పురాణాల ప్రకారం #అసితాంగభైరవుడు, #రురుభైరవుడు, #చండభైరవుడు, #క్రోథభైరవుడు, #ఉన్మత్తభైరవుడు, #కపాలభైరవుడు, #భీషణభైరవుడు, #సంహారభైరవుడు అని 8 రకాలు. వీరు కాక మహాభైరవుడు, స్వర్ణాకర్షణ భైరవుడు మరో ఇద్దరు కనబడతారు. స్వర్ణాకర్షణ భైరవుడు చూడడానికి ఎర్రగా ఉంటాడు. బంగారు రంగు దుస్తులు ధరిస్తాడు. తలపై చంద్రుడు ఉంటాడు. 6 చేతులు ఉంటాయి. ఒక చేతిలో బంగారు పాత్ర ఉంటుంది.
ప్రపంచంలోనే భక్తులకు నానాలను ప్రసాదంగా ఇచ్చే ఏకైక శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం ఆర్యాపురం అఖండ గోదావరి నది తీరం రాజమండ్రి.
స్వర్ణాకర్షణభైరవుడు సిరి సంపదలు ఇస్తాడని చెబుతారు. ఇతర భైరవుల విషయానికి వస్తే సాధారణంగా భైరవుడు భయంకరాకారుడుగా ఉంటాడు. రౌద్రనేత్రాలు, పదునైన దంతాలు, మండే వెంట్రుకలు, దిగంబరాకారం, పుర్రెల దండ, నాగాభరణం ఉంటాయి. నాలుగు చేతులలో పుర్రె,డమరుకం, శూలం, ఖడ్గం ఉంటాయి.

కాలభైరవుని భక్తిశ్రద్ధలతో కొలిచే వారు
''ఓం కాలాకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహే, తన్నో కాలభైరవ ప్రచోదయాత్‌'' అని ప్రార్థిస్తారు. మన దేశంలో కాలభైరవ క్షేత్రాలు చాలా ఉన్నాయి. ఈ క్షేత్రాలలోఉండే కాలభైరవుని క్షేత్రపాలకుడు అంటారు. ఎన్నో యుగయుగాల నుండి మహోన్నతమైన గ్రంథాలలో దాగివున్న పరమ సత్యాలను ని కూడా రహస్యాలను ధర్మాలను మహామంత్రాలను సామాన్య ప్రజలకు సైతం ప్రపంచవ్యాప్తంగా కాలభైరవ తత్వాన్ని ప్రచారం చేయుచున్న భారతీయ సనాతన ధర్మ కాలభైరవ తత్వ ప్రచారకులు నిరాడంబరులు నిత్యాగ్నిహోత్రులు పరమ పూజ్య శ్రీ శ్రీ కాలభైరవ స్వామి వారికి కోటి కోటి ప్రణామాలతో ప్రణామాలతో.. కాలభైరవ గురుపరివార ఆంధ్రప్రదేశ్ తెలంగాణ.

నేపాల్‌, ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ దేశాలలో కాలభైరవ పూజ విశేషంగా జరుగుతుంది. ఇక్కడ ఆలయాలలో కాలభైరవుడు ప్రధాన దైవతంగా ఉంటాడు.

నేపాల్‌ దేశానికి జాతీయ దైవంగా కాలభైరవుడు పూజలందుకుంటున్నాడు.

దేవరాజ సేవ్యమాన పావనాంఘ్రి పంకజం
వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం
నారదాది యోగిబృంద వందితం దిగంబరం
కాశికా పురాధినాథ కాలభైరవంభజే

ఆధునిక కాలంలో కాలభైరవ గురు పరమ పూజ కాలభైరవ స్వామీజీ వేలాది సంవత్సరాలుగా వెలుగుచూడని కాలభైరవ రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చాటి చెప్పుచున్నారు.

తమ కాలభైరవ గురు సంస్థానమఠం నిర్వహించే కాలభైరవ గురు కాలభైరవ టీవీ మీడియా మాధ్యమాల ద్వారా కాలభైరవుని భగవత్‌ స్వరూపాన్ని గురించిన అంశాలపై అసంఖ్యాకమైన మంత్రాలను రహస్యాలను సాధన అందరికీ నేర్పుచు ఉన్నారు. అప్పట్నుంచి 'కాలభైరవ'లోని 'కాల' పదాన్ని నలుపుగా, 'కాలభైరవుని' నల్లటి భైరవునిగా లేదా భయంకరమైన రూపంగా పరిగణిస్తున్నారు.

నిజానికి కాలభైరవ గురువు పరమ పూజ కాలభైరవ స్వామీజీ కాలభైరవుడు అంటే శక్తి భైరవునికి (శివునికి) ప్రతిరూపమని, ఈ దేవుడు కాలాన్ని, దాని శక్తిని నియంత్రించగల్గుతాడని చెపుతూ ఉన్నారు. కనుక కాలభైరవుడంటే కాలాన్ని అధీనంలో వుంచుకునే కాల చక్ర భైరవుడు అని అర్థం. ప్రజల బాగోగులు, యోగక్షేమాలు కనిపెట్టుకుని చూసే వాడు, తన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడమే కర్తవ్యమని భావించేవాడు కాలభైరవుడు.

ఈయన ఆపడానికి వీల్లేని విధంగా నిరంతరం పురోగమిస్తుంటాడు. మామూలుగా మనందరం 'గడిచిన కాలం తిరిగిరాదు' అని అనేక సందర్భాల్లో అంటుంటాం. ఆ మాటకు తిరుగులేదు. క్షణంలో లక్షోవంతు కూడా వెనక్కి రాదంటే రాదు. అందుకే కాలం అమూల్యమైంది. కనుకనే తెలివైనవాళ్ళు కాలాన్ని వృథా చేయరు. ప్రతి క్షణాన్నీ ఉపయుక్తం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ, పూర్తి భక్తి శ్రద్ధలతో కాలభైరవ స్వరూపుని వేడుకున్నట్లయితే ఆ దివ్య శక్తి నిరంతరం కనిపెట్టుకుని వుండి కాపాడుతుంది. అనేకమంది చిన్న చిన్న సమస్యలను చూసి పెద్దగా బెంబేలుపడ్తూ కాలాన్నంతా వృథా చేసుకుంటూ వుంటారు. నిజానికి కాలభైరవుని గనుక భక్తితో ప్రార్థించినట్టయితే ఎలాంటి సమస్యలయినా ఇట్టే పరిష్కృత మైపోతాయి.

ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా కాలభైరవుని ఆరాధించడం అనే వ్యాపకం పెట్టుకుంటే ఇక జీవితంలో ఏ చింతా వుండదు. వీరికి కాలాన్ని వ్యర్థం చేయకుండా ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే నైపుణ్యం అలవడ్తుంది. దాంతో అరక్షణం కూడా వృథా చేయకుండా సమయాన్ని మంచి పనులకోసం వినియోగిస్తారు. కాలభైరవుని 'క్షేత్రపాలక' అని కూడా అంటారు. క్షేత్రపాలకుడంటే ఆలయాన్ని రక్షించే కాపలాదారు. ఈ సూత్రాన్ని పురస్కరించుకుని గుడి తలుపులు మూసే సమయంలో తాళంచెవులను కాలభైరవుని వద్ద వుంచుతారు. తిరిగి ఆలయాన్ని తెరిచేటప్పుడు అక్కణ్ణించే తాళంచెవులు తీసుకుని గుడిని తెరుస్తారు.

కాలభైరవుడు ప్రయాణీకులకు కూడా రక్షకుడిగా వ్యవహరిస్తాడు. అందుకే సిద్ధులు 'ప్రయాణానికి సన్నద్ధమయ్యేముందు.. ముఖ్యంగా రాత్రులు ప్రయాణించేమాటుంటే కాలభైరవునికి లవంగాల మాల యాలకుల మాల బాదం గింజల మాల జీడిపప్పుల మాల నివేదించి, దీపారాధన చేసి పూజించాలని, అలా చేసినట్లయితే ప్రయాణ సమయంలో ఆయన రక్షణగా వుంటాడని' చెప్తారు. కాలభైరవుని వాహనం శునకం. కనుక కుక్కలకు ఆహారం పెట్టి, వాటి యోగక్షేమాలు పట్టించుకుంటూ, అనురక్తితో సాకినట్లయితే, పరోక్షంగా కాలభైరవుని పూజించినట్టే. కాల భైరవాష్టమి. ఇది పరమ పవిత్రమైన రోజు. కాలభైరవుని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అనేక శివాలయాల్లో కాలభైరవుని విగ్రహాన్ని వుంచుతారు. దాంతో అవి మరింత పవిత్ర ప్రదేశాలుగా గుర్తింపు పొందుతాయి. రాజమండ్రిలో గోదావరి తీరాన అత్యంత పురాతనమైన స్వర్ణాకర్షణ కాలభైరవ ఆడవాళ్లు ఉన్నట్టుగా భక్తులు చెబుతూ ఉంటారు. ఇక్కడ స్వామి వారు వాయు ప్రతిష్ట. అనగా కుల మతాలకు అతీతంగా భక్తులందరూ కూడా స్వామివారిని తాకవచ్చు సర్ప హారతి కంకాల హారతి ఇవ్వవచ్చు అభిషేక సుగంధ అభిషేకమును కూడా నిర్వహించుకోవచ్చు. అందుకే ప్రపంచవ్యాప్తంగా కోటానుకోట్ల మంది భక్తులు ఈ ఆదివారాలు అస్తమీలు అమావాస్యలు పౌర్ణమిలో రోజుల్లో తప్పనిసరిగా దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొంది వారి జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ ఉన్నారు. పరోక్షంగా స్వామి వారి యొక్క మహామంత్రాలను గురువు గారి ద్వారా ఉపదేశంగా పొంది వారు సాధన చేస్తూ ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాలలో గురువుగా మహానుభావులుగా పండితులుగా జ్యోతి సిద్ధాంతర కత్తెలుగా అభివృద్ధి సాధిస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 110 మహామంత్రోపదేశాలను మన గురువుగారు ఇక్కడ అనుగ్రహించడం జరిగింది. కాలభైరవుడ్ని ధర్మాచారములో మాత్రమే పూజించాలి అని గురువుగారు తెలియజేస్తూ ఉంటారు. ధర్మాచార్మం అంటే శాఖాహారము సత్వగుణ సంపన్నమైనటువంటి భక్తిశ్రద్ధలతో మాత్రమే ఆరాధించాలని గురువుగారు అందరికీ ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మూర్ఖులు స్వామివారికి మద్యాన్ని మాంసాన్ని పెడుతూ వారి మూర్ఖత్వాన్ని వారి పిచ్చితనాన్ని వారి విరితనాన్ని బయటపెడుతూ ఉంటారు. వారిని ఈ ప్రపంచము భక్తులందరూ కూడా అజ్ఞానులుగా మూర్ఖులుగా భావన చేసి క్షమించు వదిలేస్తుంటారు. ఎందుకంటే మూర్ఖుడుతో అజ్ఞానుతో వాదన చేస్తే వాడి అజ్ఞానము వారు మూర్ఖత్వము తగ్గకపోగా మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. ఇలాంటి తప్పు పనులు చేసేటటువంటి వారికి అప్రాచ్యువండి చెప్పు పనులు చేసే పనులు చేసేటటువంటి వారికి కాలమే బుద్ధి చెబుతుందని భక్తులు వారిని పట్టించుకోరు. అరుణాచలంలోని ఆలయాల్లో భైరవుని ప్రతీకలు వుండటాన వాటిని ప్రత్యేకంగా కీర్తిస్తారు. కాశీలోని కాలభైరవుని ఆలయాన్ని కాలభైరవ ఆరాధకులు తప్పక ( కాశీలో కూడా కొంతమంది అజ్ఞానులు ఇక్కడ మద్యాన్ని స్వామి వారికి ఇస్తూ ఉంటారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి వారు ఎంత పిచ్చితనంతో విరుతనంతో బతుకుతున్నారో) మన ఇంట్లో ఎవరైనా మద్యం తాగితే మనం వారిని దూషిస్తాం తిడతాం బుద్ధి లేదా జ్ఞానం లేదా ఎందుకు ఈ పాడు పని చేస్తున్నావు. తొందరగా పోతావు రోగాలు వస్తాయి అని మనం వారికి బుద్ధి చెబుతూ ఉంటాము అలాంటిది ఈ బుద్ధులేని వాళ్లే దేవుడికి మద్యాన్ని ఇస్తున్నారంటే మనం అర్థం చేసుకోవాలి వాడు చెడిపోయింది కాకుండా పరమాత్మను కూడా మద్యం తాగే విధాతగా చూపించడం వాడి పిచ్చికి పరాకాష్ట) దయచేసి సజ్జనులైన భక్తులందరూ కూడా ధర్మాచార్ మార్గంలో కాలభైరవున్నే కాదు సమస్తమైన దేవతల్ని ఆరాధించండి స్వామి వారి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం చేత మీ జన్మను పావనం చేసుకోండి మూర్ఖులు చెప్పేటటువంటి పిచ్చి మాటలు నమ్మి కోరికష్టాలను తెచ్చుకోవద్దు) దర్శించుకుంటారు. సమస్త గ్రహాలకు అధిపతి కాలభైరవుడు. కాలభైరవుని ధర్మాచారంలో పూజించినట్లయితే కాలభైరవుడికి కంకాల హారతి సమర్పించినట్లయితే కాలభైరవుడికి తెల్ల జిల్లేడు పూలను సమర్పించినట్లయితే కాలభైరవుడికి కాలభైరవ మంత్రం రోజు 11 జపించినట్లయితే ఒక్క రాహు కేతు శని గ్రహదోషాలే ఏ దోషమైన సరే కేవలం కొన్ని రోజుల్లో సమూలంగా నివారణ అవుతుందని భక్తులు యొక్క ప్రగాఢ విశ్వాసం. శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రం రాజమండ్రిలో భక్తులకు స్నానాలను ప్రసాదంగా ఇస్తారు ఈ విధంగా భక్తులకు నానాలను ప్రసాదంగా ఇచ్చే ఏకైక క్షేత్రంగా వర్ధిల్లుతుంది. గురువుగారు చెప్పేటటువంటి అష్టకమును పారాయణం చేసిన గురువుగారు చెప్పినటువంటి మహా మంత్రములను జపం చేసిన అతి శీఘ్రంగా సమస్తమైన గ్రహదోషాల నుంచి శత్రు బాధల నుండి ఈతి బాధలనుండి కష్టాల నుండి విముక్తి అవుతారు.

మన దేశంలో కాలభైరవుని దేవాలయాలు అనగానే మనకు గుర్తొచ్చేది రాజమండ్రి గోదావరి తీరం అక్కడ రెండు అంతస్తులలో స్వామివారి కొలువుతీరుంటారు క్రింద క్షేత్రపాలక కాలభైరవ స్వామి వారి రూపంలో పైన శ్రీ లక్ష్మీ కుబేర స్వర్ణాకర్షణ కాలభైరవ రూపంలో ఉంటారు. రాజమండ్రిలోనే కాకుండా కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో కూడా అనగా శ్రీకాళహస్తిలో కాలభైరవుడు, బట్టల భైరవుడు దర్శనమిస్తారు. విశాఖపట్నంలో, భైరవకోన నిజామాబాద్‌లోని రామారెడ్డి ప్రాంతంలో కాలభైరవ స్వామి దేవాలయం వుంది. న్యూఢిల్లి పురానా ఖిల్లా దగ్గరున్న భైరవాలయం అతి ప్రాచీనమైంది. పాండవ సోదరుల రాజధాని ఇంద్ర ప్రస్త నగరంలో ప్రశస్తమైన కాలభైరవ ఆలయం ఉంది.

తమిళనాడు, అరగలూరులోని శ్రీకామనాథ ఈశ్వరాలయంలో అష్ట భైరవుడున్నాడు. అలాగే కరైకుడి, చోళపురం, అధియమాన్‌ కొట్టయ్‌, కుంభకోణాల్లో భైరవ దేవాలయాలు ఉన్నాయి. మధ్యప్రదేశ్‌ ఉజ్జయినీలో కాల భైరవాలయం వుంది. కర్ణాటకలోని అడిచున్‌చనగిరి, మంగళూరు కద్రి ప్రాంతాల్లో కాలభైరవ దేవాలయాలు ఉన్నాయి.భక్తులు తమకు క్రమశిక్షణ అలవడాలని, ప్రయాణాల్లో రక్షకుడుగా తోడుండాలని, నిరంతరం ఆపదలనుండి కాపాడాలని భక్తిప్రపత్తులతో కాలభైరవుని పూజిస్తుంటారు. Andhra Pradesh India

02/10/2026

్టోబర్02 గురువుగారి జన్మదినం సందర్భంగా ఉదయం 9గంటలకు #కాలభైరవగురు సంస్థాన్ మఠం #రాజమండ్రిలో శ్రీ కాలభైరవ స్వామి వారికి రుద్రాభిషేక సేవ. తల్లులకు చెల్లెమ్మలకు దిగ్బంధన సాధన మంత్రోపదేశ సేవ ఉంటుంది* 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

రేపు  ్టోబర్02 గురువుగారి   జన్మదినం సందర్భంగా ఉదయం 9గంటలకు  #కాలభైరవగురు సంస్థాన్ మఠం  #రాజమండ్రిలో శ్రీ కాలభైరవ స్వామి...
01/10/2026

రేపు ్టోబర్02 గురువుగారి జన్మదినం సందర్భంగా ఉదయం 9గంటలకు #కాలభైరవగురు సంస్థాన్ మఠం #రాజమండ్రిలో శ్రీ కాలభైరవ స్వామి వారికి రుద్రాభిషేక సేవ. తల్లులకు చెల్లెమ్మలకు దిగ్బంధన సాధన మంత్రోపదేశ సేవ ఉంటుంది* 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.

సమాజాన్ని, సనాతన ధార్మిక కుటుంబ వ్యవస్థను పట్టిపీడిస్తున్నటువంటి దుర్మార్గాలలో ప్రధానమైన సమస్య. భారతీయ సనాతన ధర్మంలో కుట...
30/09/2026

సమాజాన్ని, సనాతన ధార్మిక కుటుంబ వ్యవస్థను పట్టిపీడిస్తున్నటువంటి దుర్మార్గాలలో ప్రధానమైన సమస్య. భారతీయ సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థకు పెద్దపీట వేయబడింది. ఈ సాంప్రదాయ వివాహ వ్యవస్థకు గండి కొట్టేలా కొంతమంది క్షణకాల సుఖాల కోసం కోసం భర్తను భార్య మోసం చేయడం భార్యను భర్త మోసం చేయడం పరస్త్రీ పర పురుష వ్యామోహాలలో పడి వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని సర్వనాశనం చేసుకుంటూ తమ సంతానానికి వంశానికి శాపాన్ని మూటకట్టుకుంటూ ఉన్నారు.. సమాజానికే పెను సవాల్ గా మారిన ఈ అక్రమ సంబంధాలను నివారించడానికి పూజ్యశ్రీ కాలభైరవ స్వామీజీ వారు అందించిన అమూల్య పరిహారము. భార్యాభర్తలను కలపడం వారిని అన్యోన్య జీవితాన్ని మరింత దృఢంగా మార్చడమే లక్ష్యంగా ఈ పరిహారం ఉంటుంది. ఈ సమస్యల్లో ఉన్నవారు భక్తి ఉన్నవారు అందరూ కూడా ఈ పరిహారం ఆచరించి భార్యాభర్తలు ఎరువురు అనురాగంతో ఆత్మీయతతో జీవితాన్ని ముందుకు కొనసాగించి మన ధర్మాన్ని మన సంస్కారాన్ని కాపాడాలని కోరుకుంటూ ... *కాలభైరవ గురు సంస్థాన్ మఠం అడ్మిన్*

#అక్రమసంబంధాలపీడ Removes Remedies By ...

27/09/2026

ఈరోజు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి వారి దర్శనం

*రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో శ్రీ కాలభైరవ స్వామికి రాహుకాలంలో విశేష సుగంధ జలఅభిషేక సేవ. రాహుకాల దీపపూజ, స్వామి...
27/09/2026

*రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠంలో శ్రీ కాలభైరవ స్వామికి రాహుకాలంలో విశేష సుగంధ జలఅభిషేక సేవ. రాహుకాల దీపపూజ, స్వామి ప్రత్యేక దర్శనం ఉంటుంది* ఈరోజు ఆదివారం సాయంత్రం 4:30 నుండి 6గం.లకు మధ్య రాహుకాలంలో శ్రీ కాలభైరవ స్వామి అనుగ్రహం కోసం నారీకేల దీపపూజ. వటుకభైరవ మంత్రము జపం 3మాలలు. కాలభైరవ సహస్రనామావళి లేదా కాలభైరవాష్టకం పారాయణం చేయండి....🛕 📍రాజమండ్రి 🔱శ్రీస్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి ఆలయం

🔯దర్శనం ఉ.7:00
నుండి మ.11:45వరకు
🚩2026 డిసెంబర్31 గురువారం రాజమండ్రి శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో *కాలభైరవజయంతి 🔱కాలభైరవాష్టమి* మహోత్సవములు
🕉️41రోజులదీక్ష 15.11.ఆదివారం

⚛️21రోజులదీక్ష 06.12.ఆదివారం

🔯11రోజులదీక్ష 20.12.ఆదివారం
స్వీకరించాలి

✡️దీక్షా విరమణ పూర్ణాహుతి 31.12.2026

🔥5రోజుల పాటు 27నుండి 31వరకు శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ హోమాలు. విశేష పూజలు అభిషేకాలు.

యూట్యూబ్ 🧲https://youtube.com/c/Kalabhairavatv

Facebook:🧲
https://www.facebook.com/kalabhairavaTV

వివరాలకు వాట్సాప్📱@9000200117

స్వామీజీ వాట్సాప్ 🧲ఛానల్ Follow👍
https://whatsapp.com/channel/0029VbB1h4dBfxoE9wSgyq0L

Youtube:🧲
https://www.youtube.com/c/KALABHA

టెంపుల్ 📍అడ్రస్👇https://maps.app.goo.gl/xkBo2CcGiN14emoK7?g_st=ac

కాలభైరవఅభిషేకంవల్లఫలితాలు? భైరవాభిషేకంవల్లలాభాలు?  What is Benefits of Kalabhairava Abhishekam? కాలభైరవ సుగంధ జలఅభిషేకం ...
25/09/2026

కాలభైరవఅభిషేకంవల్లఫలితాలు? భైరవాభిషేకంవల్లలాభాలు? What is Benefits of Kalabhairava Abhishekam? కాలభైరవ సుగంధ జలఅభిషేకం అంటే ఏమిటి? రాజమండ్రి కాలభైరవ గురు సంస్థాన్ మఠం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో ప్రతి ఆదివారం అష్టమి అమావాస్య పౌర్ణమి రోజులలో కాలభైరవ స్వామి వారికి విశేషమైన సుగంధ జలాభిషేకం ఉంటుంది. పరమశివుని రుద్రావతారమైన కాలభైరవ స్వామి చేసే అభిషేకం వల్ల మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మరియు ఐశ్వర్యం లభిస్తాయని హిందూ ధర్మ శాస్త్రాలు , ప్రాచీన మంత్ర గ్రంధాలు చెబుతున్నాయి.. కాలభైరవుడు కంకాల హారతి ప్రియుడు, మరియు సుగంధ జలాభిషేక ప్రియుడు.
• సుగంధ జలాలతో *ఓం నమో కాలభైరవాయ నమః* లేదా వటుకభైరవ మంత్రమును జపం చేస్తూ అభిషేకం చేయడం వల్ల దీర్ఘాయువు, మానసిక ప్రశాంతత మరియు కుటుంబంలో సుఖసంతోషాలు లభిస్తాయి. గృహంలో శుభకార్యాలు, గృహ ప్రాప్తి వివాహ శుద్ధియోగం
• ఉత్తమ సంతాన ప్రాప్తి మరియు వ్యాపార వృద్ధి కలుగుతాయి.
• దీర్ఘకాలిక రోగాలు, శారీరక బలహీనతలు తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుంది.
• జీవితంలోని కష్టాలు, దుఃఖాలు దూరమవుతాయి మరియు మధురమైన వాక్కు సిద్ధిస్తుంది.
• అఖండ ఐశ్వర్యం, సంపద కలుగుతాయి.
• ధనప్రాప్తి చెందుతుంది మరియు శత్రు బాధలు నశిస్తాయి.
• కుటుంబంలో సంతోషం, అభీష్ట సిద్ధి మరియు సర్వసౌఖ్యాలు కలుగుతాయి.
• మనస్సులోని అహంకారం, కల్మషాలు తొలగిపోయి పవిత్రత ఏర్పడుతుంది. ఉద్యోగ, ఆధ్యాత్మిక పురోగతి లభిస్తుంది.
• అదృష్టం కలిసిరావడంతో పాటు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
• అప్పుల బాధల (రుణ విముక్తి) నుండి ఉపశమనం లభిస్తుంది.
• మనస్సు, శరీరం పవిత్రమవుతాయి. ఆత్మశుద్ధి లభిస్తుంది.
కాలభైరవ స్వామి వారిని సుగంధ జలంతో అభిషేకించడం అనేది కేవలం ఒక క్రతువు మాత్రమే కాదు. ఇది మన మనస్సులోని అహంకారాన్ని, చెడు ఆలోచనలను కడిగివేసి కాలభైరవ స్వామి అనుగ్రహాన్ని పొందే ఒక పవిత్రమైన మార్గం. సుగంధ ద్రవ్యాల జలంతో కాలభైరవ స్వామికి అభిషేకం చేయడం వల్ల విశేషమైన ఆధ్యాత్మిక ఫలితాలు లభిస్తాయి. ✅ *శ్రీ కాలభైరవ స్వామి వారి పైనుండి జాలువారినటువంటి ఆ సుగంధ అభిషేక జలానికి మహోన్నత దివ్య శక్తులు ఉంటాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తూ ఉంటారు. అందుకే అభిషేకం తర్వాత ఆ సుగంధ జలాన్ని కొద్దిగా మీరు ఇంటికి తీసుకుని వెళ్లి ఇంటిలో చల్లడం చేస్తూ ఉంటారు. 🌟నకారాత్మక శక్తి నివారణ: ఇంట్లోని లేదా వ్యాపార స్థలంలోని చెడు శక్తులు, దృష్టి దోషాలు మరియు నకారాత్మకత (Negative energy) తొలగిపోతాయి. 🧲గ్రహ దోషాల ముక్తి: ముఖ్యంగా శని దోషాలు, రాహు-కేతువుల పీడల నుండి ఉపశమనం లభిస్తుంది. 🏵️మానసిక ప్రశాంతత: సుగంధ ద్రవ్యాల సువాసనలు మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి. భయాందోళనలు తగ్గుతాయి. 👍కార్యసిద్ధి: చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోయి, విజయం లభిస్తుంది. ఆదివారం రోజున, పూర్ణిమ రోజున, అష్టమి, కాలాష్టమి రోజున, అమావాస్య రోజున అత్యంత శ్రేష్ఠం. మరియు *ఆదివారం రాజమండ్రి గోదావరి నది తీరాన శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ క్షేత్రంలో రాహుకాలం సమయంలో సాయంత్రం 4:30 PM 6:00 PM మధ్యకాలంలో చేసే కాలభైరవ సుగంధ జల అభిషేక సేవకు, ప్రత్యేక పూజకు ప్రత్యేక ఫలితం ఉంటుంది*. అభిషేక సేవకు విశేష పూజకు మరిన్ని వివరాలకు 9000200117 వాట్సాప్ ద్వారా సంప్రదించగలరు.

Address

Kalabhairava Guru Sansthan Mutt Godavari River Bund
Hyderabad
500104

Opening Hours

9am - 5pm

Telephone

09000200117

Alerts

Be the first to know and let us send you an email when KalabhairavaTemple posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to KalabhairavaTemple:

Shortcuts

Share

Category