13/11/2022
ఒక మంచి సినిమా
ఓ తండ్రి తీర్పు
తీస్తున్నందుకు సంతోషంగా ఉంది.
సంపూర్ణ సహకారం
అందిస్తున్న రమణ
లవ్ యూ
... ✍️
రాజేంద్ర రాజు కాంచనపల్లి
రారాజు టీవీ.
for poets & writers
13/11/2022
ఒక మంచి సినిమా
ఓ తండ్రి తీర్పు
తీస్తున్నందుకు సంతోషంగా ఉంది.
సంపూర్ణ సహకారం
అందిస్తున్న రమణ
లవ్ యూ
... ✍️
రాజేంద్ర రాజు కాంచనపల్లి
రారాజు టీవీ.
21/10/2022
ఎడిటోరియల్ పేజీలో నా కవితను ప్రచురించి
అమరులైన పోలీసులకు నివాళులు అర్పించడానికి అవకాశం కల్పించిన ఆదాబ్ హైదరాబాద్
సంపాదకులకు కృతజ్ఞతలు.
🕉️🙏
(THANK YOU RAMANA )
🤗💐
తాను చీకటై...
ఇంకొకరికి వెలుగై...
---**----
పిడికెడు గుండెను ఫిరంగి గా
శరీరాన్ని రణరంగంగా
కుటుంబానికి దూరంగా
ప్రజల ధన మాన ప్రాణ రక్షణే ధ్యేయంగా
అనునిత్యం జీవితం
అంకితం చేస్తున్నది ఎవరు...?
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లక్ష్యంగా
సృష్టి ధర్మాన్ని శరీర ధర్మాన్ని త్యాగం చేసి మరీ
ఒంటరి పోరాటం చేస్తున్నది ఎవరు...?
ప్రధాన ద్వారమై
ఇంటింటికి కాపలా కాస్తూ....
అప్రధానంగా మిగిలిపోతున్నది ఎవరు...?
జీతమై కుటుంబానికి
జీవితమై సమాజానికి
హారతి కర్పూరమై ఆరిపోతున్నది ఎవరు...?
బయటకు వెళ్ళటమే కానీ
ప్రాణాలతో తిరిగి వచ్చే
హామీ లేని జీవితం ఎవరిది...?
అభయహస్తమై
బహువచనానికి భరోసానిస్తూ...
ఏకవచనమై
ఏకాకిగా రాలిపోతున్నది ఎవరు...?
విసిరిన రాళ్లకు పగిలిన తలలై
మందుపాతర లో మాంసపు ముద్దలై
పోరు భూమిలో నెత్తురై ఇంకిపోతున్నది ఎవరు....?
నువ్వు ఎన్నటికీ గమనించని నీడగా
నీకు తోడుగా నడుస్తున్నది ఎవరు...?
తానే లేకుంటే...
నీ అడుగు ఎక్కడ...?
నీ కుటుంబం, ఈ సమాజం ఎక్కడ...?
చరితలకెక్కని వీరుల మరణం
చలించి చూడు ఒక్కక్షణం
ఉన్నది ఒక్కటే జీవితం
అది ప్రజల కోసమే అంకితం
పోతే రానిది ప్రాణం
అది ఇవ్వడానికే సిద్ధం.
*** *** *** *** ***
*RAJENDER RAJU KANCHANAPALLY*
9849 22 6423
***
16/10/2022
ఉంటారు కొందరు అలా
ఆకాశానికి చేరువై....
అనుబంధానికి దూరమై...
లవ్ యు ఉత్తేజ్ అన్న
🤗🥰
పద్దూ.....
ఎలా ఉన్నావు...
నేను ఉన్నాను...అంతే!!
ఈరోజు దసరా...అట.,
పొద్దున్నే లేచి,
పట్టుచీర కట్టుకుని,
ఎర్రని కుంకుమబొట్టుతో ఉండే నిన్ను
చూసి
అందరూ
అమ్మవారిలా ఉంటావు
అనే వారు....
ట్రైన్ లో వెళ్లెప్పుడు..
పెళ్ళిళ్లల్లో...
కొలకలూరు విఖనసస్వామి
మొదలు...
అందరూ.......కదా...!!
ప్రతీ పండుగ ఎంత
అందంగా. మరెంత కమ్మగా
జరిగేది కదా!!
నీతో పాటే పండుగలు..
సమిష్టి భోజనాలు...మిస్ అయ్యాయి...
ఈ నవరాత్రులు అమ్మవారిని
అలంకరించేదానివి..
అందర్నీ పిలిచి వాయనాలు.
ఏంటో....నిజమా పద్దు..
నువ్వు.లేవా.....
అరకొరగా ఉండే మన ఆర్థిక పరిస్థితిచూసి, ఏదో ఒకటి చేస్తూ,, వేడినీళ్లకు చన్నీళ్ళలా ఇంటిని కాపాడుతూ....
అలసిపోకుండా . ఢిల్లీ, బొంబాయి..ఉప్పాడలు తిరుగుతూ... చీరలు తెచ్చి
బొటిక్.. నడుపుతూ కొన్నాళ్ళు....
మయూఖ యాక్టింగ్ స్కూల్ ని...మొత్తం భుజాలపై వేసుకుని, పిల్లలందరికీ అన్నం వండిపెడుతూ...
అలిసిపోని ప్రయాణం చేసి, చేసి...నీలోంచి నిన్ను
ఒలిచి పెట్టీ పెట్టీ...పెట్టీ..
ఉన్నట్టుండి మాయమయ్యావ్.....
నువ్వు లేవు..నవ్వు లేదు.
ఇంటికి తోరణం.లేదు
గడపకు పసుపులేదు
ఇంటిముందు ముగ్గులేదు
దేవుడిముందు ప్రమిద లేదు
కమ్మని ముద్ద లేదు......
ఇంకొంచం తిను మాట లేదు.
కుటుంబ వ్యవస్థ లేదు...
ఒక్కదానివే కదా.
ఇన్ని పట్టుకెళ్ళావా..
నువ్వంటే "ఇన్నా...."
స్త్రీ అంటే...ఇన్నింటి కలపోతా....????
నీలో అమ్మని,
అమ్మ వారిని... చూస్తూ....
నీకోసం...నీలాంటి వారికోసం
నేను రాసిన
కవిత చదువు....
అర్ధరాత్రి నిన్ను లేపి మరీ
చదివి వినిపించే వాణ్ణి..
ఇంకేం పడుకుంటాం లే
అని ఇద్దరం coffee తాగుతూ
కబుర్లు......తెల్లారేదాకా
కదా!!!!
నాకు ఫిల్టర్ కాఫీ
పెట్టడం రావట్లేదు పద్దూ..
ఒక్కటీ నేర్పలేదు నువ్వు..
మిస్సింగ్ యూ పద్దు...
"నవ"నవోన్మేష దుర్గలు
💃💃💃
💃💃💃
💃💃💃
బేల తనాల్లోంచి,
అమాయకత్వాల్లోంచి,
పిరికితనాల్లోంచి,
వంటింటి కుందేళ్లలోంచి,
పని మనుషుల్లోంచి,
పిల్లల్నికనే యంత్రాల్లోంచి,
మాట పెకలని శిలాజాల్లోంచి,
నిర్బంధపు ఒంటరితనాల్లోంచి,
నిశ్శబ్దపు ఏకాంతోల్లోంచి,
నాల్గు గోడల గోడుల్లోంచి,
వత్సరాల ...
ఆరాట పోరాటాల్లోంచి,
వ్యక్తిత్వాల పదును పెట్టుకుంటూ,
తమ భుజాన్ని తామే తట్టి,
తమని తామే మేలుకొలిపి,
తమకి తామే ఊతమై,
బలోపేతమై....
తమ ' గుండె గర్భం" లో
పిండ దశనుంచీ తమని తామే, మళ్ళీ పెంచుకుని
సరికొత్త జవసత్వాల నింపి,
రక్తమాంసాల ఒడ్డి,
తమని తాము
మళ్లీ "కని"పెంచుకుని,
కనిపెట్టుకుని.......
ధీర వనితలుగా,
ఆవిర్భవించి...
నవజీవన ప్రస్థానంలో..
"నవ"నవోన్మేష దుర్గలై..
అపర ఛoడికలై...
చైతన్య దీప్తులై..
నిరంతర వాహినులై,
శక్తి పీఠాలై...
వర్ధిల్లుతూన్న..
ఆకాశమంత మనస్సులకు..
భూలోకమంత ఓపికలకు..
ధీటురాళ్లకు..
మైలు రాళ్లకు..
ఆడవాళ్లకు...
అమ్మలకూ..
విజయదశమి శుభాకాంక్షలు
🌹🌹🌹🌹🌹
శుభమ్... జయమ్..
........ఉత్తేజ్🙏
30/08/2022
https://youtu.be/Ed2M0shd7ts
లింకు టచ్ చేయండి.
మధురమైన పాట ఆస్వాదించండి.
మమతలు వేయిగా..
పెనవేయి నన్ను తీయగా....
https://youtu.be/Ed2M0shd7ts
పెనవేయి నన్ను తీయగా....💞SUBSCRIBE RARAJU TV SONGS...✍️ కాంచనపల్లి రాజేంద్ర రాజు 9849226423..💞 అక్షరం వేటూరి సుందర రామ్మూర్తిస్వరం కాంచనపల్లి రాజేంద్ర రాజుRARAJU TV SINGSMELODIES...
18/08/2022
https://youtu.be/lafKe4GmHeQ
అంకితం నీకే అంకితం
నూరేళ్ళ నా జీవితం
💞
ఈ లింకు టచ్ చేయండి
మైండ్ ఫ్రెష్ అయ్యే మంచి పాట వినండి
https://youtu.be/lafKe4GmHeQ
అంకితం నీకే అంకితం... 💞... RARAJU TV SONGS ♥️ కాంచనపల్లి రాజేంద్ర రాజు 💐 మన పాటలు మన ప్రేమ కోసం💞 అక్షరం దాసరి నారాయణరావు💐 స్వరం కాంచనపల్లి రాజేంద్ర రాజు9849 22 6423
06/08/2022
తనివి తీరలేదే... 💞 నా మనసు నిండలేదే... 💞
https://youtu.be/Gdp_HmQda9U
ఈ లింక్ ని క్లిక్ చేయండి 💞
29/07/2022
https://youtu.be/OMZBq17mHKI
ఈ లింకు టచ్ చేయండి
అక్షరం.. సినారె.
స్వరం.... రారాజే.
♥️
RARAJU TV.
మనసే జతగా పాడిందిలే....♥️ RARAJU TV SONGS 💐 కాంచనపల్లి రాజేంద్ర రాజు 9849 22 6423. 🕉️
19/07/2022
https://youtu.be/7NrPozripXo
పైన లింకు టచ్ చేయండి
పరవశించి పోయే పాట వినండి 🥰💐
ఇదే ఇదే నేను కోరుకుంది... ఇలా ఇలా చూడాలని ఉంది... 🥰... ఒక మనసైన పాట మనసారా... SUBSCRIBE RARAJU TV 💐💐
16/04/2021
https://youtu.be/Aubgph_eLlM
రోజు...
100 వీడియోలు
1000 మెసేజ్ లు
కానీ.,
ఈ ఒక్క వీడియో చాలు
అదే పదివేలు
తప్పక చూడండి.
don't Miss...
రారాజు టీవీ
ఒక సామాజిక బాధ్యత
ఈ ఒక్క వీడియో చాలు....అదే పదివేలు... THANK YOU DR. BHARATHI GARU. రారాజు టీవీఒక సామాజిక బాధ్యత.
13/02/2021
https://youtu.be/JQWkkLDQG7g
*రేపే మన మహాసభ*
✍️🕉️
*మాకు టీవీ నగర్ కావాలి*
అంటూ టీవీ కార్మికుల పక్షాన కదం తొక్కుతూ...
14-2-2021నాడు 10 గంటలకు శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో ప్రథమ నివేదన సభకు సమాయత్తం అవుతున్న
*ప్రముఖ కవి రచయిత టెలివిజన్ రచయితల సంఘం అధ్యక్షులు*
*నాగబాల సురేష్ కుమార్*
వ్యవస్థాపక అధ్యక్షులు
టెలివిజన్ ఫెడరేషన్
U R WELCOME 🙏 TV INDUSTRY FIRST NIVEDANA SABHA ON 14.2.2021✍️ RARAJU TV U R WELCOME 🙏 TV INDUSTRY FIRST NIVEDANA SABHA ON 14.2.2021✍️ RARAJU TV
03/01/2021
https://youtu.be/SGxMmOAHyRM
యూట్యూబ్ లింక్ ఓపెన్ చేయండి
☝️
COME WITH ME...
🕉️
అలా యాదగిరి గుట్ట మెట్ల నిర్మాణం చూస్తూ... స్వామివారిని దర్శించుకుందాం
COME WITH ME యాదగిరిగుట్ట మెట్ల నిర్మాణం చూస్తూ..నాతో కలిసి నడుస్తూ అనుభూతి చెందండి..🕉️రాజేంద్ర రాజ COME WITH MEయాదగిరిగుట్ట మెట్ల నిర్మాణం చూస్తూ..నాతో కలిసి నడుస్తూ..... అనుభూతి చెందండి..🕉️రాజేంద్ర రాజు