BhimArmy Telangana

Call Directions Contact the organization

BhimArmy Telangana BhimArmy Telangana

11/10/2026
11/10/2026

06/10/2026

బాబాసాహెబ్ ఆశయాలే మార్గంగా…

సామాజిక న్యాయమే లక్ష్యంగా…
బహుజన రాజ్యాధికారమే గమ్యంగా…
పోరాటమే పునాదిగా… బహుజన సేవే ధ్యేయంగా…

ఉద్యమ బాటలో నిరంతర స్ఫూర్తిగా,
భీమ్ ఆర్మీ బలోపేతానికి అంకితమై,
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జ్‌గా
ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న

**శ్రీ మాచర్ల ప్రకాష్ గారికి

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! 💐🎂**

-వనం మహేందర్
జాతీయ ఉపాధ్యక్షులు – భీమ్ ఆర్మీ

06/10/2026

తెలంగాణ రాష్ట్రంలో దళిత మహిళపై కాంగ్రెస్ నేత దాడి దారుణం!
అమర్నాథ్ గౌడ్‌పై తక్షణమే ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి!
- భీమ్ ఆర్మీ జాతీయ ఉపాధ్యక్షులు వనం మహేందర్ హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో గ్రామసభ ప్రాంగణంలోనే.. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు అమర్నాథ్ గౌడ్, బాధ్యతాయుతమైన దళిత మహిళా VOA మాధవి గారిపై భౌతిక దాడికి పాల్పడి, జుట్టు పట్టుకుని లాగి అరాచకం సృష్టించడాన్ని భీమ్ ఆర్మీ జాతీయ కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.

ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక దళిత మహిళకు, అదీ ప్రభుత్వ యంత్రాంగం సమక్షంలో నిర్వహించే గ్రామసభలోనే రక్షణ లేకపోవడం అత్యంత శోచనీయం. అధికార మదంతో ఒక దళిత మహిళా ఉద్యోగిపై నడిరోడ్డుపై దాడి చేస్తుంటే, ఇది ప్రజాపాలన అనుకోవాలా లేక దళితులపై సాగుతున్న అణచివేత అనుకోవాలా?

జాతీయ స్థాయ

23/09/2026

అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో బెయిల్ ప్రక్రియ కోసం వెళ్లిన ఒక న్యాయవాది పట్ల సదరు సీఐ, ఏఎస్ఐ, కానిస్టేబుళ్లు ప్రవర్తించిన తీరు తీవ్ర దిగ్భ్రాంతికి, ఆగ్రహానికి గురిచేస్తోంది.

స్టేషన్ లోపల జరుగుతున్న అక్రమాలను, అన్యాయాన్ని రికార్డ్ చేయడానికి ప్రయత్నించిన లాయర్‌పై భౌతిక దాడికి దిగడం, తీవ్రంగా దుర్భాషలాడటం చట్టాన్ని దారుణంగా ఉల్లంఘించడమే. చట్టాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఒక న్యాయవాదికే పోలీస్ స్టేషన్‌లో రక్షణ లేకపోతే.. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి?

ప్రజా పాలన అని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ, రాష్ట్ర డీజీపీ గారూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? పోలీస్ స్టేషన్లను ప్రజా రక్షణ కేంద్రాలుగా నడుపుతున్నారా లేక రహస్య స్థావరాలుగా మార్చారా అని భీమ్ ఆర్మీ తరఫున నిలదీస్తున్నాం.

'పరమ్‌వీర్ సింగ్ సైనీ వర్సెస్ బల్జీత్ సింగ్ (2020)' కేసులో ప్రతీ పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ క�

22/09/2026

जमुई में एक बच्ची पर हुआ अत्याचार अत्यंत दर्दनाक और निंदनीय है। हम इस जघन्य अपराध की कड़े शब्दों में निंदा करते हैं। यह घटना बिहार में कानून-व्यवस्था और महिलाओं की सुरक्षा की वास्तविक स्थिति को दर्शाती है। आरोपी चाहे कितना भी प्रभावशाली क्यों न हो, उसे सख्त से सख्त सजा मिलनी चाहिए।

यहां हमारा मुख्यमंत्री सम्राट चौधरी जी से एक सीधा सवाल है!

अतीत में उपमुख्यमंत्री रहते हुए उन्होंने बड़ी आक्रामकता के साथ कहा था: "बिहार में आधी रात 12 बजे भी कोई भी व्यक्ति निडर होकर शांति से अपने गांव जा सकता है। अगर उस समय कोई उन पर हाथ उठाता है (नुकसान पहुंचाता है)... तो अगली सुबह तक सम्राट चौधरी अपने पद से इस्तीफा दे देंगे।" उन्होंने यह शपथ ली थी।

इतनी बड़ी-बड़ी बातें करने वाले सम्राट चौधरी जी आज खुद राज्य के मुख्यमंत्री के पद पर विराजमान हैं।

इसलिए हमारा सवाल बहुत सीधा है— "सम्राट चौधरी जी.. उस दिन आपने जिस इस्तीफे का वादा किया था, वह पत्र कहां है?"

कानून-व्यव

Address

Telangana
Hyderabad
500048

Telephone

+919908170170

Website

Alerts

Be the first to know and let us send you an email when BhimArmy Telangana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to BhimArmy Telangana:

Shortcuts

Share