07/10/2026
అంగన్వాడీల్లో కనీస సౌకర్యాలు కరువు — అధికారులు వెంటనే స్పందించాలి: పగిడాల శ్రావణి
కొల్లాపూర్ నియోజకవర్గం | కోడేరు మండలం | నర్సాయిపల్లి
నర్సాయిపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పగిడాల శ్రావణి సందర్శించారు. అంగన్వాడీ వర్కర్లు, టీచర్లను కలిసి అక్కడ నెలకొన్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
అంగన్వాడీ కేంద్రంలో కనీసం టాయిలెట్ సౌకర్యం కూడా లేకపోవడంతో టీచర్లు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
అదేవిధంగా, ప్రహరీ గోడ లేకపోవడంతో చిన్నారులు రోడ్డుపైకి పరుగులు తీస్తున్నారని, ఏ క్షణంలోనైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
“చిన్నారుల భద్రతకు కనీస ప్రాధాన్యత కూడా ఇవ్వకుండా ప్రభుత్వం ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తుంది? అంగన్వాడీ కేంద్రాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత.”
ఈ సమస్యలను ఇప్పటికే అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన స్పందన లేకపోవడం బాధాకరమని పగిడాల శ్రావణి అన్నారు.
చిన్నారుల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నర్సాయిపల్లి అంగన్వాడీ కేంద్రానికి టాయిలెట్, ప్రహరీ గోడతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.
— పగిడాల శ్రావణి
కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్
తెలంగాణ రక్షణ సేన (TRS)