TRS Party

Directions

TRS Party Official Account Of TRS Party - Telangana Rakshana Sena
Founded By Kalvakuntla Kavitha

25/10/2026

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భూమి కోల్పోయి, పరిహారం అందక ఆందోళన చేస్తున్న రైతు నర్సింహులుపై జడ్చర్ల ఎస్సై దాడి చేయడాన్ని తెలంగాణ రక్షణ సేన నాయకులు తీవ్రంగా ఖండించారు. బాధిత రైతును పరామర్శించి, ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా గద్వాల్ నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్ గారు మాట్లాడుతూ, ఉద్దండాపూర్ నిర్వాసితులకు ఎకరానికి ₹20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతు నర్సింహులుపై దాడికి బాధ్యుడైన ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

25/10/2026

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భూమి కోల్పోయి పరిహారం అందలేదని ఆందోళన చేసిన రైతు నర్సింహులుపై జడ్చర్ల ఎస్సై దాడిని తెలంగాణ రక్షణ సేన నాయకులు ఖండించారు. బాధిత రైతును పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఉద్దండాపూర్ నిర్వాసితులకు ఎకరానికి ₹20 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ, నర్సింహులుపై దాడికి బాధ్యుడైన ఎస్సైపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ల రంజిత్ కుమార్, నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జి గవినోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు కామెర నవీన్ కుమార్, జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు బుచ్చిబాబు, జడ్చర్ల నాయకుడు బీర్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

25/10/2026

కాంగ్రెస్ పార్టీ చెరువులు మాయం చేస్తుంటే, హైడ్రా పేరు మీద పేదలను కొట్టి, పెద్ద కార్పొరేట్ కంపెనీలను కాపాడుతుంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్‌ఎస్ పార్టీ నోరు తెరవడం లేదు.

తేలు కుట్టిన దొంగల్లా అణిగిమణిగి ఉంటున్నారు. ఎందుకంటే అవినీతిలో ఆ పార్టీకి కూడా వాటా ఉంది కాబట్టి.

ప్రజల పక్షాన, ప్రజా సమస్యలను ఎత్తుకొని పోరాడేది కేవలం తెలంగాణ రక్షణ సేన పార్టీ మాత్రమే

25/10/2026

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు, ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో మనకు అనుభవమే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల ఎట్లాంటి నిరంకుశ వైఖరితో వ్యవహరిస్తుందో మనం చూస్తున్నాం.

ఈ పరిస్థితుల్లో కొత్త నాయకత్వంతో, ఉచిత విద్య, వైద్యం వంటి పాంచజన్య హామీలతో పేదల గొంతుకగా తెలంగాణ రక్షణ సేన ముందుకొచ్చింది. ఇప్పటికే అనేక ప్రజా సమస్యలపై కొట్లాడి, వాటి పరిష్కారం కోసం కృషి చేసి సాధించాం

ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనందరి బలం తోడైతే, కల్వకుంట్ల కవిత గారు నియమించిన టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి డా. నలమాస శ్రీకాంత్ గౌడ్ గారిని గెలిపిస్తే, ప్రజల పక్షాన మరింత గట్టిగా కొట్లాడుతాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా ముందుకు సాగుతాం.

గిరిజన ఆడబిడ్డల బతుకులు రోడ్డున పడేసిన రేవంత్ రెడ్డిఅడవి బిడ్డలకు ఉపాధి కల్పించే జీసీసీని పక్కనపెట్టి, కమిషన్ల కోసం గిరి...
25/10/2026

గిరిజన ఆడబిడ్డల బతుకులు రోడ్డున పడేసిన రేవంత్ రెడ్డి

అడవి బిడ్డలకు ఉపాధి కల్పించే జీసీసీని పక్కనపెట్టి, కమిషన్ల కోసం గిరిజన ఉత్పత్తుల సరఫరా కాంట్రాక్టును రాష్ట్రంలో ఎలాంటి తయారీ యూనిట్లు లేని ఏపీ మాజీ మంత్రి బంధువు కంపెనీకి కట్టబెట్టిన రేవంత్ రెడ్డి.

దీంతో జీసీసీ సంస్థ మీద ఆధారపడిన అనేకమంది గిరిజన మహిళలు రోడ్డున పడ్డారు.

25/10/2026

బిర్యానీ, ఇరానీ చాయ్, ముత్యాలకు ప్రసిద్ధిగాంచిన మన హైదరాబాద్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం దోమలకు ప్రసిద్ధిగా మార్చేసింది.

24/10/2026

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని మియాపూర్‌లో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన "టీఆర్ఎస్ రాజధాని రణభేరి సభ"లో రణభేరి మోగించిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు.

24/10/2026

కనీసం మంచినీళ్ళు ఇవ్వలేనోళ్ళు విశ్వనగరం అని ప్రచారం చేసుకుంటున్నాం.

పేద విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వానికి పట్టింపు లేదా?గురుకులాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన పాలకులు,...
24/10/2026

పేద విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వానికి పట్టింపు లేదా?

గురుకులాలను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన పాలకులు, కనీసం విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లను కూడా సకాలంలో ఇవ్వలేని స్థితిలో ఉంది.

24/10/2026

హైదరాబాద్ లో చెత్త ఎత్తే బండ్ల వాళ్లను కూడా రేవంత్ రెడ్డి వదలటం లేదు.. రామ్ కీ సంస్థకు కాంట్రాక్ట్ కోసం వీరిని బలి చేయాలని చూస్తున్నాడు

ఎట్టి పరిస్థితుల్లో వాళ్లకు అన్యాయం జరగనివ్వం. వారికి ఏదైనా జరిగితే ముఖ్యమంత్రి ఇంటి ముందు చెత్త తీసుకెళ్లి వేస్తాం.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when TRS Party posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share