11/11/2024
కర్కషులు కళలపై
అక్కసుతో వెక్కిరింతలు చేసి
అవమాన పరిచి అనిచేసిన
మనసు ముక్కలు చేసుకోకుండా
తొక్కిన చోటే అక్కున చేర్చునేలా
అస్తమించాడనుకుని ఆదమరచిన....
చీకటిలోకి తోషామనుకుని భుజాలెగురేసిన....
కఠినాత్ములా గుండెల్లో..... చిటికె-కోలై
సూర్యుడనే డప్పుల కొలిమిపై
అణిచివేతనే హృదయ భారాన్ని
కనకణమండే డప్పుసప్పుడై ఉదయించి డప్పాకారుడా !!!!
సావు సన్నాయికే పరిమితం చేసిన
డప్పుసప్పుడును
గల్లీ నుండి డిల్లీకి - అటునుండి
విశ్వవేదికలపై దర్శనం ఇచ్చేలా చేసి,
డప్పు దరువులకే ప్రపంచం
పట్టాభిషేకం చేసే స్థాయికి తీసుకెళ్లిన మా....
జాతీయ ఉత్తమ ఉస్తాద్ బిస్మిల్లాఖానుడా
డప్పు సూర్యుడా అందె భాస్కరుడా
నీకు నీల్ సలాం 💐🙏✊
