‘ జస్టిస్ ‘ కేజీ బాలకృష్ణన్ గారికి తన నివేదికను సమర్పించిన ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ గారు...
MRPS4India
founded on July 7, 1994, under the visionary leadership of Padma Shri Manda Krishna Madiga Garu.
Committed to the cause of social justice and reservation categorization.🏴l✊
27/05/2026
‘ జస్టిస్ ‘ కేజీ బాలకృష్ణన్ గారికి తన నివేదికను సమర్పించిన ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ గారు...
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చేత నియమించబడినటువంటి ప్రత్యేక కమిటీ చైర్మన్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారికి న్యూడిల్లీలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ‘ పద్మశ్రీ ‘ మందకృష్ణ మాదిగ గారు తన నివేదికను సమర్పించడం జరిగింది.
200 పైగా పేజీలతో కూడిన ఈ నివేదికలో దళిత క్రైస్తవులకు సంబంధించిన విద్యా,వైద్య, సామాజిక ,సాంస్కృతిక , ఆర్థిక పరిస్థితులను పేర్కొంటూ వారికి ఎస్సీ హోదా మరియు రాజ్యాంగ హక్కులను కల్పించాలని కమిటీకి MRPS తరుపున విజ్ఞప్తి చేశారు.
అలాగే 1950 రాష్ట్రపతి ఉత్తర్వులు మరియు సామాజిక వివక్షత , రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఇతర అంశాలు ,కుల వ్యవస్థ ప్రభావం మొదలగు అంశాలను ఈ నివేదికలో పొందుపరిచి సుదీర్ఘ కాలంగా నలుగుతున్న సమస్య పరిష్కారం కోసం కమిటీ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టడం జరిగింది.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)
26/05/2026
గౌరవపూర్వక కలయిక..
డిల్లీలో భారత సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారిని వారి నివాసంలో MRPS అధినేత ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ గారు గౌరవ పూర్వకంగా కలవడం జరిగింది.
వారికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది.
గతంలో సుప్రీం కోర్టులో చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ క్షేత్రస్థాయి నుండి డిల్లీ స్థాయి వరకు వివిధ దశల్లో MRPS ఉద్యమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రత్యేక నివేదికను గవాయి గారికి అందజేయడం జరిగింది.
చీఫ్ జస్టిస్ గా సుప్రీం కోర్టులో బెంచ్ మీద వాదనలు వింటున్న బిఆర్ గవాయి గారి మీద ఒక అగంతకుడు బూటు విసిరి దాడికి పాల్పడడం జరిగింది.
దళిత సామాజిక వర్గానికి చెందిన జస్టిస్ BR గవాయి గారి మీద జరిగిన దాడిని నిరసిస్తూ ‘ పద్మశ్రీ ‘ మంద కృష్ణ మాదిగ గారు జాతీయ స్థాయిలో దళిత ఆత్మగౌరవ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది.
ఆ పోరాటంలో భాగంగా తహశీల్దార్ కార్యాలయల ముందు ఆందోళనలు, కలెక్టర్ల ముట్టడి , అలాగే వేలాది మందితో హైదరాబాద్ లో దళిత ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించడం జరిగింది.
ఆ తరువాత నవంబర్ 17 న డిల్లీలో పెద్ద ఎత్తున దళిత ఆత్మగౌరవ ప్రదర్శన చేపట్టడం జరిగింది.జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున మహాధర్నాను నిర్వహించడం జరిగింది.
జాతీయ స్థాయిలో జరిగిన ఈ దళిత ఆత్మగౌరవ ఉద్యమ ఘట్టాలను ప్రత్యేక డాక్యూమెంట్ గా రూపొందించడం జరిగింది.
ఆ నివేదికను మంద కృష్ణ మాదిగ గారు బిఆర్ గవాయి గారికి అందించడం జరిగింది.
ఈ సందర్భంగా వివిధ సామాజిక అంశాల మీద వారు చర్చించుకోవడం జరిగింది.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి -( MRPS)
🇮🇳❤️
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Website
Address
500003, Secunderabad
Hyderabad
500003
