Aisf-Aiyf Long-March

Aisf-Aiyf Long-March

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Aisf-Aiyf Long-March, Political organisation, amrutha stress 407, Hyderabad.

Photos from Aisf-Aiyf Long-March's post 06/09/2024

Today's news

28/08/2024

అఖిల భారత విద్యార్థి సమైక్య రెండు సంవత్సరాల నిరంతరం బడుగు బలహీన విద్యార్థుల కోసం అలుపెరుగని పోరాటాలు తెలంగాణ రాష్ట్రంలో చేస్తూ. విద్యార్థుల పట్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అన్యాయం చేస్తే ఊరుకున్న ప్రసక్తే లేదు అని తెలియజేస్తూ ఈ రెండు సంవత్సరాల కాలం పాటు తమ ప్రాణాలు లెక్కచేయకుండా నిరంతరం పోరాడుతూ విద్యార్థులకు న్యాయం చేస్తున్నా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కసిరెడ్డి మణికంఠ, పుట్ట లక్ష్మణ్ వాళ్లకు విప్లవాభి వందనాలు తెలియజేస్తున్న

అఖిల భారత విద్యార్థి సమైక్య నాగర్కర్నూల్ జిల్లా సమితి

Photos from Aisf-Aiyf Long-March's post 17/08/2024

News clips

Photos from Aisf-Aiyf Long-March's post 17/08/2024

తెలకపల్లి

అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలి.

దేశాన్ని పరిపాలించడంలో మోడీ విఫలం.

మహిళలపై ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలను అరికడదాం......

ర్యాగింగ్ ఇవ్ టీజింగ్ గ్యాంగ్ మానభంగం నశించాలి....

*ప్రభుత్వ హైస్కూల్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేసి ధర్నాకు దిగిన అఖిల భారత విద్యార్థి సమైక్య, యువజన సమైక్య నాగర్ కర్నూల్ జిల్లా సమితి*

*ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, ఏఐవైఎఫ్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు దేశముని ఆంజనేయులు మాట్లాడుతూ*

*ఇతర దేశాలు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే ఏమన అఘాయిత్యానికి పాల్పడితే ఆ దేశంలో యువకులని ఏ విధంగా శిక్షిస్తారో అదే విధంగా మనదేశంలో కూడా శిక్షించాలి*

*ఈ ఘటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిండితులకు అనుకూలంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిండితుని కఠినంగా శిక్షించాలి*

మొన్న కోల్కత్తాలో ఒక పీజీ చేస్తున్న అమ్మాయిని మానభంగం చేసి చంపారు ఆమెని ఎక్కడో ఉంటే చేయలేదు ఆమె వర్క్ ప్లేస్లో చేశారు పీజీ అంటేనే చాలా పని ఉంటుంది ఒక్కోసారి కంటిన్యూగా 36 గంటలు డ్యూటీ కూడా ఉంటుంది ఆమెను ఎంత దారుణంగా రేప్ చేసి చంపారో పోస్ట్ మార్టం రిపోర్ట్ లో చదివితే తెలుస్తుంది ఆమె రెండు కాళ్లు 90 డిగ్రీలు అటూ ఇటూ లాగేశారు ఈ పని చేయడానికి కనీసం ఇద్దరూ కావాలి స్కల్ మీద చాలా ఫ్రాక్చర్స్ ఉన్నాయి కళ్లద్దాలు పగిలి గాజు ముక్కలు కంట్లోకి వెళ్లాయి వెన్నుముక విరిగిపోయింది ఇది కామ వాచకం చేసినట్లు లేదు అత్యాచారం దారుణంగా హింసించి పాశవిక ఆనందాన్ని పొందుతూ చేసిన పూతకం రిపోర్ట్ లో 150 సెమెన్ వీర్యం ఉన్నట్లు నిర్ధారించారు ఇది ఒక్కటి పని కాదు కచ్చితంగా ఇంకొకరు ఇద్దరు ముగ్గురు ఉండే ఛాన్స్ ఉంది ఇప్పటివరకు ఒక్కడే దొరికాడు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజీనామా చేస్తే మమతా బెనర్జీ ప్రభుత్వం అతనికి వెంటనే వేరే పోస్టింగ్ ఇచ్చింది ఒక్కడినే పట్టుకోవడం వల్ల కొంతమందిని సేవ్ చేసినట్లు కనిపిస్తుంది ఇప్పుడు ఒక్కసారిగా దేశం మొత్తం స్పందించింది డాక్టర్లతో పాటు సామాన్యులు కూడా ప్రాణాలు బతికించే డాక్టర్ని అదే హాస్పిటల్లోనే చిత్రహింసలు పెట్టి గోరాతి ఘోరంగా రేప్ చేసి చంపినారు ఇదే నా స్వాతంత్ర భారత స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా ఆడపిల్లలకు రక్షణ కల్పించలేనిది స్వతంత్రం అందరూ మహిళా చట్టాలు అని వచ్చిన ఏమీ లాభం మహిళలకు రక్షణ లేని చట్టాలు ఎందుకు. డాక్టర్ అమ్మాయి దేశంలో పుట్టాలి అంటే పుణ్యం చేసుకోవాలి అంటారు కానీ మీరు ఇక్కడ పుట్టి కర్మ చేసుకున్నారు తల్లి నిన్ను హత్య చేసిన దుర్మార్గులను కఠినంగా ప్రభుత్వాలు శిక్ష వేయాలి డిమాండ్ చేశారు,
తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి వీటన్నిటిని నిర్మూలించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఒక్క చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు కల్పన శిరీష మధు శేఖర్ హై స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

14/08/2024

Photos from Aisf-Aiyf Long-March's post 13/08/2024

*ప్రచురణార్థం*:
*13/8/2024*
*నాగర్ కర్నూల్*
*ప్రజాస్వామ్యానికి పాతర వేసే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి*
*వలసవాద చట్టాల ప్రతిరూపాలే ఈ క్రూర చట్టాలు*

*ఏ ఐ వై ఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా సమితి డిమాండ్*

మోదీ సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త చట్టాలను 'భారతదేశ చరిత్రలో అత్యంత క్రూరమైన నేర చట్టాలు' అని,ప్రజాస్వామ్యానికి పాతర వేసే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏ ఐ వై ఎఫ్) జాతీయ సమితి పిలుపులో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా సమితి ఆధ్వర్యంలో

*నాగర్ కర్నూల్ ఏఐవైఎఫ్ అధ్యక్షుడు దేశమున ఆంజనేయులు ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ*

అధికార దురహంకారంతోనే కేంద్రం ఇలాంటి చట్టాలు తీసుకొచ్చిందని వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం పార్లమెంటులో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి... బలవంతంగా ఈ చట్టాలను ఆమోదించిందని, ఈ చట్టాల్లో అనేక తిరోగమన నిబంధనలు ఉన్నాయని వారు విమర్శించారు. అర్ధరాత్రి పోలీసు రాజ్యంతో భారతదేశం మేల్కొంటోందని, న్యాయ శాస్త్రానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలకు ఇది విరుద్ధమని, చాలా విస్తృతమైన పరిణామాలు కలిగి ఉంటుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా అనేకమంది న్యాయకోవిదులు, న్యాయవాదులు, విద్యావేత్తలు హడావుడిగా రూపొందించిన మూడు క్రిమినల్ చట్టాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. 17వ లోక్ సభ గడువు కొద్దిరోజుల్లో ముగుస్తుందనగా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎవరో తరుముతున్నట్టు వేగంగా ఆమోదించి జులై 1వ తేదీని అమలులోకి తెచ్చారన్నారు. భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత(బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియామ్ (బీఎస్ఏ) లను....ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్పిసి), ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు బదులు హిందీలో పలికే కొత్తచట్టాలు తెచ్చారన్నారు. ఎలాంటి సంసిద్ధత, చర్చలు జరపకుండా, నిపుణుల న్యాయప్రవీణుల సూచనలుసైతం ఆలకించకుండా నేర న్యాయవ్యవస్థ మొత్తంలో పూర్తి మార్పులు చేశారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వ విధానాలపై 18వ లోక్సభ ఎన్నికలపై తీవ్ర కలవరపరిచి భవిష్యత్లో మరింత దెబ్బకొట్టే విధంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఏమీ జరగలేదన్నట్లుగా బ్రిటీష్ పాలన నాటికంటే మరింత క్రూరమైన చట్టాలను మోదీ ప్రభుత్వం ఆమోదించి అమలులోకి తీసుకువచ్చిందన్నారు.. హిందీ భాషలో ఈ చట్టాలకు పేరుపెట్టే సమయంలోనైనా ఎంత మాత్రం చర్చించలేదన్నారు.

స్వాతంత్రోద్యమంలో నాటి జాతీయ నాయకులను జైళ్లలో పెట్టడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించిన 'రాజద్రోహ' చట్టం అమలును సుప్రీంకోర్టు 2022లో నిలిపివేసిందన్నారు. ఈ చట్టంపై సమీక్ష జరుపుతామనీ కేంద్రం నాడు సుప్రీంకోర్టులో తెలిపింది. కానీ, కొత్త చట్టంలో తిరిగి 'రాజ ద్రోహం' చట్టాన్ని 'దేశ ద్రోహం' పేరుతో తీసుకొచ్చిందన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ప్రజలకు ఉన్న హక్కును హరించి వేయటానికే ఈ చట్టం ఉపయోగపడుతుందన్న విమర్శలు ఎంతో కాలంగా ఉన్నాయన్నారు. అరెస్టు సందర్భంగా నిందితుల చేతులకు బేడీలు వేయటాన్ని పునరుద్ధరించటం సరైంది కాదన్నారు. తప్పనిసరిగా బాధితుల నుండి ఫిర్యాదు అందిన వెంటనే ఎస్ఐఆర్ నమోదు చేయాలన్న ప్రస్తుత నిబంధనను తొలగించడాన్ని పాతకాలపు పోకడలకు దేశాన్ని వెనక్కు తీసుకెళ్లడమేనని వారు ఉద్ఘటించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వాడల బాల పీర్, ఏఐఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు మధు, జిల్లా నాయకులు ప్రకాష్, నవీను, ప్రవీను, తరుణ్, తదితరులు పాల్గొన్నారు

Photos from Aisf-Aiyf Long-March's post 13/08/2024

*నాగర్ కర్నూల్*
*13/08/2024*

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు..

నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భగత్ సింగ్, స్వతంత్ర సమరయోధుల జీవిత చరిత్ర వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బలముల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ 89వ ఆవిర్భ వేడుకలను ఆగస్టు నెల మొత్తం పురస్కరించుకొని ఈ వ్యాసరచన పోటీలు పెట్టడం జరుగుతుందన్నారు. దేశ స్వాతంత్రం కోసం చిన్నవయసులోనే వీరమరణం పొందిన భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని, భారతరత్న అవార్డు ఇవ్వాలని కైలాష్ ప్రభుత్వాన్ని కోరారు. 89 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి ఉద్యమంలో అనేక కార్యక్రమాలు నిర్వహించి దేశంలోనే మొట్టమొదటి విద్యార్థి సంఘంగా, విద్యారంగల సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. వ్యాసరచన పోటీలో 6, 7, 8, 9 తరగతి విద్యార్థులు పాల్గొన్నారు అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు దేశముని ఆంజనేయులు, బాలపీర్, నవీన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

07/08/2024

ప్రజా కళలు పండుగ సందర్భంగా పాఠశాల నుంచి విచ్చేసి విద్యార్థులు తమ కళారూపాన్ని నిరూపించుకున్నందుకు తెలంగాణ ప్రజానాట్యమండలి బహుమతి ఇవ్వడం జరిగింది
కళాకారులం కలుద్దాం సమగ్ర సంస్కృతి విధానం కోరుకుందాం

06/08/2024
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Amrutha Stress 407
Hyderabad