ITDP Medchal

ITDP Medchal

Share

Official page of TDP Medchal Constituency

23/01/2026

మధిర లో ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు 🎉
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, డైనమిక్ యంగ్ లీడర్, ఎపి రాష్ట్ర ఐటి మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఈరోజు స్థానిక టిడిపి కార్యాలయంలో ఘనంగా జరిగాయి.

Photos from ITDP Medchal's post 23/01/2026

యువగళం రథ సారథి, నవతరం నాయకులు నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన తెలుగు దేశం పార్టీ - వంచ శ్రీనివాసరెడ్డి
ఈరోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు వంచ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో యువగళం రథసారథి భావితరాల భవిష్యత్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరులు ఐటి మరియు విద్యాశాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు.

Photos from ITDP Medchal's post 23/01/2026

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు, యువనాయకులు
శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు 23-01-2026 యాద‌గిరిగుట్ట ల‌క్ష్మిన‌ర్సింహ స్వామి దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వహించిన పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింహులు గారు ఇతర టిడిపి రాష్ట్ర నాయకులు

Photos from ITDP Medchal's post 19/01/2026

తెలుగు ప్రజల ఆత్మగౌరవం శ్రీ నందమూరి తారక రామా రావు గారి 30వ వర్ధంతి సందర్భంగా 1997 లో మాజీ మంత్రి, అఖిల భారత NTR అభిమాన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు కీ.శే. శ్రీపతి రాజేశ్వర్ రావు గారు మొదలుపెట్టిన NTR అమర్ జ్యోతి ర్యాలీని నిర్వహించడం జరిగింది. శ్రీ నందమూరి రామకృష్ణ గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా , నందమూరి సుహాసిని గారు, కాట్రగడ్డ ప్రసూన గారు మరియు ఇతర నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.

Photos from ITDP Medchal's post 19/01/2026

ఆదివారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్థంతి కార్యక్రమాన్ని ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా లెజెండరీ బ్లెడ్‌ డొనేషన్‌ అండ్‌ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక`విశ్వవిఖ్యాత నటసార్వభౌమ డాక్టర్‌ నందమూరి తారక రామారావు గారికి ఆత్మీయ నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా శ్రీమతి నారా భువనేశ్వరి గారు మాట్లాడుతూ... తెలుగుప్రజలకు అన్నగా పిలుచుకునే ఎన్‌టిఆర్‌ గారి 30వ వర్థంతి కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. ప్రతి వర్థంతికి ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా లెజెండరీ బ్లడ్‌ డొనేషన్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఎన్‌టిఆర్‌ గారు సేవా భావంతో రాజకీయాలలోకి అడుగుపెట్టడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ను స్థాపించడం జరిగింది. ఈ ట్రస్ట్‌కు మేనేజింగ్‌ ట్రస్టీగా ప్రజలకు సేవలు అందించే కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే అదృష్టం నాకు కలిగింది. ప్రజల అవసరాలను ట్రస్ట్‌ ద్వారా మేము సేవలు అందించడానికి ముందు ఉంటాం. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా సేవలు అందిస్తున్నామంటే దానికి ముఖ్య కారణం దాతలే. కడియాల రాజేందర్‌, మన్‌మీత్‌ సింగ్‌ వంటి ఎంతో మంది దాతల సహకారంతో మేము ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ను ముందుకు తీసుకెళ్లగలుతున్నాం. ఈ దాతలు ఎన్‌టిఆర్‌ గారిపై ప్రేమతో ముందుకు వస్తున్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌కు విరాళాలు ఇస్తే ప్రజలకు అందుతుందనే నమ్మకంతో చేస్తున్నారని అన్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ తరపున బ్లడ్‌ బ్యాంక్‌ కేంద్రాలను హైదరాబాద్‌, తిరుపతి, వైజాగ్‌, రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ తరపున నాణ్యమైన రక్తాన్ని అవసరమైన ప్రజలకు అందిస్తున్నాం. ముందుగా తలసేమియా పిల్లలకు అవసరమైన బ్లెడ్‌ను ఇచ్చిన తరువాతనే ఇతరులకు ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పటి వరకు ఎన్‌టిఆర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా 5 లక్షల బ్లడ్‌ యూనిట్స్‌ను సేకరించడం జరిగింది. ఈ యూనిట్ల ద్వారా 9 లక్షల 18 వేల మందికి ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ తరపున రక్తాన్ని అందించగలిగాం. వ్యక్తిగత జీవితంలో స్థిరపడిన తరువాత ప్రతి ఒక్కరూ ఎంతో కొంత తిరిగి సమాజానికి, దేశానికి ఇవ్వాలనే భావనతో ముందుకు రావాలని ప్రజలందరినీ ఈ సందర్భంగా కొరుతున్నాము. ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మాత్రమే కాకుండా చాలా మంది తమతమ ట్రస్ట్‌ల ద్వారా ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వెళ్తున్నారు. ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ‘‘స్త్రీ శక్తి హస్తకళ’’ ద్వారా మహిళలకు వివిధ చేతి వృత్తులలో కుప్పం నైపుణ్య కేంద్రంలో శిక్షణను ఇచ్చి వారికి ఆర్థికంగా ఉపయోగపడే విధంగా చేస్తున్నాం. హైదరాబాద్‌లో స్త్రీ శక్తి హస్తకళ స్టోర్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు, ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ సీఈవో కె. రాజేంద్రకుమార్‌, సీవోవో అడుసుపల్లి గోపి, ఎన్‌టిఆర్‌ కుటుంబ సభ్యులు గారపాటి శ్రీనివాస్‌, జాతీయ పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, రాష్ట్ర పార్టీ నాయకులు అజ్మీరా రాజునాయక్‌, శ్రీపతి సతీష్‌ కుమార్‌, పోలంపల్లి అశోక్‌, పొగాకు జయరామ్‌చందర్‌, తెలుగుదేశం ప్రకాష్‌రెడ్డి, పార్లమెంట్‌ పార్టీ కన్వీనర్లు కుందారపు కృష్ణాచారి, సంజయ్‌, అమర్‌నాథ్‌, సంధ్యపోగు రాజశేఖర్‌, వేజెండ్ల కిశోర్‌బాబు, ముంజ వెంకట్రాజంగౌడ్‌, సైదేశ్వర్‌ రావు, జనగాం నర్సింగ్‌రావు, సాంబశివ రావు, యాదీలాల్‌, గూడెపు రాఘవులు, జగదీష్‌, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరంలో బసవతారకం ఇండో`అమెరికన్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి మరియు రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వారు..., డాక్టర్‌ కడియాల రాజేందర్‌, డాక్టర్‌ కడియాల విద్య ఆధ్వర్యంలో ఏపీ సూపర్‌స్పెషాలిటీ డెంటల్‌ ఆస్పత్రి తరపున మెగా ఫ్రీ డెంటల్‌ క్యాంపును..., మన్‌మీత్‌సింగ్‌ (సోనూ) ఇన్‌ అసోసియేషన్‌ విత్‌ యోదా డయోగ్నస్టిక్స్‌ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, కన్సల్టేషన్‌, మెడిసిన్‌ అండ్‌ ఈసీజీ..., డాక్టర్‌ అవినాష్‌ ఆధ్వర్యంలో ఓమెగా పిఆర్‌కె, మల్టీస్పెషాలిటీ అండ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి తరపున ఈఎన్‌టి (చెవి, ముక్కు, గొంతు లకు సంబంధించి)..., మంత్రి ఐజయ్య ఆధ్వర్యంలో ‘హియర్‌జాప్‌’ వారి తరపున హియరింగ్‌కు సంబంధించి..., కెఎస్‌ఆర్‌ ఐకేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిటీ ఐ ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలకు సంబంధించి క్యాంపులను ఏర్పాటు చేశారు. లెజెండరీ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపులో రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరినీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు పలకరించారు. అలాగే వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ట్రస్ట్‌ తరపున అవసరమైన వారికి మందులను ఉచితంగా అందించడం జరిగింది.
గత రెండున్నర సంవత్సరాల నుండి మోతీలాల్‌ అధ్యక్షతన మోక్షజ్ఞ. ఓ ఆర్ జి. కర్నూల్ పేరుతో ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ తరపున 30 క్యాంపులను పెట్టి తలసేమియా బాధిత పిల్లలకొరకు 700 మంది రక్తదానం చేయడం జరిగింది.
జగిత్యాలకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పల్లెర్ల సురేందర్‌ ఈ సందర్భంగా రూ.25 వేల విరాళాన్ని ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌కు అందించడం జరిగింది.
మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన ఎన్‌టిఆర్‌ అభిమానులు గన్నేరు తిప్పన నాయకత్వంలో ఎన్‌టిఆర్‌ వర్థంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన అమరజ్యోతి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌లో జరిగిన ఎన్‌టిఆర్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని శ్రీమతి నారా భువనేశ్వరి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌కు పెద్ద ఎత్తున వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తమ సమస్యలను శ్రీమతి నారా భువనేశ్వరి గారికి విన్నవించుకోవడం జరిగింది.
-కె. రాజేంద్ర కుమార్‌ ఐపిఎస్‌(రిటైర్డ్‌)
సీఈవో, ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌.

Photos from ITDP Medchal's post 19/01/2026

అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తాలికోట హరికృష్ణ గారి ఆధ్వర్యంలో నాగారం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
నాగారం లోని ఎన్టీఆర్ విగ్రహానికి ముందుగా నివాళులు అర్పించిన అనంతరం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తాలికోట హరికృష్ణ గారు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ గారు చేసిన సేవలు చిరస్మరణీయమని, పేదల సంక్షేమం, మహిళల గౌరవం, ప్రజల ఆత్మగౌరవమే ఆయన పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు.
ఈ ర్యాలీ లో ముఖ్యంగా ఉమ శంకర్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, సాయి నాగార్జున గారు, మెల్లం శ్రీనివాస్ గారు, బజార్ హేమంత్ గౌడ్ గారు, బ్రహ్మం చౌదరి గారు, బాలకృష్ణ గౌడ్ గారు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

19/01/2026

17/01/2026

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ది:18-01-2026 అనగా రేపు ఆదివారం రోజున ఉదయం 6:00 గం"లకు తెలుగుదేశం పార్టీ
జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా.లోకేష్ గారు హైదరాబాదు లోని ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళులర్పించడం జరుగుతుంది.
కావున గ్రేటర్ హైదరాబాదు లోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులు రేపు ఉదయం 5:30 AM కు ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము🙏

Photos from ITDP Medchal's post 31/12/2025

తేది: 31-12-2025 పత్రికా ప్రకటన
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల మృతి చెందిన ఎన్‌టిఆర్‌ అభిమాని, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, కరీంనగర్‌కు చెందిన కళ్యాడపు ఆగయ్య కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
పొలిట్‌బ్యూరో సభ్యులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు జాతీయ పార్టీ అధ్యక్షులు ప్రకటించిన రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని కళ్యాడపు ఆగయ్య కుమారుడు కళ్యాడపు నరేష్‌, కోడలు కళ్యాడపు రవళి లకు బుధవారం ఎన్‌టిఆర్‌ భవన్‌లో అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా బక్కని నర్సింహులు మాట్లాడుతూ.... కళ్యాడపు ఆగయ్య ఎన్‌టిఆర్‌కు వీర అభిమానిగా, పార్టీలో కార్యకర్తగా క్రమశిక్షణతో పని చేస్తూ ముక్కుసూటిగా మాట్లాడేవారని అన్నారు. ఆయన మృతి ఎవరూ భర్తీ చేయలేరని అన్నారు. జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కళ్యాడపు ఆగయ్య కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారని అన్నారు. ఎన్‌టిఆర్‌ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ప్రజాఅవసరాలకు అనుగుణంగా చంద్రబాబు గారు ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 2014లో 15 మంది ఎమ్మెల్యేలు గెలుపొందగా అలాగే 2018లో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందగా వీరందరినీ కేసీఆర్‌ తమ పార్టీలోకి తీసుకుని తెలుగుదేశం పార్టీయే తెలంగాణలో ఉండకూడదనే విధంగా ఆలోచించిన కేసీఆర్‌కు 2023 ఎన్నికలలో ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. కేసీఆర్‌ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు గారి, తెలుగుదేశం పార్టీ పేరు చెప్పి మళ్లీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
కేసీఆర్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల మనసులలో తెలుగుదేశం పార్టీ ఉందని అన్నారు. పార్టీ వల్ల లబ్ధి పొందిన నాయకులందరూ వెళ్లిపోయినా లక్షా 80 వేల మంది పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగిందని వీరిలో రెన్యూవల్‌ చేసుకున్నవారు తక్కువ మంది ఉండగా కొత్త సభ్యత్వాలు తీసుకున్నవారు ఎక్కువ మంది ఉండటం గమనార్హమని అన్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కావడం ఖాయమని అన్నారు. భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనంతగా ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రజలకు సేవలందిస్తుండటం జరుగుతున్నదని అన్నారు. నారా లోకేష్‌ గారు మొట్టమొదటిసారిగా ‘కార్యకర్తల సంక్షేమ నిధి’ని ఏర్పాటు చేసి, ఇన్సూరెన్స్‌ను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ఈ కార్యక్రమాలను ఇతర పార్టీలు కూడా అనుసరిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసినప్పటికీ పరాయి దేశస్తులు అన్నట్లుగా బీఆర్‌ఎస్‌ నాయకులు తెలుగుదేశం పార్టీని, నాయకులను, కార్యకర్తలను చూపించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. దీనిని కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా తిప్పికొట్టాలని తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ పార్లమెంట్‌ పార్టీ కన్వీనర్‌ వంచె శ్రీనివాస్‌ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు నెల్లూరి దుర్గాప్రసాద్‌, జనగామ నర్సింగ్‌రావు, ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పార్టీ మాజీ ఉపాధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్‌, కరీంనగర్‌ పార్లమెంట్‌ పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి తీగుట్ల రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

22/12/2025

22/12/2025

కాకా నువ్వు బ్యాకా...
ఇంతకి మనది పార్టీనా పార్టీనా?
కాకా ఇంతకి మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీనా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష పార్టీనా...
ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారి పేరు వాడటం కంటే చంద్రబాబు నాయుడి గారి నామస్మరణే ఎక్కువ చేస్తిరి...
పాలమూరులో బాబు గారి వేసిన పునాది రాళ్ళతో ప్రాజెక్టును కట్టోచ్చు అంటిరి, ఒక దశాబ్దం అధికారంలో ఉండి ఏమి చేసిర్రు కాకా..
కాకా నువ్వు కేక ఎందుకంటే జినోమ్ వ్యాలి గొప్పతనం గుర్తుచేసినవులే...
ఏమైనా కాకా నువ్వు కేక ఇంట్లో కుంపటి పెట్టుకోని , ఏమి జరగనట్టు మరల సెంటిమెంట్ రాజకీయాలు చేయటానికి బయటికోచ్చినవ్వులే...

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Website

Address


Hyderabad
501401