BRS Party - Nandipet

BRS Party - Nandipet

Share

Jai KCR...

16/05/2025

అమెరికా ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడిన సద్దాం హుస్సేన్ ను, అమెరికా పై దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ ను వెంటాడి చంపించిన అమెరికా ఇప్పుడు భారత్ కు ఎందుకు సుద్దులు చెపుతున్నది.. మనం ఎందుకు వింటున్నాం...?

16/05/2025

పహాల్గామ్ యుద్ధ వీరుడు
Pok విజేత మోడీ జీ కి
బహుమతులు పంపిన భారత మహిళలు..

16/05/2025

*అమాత్యులంతా అవినీతి అనకొండలే*

-ఆమ్యామ్యాలు లేనిదే ఫైళ్లు కదలవు

-ప్రతీ మంత్రి పేషీలో ఇదే తంతు

-సచివాలయమంతాఅవినీతి కంపు

-కాంగ్రెస్ ప్రభుత్వ మంటేనే కమీషన్ల పాలన

-మంత్రి కొండా వ్యాఖ్యలే ప్రభుత్వ అంతులేని అవినీతికి నిదర్శనం

-మంత్రి సురేఖ కామెంట్స్ పై రాహుల్ గాంధీ స్పందించాలి

-సీఎం రేవంతే పెద్ద అవినీతి భూతం, తెలంగాణకు శరాఘాతం

-పీసీసీ అంటేనే ప్రదేశ్
కరెప్షన్ సెంటర్

-కాంగ్రెస్ డీ.ఎన్. ఏ లోనే కరప్షన్ ఉంది

-పంచభూతాలనే భోంచేసిన పాపాల పుట్ట

-ఇందిరమ్మ రాజ్యమంటేనే ల్యాండ్,శాండ్, మైన్, వైన్ మాఫియా

-అది ఇండియన్ నేషనల్ కరప్షన్ పార్టీ

-ఏ టూ జెడ్ కాంగ్రెస్ కరప్షన్ కహానీలే

-మండిపడ్డ బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-కాంగ్రెస్ అవినీతి భాగోతాలపై సభా కమిటీ వేయాలి

-లేదా సీబీఐచే విచారణ జరిపించాలి

-కాంగ్రెస్ కు ఏమాత్రం సిగ్గూశరం ఉన్న సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్

హైదరాబాద్, మే16:-

రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా అవినీతి అనకొండ లేనని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు.
మంత్రులకు పనులను బట్టి లంచాలు ఇవ్వనిదే ఫైళ్లు కదలవని ఆయన శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజ మెత్తారు. ప్రతీ మంత్రి పేషీలో ఇదే తంతు కొనసాగుతూ సచివాలయమంతా అవినీతి కంపు కొడుతోందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంటేనే కమీషన్ల పాలన అని, ఇది తామన్నది కాదని, ఫైళ్లు క్లియర్ చేయడానికి మంత్రులకు డబ్బులు ఇవ్వాల్సిందేనని
మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని గుర్తు చేస్తూ సురేఖ మాటలు కాంగ్రెస్ సర్కార్ అంతులేని అవినీతికి నిలువెత్తు నిదర్శనమని ఆయన అన్నారు. మంత్రి సురేఖ కామెంట్స్ పై రాహుల్ గాంధీ స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డే పెద్ద అవినీతి భూతమని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి శరాఘాతమని ఆయన నిప్పులు చెరిగారు. పీసీసీ అంటేనే ప్రదేశ్
కరెప్షన్ సెంటర్ అని, అది ఇండియన్ నేషనల్ క్రైమ్ అండ్ కరప్షన్ పార్టీ అని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అవినీతి పునాదుల మీద పెరిగిన కాంగ్రెస్ పార్టీ పంచభూతాలనే భోంచేసిన పాపాల పుట్ట అని ఆయన అన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటేనే ల్యాండ్,శాండ్, మైన్, వైన్ మాఫియా అని ఆయన దుయ్య బట్టారు.
నాటి ఆంగ్లేయులది, నేటి కాంగ్రెస్ ది ఒకటే వంకరబుద్ది, కాంగ్రెస్ ఈస్టిండియా కంపెనీ అయితే బీజేపీ నార్తిండియా కంపెనీ అని జీవన్ రెడ్డి పేర్కొంటూ ఈ రెండూ దేశాన్ని దోచుకునే దోపిడీ కంపెనీలేనని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ దేశాన్ని పాడు చేస్తున్న మిడతలదండుగా ఆయన అభివర్ణించారు.
కాంగ్రెస్ అంటేనే సంపన్నులకు ఆపన్న హస్తం, పేదలకు రిక్త హస్తం. అబద్దాలు, అవినీతి,అక్రమాలకు పుట్టిన అభవిక్త కవల. అందినకాడికి ప్రజాధనాన్ని నొక్కడంలో, మెక్కడంలో అందె వేసిన చెయ్యి. కాంగ్రెస్ అంటేనే అవినీతి చీడ. దేశానికి పట్టిన పీడ. జలయజ్ఞం, 2జీ, భూపందారాలు, ఆగస్టా, కోల్ -ఇలా పంచభూతాలను దిగమింగిన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్, అవినీతి రెండూ రాహుకేతువులు లాంటివి. గరీబీ హఠావోను గాలికొదిలేసింది. పైసా కమావో బాట పట్టింది. అవినీతి పాఠాల్లో కాంగ్రెసు కె ఫస్ట్ మార్క్. ఏ ఫర్ ఆదర్శ్. బీ ఫర్ బోఫోర్స్. సీ ఫర్ కామన్ వెల్త్ స్కామ్, డీ ఫర్ దేవాస్ యాంత్రిక్స్-ఇలా ఏ టూ జెడ్ కాంగ్రెస్ కరప్షన్ కహానీలే.
బోఫోర్స్ గన్నులు, టాటా ట్రక్కులు, ఆగస్టా హెలీ కాఫ్టర్లు ఇలా అన్నింట్లో కాంగ్రెస్ ఆవినీతే నిత్య దర్శనం. అవినీతి అమీబా కాంగ్రెస్. కాంగ్రెస్ డీ.ఎన్. ఏ లోనే కరప్షన్ ఉంది అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్ కాంగ్రెస్ అవినీతి చట్టబద్దమనే విధంగా ఉన్నాయ న్నారు. కాంగ్రెస్ అవినీతి భాగోతాలపై సభా కమిటీ వేయాలి. లేదా సీబీఐచే విచారణ జరిపించాలి. అవినీతి మంత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ కు ఏమాత్రం సిగ్గూశరం ఉన్న సురేఖను బర్తరఫ్ చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్.

Photos from BRS Party - Nandipet's post 12/05/2025

మోడీ భయపడ్డావా!

పాక్ పై వెనకడుగుతో తిరగబడ్డ దేశం

దేనికి భయపడి కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్టు?

అమెరికా చెప్పగానే ఎందుకు విన్నట్టు?

ట్రంపుకు ఎందుకు భయపడుతున్నవట్టు?

EVM స్కామ్ వణికిస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు

నెటిజన్లకు కౌంటర్లు ఇవ్వలేకపోతున్న బీజేపీ

'కాంగ్రెస్, విపక్షాల లేఖాస్త్రాలతో డిఫెన్స్ లో కమలదళం

12/05/2025

🔷🔹 ఏంట్రా మీ వల్ల నా దేశానికి ఉపయోగం.. ?? 🔹🔷

● భారత మాతకు జై ..
● గుజరాత్ మాతకు జై..
● ఉత్తర ప్రదేశ్ మాతకు జై..
● బీహార్ మాతకు జై..
● ఆంధ్రా మాతకు జై..
● గోమాతకు జై, భూమాతకు జై..
● జై శ్రీరామ్..
● వందేమాతరం..
● జై భవాని,, జై శివాజీ..
● ఇంకా ఏమైనా మిగిలి ఉంటే,, మీరు చెప్పే ప్రతీదానికి జై జై కొట్టేద్దాం..

● సరిపోయిందా.. అయిపోయిందా..

✋ ఇప్పుడు చెప్పండ్రా....

☞ 100 రోజుల్లో వెనక్కి తెస్తానన్న నల్ల ధనం ఏది..??

☞ ప్రతి పౌరుడికి పంచుతాను అన్న 15 లక్షలు ఏవి..??

☞ 35 రూపాయలకు పెట్రోలు.. ఏది..??

☞ రూపాయికి 40 డాలర్లు.. ఏవి.. ??

☞ "ఒక తలకు పది తలలు" ఏవి ??

☞ పఠాన్కోట్ నిందితులు ఎక్కడ ??

☞ పుల్వామాలో 40 మంది సైనికులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు ఎక్కడ ??

☞ పహల్గామ్ లో నా హిందూ సోదరులను మతం అడిగి మరీ చంపిన ఆ నలుగురు ఉగ్రవాదుల జాడ ఎక్కడ ??

☞ మాకు అధికారం వస్తే చొక్కా కాలరు పట్టుకుని లాక్కొస్తాం అన్నా దావూద్ ఇబ్రహీం ఎక్కడ.. ??

☞ ముంబై మీద తీవ్రవాద దాడికి బాధ్యుడైన హాఫీజ్ సయిద్ గాడు ఎక్కడ.. ??

☞ ప్రజాధనం పంది కొక్కుల్లాగా తిని హాయిగా దేశం నుండి పారిపోయిన మీ పార్టీ MP విజయ్ మాల్య ఎక్కడ..??

☞ ప్రజాధనాన్ని కొల్లగొట్టి, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించుకుని, హాయిగా విదేశాలలో జల్సా చేస్తున్న మీ నీరవ్ మోడీ ఎక్కడ.. మేహుల్ చోస్కీ ఎక్కడ.. ??

☞ లాడాక్ నుండి చైనాను, టిబెట్ సరిహద్దు దాకా తరిమి కొడతాం అన్నారు.. ఎక్కడ దాకా తరిమారు.. ??

☞ ఇక మాట్లాడ్డాలు లేవు.. కళ్లెర్ర జేసి భస్మం చేస్తాం,, 56 ఇంచుల ఛాతీతో నలిపేస్తాం అన్నారు.. ఏది..?? ఎక్కడ..?? ఎంత మందిని నలిపారు.. ??

☞ రైతు ఆదాయాన్ని పదిరెట్లు చేస్తానన్నారు.. ఎక్కడిదాక వచ్చింది.. ??

☞ మేడ్ ఇన్ ఇండియా అని అమెరికాకి ఎగుమతి చేస్తాము అన్నారు.. ఎక్కడిదాక చేశారు.. ??

☞ బేటీ బచావో అన్నారు... ఆడబిడ్డలను రేపులు చేసి చంపుతున్న మీ MP లకు, MLA లకు శిక్షలేవి.. ??

☞ బేటీ పడావో అన్నారు... ఎంతమంది ఆడబిడ్డలను చదివించారు.. ఎన్ని బడులు కట్టారు..??

☞ పౌరులకు నాణ్యమైన వైద్యం అందించడంలో మీరు సాధించినది ఏమిటి.. ??

☞ రైతుల ఆత్మహత్యలు ఆపడానికి మీరు తీసుకున్న చర్యలు ఏమిటి.. ??

☞ అవినీతిని నిర్మూలనించడానికి మీరు చేసిన ప్రయత్నాలు ఏమిటి.. ??

☞ నత్త నడక నడుస్తున్న న్యాయ వ్యవస్థను గాడిలో పెట్టి పౌరులకు సత్వర న్యాయం అందించేందుకు.. మీరు తీసుకున్న చర్యలు ఏమిటి...??

☞ ఒక్క పూట తిండితో జీవనం గడుపుతూ వస్తున్న 35% పేదలకు, రెండోపూట తిండిని కూడా దూరం చేస్తున్న ధరల పెరుగుదల సమస్యపై మీరు తీసుకున్న చర్యలు ఏమిటి ??

☞ ఈ దేశంలో గంటకు 4గురు మహిళలు లైంగిక వేధింపులకు గురి అవుతున్నారు.. రోజుకు 16 మంది ఆడబిడ్డలు అత్యాచారాలకు బాధితులుగా మారుతున్నారు.. వాటికి నివారణ చర్యలు ఏమిటి....??

సమాధానం చెప్పండ్రా...

కావాలంటే మరో 1000 సార్లు జై కొడతా..
మీరు చెప్పిన ప్రతి దానికి... జై కొడతా..

▪️పందుల్లాగా రోడ్ల మీద చెత్త విసిరి, పాన్ పరాగ్ ఉమ్ములు ఊసే మీరు, పాచి ముఖం వేసుకుని, మాకు స్వచ్ఛ భారత్ కబుర్లు చెబుతూ... దేశభక్తి పోజులు కొడతారా.??

▪️ శత్రుదేశాలు మన సైనికులను చంపుతుంటే,, ఫోనులో ఆప్లికేషన్లు తొలగించేసి,, ఏదో ఊడబోడిచాం అని సంకలు గుద్దుకునే,, పిరికి వెధవల్లరా.... మీరా.. దేశాన్ని కాపాడే వీరులు..??

▪️బేకరీల మీద, చిన్న చిన్న మసీదులు చర్చీల మీద, గొడ్డుపోయిన ఆవులను తీసుకువెళ్ళే వాహనాల మీద, దాడులు చేస్తూ అదే ధర్మ రక్షణ అని, హిందూ మతాన్ని బ్రష్టు పట్టిస్తున్న మీరా సనాతన పరిరక్షకులు..??

▪️ పాకిస్తాన్ వాడు దాడి చేస్తే.. ఈ దేశ పౌరులైన ముస్లింల మీద..
చైనా వాడు దాడి చేస్తే... ఈ దేశ పౌరులైన కమ్యూనిస్టుల మీద..
అమెరికా వాడు దాడి చేస్తే.. ఈ దేశ పౌరులైన క్రైస్తవుల మీద..
ఆవు పేరుతో, మతం పేరుతో.. ఈ దేశ పౌరులైన దళితుల మీద..

... దాడులు చేస్తూ,, విషం కక్కుతూ ఉండడమేనా.. మీ వీరత్వం..?? మీ దేశభక్తి..??

ఒక్క సారి మీ గుండెల మీద చేయి వేసుకుని చెప్పండ్రా...

🔹 ఏంట్రా మీ వల్ల నా దేశానికి ఉపయోగం.. ?? 🔹

- చైతన్య కూరపాటి

Photos from Jeevan Reddy BRS's post 15/09/2024
26/08/2024

నాడైన-నేడైనా-ఎప్పటికైనా రైతుల పక్షమే మన Jeevan Reddy BRS

26/08/2024

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో రోడ్డెక్కిన రైతన్నలు..

ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రుణాలు మాఫీ చేయాలనే డిమాండ్ తో ఇందూరు రైతులు ఆదివారం పోరు బాటపట్టారు.ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మహా ధర్నా చేపట్టారు. రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాకు ఆర్మూర్,బాల్కొండ, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

25/08/2024
Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Website

Address


Telangana Bhavan, Banjarahills Road No12
Hyderabad