19/11/2025
🌟 మనుషుల మధ్య మంచితనం ఇంకా ఉందని గుర్తు చేసే చిన్న సంఘటన… 🌟
నిన్న మా వాలంటీర్ ఒకళ్ళు కాల్ చేశారు.
“భార్గవ్ గారు, మా స్కూల్ స్నేహితురాలికి చాలా కష్టాలు వచ్చాయి. ఇద్దరు పిల్లలను ఎంతో ప్రేమగా పెంచుతుంటే, అనుకోకుండా ఆమె భర్త తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఇల్లు నెట్టుకుపోవడమే పెద్ద సమస్యగా మారింది… పిల్లల చదువులు ఇంకా భారంగా మారాయి. ఒక బిడ్డ స్కూల్ ఫీజు బాధ్యత తీసుకోగలరా?” అని అడిగింది.
ఆమె మాటల్లో ఉన్న ఆవేదన, పిల్లల భవిష్యత్తు మీదున్న ఆందోళన నాకు వెంటనే అర్థమైంది.
అక్కడే నిర్ణయం తీసుకున్నాను — చాణక్య జోస్ అనే ఆ చిన్నారి ఈ సంవత్సరం విద్యా బాధ్యతను తీసుకుందాం అని.
🙏 నాకు మంచి స్నేహితుడు నా చెడ్డీ దోస్త్ డాక్టర్ మైకెల్ మనోజ్ కి ప్రత్యేక ధన్యవాదాలు.
కాల్ చేసిన వెంటనే స్పందించి, మచిలీపట్నం నాగార్జున పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న చాణక్య ఫీజును వెంటనే అందించారు.
జీవితం ఎంత కఠినమైనదైనా…
మనుషుల మధ్య ప్రేమ, అండ, సహాయం… ఇవే నిజమైన బలం.
మన చిన్న సహాయం ఎవరికో పెద్ద భవిష్యత్తు అవుతుంది.
ఇలాంటి మంచి పనుల్లో భాగస్వాములుగా నిలుస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ❤️✨
17/08/2025
🌸 ప్రతి ఆదివారం మాకు ఒక పండుగ, ఒక బ్లెస్సింగ్.
హైదరాబాద్‌లోని నిలోఫర్ హాస్పిటల్‌లో గర్భిణీ మహిళల బంధువులకు మేము ప్రేమతో వండిన ఆహారాన్ని ఈ ఆదివారం అందించాము. 🍛
👉 శుభ్రంగా వండిన అన్నం
👉 రుచికరమైన పప్పు కూర
👉 ఉడికించిన గుడ్లు 🥚
అక్కడికి వచ్చే వారు చాలా మంది వెనుకబడిన ఆర్థిక స్థితి నుండి వచ్చేవారే. రోగులకు భోజనం దొరికినా, బంధువులు మాత్రం బయట కొనుకోవాలి – అది వారికి భారంగా మారుతుంది. 💔
అందుకే… మేము ప్రతి ఆదివారం 100 మందికి పైగా అవసరమైన వారికి ఈ హైజీనిక్ హోమ్‌మేడ్ మీల్స్ అందిస్తున్నాం.
ఇది కేవలం ఒక చారిటీ కాదు – ప్రేమతో, కరుణతో, మనసుతో చేస్తున్న ఒక యజ్ఞం. ❤️
🙏 ఈ weekend charity స్పాన్సర్‌గా నిలిచిన JanaSena Party NRI Coordinator Sai Raj గారికి ప్రత్యేక ధన్యవాదాలు, వారి తల్లితండ్రుల జ్ఞాపకార్ధంగా ఈ అన్నదానం చేయటం జరిగింది.
Helping Spot – Serving Humanity with Love
12/08/2025
🌸 ప్రతి వారం ఒక పండుగలా… 🌸
ప్రతి వారం లాగానే, ఈ వారం కూడా మేము Helping Spot Organisation - Weekend Charity ప్రోగ్రామ్ లో భాగంగా నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లి గర్భిణీ స్త్రీలు మరియు వారి బంధువులకు శుభ్రమైన, హైజీనిక్‌గా ఇంట్లో వండిన భోజనాన్ని అందించాము.
మేము చేస్తున్న సేవలో మాకు ఆనందం ఉంది… అవసరంలో ఉన్నవారికి చేయూత ఇవ్వడం మా అభిరుచి ❤️
ఆసుపత్రికి చేరగానే, మేము వస్తామని ముందే తెలిసిన వారంతా మా వాహనం వద్దకు చేరుకున్నారు. ఈసారి జనసమ్మర్ధం కూడా నియంత్రణలో ఉండడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భోజన ప్యాకెట్లు పంపిణీ చేయగలిగాము.
ఈ వారం జరిగిన ఈ సేవా కార్యక్రమానికి స్పాన్సర్‌గా, తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం జనసేన పార్టీ NRI కోఆర్డినేటర్ శ్రీ సాయి రాజ్(Sai Raj) గారు ముందుకు వచ్చారు. 🙏
🤝 మనమంతా కలసి ఇలాగే సేవా పథంలో ముందుకు సాగుదాం.
03/08/2025
మానవత్వం మన చేతుల్లోనే ఉంది...
మాచిలీపట్నం వార్డు 1కి చెందిన శ్రీ కాసాని కాంతారావు గారు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. రోజు వారి కూలి పనుల మీద ఆధారపడి జీవనోపాధి సాగించే ఆయన, గత మూడు నెలలుగా ఆరోగ్య సమస్యల వల్ల పనికి వెళ్లలేక, తన కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నారు.
ఈ పరిస్థితిని శ్రీ బత్తిన దాస్ గారు తెలుసుకొని, నన్ను సంప్రదించారు. కాంతారావు గారి పరిస్థితిని దగ్గరగా చూసి, మూడు నెలల పాటు వారి కుటుంబానికి అవసరమైన #నిత్యావసర #సరుకులు మా సంస్థ హెల్పింగ్ స్పాట్ ఆర్గనైజేషన్ ద్వారా అందించాలని నిర్ణయించుకున్నాను. ఈ నెల నుండి ప్రతి నెల(మూడు నెలల పాటు) రెండవ తారీఖున నా టీమ్ వాళ్ళకి నిత్యావసర వస్తువులు అందిస్తుంది
ఈ మంచి కార్యక్రమంలో నా సహాయకులు చందూ మరియు షరీఫ్ అందించిన సహాయానికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మన చిన్న ప్రయత్నం ఎవరికో ఒకరికి పెద్ద ఆశాజ్యోతి అవుతుంది.
ఇంకా ఎంతో మందికి సాయం చేసే శక్తి ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
#మనసుకొకమాట
#మానవత్వమేమహోన్నతం
29/07/2025
ప్రతి వారాం లాగానే ఈ వారం కూడా మా Helping Spot Organisation తరఫున Weekend Charity విజయవంతంగా జరిగింది.
ఈసారి క్యూలో నిలబడకుండానే చాలామంది ఒక్కసారిగా మా వాహనం చుట్టూ చేరారు. అందులో ఇద్దరిని తీసుకుని వారే భోజనం పంచమని చెప్పాము. వాళ్లు చాలా ఆనందంగా పంపిణీ చేశారు.
ఉదయం చాలా తెల్లవారే లేచి, కిరాణా సరుకులు తీసుకుని, శుభ్రంగా ఆహారం వండాం.
గర్భిణీలు మరియు వారి బంధువుల కోసం ఉడికించిన గుడ్లు కూడా అందించాం.
ఈ కార్యక్రమం కోసం దాదాపు 8 గంటల శ్రమ పెట్టాం.
ఈ సేవా కార్యక్రమానికి మద్దతుగా ఉన్న
ఇల్లూరి ప్రణీత్ గారికి
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ కార్యక్రమం భోగాడి నాగ జ్యోతి గారి జ్ఞాపకార్థం జరిగింది.
ఒక మంచి పని ఎంతో మందికి ఆశగా మారుతుంది.
మీరు కూడా తోడ్పడండి.
If you want to support this initiative, please reach us at 8886686000
26/06/2025
- ప్రతి ఆదివారం అన్నదానం
ప్రతి ఆదివారం మేము Helping Spot Organisation తరఫున బసవతారకం, నిలోఫర్ ఆసుపత్రిల్లో #క్యాన్సర్ #రోగులు, వారి బంధువులు, అలాగే #గర్భిణీ #స్త్రీలకు పోషకమైన, రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేసి ఇస్తూ ఉంటాము.
అన్ని ఆదివారాలు చేసినట్టు గానే ఈ ఆదివారం కూడా #ఉదయం #నుంచే మేమందరం కలసి వంట మొదలుపెడతాం. అన్నం, మంచి ఆకుకూర పప్పు, ఉడకబెట్టిన గుడ్లు వండి ప్యాక్ చేయడానికి దాదాపు #8గంటలు సమయం పడుతుంది — కాని ఆ కష్టం మాకు ఎప్పుడూ భారంగా అనిపించదు.
ఎందుకంటే, భోజనం ఇచ్చేటప్పుడు అందరి ముఖాల్లో కనబడే చిరునవ్వులు, వారి ఆశీర్వాదాలు మాకు ఎనలేని ఆనందాన్ని ఇస్తాయి. వాళ్లతో మాట్లాడి, కొన్ని క్షణాలు గడపటం అదృష్టంగా భావిస్తాము
మూడో సంవత్సరం లోకి ప్రవేశించిన ఈ “Weekend Charity” కార్యక్రమం మాకు కేవలం ఒక ఛారిటీ కాదు — ఇది ఒక సంకల్పం, ఒక భావన.
మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వచ్చు. మీ సమయం, మీ సహాయం లేదా వనరులతో మాకు తోడుగా నిలవగలిగితే, అది మరెంతమందికో ఒక ఆశ కిరణంలా ఉంటుంది.
ఈ weekend charity ను #శ్రీకాంత్ #తిరుమల
స్పాన్సర్ చేశారు.
మళ్ళీ వచ్చే ఆదివారం మరొకసారి weekend charity తో మీ ముందుకు వస్తాము.
10/06/2025
𝐇𝐞𝐥𝐩𝐢𝐧𝐠 𝐒𝐩𝐨𝐭 𝐎𝐫𝐠𝐚𝐧𝐢𝐬𝐚𝐭𝐢𝐨𝐧 – 𝐖𝐞𝐞𝐤𝐞𝐧𝐝 𝐂𝐡𝐚𝐫𝐢𝐭𝐲 కార్యక్రమం
ఈ ఆదివారం చాలా అలసటగా గడిచింది, పని వల్ల పలు నగరాలకి ప్రయాణం చేయాల్సి వచ్చింది. అయినా కూడా weekend charity మిస్ అవకుండా ఉండాలని నేను మరియు నా భార్య ప్రత్యేకంగా హైదరాబాద్‌కి తిరిగి వచ్చాం. మేము వచ్చేసరికే ఆదివారం ఉదయం అయిపోయింది, ఇంకా కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా భోజనం తయారీ మీద దృష్టి పెట్టాము. ఈ సారి మేము నిలోఫర్ హాస్పిటల్స్ వద్ద ఉన్న గర్భిణీ స్త్రీల బంధువులు మరియు నిరాశ్రేయులకు తినేందుకు ఆరోగ్యకరమైన అన్నం, పప్పు కూర మరియు ఉడికించిన గుడ్లతో కూడిన భోజనాన్ని సిద్ధం చేసాం.
ఇదంతా సుమారు 6 గంటల వంట పని, తరువాత 2 గంటల ప్యాకింగ్ పని. చివరికి మేము తినకుండా, విశ్రాంతి లేకుండా ఆహారం ప్యాకింగ్ చేసి, ప్రేమతో నిలోఫర్ ఆసుపత్రికి వెళ్లి, అక్కడ ఉన్న గర్భిణీ స్త్రీల బంధువులకు అందించాము.
అలసట, నిద్రలేకపోవటం, ప్రయాణం వల్ల వచ్చే బాడీ పెయిన్స్– ఇవన్నీ ఒక్కసారిగా మేము మర్చిపోయాం. ఎందుకంటే అక్కడ గర్భిణీ స్త్రీలు, వారి కుటుంబ సభ్యులు మమ్మల్ని చూసి చిరునవ్వుతో, కృతజ్ఞతతో భోజనం తీసుకుంటే – ఇది కద అసలైన సంతోషం అనిపించింది! కానీ ఒక్కసారిగా అక్కడున్న జనం మాపై దండయాత్ర చేసినట్టుగా మీదకు వచ్చేశారు అసలు ఎంత చెప్పినా కూడా వినలేదు, ఇంకా ఎలాగోలా వాళ్ళని బ్రతిమిలాడి అందరికి ఆహారం అందించాము.
🌿 మేము ప్రతి ఆదివారం సుమారు 80-100 మందికి 250 గ్రాముల చొప్పున భోజనం అందిస్తున్నాం
🌿 ఇప్పటివరకు (జనవరి 2022 నుంచి జూన్ 2025 వరకు) మేము 4,028 కిలోలకు పైగా భోజనం తయారు చేశాము
🌿 సుమారు 16,110 ఫుడ్ ప్యాకెట్స్ పైగా అందజేశాము
🌿 ఇప్పటివరకు 1,253 గంటల సమయం ఈ weekend charity కోసం మేము కేటాయించాము.
ఇది మాకు ఒక మిషన్, మనుషుల మధ్య మానవత్వాన్ని నిలబెట్టే ఓ ప్రయాణం.
🙏 మీరు కూడా ఈ సేవా కార్యక్రమంలో భాగం కావాలనుకుంటే, మాకు సహాయంగా, సహచరులుగా ఉండండి. డోనేషన్ రూపంలో కానీ, వాలంటీర్‌గా కానీ, మద్దతుగా కానీ – మీ తోడు ఎంతో విలువైనది.
ఈ ఆదివారం ఎవరికైనా ఆకలితో పడుకోకుండా చేయండి – మీరే ఆ కారణం అవ్వండి.
📌 మీరు సహాయం చేయాలంటే, మాకు 8886686000 నంబర్ పైన మెసేజ్ చేయండి.
ఈ వారం మీల్స్ ను CA Shiva Surya Mounika గారు స్పాన్సర్ చేశారు. Thank you so much sister for joining your hands with us.
#మనసున్నమనం
#మానవత్వసేవ
07/05/2025
వెనుకబడిన స్టూడెంట్స్ చదువు కోసం మొదలు పెట్టిన "మిషన్ శిక్షాపాత్ర" అనే ప్రాజెక్ట్ లో భాగంగా హెల్పింగ్ స్పాట్ సంస్థ #ఎంబీఏ #స్టూడెంట్ కు అండగా నిలిచింది.
కృష్ణా గారు మచిలీపట్నం గవర్నమెంట్ ఆసుపత్రి లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ తన కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
ఆయనకు ఇద్దరు కూతుర్లు, అందులో ఒకరు అయిన రామ సాయి కృష్ణా యూనివర్సిటీ లో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతుంది.
రామ సాయి కాలేజీ ఫీజు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న కృష్ణా గారు తనకు తెలిసిన వాళ్ళు చెప్పటంతో హెల్పింగ్ స్పాట్ సంస్థ ను ఆశ్రయించారు. ఒకటి, రెండు కాదు సుమారు యాభై కి పైగా ఫోన్ లు చేసి తన కూతురు చదువు కోసం ప్రాధేయపడ్డారు. ఆయన బాధ వర్ణానితం, ఆయనకు అండగా నిలవాలని భావించి మా సంస్థ ముందుకొచ్చింది. ఎప్పటిలాగే మొదటి సహాయం నేనే చేస్తున్నాన్ను అని తెలపగానే నాతోపాటు ముందుకొచ్చి #ఫీజు సహాయం అందించిన స్పాన్సర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు.
మా సంస్థ సపోర్టర్ అయిన రాష్ట్ర టిడిపి యువత ఉపాధ్యక్షులు Haseem Baig గారి సమక్షంలో కృష్ణా గారికి ధన సహాయం చేయటం జరిగింది. ఈ స్టూడెంట్ ఎడ్యుకేషన్ స్పాన్సర్షిప్ తో కలిసి ఇప్పటిదాక మా సంస్థ 30 మంది స్టూడెంట్స్ కు ఫీజు చెల్లించింది.
Thank you sponsors, supporters, and volunteers.
07/04/2025
Admin Post
మచిలీపట్నం శివగంగ కు చెందిన నాగిసెట్టి దేవి శ్రీ గుడివాడ లో ఉన్న ANR కాలేజిలో MCA చివరి సంవత్సరం చదువుతుంది. చదువులలో చాలా చురుకుగా ఉండేది, మొదటి సంవత్సరం ఫలితాలలో 85% ఉత్తీర్ణత సాధించింది. #కాలేజీ #ఫీసు కట్టటానికి ఆర్ధిక ఇబ్బందులు ఉండటంతో ప్రసార మాధ్యమాల ద్వారా హెల్పింగ్ స్పాట్ సంస్థ చేసే సేవా కార్యక్రమాలు చూసి సంస్థ ను ఆశ్రయించటానికి ప్రయత్నించింది. ఈ మేరకు APSRTC Chairman శ్రీ కొనకళ్ల నారాయణ రావు గారికి సిఫార్సు లెటర్ అందించి తమ గోడు వెళ్ళబెట్టుకుంది.
ఈ విషయం తెలుసుకుని మేము ఆ #చదువుల #తల్లికి మా సంస్థ సపోర్టర్ అయినటువంటి #స్నేహ గారి సహకారంతో హెల్పింగ్ స్పాట్ సంస్థ వెనుకబడిన విధ్యర్ధినీ విధ్యార్ధుల చదువు నిమిత్తం మొదలు పెట్టిన Mission Sikhshapatra లో భాగంగా 8000/- #ఆర్ధిక #సహాయం అందజేసాము.
Helpingspot Organisation