22/02/2024
జగన్ పార్టీ ప్రత్యేక రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. మీరు పూర్తి చేయని హామీలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి నిర్బంధిస్తారా? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నాకే ఈ పరిస్థితి ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? లేక రాచరికపు పాలన లో ఉన్నామా?మెగా డీఎస్సీ కావాలి దగా డీఎస్సీ వద్దు అని ప్రభుత్వానికి రిప్రెజెంటేషన్ ఇద్దామని వెళ్తున్న నాతో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అక్రమ అరెస్ట్ చేసి భౌతిక దాడికి పాల్పడి గాయపరచడం బాధ కలిగించింది. అధికారం శాశ్వతం కాదు అది గుర్తు పెట్టుకోండి. మన రాష్ట్రంలో ప్రభుత్వానికి వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ లేదు... వినతి పత్రం తీసుకోవడానికి సచివాలయంలో ఒక్కరూ కూడా లేరట. సీఎం రాడు.. మంత్రులు లేరు.. అధికారులు రారు.. వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనం.
30/04/2023
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యవారిపల్లెలో అకాల వర్షంతో నష్టపోయిన పంటలను పరిశీలించడం జరిగింది. వరి, మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ రైతులను పరామర్శించలేదు. తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోండి దొరా..
30/04/2023
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే వచ్చే సంతోషమే వేరు.. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం నెల్లుట్ల గ్రామ పరిధిలో సుమారు 800 కుటుంబాలు చంటిపిల్లలతో చీకట్లో బతికేవారు. నాడు పాదయాత్రలో ఆ కుటుంబాలకు ఇచ్చిన మాట ప్రకారం సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేయించడం జరిగింది.
28/04/2023
దళితబంధులో ఒక్కో కుటుంబం వద్ద రూ.3లక్షలు తిన్న MLAలను KCR వెంటనే బర్తరఫ్ చేయాలి.MLAల పేర్లు బయటపెడితే కాళేశ్వరంలో మీరు తిన్న రూ.70వేల కోట్ల గురించి,బిడ్డ లిక్కర్ స్కాం,కొడుకు రియల్ ఎస్టేట్ స్కాంపై ప్రశ్నిస్తారని భయమా?దమ్ముంటే అవినీతి MLAలపై చర్యలు తీసుకో.
దళిత బందులో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి | Ys Sharmila Demands CM KCR | YSRTP
ిత బందులో అవినీతికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను బర్తరఫ్ చేయాలి | Ys Sharmila Demands CM KCR | YSRTPRelated Videos:• .వైద్య,ఆరోగ్యశా...