05/04/2026
పత్రిక ప్రకటన
యలమంచిలి తండా లో లంబాడీల ఆత్మ గౌరవ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
డోర్నకల్ నియోజక వర్గం మరిపెడ మండల మాకుల తండా సమీపం లో ఉన్న మాకుల క్షేత్రం లో ఏప్రిల్ 15 న జరిగే బండ్లు తిరిగే కార్యక్రమ రోజున జరిగే లంబాడీల ఆత్మ గౌరవ సదస్సు పోస్టర్ ను యలమంచిలి తండా సర్పంచ్ బానోతు భద్రు నాయక్ ఆధ్వర్యం లో చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని భావసంగ్ మహారాజ్ పేరును మాకుల క్షేత్రం లో విస్మరించడం తగదు అని తెలిపారు అలాగే మ్యారామా భవానీ పేరు మీద గత సంవత్సరం 2025 ఏప్రిల్ 9 న విగ్రహ ప్రతిష్ట చేసి ఒక ఏడాది కావస్తున్న ఇప్పటి వరకు శిలా ఫలకం ఏర్పాటు చేయకపోవడం శోచనీయం అని గుర్తు చేసారు ఎక్కడ బోర్డు లు కూడా ఏర్పాటు చేయకపోవడాన్ని తీవ్రముగా తప్పు పట్టారు.
లంబాడీల అనేవాళ్ళు ఉన్న ప్రతి క్షేత్రం లో ఈ రోజు ఇదే తంతు నడుస్తుంది అని దీన్ని లంబాడీల రాజకీయ ప్రతినిధులు చూస్తూ చోద్యం చూస్తున్నారు మీరు జోక్యం చేసుకుంటే తగిన మూల్యం చెల్లిస్తారు అని హెచ్చరించారు.
ఇప్పటికీ అయిన జాతి కోసం,జాతి ఆనవాళ్ల కోసం ప్రత్యేక శ్రద్ధ మీరు చేయించాలి అని ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఈ కార్య క్రమం లో లంబాడీల ఐక్య వేదిక డోర్నకల్ నియోజకవర్గ ఇంచార్జీ బానోతు ప్రవీణ్ నాయక్, మరిపెడ మండల నాయకులు రాజేష్ నాయక్, నర్సింహుల పేట మండల అధ్యక్షులు బానోతు రాజేందర్ నాయక్, తండా నాయకులు, తండా విద్యార్థులు పాల్గొన్నారు.
04/04/2026
మాకుల భావసంగ్ మహారాజ్ మ్యారమా భవానీ జాతర పోస్టర్ కు విశేష స్పందన
పోస్టర్ ఆవిష్కరణలతో వేంకటేశ్వర స్వామి కి భావసంగ్ మహారాజ్ కు తేడా తెలుసుకుంటున్న ప్రజలు
ఇన్ని రోజులు అమాయక గిరిజనులను మోసం చేశారు అని వాపోతున్న తండా ప్రజలు
జాదవ్ రమేష్ నాయక్ గుగులోత్ లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త ఆధ్వర్యం లో విస్తృతంగా జరుగుతున్న ఫెరీ ఉద్యమం మా మ్యారమా భవానీ పేరు ఉండాలి అని పట్టుబడుతున్న లంబాడీ గిరిజనులు
భావసంగ్ మహారాజ్ ను కూడా విస్మరించకూడదు తిరుపతి క్షేత్రం లో హతిరం మహారాజ్ కు ఉన్న స్థానాన్ని మాకుల క్షేత్రం లో కూడా కల్పించాలి.
బాల్య తండా, భదృ తండా, చీమ్లా తండా, భంగ్య తండా, తావుర్యా తండా లలో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాలు
సేవాలాల్ సేన డోర్నకల్ నియోజక ఇంచార్జీ నరేష్ నాయక్ ఆధ్వర్యం లో జాతి జిల్లా నాయకులు లావుడ్య వాగ్య నాయక్ నాయకత్వం లో కురవి మండలం లోని వివిధ తండా లలో మరిపెడ మండల మరిపెడ గ్రామ శివారు మాకుల తండా లో 15 వ తారీకున బండ్లు తిరిగే కార్యక్రమము రోజున జరిగే లంబాడీల ఆత్మ గౌరవ సదస్సు కు అందరూ రావాలని తండా తండా లు తిరిగి ప్రచారం లో పాల్గొన్న లంబాడీల ఐక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త జాదవ్ రమేష్ నాయక్.
అలాగే భద్ర తండా లో స్థానిక సర్పంచ్ మలోత్ రమేష్ నాయక్ ఆధ్యర్యంలో ఘనముగా ఆవిష్కరణ చేయడం జరిగింది, ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలు, మాన దేవి దేవతల ఆనవాళ్లను ఎవరు అయిన కుట్రపూరితం గా విస్మరించాలని చూస్తే ఊరుకునేది లేదు అని తెలిపారు.
చీమ్ల తండా సర్పంచ్ ధారావత్ సాంకు రాధ కృష్ణ గారి ఆధ్వర్యం లో పోస్టర్ ఆవిష్కరణ చేస్తూ ప్రతి సంవత్సరం మా తండా ల నుండి వారం వారం దేవుడి సేవలో మాకుల వస్తూ ఉంటాము అని అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు అని వాపోయారు.మా మ్యారమా భవానీ పేరు ను అలాగే శిల పలకాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది.
ఈ కార్య క్రమం లో భుజ సరోజ వార్డు నంబర్, భూక్యా సుక్యా నాయక్, భూక్యా రాములు నాయక్, సొమ్ల నాయక్ , వెంకట్ నాయక్,గోపి నాయక్,జాతి మేధావులు అశోక్ భూక్యా, రాంమూర్తి భూక్యా లు పాల్గొన్నారు.
14/02/2026
ప్రతి తండా పంచాయతీలలో సద్గురువు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల 🔥భోగ్ భండార్🔥 జరగాలి అప్పుడే తండా పంచాయతీలకు అర్థం వస్తుంది - LIVE -