Hyderabad Metropolitan Water supply & Sewerage Board

Hyderabad Metropolitan Water supply & Sewerage Board

Share

Hyderabad Metro Water Supply and Sewerage Board established in the year 1989 November 1st.

Objective is to supply of drinking water and maintenance of sewerage system in entire GHMC area and also surrounding panchayats.

18/11/2025

జ‌ల‌మండ‌లి జ‌ల సంర‌క్ష‌ణకు కేంద్ర ప్ర‌భుత్వ‌ అవార్డు
================================

న‌గ‌రవాసుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా విశేష కృషిచేస్తున్న జ‌ల‌మండ‌లికి మ‌రో అవార్డు ల‌భించింది. జ‌ల సంర‌క్ష‌ణలో జ‌ల‌మండలి చేప‌డుతున్న కృషికి గాను ప్ర‌క‌టించిన అవార్డును జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి నేడు (తేది.18.11..2025, మంగళవారం రోజున‌) న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము గారి చేతుల మీదుగా అందుకున్నారు.

కేంద్ర ప్ర‌భుత్వం కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన‌ 'టాప్ మునిసిపల్ కార్పొరేషన్' కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచినందుకు ఈఅవార్డ్ అందించారు.

కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ, జల వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన‌ '10 టాప్ మున్సిపల్ కార్పొరేషన్' కేటగిరీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచినందుకు 'జల్ సంచయ్ జన భాగిదారి 1.0 అవార్డ్ అందించారు.

జల మండలి నీటి భద్రతతో కూడిన భవిష్యత్తు కోసం నీటి సంరక్షణ మాత్రమే కాకుండా ప్రజల ప్రవర్తనలో సానుకూల మార్పు తీసుకురావడంలో కూడా కీలక పాత్ర పోషించినందుకు, JSJB పరిధిలో కమ్యూనిటీ ఆధారిత నీటి సంరక్షణ చర్యలను ప్రోత్సహించడం ద్వారా “వాటర్ పాజిటివ్ యాక్షన్”ను ప్రేరేపించడమే కాకుండా, నీటి పట్ల కోల్పోయిన గౌరవాన్ని తిరిగి కలిగించిందని ఈ సందర్బంగా మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. ఈ అవార్డు భాగంగా నీటి సంరక్షణ కార్యక్రమాల కోసం రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహక బహుమతిని అందిస్తారు.

ఈ సంద‌ర్భంగా జ‌ల‌మండలి ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ జ‌ల సంర‌క్ష‌ణలో అవార్డు రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. బోర్డు ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది స‌మిష్టి కృషి వ‌ల్లే ఈ అవార్డు వ‌చ్చింద‌ని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ‌. రేవంత్ రెడ్డి గారు బోర్డు అధికారుల‌పై న‌మ్మకం ఉంచి ప్రోత్సాహించ‌డం.. హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో ఈ కార్యక్రమం విజ‌య‌వంతం అయిన‌ట్లు తెలిపారు.

రోజురోజుకు హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం అంత‌కంత‌కు అభివృద్ది చెందు తోంది. దీంతో న‌గ‌రంలో జీవిస్తున్న వారి సంఖ్య దాదాపు కోటిన్నర జ‌నాభాను దాటింది. దీంతో ప్ర‌జ‌ల అవ‌స‌రాల కొర‌కు నీటివినియోగం మ‌రింత‌గా పెరిగింది. జ‌ల‌మండ‌లి వంద‌ల కిలో మీట‌ర్ల నుంచి నీటిని తీసుకువ‌చ్చి స‌ర‌ఫ‌రా చేస్తుంది.

అయినా భూగ‌ర్భ జ‌లాన్ని ఇష్టానుసారంగా తోడేస్తున్నారు. ఎంతగా అంటే భూమిలోకి ఇంకుతున్న నీటిక‌న్నా న‌గ‌ర‌వాసులు బోర్ల ద్వారా వినియోగిస్తున్న నీరే అధికం. దీంతో భూగ‌ర్భ జ‌లాలు ఆడుగంటి పోతున్నాయి.

లాతూర్‌లో ఎదురైన నీటి క‌ష్టాల అనుభ‌వ దృష్ట్యా అలాంటి ప‌రిస్థితులు హైద‌రాబాద్‌లో రాకుండా ఉండేందుకు సరిగ్గా ఏడాది క్రితం అక్టోబర్‌ 2న సీఎం రేవంత్‌ రెడ్డి, హైదరాబాద్‌ జిల్లా ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేతులు మీదుగా ‘ ప్రతి ఇంటా ఇంకుడు గుంత–90 డేస్‌ స్పెషల్‌ డ్రైవ్‌’ పేరిట కార్యాక్రమానికి ప్రారంభింప జేసి నిరంతరం యజ్ఞంగా కొనసాగిస్తూ వస్తున్నారు.

31/08/2025

పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం
=================
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్(కేడీడబ్ల్యూఎస్పీ) ఫేజ్- 3, పంపింగ్ మెయిన్‌ కి సంబంధించి 1400 ఎంఎం డ‌యా పైప్‌లైన్‌పైన పి.వి.ఎన్‌.ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే, రాజేంద్రనగర్ వద్ద భారీ నీటి లీకేజీని అరిక‌ట్ట‌డానికి గానూ, అత్తాపూర్ ముసీ వంతెన వద్ద ఉన్న 300 ఎంఎం డ‌యా గల స్కవర్ వాల్వ్ ఎక్స్‌టెన్షన్ పైప్‌లో లీకేజీ పనులు.. అలాగే, మైలార్దేవ్‌పల్లి ఫేజ్-III పంప్ హౌస్‌లో పనిచేయని వాల్వ్‌లను మార్చడం వంటి మరమ్మత్తు పనులను చేపట్టనున్నారు.

ఈ ప‌నులు తేదీ: 01.09.2025, సోమవారం ఉద‌యం 11 గంటల నుండి 02.09.2025 మంగళవారం ఉదయం 7 గంటల వరకు మొత్తం 20 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి.

కాబట్టి ఈ 20 గంటల వరకు కృష్ణ డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్ - 3 రింగ్ మెయిన్ - 1 కింద ఉన్న రిజర్వాయర్ల ప‌రిధిలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 3- షేక్‌పేట్ రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 6- జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, ప్రశాసన్‌నగర్, తట్టిఖానా రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాలు.
3. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 15 - గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్ రిజర్వాయర్ ప‌రిధిలోని ప్రాంతాలు.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.

30/05/2025

Public Caution Notice
It has come to the attention of the Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMWSSB) that certain unsolicited WhatsApp messages are being circulated from unidentified mobile number 84271 56645, falsely claiming that water connections will be disconnected by HMWSSB at 9:30 PM tonight due to non-payment of previous month's bill. These messages further request recipients to contact 9064953421 for assistance.Upon contacting this number, citizens are being sent an APK file via WhatsApp, purportedly for further processing.
The HMWSSB hereby clarifies that no such messages are being sent by the Board via WhatsApp, and these communications are unauthorized and misleading. Citizens of Greater Hyderabad are strongly advised not to respond to such messages or contact the numbersmentioned or download or install any APK files sent via unsolicited WhatsApp numbers.
Further, department has requested Cyber Crimes to take up investigation in this regard.
All official communications from HMWSSB are issued through authorized channels only. For any clarification or service-related queries, citizens are requested to contact the official HMWSSB helpline 155313.

Issued in public interest by:
The Managing Director, Hyderabad Metropolitan Water Supply and Sewerage Board (HMWSSB)
Further, the department has requested Cyber Crimes to take up an investigation in this regard. App, and these communications are unauthorized and misleading. Citizens of Greater Hyderabad are strongly advised not to respond to such messages or contact the numbers mentioned, or download or install any APK files sent via unsolicited WhatsApp numbers.

07/03/2025

జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి జలమండలి సుదూరు ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తుంది. కాబట్టి.. నీటిని వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరుతోంది. ఇప్పటికే నగరంలో భూగర్భ జలాలు అడుగంటిపోగా కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. రానున్న రెండు నెలలు నీటికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు తాగునీటికై సరఫరా చేసే శుద్ధమైన నీటిని వృధా చేయకూడని విజ్ఞప్తి చేస్తోంది.

జలమండలి జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలో 13.7 లక్షల నీటి కనెక్షన్లు ఉండగా ప్రతి రోజూ 550 ఎంజీడీల నీటిని ప్రజలకు సరఫరా చేస్తోంది. వెయ్యి లీటర్ల (ఒక కిలోలీటరు) నీటి సరఫరాకు రూ.48 వ్యయం చేస్తోంది. కేవలం తాగునీటి కోసం ఉద్దేశించిన రక్షిత నీటిని వాహనాలను శుభ్రం చేయడానికి, గార్డెనింగ్, ఇళ్ల పరిసరాలను కడగడానికి వృధా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు.

07/03/2025

తేది: 07.03.2025
రేపు నీటి సరఫరాలో అంతరాయం

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా బీహెచ్ఈఎల్ జంక్షన్ దగ్గర ఫ్లై ఓవర్ నిర్మించనుంది. ఈ నేపథ్యంలో ఈ పనులకు ఆటంకం కలగకుండా ఎన్.హెచ్.ఎ.ఐ వినతి మేరకు అక్కడున్న జలమండలి పీఎస్సీ పైపులైన్ ను వేరే చోటకి మార్చనున్నారు. బీహెచ్ఈఎల్ ఫ్లై వద్దనున్న 1500 ఎంఎం డయా పైపులైన్ కు జంక్షన్ పనులు చేపట్టనున్నారు. ఇవి తేది.08.03.2024, శనివారం ఉదయం 6 గంటల నుంచి అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు జరగనున్నాయి. దీంతో ఈ 12 గంటల పాటు కింద పేర్కొన్న ప్రాంతాల్లో కొన్ని చోట్ల నీటి సరఫరాలో అంతరాయం మరికొన్ని చోట్ల లో-ప్రెజర్ తో నీటి సరఫరా జరుగుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు
1. ఓ అండ్ ఎం డివిజన్ - 6 : ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్.
2. ఓ అండ్ ఎం డివిజన్ - 9 : కేపీహెచ్బీ కాలనీ, కూకట్ పల్లి, మూసాపేట్, జగద్గిరిగుట్ట.
3. ఓ అండ్ ఎం డివిజన్ - 17 : ఆర్సీపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్.
4. ఓ అండ్ ఎం డివిజన్ - 22 : దీప్తి శ్రీ నగర్, బీరంగూడ, అమీన్ పూర్, నిజాంపేట్.

కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.

23/11/2024

ఓటీఎస్-2024 సద్వినియోగం చేసుకోండి.
=====================
హైదరాబాద్ నగరంలో దీర్ఘకాలికంగా పేరుకుపోయిన నల్లా కనెక్షన్ బిల్లులను వసూలు చేసేందుకు ఓటీఎస్-2024 పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న నల్లా బిల్లుల్ని.. ఎలాంటి ఆలస్య రుసుం, వడ్డీ లేకుండా చెల్లించే అవకాశాన్ని కల్పించింది.

08/03/2021

నేడు ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాలో పాక్షిక అంత‌రాయం
============================

హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-1,2 & 3 పంపింగ్ స్టేషన్లకు నిరంతరాయంగా విద్యుత్ ను సరఫరా చేసే బ‌ల్క్ ఫీడర్ల నిర్వహణ, దెబ్బతిన్న కరెంట్ ట్రాన్స్ఫార్మర్ (CT), పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ (PT)ల స్థానంలో కొత్తవి అమర్చుటకు కోదండపూర్, నాసర్లపల్లి మరియు గొడ‌కండ్ల‌ గ్రామాల్లోని జలమండలి పంపింగ్ స్టేషన్ల వద్ద ఉన్న 132 కెవి సబ్ స్టేషన్లకు తేదీ: 08.03.2021, సోమవారం రోజున ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 6 గంటలు విద్యుత్ సరఫరాను నిలిపివేయబడుతుంది.

కావున తేదీ: 08.03.2021, సోమవారం రోజున జలమండలి సరఫరా చేసే కృష్ణా ఫేస్ -1,2 & 3 ల‌లో కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో పాక్షిక అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు :

సంతోష్‌నగర్, వినయ్‌నగర్, సైదాబాద్, ఆస్మన్ ఘడ్, యాకుత్పుర, మహబూబ్ మాన్షన్, నారాయణగూడ, బొగ్గులకుంట, అడిక్ మెట్, శివమ్ రోడ్, చిల్కలగూడ, రియాసత్‌నగర్, అలియాబాద్, మిరాలం, బిఎన్. రెడ్డి నగర్,ఆటో నగర్, వనస్థలిపురం, మారుతీ నగర్, ఏలుగుట్ట‌, హబ్సిగూడ‌, నాచారం, బోడుప్ప‌ల్, తార్నాక‌, లాలాపేట్, మారేడ్ ప‌ల్లి, కంటోన్మెంట్, ఎమ్ఈఎస్, ప్రకాష్ నగర్, మేకల మండి, బాలాపూర్, మైసారం, సాహెబ్ నగర్, మైలార్ దేవ్ ప‌ల్లి, బండ్ల గూడ, పీడీపీ, గోల్డెన్ హైట్స్, సులేమాన్ నగర్, 9 నెంబర్ భోజగుట్ట, ఆళ్ళ బండ, గంధం గూడ, ఆసిఫ్ నగర్, ప్రశ్సన్ నగర్, మాదాపూర్, షేక్ పేట్ రిజర్వాయర్ ప్రాంతాలు.

కాబ‌ట్టి నీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం క‌ల‌గనున్న ప్రాంతాల్లోని వినియోగ‌దారులు నీటిని పొదుపుగా వాడుకోగ‌ల‌ర‌ని కోర‌డ‌మైన‌ది.

29/10/2020

పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం

29/10/2020

NO WATER SUPPLY TO CERTAIN AREAS

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Address


Khairatabad
Hyderabad
500004

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 10:30am - 5pm
Sunday 9am - 5pm