01/04/2026
ప్రత్యేక కృతజ్ఞతలు
ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నాయకత్వానికి అసలైన లక్షణం...
ఆ లక్షణాన్ని ఆచరణలో చూపించిన
గౌరవ ఐటీ శాఖ మంత్రి Duddilla Sridhar Babu శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు 🙏
మాట ఇస్తే తప్పనని తన నైజాన్ని
మరోసారి నిరూపిస్తూ
మీసేవ కుటుంబానికి నూతన ఉత్సాహాన్ని అందించారు 💪
తెలంగాణ మీసేవ ఫెడరేషన్ తరఫున
5,000 మీసేవ నిర్వాహకులు
మరియు 20,000 కుటుంబాల తరఫున
వారికి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు 💐
— తెలంగాణ మీసేవ ఫెడరేషన్
25/03/2026
Heartfelt Birthday Wishes to Sri T. Ravi Kiran, IFS
Commissioner, ESD – MeeSeva
Your visionary initiatives like Mee Ticket and your decision to bring MeeSeva Aadhaar VLEs into the in-house system, thereby safeguarding the livelihood of MeeSeva VLEs, are truly commendable.
Your efforts in strengthening digital citizen services continue to inspire many.
Wishing you good health, happiness, and continued success in public service.
Happy Birthday, Sir! 🎉
13/11/2025
తెలంగాణ వ్యాప్తంగా ఆధార్ సెంటర్లు నిర్వహిస్తున్న మీసేవ నిర్వాహకులకు
రాత్రి మరియు ఉదయం వేళల్లో ‘లాగిన్ అయినట్టు’ వస్తున్న ఇమెయిల్స్ సమస్యపై
ఈరోజు TV9 మరియు సాక్షి టీవీలలో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
13/11/2025
మీ సేవలో పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు వెల్లడి Duddilla Sridhar Babu Minister Sridhar Babu
12/11/2025
కమిషనర్ మీసేవ గారి ఆధ్వర్యంలో ఈ రోజు వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లా ఆధార్ ఎన్రోల్మెంట్స్ కొత్తకిట్ల పంపిణీ కార్యక్రమంలో
11/11/2025
కమిషనర్ మీసేవ గారి ఆధ్వర్యంలో ఈ రోజు జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట జిల్లా ఆధార్ ఎన్రోల్మెంట్స్ కొత్తకిట్ల పంపిణీ కార్యక్రమంలో
10/11/2025
కమిషనర్ మీసేవ గారి ఆధ్వర్యంలో ఆధార్ ఎన్రోల్మెంట్స్ కొత్తకిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆదిలాబాద్, కొమురంభీమ్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, ములుగు జిల్లా మీసేవ మిత్రులతో
02/11/2025
📍 తెలంగాణ మీసేవ ఫెడరేషన్ సమాచారం
Duddilla Sridhar Babu Minister Sridhar Babu
ఈరోజు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని మినిస్టర్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలుసుకున్నాము.
ఈ సందర్భంగా మీసేవ నిర్వాహకులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, సేవల అమలులో ఉన్న సాంకేతిక మరియు పరిపాలనా ఇబ్బందులు, అలాగే ఫెడరేషన్ ప్రతిపాదనలు గురించి సమగ్రంగా చర్చించాం.
మంత్రిగారు సానుకూలంగా స్పందించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రతి సంవత్సరం మనం నవంబర్ 4వ తేదీ మీసేవ ఆవిర్భావ దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమం మంత్రివర్యులు యొక్క ఎన్నికల షెడ్యూల్ కారణంగా ఆ రోజు కార్యక్రమం నిర్వహించలేకపోతున్నాము.
ఇట్లు,
మీ తెలంగాణ మీసేవ ఫెడరేషన్
25/09/2025
తెలంగాణ మీసేవ నిర్వాహకుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు
ఈ రోజు నిజామాబాద్ జిల్లా మీసేవ మిత్రులతో కలిసి గౌరవనీయులు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారిని (మాజీ స్పీకర్ & ప్రస్తుత రాజ్యసభ సభ్యులు) వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసే అవకాశం లభించింది.
మన మీసేవ నిర్వాహకులు ఆధార్ యాక్టివేషన్ సమస్యలతో ఎదుర్కొంటున్న ఇబ్బందులను సవివరంగా వివరించగా, గౌరవ రాజ్య సభ సభ్యులు మన వినతి పత్రాన్ని పూర్తిగా చదివి, త్వరలోనే సంబంధిత అధికారులతో పాటు కేంద్ర మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ గారితో కూడా ఈ విషయమై మాట్లాడి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
మన సమస్యలను గమనించి, అమూల్యమైన సమయం కేటాయించినందుకు గౌరవనీయులు శ్రీ కేఆర్ సురేష్ రెడ్డి గారికి తెలంగాణ మీసేవ నిర్వాహకులందరి తరఫున మరియు నిజామాబాదు జిల్లా మీసేవ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
KR Suresh Reddy
18/08/2025
MeeSeva delivers essential services to lakhs of citizens every day with dedication. Recent threats to our Commissioner are unacceptable. We urge authorities to ensure safety for all MeeSeva officials, staff and operators.
మీసేవ ప్రతిరోజూ లక్షలాది పౌరులకు నిబద్ధతతో అవసరమైన ప్రభుత్వ సేవలను అందిస్తోంది. ఇటీవల కమిషనర్ గారిపై జరిగిన బెదిరింపులు అసహ్యకరమైనవి. అన్ని మీసేవ అధికారులు, సిబ్బంది మరియు ఆపరేటర్లకు భద్రత కల్పించవలసిందని మేము అధికారులను కోరుతున్నాం.