12/03/2024
Summer Action Plan By . By Making Water Availability To Wildlife, Prevention Of Forest Fires. Vigilant To Curb Poaching Activities.
Telangana CMO
Anumula Revanth Reddy
Konda Surekha
Hi Hyderabad
Tsfdc Eco-Tourism Telangana State
07/03/2024
మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రువర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
మహాశివరాత్రి సందర్భoగా చేపట్టే ఉపవాసం, జాగరణలు మనలో ఆత్మ శుద్ధిని కలిగిస్తాయని మంత్రి అన్నారు. ప్రజలంతా భక్తిప్రపత్తులతో మహాశివరాత్రి పండుగను జరుపుకోవాలని కోరారు. ఆ మహాశివుడి కృప ప్రజలందరి పై ఉండాలని ప్రార్థించారు.
Telangana CMO
Anumula Revanth Reddy
Konda Surekha
Hi Hyderabad
03/03/2024
*ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (మార్చి 3) సందర్భంగా అటవీ, పర్యావరణం, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారి సందేశం*
ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని, వన్యప్రాణుల మనుగడ, రక్షణ చర్యలపై అవగాహన కల్పిస్తూ ప్రతీ యేటా మార్చి 3 న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం జరుపుకుంటున్నాం. సాంకేతిక అభివృద్ది, కొత్త ఆవిష్కరణలను వన్యప్రాణుల రక్షణ కోసం వాడాలనే సంకల్పంతో ఈ యేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవాన్ని (వరల్డ్ వైల్డ్ లైఫ్ డే) జరుపుకుంటున్నాం.
జీవ వైవిధ్యం, అన్ని ప్రాణుల మనుగడే సమతుల్యమైన ప్రకృతికి జీవనాధానం. అభివృద్ది పేరిట అడవులు, ఇతర జంతుజాలం పట్ల మనుషుల వైఖరిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయి. దీంతో వన్యప్రాణుల మనుగడపై తీవ్ర ఒత్తిడి చోటు చేసుకుంటోంది. మనతో పాటు రానున్న తరాలకు కూడా నివాసయోగ్యమైన పరిసరాలు కావాలంటే అన్ని జీవరాసుల మనుగడ, సహజీవన సూత్రాన్ని కొనసాగించాలి.
జంతువులు, పక్షులు, వృక్ష జాతులతో కూడిన పర్యావరణ రక్షణ అందరి సంకల్పం కావాలి.
మనుషులు, జంతువుల మధ్య సంఘర్షణ పెరుగుతోంది. జంతు ఆవాసాల్లో మనుషుల చొరబాట్ల వల్లే ఈ సమస్య వస్తోంది. దీనిని వీలైనంతగా తగ్గించటం మనందరి బాధ్యత. అలాగే మనుషుల నిర్లక్ష్యంతో జరుగుతున్న అటవీ అగ్నిప్రమాదాలను నివారించాలి. అటవీ మార్గాల్లో ప్రయాణాల్లో ప్రతీ ఒక్కరూ అప్రమత్తతతో వ్యవహరించాలి. ఎండాకాలం జంతువులు, పక్షుల నీటి వసతికి వీలైనంతగా అందరూ సహకరించాలి. అటవీ నేరాల అదుపుకు, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్ నివారణకు ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి.
పర్యావరణ సమతుల్యత, జంతుజాలం, మనుషుల జీవనం పరస్పర ఆధారాలు. ఇందులో ఏ ఒక్కటి లోపించినా మిగతా వాటి జీవనంపై ప్రభావం పడుతుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. బాధ్యతతో మెలగాలని ఆశిస్తున్నా.
Telangana CMO
Anumula Revanth Reddy
Konda Surekha
Hi Hyderabad
26/02/2024
అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆవిష్కరించారు. సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్దిపై శిక్షణను ఇచ్చేందుకు హైదరాబాద్ శివారు ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలకు తేనెటీగల పెంపకంపై వారం రోజుల శిక్షణా కార్యక్రమాలను ఫారెస్ట్ కాలేజీ అందిస్తున్నది. ఈ సెంటర్ ఆధ్వర్యంలో పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో అభివృద్ది చేసిన తేనెను “వైల్డ్ ఫ్లేవర్స్” బ్రాండ్ పేరుతో ఫారెస్ట్ కాలేజీ అందుబాటులోకి తెస్తున్నది. ములుగు ఫారెస్ట్ కాలేజ్ లో త్వరలో ఒక తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు డీన్ ప్రియాంక వర్గీస్ తెలిపారు.
26/02/2024
*ములుగు ఫారెస్ట్ కాలేజ్ ఆధ్వర్యంలో ఉత్పత్తి చేసిన తేనె “వైల్డ్ ఫ్లేవర్స్”ను ఆవిష్కరించిన మంత్రి శ్రీమతి కొండా సురేఖ గారు*
అటవీ కళాశాల, పరిశోధనా సంస్థ (FCRI) ఆధ్వర్యంలో శాస్త్రీయంగా పెంచుతున్న తేనెటీగల కేంద్రం నుంచి తయారు చేసిన ఆర్గానిక్ (సేంద్రియ) తేనెను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆవిష్కరించారు. సేంద్రియ ఉత్పత్తులను ఆదరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
రైతులకు తేనెటీగల పెంపకం, ఆదాయ అభివృద్దిపై శిక్షణను ఇచ్చేందుకు హైదరాబాద్ శివారు ములుగులో ఉన్న ఫారెస్ట్ కాలేజీలో ప్రత్యేక తేనెటీగల పెంపకం, ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పారు. రైతులతో పాటు ఔత్సాహిక వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు, మహిళలకు తేనెటీగల పెంపకంపై వారం రోజుల శిక్షణా కార్యక్రమాలను ఫారెస్ట్ కాలేజీ అందిస్తున్నది. ఈ సెంటర్ ఆధ్వర్యంలో పూర్తి సేంద్రీయ పద్ధతుల్లో అభివృద్ది చేసిన తేనెను “వైల్డ్ ఫ్లేవర్స్” బ్రాండ్ పేరుతో ఫారెస్ట్ కాలేజీ అందుబాటులోకి తెస్తున్నది. ములుగు ఫారెస్ట్ కాలేజ్ లో త్వరలో ఒక తేనె విక్రయ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు డీన్ ప్రియాంక వర్గీస్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, ఫారెస్ట్ కాలేజీ డీన్ ప్రియాంక వర్గీస్, తదితరులు పాల్గొన్నారు.
FCRI CARES Wild flavors.
forest honey was launched today (26-02-2024) by Hon’ble Minister (Environment & Forests, Endowment) Smt Konda Surekha madam, Smt. A. Vani Prasad, IAS Prl. Secretary (Environment, Forests, Science & Technology), R.M. Dobriyal Principal Chief Conservator of Forests & HoFF, Telangana Forest Department, Government of Telangana,Forest department officials, Smt. Priyanka Varghese, Dean of Forest College and Research Institute, Sailaja, Assistant Professor, FCRI into the market.
Integrated Beekeeping Development Centre is established at Forest College and Research Institute, Mulugu, Siddipet District, Telangana to create awareness on Scientific Beekeeping to promote beekeeping as sustainable livelihood to rural people and post harvest management of honey and other beehive products (beeswax, bee pollen, propolis, royal jelly, comb honey , bee venom).. As a part this project we have started beekeeping at IBDC with 500 beehives kept inside forest and harvested pure, organic, natural and certified forest honey with a brand name of FCRI CARES wild flavors. We have established Honey testing laboratory, Bee disease Diagnostic laboratory, honey and other beehive products processing unit at IBDC, FCRI. We are giving 7 days training on Scientific Beekeeping to the farm and non farm rural people, women, students, entrepreneurs and department employees from Telangana and other states.
Telangana CMO
Anumula Revanth Reddy
Konda Surekha
Hi Hyderabad
26/02/2024
*ప్రకృతే శాశ్వతం, పచ్చదనంతోనే మానవ జీవితానికి పరిపూర్ణత*
*మానవ మనుగడ పచ్చని అడవులు, మంచి పర్యావరణంపైనే ఆధారపడి ఉంది.*
*అడవుల రక్షణ కోసం అధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలి*
*మాది ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం, సమస్యలు ఉంటే ఓపెన్ గా చెప్పండి*
*అటవీశాఖపై రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో మంత్రి కొండా సురేఖ*
అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ వేదికగా అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అరణ్యభవన్ కు వచ్చిన మంత్రికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు.
సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎం.సీ. పర్గెయిన్, విజిలెన్స్ పీసీసీఎఫ్ ఏలూసింగ్ మేరు, అన్ని జిల్లాలకు చెందిన కన్జర్వేటర్లు, అటవీ అధికారులు హాజరయ్యారు.
సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తమది ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉండే ప్రభుత్వమని, అధికారులు, సిబ్బంది తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకోవచ్చని అన్నారు. క్షేత్ర స్థాయి అధికారుల చెప్పిన విషయాలను ఓపికగా విన్న మంత్రి తన తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా రోడ్లు, భవనాల శాఖలో పనిచేశారని, ప్రభుత్వ ఉద్యోగుల కష్ట సుఖాలు తనకు తెలుసు అన్నారు. అదే సమయంలో ప్రతీ అధికారి కుటుంబంతో సహా పనిచేసే ప్రదేశంలోనే నివాసం ఉండాలన్నారు. అడవులు రక్షణ అనేది అన్నింటికంటే ముఖ్యమైన విధి అని, రానున్న రోజుల్లో అత్యంత సవాల్ తో కూడిన ఈ బాధ్యతలను అందరూ సమర్థవంతంగా నెరవేర్చాలన్నారు. ఇటీవల కాగజ్ నగర్ లో పులుల మరణం తనను కలిచివేసిందని, రానున్న రోజుల్లో అలాంటి సంఘటనలు జరగకూడదని అన్నారు.
అడవుల రక్షణపై కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి అటవీ రక్షణ కమిటీల సమావేశాలు క్రమం తప్పుకుండా జరగాలని అన్నారు. గత ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటామని చెప్పినప్పటికీ ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. తెలంగాణ స్థానిక జాతులు చెట్ల విత్తనాలు సేకరించి, మెరుగైన మొక్కలను నర్సరీల్లో పెంచాలన్నారు. చింత, జామ, నేరేడు, రేగు, సీతాఫలం, మునగ లాంటివి పెంచటం వల్ల అటవీ జంతువులు బయటకు రాకుండా ఉంటాయన్నారు. హరితహారం వచ్చే సీజన్ పై జిల్లా సమీక్షా సమావేశాలు జరిపి లక్ష్యాలతో పాటు, అవసరమైన మెటీరియల్ ను సిద్దం చేసుకోవాలన్నారు.
రాష్ట్రంలో మిగతా పట్టణ ప్రాంతాలతో పాటు ట్రై సిటీస్ గా ఖ్యాతిగాంచిన వరంగల్, హన్మకొండ, ఖాజీపేట మూడు నగరాల్లో పచ్చదనం పెంపు, పార్కుల సుందరీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యతను ఇస్తాము, అదే సమయంలో చట్ట వ్యతిరేకంగా అడవుల ఆక్రమణ చేపడితే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. అడవుల ఆక్రమణను సహించమని, గుత్తికోయ ప్రభావిత ప్రాంతాల్లో తదుపరి ఆక్రమణలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం ఇతర శాఖల మద్దతు కూడా తీసుకోవాలని సూచించారు.
కొత్తగా అటవీ స్టేషన్ల ఏర్పాటు, సిబ్బందికి ఆయుధాల విషయం ప్రభుత్వ పరిధిలో ఉందని, చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అడవులకు సంబంధించి కోర్టు వివాదాలను త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. అటవీశాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కూడా సత్వర చర్యలు తీసుకుంటామని అన్నారు. స్మగ్లర్లపై కఠిన చర్యల కోసం పీడీ యాక్ట్ పెట్టేందుకు పోలీస్ శాఖ సహకారం తీసుకోవాలని సూచించారు.
విధి నిర్వహణలో బాగా పనిచేసి అధికారులు, సిబ్బందిని మరింతగా ప్రోత్సహించేందుకు, అవార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ ను మంత్రి ఆదేశించారు.
వేసవిలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణ, జంతువులకు నీటి వసతిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. పెంపుడు పశువులు అడవుల్లోకి పోకుండా, అటవీ శివారుల్లో “పల్లె పశువుల వనాల” ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అన్నారు. అడవుల్లో ప్లాస్టిక్ నియంత్రణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, అలాగే మంచి ప్రాంతాలను గుర్తించి ఎకో టూరిజం అభివృద్ది ద్వారా ప్రజలకు పర్యావరణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి తెలిపారు. ఎకోటూరిజంలో స్థానిక గిరిజనులకు, చెంచులకు ఉపాధి అవకాశాలను కల్పించాలని అన్నారు. కంపా నిధుల వినియోగం, అడవుల పునరుద్దరణ, హరితనిధి, పోడు భూములకు పట్టాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కుల పురోగతి, ఫారెస్ట్ కాలేజీ, ప్రత్యామ్నాయ అటవీకరణ కోసం కేటాయించిన భూముల నోటిఫికేషన్లు తదితర అంశాలను సమీక్షా సమావేశంలో భాగంగా మంత్రి కొండా సురేఖ చర్చించారు.
Telangana CMO
Anumula Revanth Reddy
Konda Surekha
Hi Hyderabad
18/02/2024
*కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ వేగవంతం*
*వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న పునరావాస కాలనీ*
కవ్వాల్ పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ వేగవంతం అయింది. అటవీ ప్రాంతం కోర్ ఏరియా నుంచి గ్రామాల తరలింపు, పునరావాసం కాలనీ పనుల పురోగతిని కవ్వాల్ లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఏం.డోబ్రియాల్ ఇవాళ సమీక్షించారు. స్థానిక అధికారులతో కలిసి పునరావాస కాలనీని సందర్శించటంతో పాటు, లబ్దిదారులతో సమావేశం అయ్యారు.
పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపుపై ఇటీవల సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ఆరాతీశారు. తరలింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండటంతో పాటు, మిగతా గ్రామాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి సూచించారు. దీనిలో భాగంగా పీసీసీఎఫ్ ఇవాళ క్షేత్ర పర్యటన చేశారు.
మొదటి దశలో పునరావాసానికి రాంపూర్, మైసంపేట గ్రామాలు స్వచ్ఛందంగా అంగీకరించాయి. కేంద్ర ప్రభుత్వం (NTCA) నిబంధనల ప్రకారం రెండు ప్రతిపాదనలతో అటవీశాఖ పనులను చేపట్టింది. గ్రామాల తరలింపులో భాగంగా ఒక్కో కుటుంబానికి ఏకమొత్తంగా 15 లక్షల రూపాయల పరిహారం అందిచటం ఒక ప్రతిపాదన. దీనికి 48 కుటుంబాలు అంగీకరించి ఆ మేరకు పరిహారం స్వీకరిస్తున్నాయి. ఇక రెండవ ప్రతిపాదనకు అంగీకరించిన 94 కుంటుంబాలకు అవే 15 లక్షల పరిహారంలో భాగంగా ఒక ఇల్లు నిర్మాణంతో పాటు సాగు భూమిని కూడా ప్రభుత్వం సమకూర్చుతోంది.
కవ్వాల్ కు సమీపంలోనే అటవీ ప్రాంతం బయట కొత్త మద్ది పడగలో అన్ని వసతులతో పునరావాస కాలనీ నిర్మాణం వేగంగా జరుగుతోంది. మొత్తం 12.36 ఎకరాల్లో కాలనీ నిర్మాణం అవుతోంది. ఒక్కో కుటుంబానికి 333 చదరపు గజాల్లో ఇల్లు, 2.81 ఎకరాల సాగుభూమిని అందిస్తున్నారు. కాలనీలో సామాజిక ఏర్పాట్లు, పనుల తీరుగా లబ్దిదారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
పనులన్నీ పూర్తి కాగానే ప్రభుత్వ ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటుచేసి లబ్దిదారులకు అందిస్తామని
పీసీసీఎఫ్ తెలిపారు.
పర్యటనలో కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారామ్, నిర్మల్, మంచిర్యాల డిఎఫ్ఓలు రామ్ కిషన్ ఆశీష్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Telangana CMO
Anumula Revanth Reddy
Konda Surekha
Hi Hyderabad