Cpi Telangana

Cpi Telangana

Share

Fighting for social justice, equality, and the rights of the working class...

People’s issues are our agenda.

Democracy is our path...

CPI Telangana – Voice of workers, farmers, youth,Students and women.”

04/06/2026

విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి కామెంట్స్...

నాగేశ్వర్ చేసిన విశ్లేషణ సరైందా కదా అన్నది వేరు... పత్రికలకు సోర్స్ అనేది రాజ్యాంగం కల్పించిన భద్రత

ఎవరు చెప్పారు అని అడిగే అవసరం ఉండదు అక్కడ

రాజకీయపరమైన విశ్లేషణ అది

పత్రికలకు, గోడలకు చెవులు ఉంటాయి.. ఎవరో ఒక్కరు చెబుతూనే ఉంటారు

పలకడానికి కూడా ఇష్టపడని మాటలతో నాగేశ్వర్ మీద దాడికి పాల్పడ్డారు

క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటి.. ఆయన చేసిన నేరమేంటి?

భావ ప్రకటన స్వేచ్ఛ మీద దాడి ఏంటి

నాగేశ్వర్ కేంద్రం గా ఇంత దాడి జరగాల్సిన అవసరం ఏముంది

నాగేశ్వర్ అనే కాదు ఎవరి మీద దాడి జరిగినా.. మనం స్పందించాల్సిందే

లేనిపోని అర్థం లేని వివాదం సృష్టించడం తప్ప.. ఏం లేదు

తెలుగు జాతి లేదు.. తెలుగు భాష ఉందని నమ్ముతాను

లేనిపోని రూపకల్పన.. తెలుగు జాతి

ఎవరు ఎక్కడైనా పోటీ చెయ్యండి.. మిమల్ని ఎవరు వద్దన్నారు

ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమైంది

భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ఉండాలన్న ఫజల్ అలీ కమిషన్ ది ప్రాంతీయ వాదమా

ప్రాంతీయవాదం, అస్థిత్వవాదానికి ఉన్న భేదం తెలియదా

ఒకే భాష మాట్లాడే వాళ్ళకు రెండు రాష్ట్రాలు ఉండొద్దా

ఉగ్రవాదం, పాకిస్తాన్, పాలస్తీనా ప్రస్తావన ఎందుకు వచ్చింది

పాలస్తీనా తో పోల్చండి.. కానీ పాకిస్థాన్ తో కాదు

హైదరాబాద్ లో చెరువులను చెరబట్టింది ఎవరు

ఎవరి అస్థిత్వం మీద ఎవరు దాడి చేశారు

మేము మాట్లాడితే ఉగ్రవాదులం అవుతామా

మీ అభిప్రాయాలు మార్చుకుని.. రూపాంతరం చెందినా మేము ఏం మాట్లాడలేదు కదా

04/06/2026

ప్రో.నాగేశ్వర్ కామెంట్స్...

తెలుగు రాష్ట్రాల్లో అసలు వేరే సమస్య లేనట్టుగా చేశారు

చట్టం ఒప్పుకోని.. ప్రభుత్వమే కేసులు పెట్టింది

కుల ప్రస్తావన లేకున్నా.. ఆ అంశoపైనా కేసు పెట్టారు

ఎవరు మాట్లాడినా ఇదే జరుగుతుంది అనేట్టు కేసులు పెట్టారు

ప్రజల పక్షాన మాట్లాడితే.. భావ ప్రకటన స్వేచ్ఛ ను అంగీకరించo అనే ధోరణి

పదవులు, ప్రలోభాల కోసం మాట్లాడితే.. ఇదంతా ఉండేది కాదు.. ఆ ఉద్దేశ్యం ఎప్పుడూ లేదు

ప్రాణం ఉన్నంత వరకూ మాట్లాడుతూనే ఉంటాను

సోషల్ మీడియాలో అనేకంగా ట్రోల్ చేశారు

రాజ్యాంగ పరిరక్షణకు నా ఘటన నాంది పలికితే నా జన్మ ధన్యం అవుతుంది

ఇది కేవలం నాగేశ్వర్ అంశంగా చూడొద్దు.. రాజ్యాంగ పరిరక్షణ, విలువల అంశంగా చూడాలి

04/06/2026

కే.శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు

పవన్ వ్యాఖ్యల్లో చాలా అభ్యంతర అంశాలున్నాయి

ప్రాంతీయ అంశాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టడం ఖండించాల్సిందే

ఈ వ్యవహారాన్ని క్రిమినలైజ్ చేసే ప్రయత్నం

రెండు ప్రాంతాల ప్రజలకు ఇది మంచిది కాదు

రెండు రాష్ట్రాల ప్రజలు సహజ మిత్రులు.. ఎలాంటి వైరం లేదు

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఏపీ ప్రజలు సమర్థించారు

పాలకులు వాళ్ళకు అవసరం అయినప్పుడల్లా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు

విశ్లేషకులను, విలేకరులను.. రాజకీయ వాదుల్లాగా దూషించడం దారుణం

రేవంత్ రెడ్డి తల నరుకుతున్నట్టుగా పవన్ అభిమాని పోస్ట్ చేయడం ఎలాంటి సంకేతం

నాగేశ్వర్ ను చాలా అన్యాయంగా ట్రోల్ చేశారు

తమిళనాడులో విజయ్ గెలిచాక.. ఆయన అంత సులభంగా గెలిస్తే.. నేను పదిహేనేళ్లుగా ఎందుకు కాలేకపోతున్నా అని ఆయనే చెప్పుకున్నాడు

టిడిపి మహానాడు చేసుకుంటే.. జనసేన ఏమి చెయ్యలేని స్థితి

ఆ ప్రస్టేషన్ లోనే పవన్ అలా మాట్లాడాడేమో

ప్రో. నాగేశ్వర్ మీద కేసుకు ఎత్తేయాలి

04/06/2026

ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్..
తెలంగాణకు ఎవరు రావొద్దని అనలేదు...

ఎవరికి ఎక్కడైనా ఉండే స్వేచ్ఛ ఉంది...

నాగేశ్వర్ అంశాన్ని అడ్డుగా పెట్టుకుని బిజెపి అజెండాను అమలు చేస్తున్నట్టు అనిపిస్తుంది..

హైదరాబాద్ ను UT గా చేసే కుట్ర అనిపిస్తోంది...

బీజేపీ నేరుగా ఏమి చెయ్యదు.. పరీక్ష ఎత్తుగడలో ఇతరులను పావుగా వాడుకుంటుంది..
ఆ పావే పవన్ అనుకుంటున్నాం...

జర్నలిస్టులపై రాజకీయ దేశాలను ఉపేక్షించం..

04/06/2026

ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణపై కక్షపూరిత దాడిని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు పశ్య పద్మ

04/06/2026

ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణపై కక్షపూరిత దాడిని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాధినేని వెంకటేశ్వర్లు

04/06/2026

ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణపై కక్షపూరిత దాడిని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య

04/06/2026

ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రాజకీయ విశ్లేషణపై కక్షపూరిత దాడిని ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కామ్రేడ్ కె రమ.

04/06/2026

ప్రజల గొంతు ప్రొఫెసర్ నాగేశ్వర్ ను కాపాడుకోవాలి/ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Website

Address


3-6-201 Makhdoom Bhavan, Himayath Nagar, Hyderebad
Hyderabad
500029