Aiyf Telangana

Aiyf Telangana

Share

" Youth for a vibrant secular, democratic India with equal rights and oppurtunites for all "

04/06/2026

#𝙥𝙖𝙬𝙖𝙣𝙠𝙖𝙡𝙮𝙖𝙣

04/06/2026

03/06/2026

*యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలి*

*రోషన్ కుమార్ సిన్హా* పిలుపు
ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు

యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటాలు ఉధృతం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా పిలుపునిచ్చారు. ఈ రోజు హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో జరుగుతున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్బంగా *ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు కామ్రేడ్ రోషన్ కుమార్ సిన్హా*. మాట్లాడుతూ దేశంలో యువత ఎదుర్కొంటున్న నిరుద్యోగం, విద్యా సంక్షోభం, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, కాంట్రాక్టు ఉద్యోగాల పెరుగుదల, పెరుగుతున్న ఫీజులు, సామాజిక అసమానతలు వంటి అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించామన్నారు .
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి, యువతను మోసం చేసిందన్నారు . పదేళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమైందని విమర్శించారు . కేంద్ర ప్రభుత్వ శాఖల్లో లక్షలాది ఖాళీలు భర్తీ కాకుండా , ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను అమలు చేస్తోందన్నారు . రైల్వేలు, రక్షణ రంగం, బ్యాంకులు, బీమా సంస్థలు, విద్యా రంగంలో ప్రైవేటీకరణ వేగవంతం చేయడం వల్ల ఉద్యోగ అవకాశాలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు . విద్యా రంగంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు సామాన్య, మధ్యతరగతి విద్యార్థులపై భారంగా మారాయన్నారు . ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా, కార్పొరేట్ విద్యాసంస్థలకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.
దేశంలో యువత ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అందుకే ఇటీవల వివిధ రాష్ట్రాలలో ప్రజలు బీజేపీ విధానాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారన్నారు . నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సంక్షోభం, విద్యా-ఉపాధి సమస్యల నేపథ్యంలో ప్రత్యామ్నాయ ప్రజా రాజకీయాల పట్ల యువత ఆకర్షితులవుతున్నారని,
ఈ పరిస్థితుల్లో శాంతి, అభ్యుదయం, శాస్త్రీయ సోషలిజం అనే ఏఐవైఎఫ్ సిద్ధాంతాలతో యువతను సంఘటితం చేసి, ఉద్యోగ హక్కు, విద్య హక్కు, సామాజిక న్యాయం, ప్రభుత్వ రంగ పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత విస్తృతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

అదే విధంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర*. మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, రైల్వేలు, బ్యాంకులు, బీమా సంస్థల ప్రైవేటీకరణను నిలిపివేయాలని, యువతకు గౌరవప్రదమైన ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నైపుణ్యాభివృద్ధి పేరుతో జరుగుతున్న కార్పొరేట్ దోపిడీని అరికట్టాలని, విద్య, ఉద్యోగాలలో సామాజిక న్యాయం అమలు చేయాలని, యువత సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని, రాష్ట్రంలోని ప్రతి జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఉద్యమాలను నిర్మించేందుకు ఏఐవైఎఫ్ కార్యకర్తలు సిద్ధం కావాలని ఈ సమావేశం పిలుపునిస్తోందన్నారు.

*AIYF తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలను యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లో సెప్టెంబర్ 8,9 తేదీలలో నిర్వహించాలని తీర్మానించడం జరిగింది*.

ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వెంకటేశ్వర్లు, లింగం రవి, టి. సత్య ప్రసాద్, పేరబోయిన మహేందర్, యుగంధర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆర్. బాలకృష్ణ, మొగిలి లక్ష్మణ్, పి. శివ కుమార్, ఎల్లంకి మహేష్, శేఖర్, రాజ్ కుమార్, మహేష్, ఆంజనేయులు, నయీమ్, హేమంత్, వెంకటేష్, మధుకర్, భాను పాల్గొన్నారు.

Photos from Aiyf Telangana's post 03/06/2026

AIYF National President Comrade Roshan Kumar Sinha attended the AIYF Telangana State Council Meeting as the Chief Guest at the AIYF State Office, Narayanaguda, Himayatnagar, Hyderabad.

Addressing the State Council, Comrade Roshan Kumar Sinha spoke extensively on the challenges and issues faced by youth across the country. He highlighted various national-level developments affecting employment, education, social justice, and democratic rights. He emphasized the need for young people to actively participate in movements that safeguard the interests of students, unemployed youth, and working people. He also outlined the future programmes and campaigns of AIYF at the national level and called upon the Telangana unit to strengthen the organization at the grassroots level.

The meeting was presided over by AIYF Telangana State President Dr. Syed Vali Ullah Khadri. AIYF Telangana State Secretary Comrade K. Dharmendra presented a detailed report on the activities and organizational initiatives undertaken by the state unit during the review period. The report covered membership drives, youth awareness programmes, campaigns on education and employment, and various struggles conducted across Telangana.

State Council members actively participated in the discussions and shared their views on strengthening the organization and addressing the concerns of youth in the state. The meeting concluded with a resolve to expand AIYF's activities and intensify struggles for the rights and welfare of young people.

01/06/2026

Photos from Aiyf Telangana's post 01/06/2026

Dr. Syed Vali Ullah Khadri, AIYF National Secretary, addressed the Andhra Pradesh AIYF State Political Classes at the State-Level Youth, Education, Scientific and Cultural Camp organized by the All India Youth Federation (AIYF) from June 1 to 5, 2026, at Kotappakonda, Palnadu District, Andhra Pradesh.

During his address, Dr. Khadri emphasized the importance of ideological education, scientific temper, secular values, social justice, and strengthening the youth movement to meet the challenges facing the country. He called upon young people to actively participate in democratic struggles and work towards building a progressive and inclusive society.

Red Salute! ✊🚩

Photos from Aiyf Telangana's post 31/05/2026

ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జి డా. సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి మాట్లాడుతూ, జూన్ 1 నుండి 5 వరకు గుంటూరులో నిర్వహించబడనున్న ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ శిక్షణా తరగతులకు హాజరయ్యేందుకు వరంగల్ నుండి శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరుకు ప్రయాణిస్తున్నానని తెలిపారు.

ఈ రాజకీయ శిక్షణా తరగతులు యువతలో రాజకీయ చైతన్యం, సామాజిక బాధ్యత మరియు ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం నలుమూలల నుండి పాల్గొనే యువ నాయకులతో కలిసి చర్చలు జరిపి, యువజన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.
✊🚩

డా. సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి
ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి
ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇన్‌ఛార్జి

31/05/2026

ప్రముఖ సాహితీవేత్త, అరసం నాయకులు, నవచేతన విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సుదీర్ఘ సంపాదకులు అయిన డాక్టర్ ఏటుకూరి ప్రసాద్ గారి సంస్మరణ సభ హిమాయత్ నగర్ లోని మగ్గంభవన్లో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధులుగా CPI జాతీయ కంట్రోల్ కమీషన్ ఛైర్మెన్ కె. నారాయణ, CPI తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Hyderabad
500029