28/12/2016
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao addressing the august gathering after felicitating Sri Rajeev Sharma, the outgoing Chief Secretary, at a function held at Secretariat on Wednesday.
Telangana Secretariat, Khairatabad, Hyderabad, Telangana, India
28/12/2016
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao addressing the august gathering after felicitating Sri Rajeev Sharma, the outgoing Chief Secretary, at a function held at Secretariat on Wednesday.
29/11/2016
Telangana Government preparing to enable cashless transactions across the state.
29/11/2016
Hon'ble Chief Minister Sri K. Chandrashekar Rao addressing in a Press Meet held at Secretariat on Monday.
16/11/2016
01/11/2016
Ease of doing biz rank: KCR lauds Telangana officials
Telangana Chief Minister K Chandrasekhar Rao today expressed happiness over the state being ranked No 1 among the states in ease of doing business.
The chief minister congratulated the officials who contributed to the achievement, a release from his office said.
Andhra Pradesh and Telangana have jointly dislodged Gujarat to emerge as the best states to do business in the country, according to a report by the World Bank and DIPP.
"We have reached top position this year from the 13th position last year due to the hard work put up by the employees besides simplified government policies. We must continue the spirit and offer better and quality services," the chief minister said.
Principal Secretary for Industries Arvind Kumar said the state has received nearly Rs 55,000-crore investment last year alone. "Our endeavour is to make the state No 1 destination for investments. Accordingly, we made systemic changes. It is not just ranking as such. We have approved 2,550 investment proposals in the last one year," Kumar told PTI.
"Though both AP and Telangana have got equal scores (98.78 per cent), AP's name has come first in the alphabetical order," Kumar added.
Source: PTI
28/10/2016
ఇదేం సచివాలయం!
- ఇరుకు గల్లీలా అధ్వాన్నస్థితి.. వాహనాల పార్కింగ్‌కు ఇబ్బంది
- కలెక్టర్ల సమావేశాలకు స్థలం కరువు.. ఆలయాలు, హెలీప్యాడ్లూ పార్కింగులే
- రోడ్ల మీద సందర్శకుల పాట్లు..
- విశాల ప్రాంగణాన్ని నాశనం చేసిన ఉమ్మడిపాలకులు
- పునర్వైభవానికే నూతన సచివాలయ నిర్మాణ సంకల్పం
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒకనాడు నిజాం కాలంలో హుస్సేన్‌సాగర్ ఒడ్డున విశాల ప్రాంగణంలో ఠీవిని ఒలకబోస్తూ తలెత్తుకుని సగర్వంగా నిలిచిన సచివాలయం ఉమ్మడి పాలకుల పుణ్యమా అని ఇరుకు గల్లీగా మారిపోయింది. మారుమూల గల్లీల్లో ఉన్నట్టు వాహనాలు ఎదురెదురుగా వస్తే వెళ్లలేని స్థితి ఏర్పడింది. పనుల కోసం వచ్చే సందర్శకుల సగం సమయం పార్కింగ్ స్థలం వెతుకులాటకే పోతున్నది.
ముఖ్యమంత్రి, మంత్రులు బయటకు వెళ్లాలంటే సచివాలయ ప్రాంగణంలోనే రహదారుల మీద నిషేధజలు విధించిన దృశ్యాలు ఆవిష్కృతమవుతున్నాయి. మంత్రు లు తమ బ్లాక్‌ల ముందుకు కాన్వాయ్‌లతో వెళ్లలేరు. సందర్శకులు తమకు లోపలికి అనుమతి దొరికేలోగా కాసేపు ఆగేందుకు స్థలమే లేదు. అడ్డదిడ్డంగా భవనాలు. 25 ఎకరాల ప్రాంగణంలో మిగిలిన ఖాళీ స్థలం ఏడెకరాలే. రోజుకు మూడు వేల వాహనాలు వచ్చే సచివాలయంలో సగం వాహనాలకు లోపలా బయటా ఉన్న రోడ్లే ఆధారం.
నిజాం కట్టిన ప్రధాన భవనం గబ్బిలాల ఆవాసమైపోగా కొత్తగా కట్టిన భవనాలు ఉద్యోగులకు సౌకర్యంగాలేక కాంక్రీట్ జంగిల్‌ను తలపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్లతో సమావేశానికి సౌకర్యం లేదు. పార్కులు, పచ్చదనాలు లేవు. పర్మనెంట్ క్యాంటీన్ కూడాలేదు. రాష్ర్టాభివృద్ధికి ప్రణాళికలు వేసి అమలు చేసే సచివాలయంలో మంత్రులకు, అధికారులకు నూతనంగా ఆలోచించి కొత్త ఆవిష్కరణలు చేసే పరిస్థితి ఉండాలి. కార్యాలయ ప్రాంగణం ఆహ్లాదంగా ఉండాలి. భద్రత పటిష్టంగా ఉండాలి. కానీ మన సచివాలయం దీనికి భిన్నం.
నిర్మాణ నిబంధనలు గాలికి...
-----------------------------
రాష్ట్ర సచివులు కొలువుదీరే సచివాలయంలోనే ఉమ్మడి రాష్ట్ర హయాంలో ప్రభుత్వ నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారు. అడిగేవాడు లేడన్న తీరుగా భవన నిర్మాణాలకు నిబంధనలు ఏమాత్రం పాటించలేదు. పట్టణాల్లో భవన నిర్మాణ నిబంధనల ప్రకారం ఉన్న స్థలంలో 30 నుంచి 40 శాతం వరకు మాత్రమే నిర్మాణాలుండాలి. మిగిలిన స్థలంలో రోడ్లు, పార్కులు ఉండాలి. ఈ లెక్కన చూస్తే మొత్తం 25 ఎకరాల సచివాలయ స్థలంలో ఏడున్నర ఎకరాల్లో భవనాలు, 17.50 ఎకరాల్లో రోడ్లు, పార్కు, పార్కింగ్ ఉండాలి. కానీ మన సచివాలయంలో మాత్రం రివర్స్‌లో ఉన్నది. భవనాలు 17 ఎకరాలు దాటితే ఖాళీ స్థలాలు ఏడున్నర ఎకరాలు ఉంది. భవనాల నిర్మాణాలు చేపట్టే సమయంలో ఆయా భవనాల విస్తీర్ణానికి అనుగుణంగా పార్కింగు ఖాళీ స్థలం ఉండాలి. భవనాల మధ్య దూరా న్ని పాటించాలి. మధ్యలో రహదార్లు శాస్త్రీయంగా వేయాలి. ఇందులో ఏ ఒక్క అంశాన్ని పాటించలేదు.
అంతా అడ్డదిడ్డం...
------------------
నిజాం కాలంలో 25 ఎకరాల స్థలంలో విశాలమైన భవనం నిర్మించి పరిపాలన సాగించారు. తర్వాత పగ్గాలు చేపట్టిన పాలకులు తాత్కాలిక అవసరాలు తీర్చుకోవడమే తప్ప భవిష్యత్తు ఆలోచనే లేకుండా అడ్డదిడ్డంగా భవనాలు కడుతూ పోయారు. ఫలితంగా ఒకనాడు ధారాళమైన గాలి వెలుతురుతో వెలిగిన సచివాలయం పట్టపగలు గుడ్డి వెలుతురుతో కునారిల్లింది. కనీసం వందకార్లు నిలుపుకునే స్థలం కూడా లేక ముఖ్యమంత్రి ఆకస్మిక అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న హెలిప్యాడ్‌ను వాడుకుంటున్నారు. ద్విచక్రవాహనాలను సచివాలయం రోడ్లపై పార్క్ చేస్తున్నారు. సచివాలయంలో ఉన్న నల్లపోచమ్మ గుడి ప్రాంగణం ద్విచక్రవాహన దారులకు పార్కింగ్ కాగా, సీ బ్లాక్ పక్కన ఉన్న మసీదు ముందే సీఎంవో అధికారుల కార్లు పార్క్ చేయాల్సి వస్తున్నది.
ఏదైనా ఒక బ్లాక్ వద్ద ఎదురుగా వాహనం వస్తే పక్కకు వెళ్లే పరిస్థితి లేదు. ఏ బ్లాక్, బీ బ్లాక్, డీ బ్లాక్, ఏపీకి కేటాయించిన ఎల్, జే బ్లాక్‌ల వద్దా ఇదే దుస్థితి. ఏ ఒక్క బ్లాక్ వద్ద మంత్రుల వాహనాలు వస్తే పార్కింగ్ చేసే స్థితి లేదు. మంత్రుల కాన్వాయ్ కనుక వస్తే అధికారుల వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేసుకోవాల్సిందే. పట్టుమని పదిమంది జిల్లా కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించుకునే పరిస్థితి ఈ సచివాలయంలో లేదు. ఇపుడు 31 జిల్లాలు అయిన తర్వాత పరిస్థితి ఏమిటో దేవుడికే తెలియాలి. ఉద్యోగులతో అత్యవసరంగా సీఎం ఒక మీటింగ్ నిర్వహించడానికి కూడా స్థలం లేదు.
భారంగా ట్రాఫిక్ నియంత్రణ..
-----------------------------
వాహనాల నియంత్రణ ఇక్కడ పోలీసులకు తలకు మించిన భారంగా మారుతున్నది. సచివాలయంలో అధికారులు, ఉద్యోగులు, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులంతా కలిపి 2500 మంది పనిచేస్తారు. వివిధ జిల్లాల నుంచి, శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి అధికారిక పనుల మీద వచ్చే అధికారులు పెద్ద సంఖ్యలో ఉంటా రు. సచివాలయ అధికారుల కార్లు దాదాపు 500 కాగా, బయటి కార్లు 700లకు పైగా ఉంటాయి. ద్విచక్ర వాహనాలు 2 వేల వరకు వస్తాయి. సచివాలయంలో మిగిలిన ఖాళీ స్థలం వీటికి ఏ మాత్రం సరిపోదు.
మట్టిదిబ్బలా సచివాలయ భవనం
----------------------------------
ఇక భవనాల పరిస్థితీ మెరుగ్గా లేదు. నిజాంనవాబు నిర్మించిన జీ బ్లాక్ శిథిలావస్థకు చేరి మట్టిదిబ్బలా మారింది. ఎన్టీఆర్ తర్వాత వచ్చిన సీఎంలంతా ఈ భవనాన్ని పట్టించుకోకపోవడంతో గబ్బిలాలకు, నిలయంగా మారింది. ఈ భవనాన్ని అటు కూల్చి వేయలేదు... ఇటు చారిత్రక భవనంగా గుర్తిస్తే పరిరక్షణకోసం కృషి చేయలేదు. రోజూ వేల సంఖ్యలో వచ్చే ప్రజలు ఆగడానికి విశ్రాంతి గది లేదు. అనుమతి దొరికేదాక కోసం రోడ్లపై పడిగాపులు కాయాలి. ఇదేవిధంగా సందర్శకుల వాహనాలు గేటుమందు రోడ్డు మీద కొలువు తీరుతాయి. లోపలసంబంధిత అధికారిని కలవడానికి సమయం పడితే కాసేపు ఆగటానికి వెయిటింగ్ రూమ్‌లు లేవు. అల్పాహారానికి వెళ్లడానికి సరైన క్యాంటిన్ లేదు. ఓ టెంట్ కిందనే తాత్కాలిక క్యాంటిన్ నడుపుతున్నారు. గాలి వచ్చినా.. వాన వచ్చినా కనీసం నిలబడే పరిస్థితి ఉండదు.
పునర్వైభవం దిశగా..
---------------------
నిజాం కాలంలో చక్కటి నిర్మాణశైలితో ఎంతో సౌకర్యవంతమైన భవనాన్ని ఒకే బ్లాక్‌లో నిర్మించారు. వాస్తు కౌశలంతో పాటు భద్రతకు కూడా ప్రాధాన్యమిచ్చి అన్ని రకాల హంగులు అమర్చారు. నాడు హైదరాబాద్ సంస్థాన పాలన, ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ రాష్ట్ర పాలన ఈ బ్లాక్‌నుంచే కొనసాగింది. ఆ నాటి వైభవాన్ని గుర్తు చేసేలా నూతన భవనాల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు శాస్త్రీయంగా అధ్యయనాలు చేయించింది. సచివాలయంలో మంత్రులు, ఉద్యోగులు సౌకర్యవంతంగా విధులు నిర్వర్తించుకోవాలంటే సుమారు ఆరు లక్షల చదరపు అడుగుల స్థలం అవసరమని గుర్తించింది. ఈ మేరకు ఒక్కో అంతస్తుకు లక్ష చదరపు అడుగుల చొప్పున ఆరు అంతస్తుల భవనంగా ఒక నమూనా...ఒక్కో అంతస్తుకు 60 వేల చదరపు అడుగుల స్థలం చొప్పున 10 అంతస్తుల భవనంగా మరో నమూనాను రూపొందించారు.
ఈ రెండు నమూనాలను ముఖ్యమంత్రి ఆమోదం కోసం అధికారులు పంపించారు. ఈ నిర్మాణం అంతా కలిసి కేవలం 4 ఎకరాల స్థలంలోనే జరుగుతుంది. అంటే సుమారు 21 ఎకరాల స్థలం ఖాళీగా ఉంటుంది. అందులో విశాలమైన రోడ్లు, పార్కింగులతో పాటు సింహభాగంలో పార్కులు, పచ్చదనానికి కేటాయిస్తారు. భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఐదు వేల వాహనాలు వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేలా పార్కింగ్ ఉంటుందని అధికారులు చెప్పారు. సందర్శకులు రోడ్డుమీద పడిగాపులు పడే దుస్థితి రాకుండా ఏర్పాట్లు ఉంటాయని వారు చెప్పారు.
Source: Namasthe Telangana
28/10/2016
24/10/2016
జిల్లాల పునర్వ్యవస్థీకరణతో అతిపెద్ద పరిపాలనా సంస్కరణ తెచ్చిన నేపథ్యంలో వాటి ఫలితాలు ప్రజలకు అందేలా కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలతో చిన్న పరిపాలనా విభాగాలు ఏర్పడ్డాయని, కలెక్టర్లు, ఇతర అధికారులకు పర్యవేక్షణ సులువైందని సిఎం అన్నారు. జిల్లాల వారీగా నో యువర్ డిస్ట్రిక్స్ - ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ (మీ జిల్లా గురించి తెలుసుకోండి, మీ జిల్లాకు ప్రణాళిక రూపొందించండి) అనే నినాదంతో జిల్లాల వారీగా ప్రణాళికలు తయారు కావాలని కోరారు. స్థానిక వనరులు, అవసరాలు గుర్తించి ఏ జిల్లాలో ఏం చేయాలనే విషయంపై అవగాహనకు రావాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా రాబోయే 8-10 ఏండ్ల కోసం ప్రణాళిక సిద్ధం చేసి, ఇప్పటి నుంచి పని ప్రారంభించాలి. ఎటు పడితే అటు అడ్డదిడ్డంగా కాకుండా ఓ పద్దతి ప్రకారం పాలన సాగేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
రాష్ట్రంలో పరిపాలనా విభాగాల పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో ప్రజలకు వివిధ రంగాల్లో మరింత మెరుగైన సేవలు అందించేందుకు, అభివృద్ధి - సంక్షేమ కార్యక్రమాలు మరింత పకడ్బందీగా అమలయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలపై క్యాంపు కార్యాలయంలో సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీనియర్ అధికారులు బిపి ఆచార్య, నర్సింగ్ రావు, శాంతి కుమారి, జనార్థన్ రెడ్డి, రాహుల్ బొజ్జా, కరుణ, రఘునందన్, సత్యనారాయణ రెడ్డి, స్మిత సబర్వాల్, ప్రియాంక వర్గీస్, భూపాలరెడ్డి తదతరులు పాల్గొన్నారు.
గతంలో జిల్లాల విస్తీర్ణం, జనాభా చాలా ఎక్కువగా ఉండేదని, దీనివల్ల కలెక్టర్లు పాలనా వ్యవహారాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం కష్టంగా ఉండేదన్నారు. కానీ ఇప్పుడు జిల్లాల విస్తీర్ణం, జనాభా తక్కువగా ఉందని, ప్రతీ కలెక్టర్ పరిధిలో రెండు నుంచి నాలుగు లక్షల కుటుంబాలే ఉన్నాయని సిఎం చెప్పారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రతీ ఒక్కరికి అందేలా చూడవచ్చని సిఎం అన్నారు. అక్రమాలను, అవినీతిని, జాప్యాన్ని నివారించి పారదర్శకమైన, నీతివంతమైన పాలన అందించడం సాధ్యమవుతుందని సిఎం చెప్పారు.
‘‘కొత్త జిల్లాలకు కలెక్టర్లుగా వెళ్లిన వారంతా యువకులు. మంచి ఉత్సాహంతో ఉన్నారు. సేవ చేయాలనే తపన ఉంది. వారు శ్రద్ధ పెట్టి పనిచేయడానికి అవకాశం కల్పించాలి. చొరవ చూపే వెసులుబాటు కల్పించాలి. వారంతా ఒకే పద్దతి ప్రకారం, ఒకే స్ఫూర్తితో పనిచేస్తే తెలంగాణ రాష్ట్రంలో అద్భుత ఫలితాలు కనిపిస్తాయి. ప్రజలు కూడా మార్పును గమనిస్తారు. ప్రయోజనం పొందుతారు. సీనియర్ అధికారులు, గతంలో కలెక్టర్లుగా పనిచేసిన వారు యువతరానికి ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలి. మార్పు తీసుకొచ్చే పనిలో కలెక్టర్లే సమన్వయ కర్తలుగా ఉండాలి. జిల్లా పరిధిలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా వాటిని కలెక్టరే పరిశీలించాలి, పర్యవేక్షించాలి. కొత్త పరిపాలనా విభాగాలు రావడం వల్ల పనిభారం తగ్గింది. కాబట్టి పనితీరులో మరింత ప్రభావం, సమర్థత కనిపించాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.
‘‘తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా సంస్కరణలు తెచ్చుకున్నాం. ప్రజలు మార్పు ప్రభావాన్ని చవిచూడాలి. మంచి పాలన అందాలి. అవినీతి పోవాలి. రుగ్మతలు పోవాలి. రెవెన్యూ కార్యాలయాల్లో కావాల్సిన సేవలు సకాలంలో, అవినీతి రహితంగా పొందాలి. డబ్బులివ్వకపోతే పనికాదు అనే భావన పోవాలి. మ్యుటేషన్లు, పహాణీ నకళ్లు, సర్టిఫికెట్లు సకాలంలో అందాలి. రెవెన్యూ, మున్సిపాలిటీ, సర్వే విభాగాల్లో లంచం ఇవ్వకుండా పని జరిగినప్పుడు ప్రజలకు అవినీతి రహిత పాలన అందినట్లు లెక్క. కరెంటు ట్రాన్స్ ఫార్మర్లు అవసరమైన వెంటనే రైతుల దరికి చేరాలి. కార్యాలయాల చుట్టూ తిరిగే దుస్థితి పోవాలె. గ్రామాల్లో గుడుంబా మహమ్మారి పారిపోవాలి. ప్రజల ఆరోగ్యం మెరుగుపడాలి. అందరూ చదవాలి. విద్య, వైద్య రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించారు. ఎక్కువ మంది ఆధారపడే వ్యవసాయ రంగాన్ని పట్టించుకోవాలి. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. అధికారులు కూడా అదే స్ఫూర్తితో పనిచేసి ఏ సమయంలో రైతులకు ఎలాంటి సహకారం కావాలో అది అందించాలి. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందించేందుకు ముందుగానే ప్లాన్ సిద్ధం చేయాలి. మార్కెట్లలో గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి. రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు వ్యవసాయ శాఖను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. వ్యవసాయ శాఖలో కొత్తగా నియామకమయ్యే ఉద్యోగుల సేవలను క్షేత్రస్థాయిలో బాగా ఉపయోగించుకోవాలి. నేను దత్తత తీసుకున్న ఎర్రవెల్లి, నర్సన్నపేటల్లో అందరికోసం అందరం అనే దృక్పథంతో సామూహిక వ్యవసాయం చేస్తున్నాం. గ్రామాలను స్వయం సమృద్ధి సాధించే దిశగా తీర్చిదిద్దుతున్నాం. ఆ గ్రామాలను తెలంగాణకు ఆదర్శంగా నిలుపుతాం. వాటి స్ఫూర్తితో మిగతా గ్రామాలు కూడ అలాగే బాగుపడాలన్నది నా ఉద్దేశ్యం. గ్రామాల్లో గ్రీన్ కవర్ పెంచడానికి కృషి చేయాలి. ఎక్కడికక్కడ నర్సరీలు ఏర్పాటు చేసుకోవాలి. హరితహారం నిరంతరం సాగాలి. మిగతా అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను కలెక్టర్లు పర్యవేక్షించాలి’’ అని సిఎం కోరారు.
‘‘ఒక్కో జిల్లాలో ఒక్కో రకమైన వనరులుంటాయి. ఒక్కో ప్రాంతంలోని ప్రజలకు ఒక్కో రకమైన అవసరాలుంటాయి. వాటికి తగినట్లు మన ప్రణాళిక ఉండాలి. ముందుగా అధికారులు ఆ జిల్లా సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాలి. అవసరాలు గుర్తెరగాలి. వనరులను గుర్తించి, ఉపయోగంలోకి తేవాలి. వీటి ఆధారంగా ప్రతీ జిల్లాలో ప్రత్యేక ప్రణాళిక తయారు కావాలి. దానికి అనుగుణంగా ప్రభుత్వం నిధులు కేటాయిస్తుంది’’ అని సిఎం అన్నారు.
‘‘భారతదేశం కుటుంబాల్లో నివసిస్తున్నది. భారతదేశ పౌరుల జీవన విధానం వ్యక్తిగతంగా ఉండదు. కుటుంబాలతో కలగలిసి ఉంటుంది. కుటుంబాలు బాగుంటేనే దేశం బాగున్నట్లు లెక్క. అందుకే కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడేందుకు, కుటుంబం క్షేమంగా ఉండేందుకు చర్యలు తీసుకోవాలి. కుటుంబం ప్రాతిపదికగా ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయాలి’’ అని సూచించారు.
‘‘అధికార యంత్రాంగంలో చురుకుదనం రావాలి. పక్కా ప్రణాళికతో ముందుకుపోవాలి. అవినీతికి, జాప్యానికి ఆస్కారం లేని విధంగా పాలనా పద్ధతులుండాలి. తప్పు ఎక్కడ జరుగుతుందో కనిపెట్టి దాన్ని నివారించగలగాలి. టిఎస్ ఐపాస్ మాదిరిగా ఎప్పుడు ఎక్కడ ఏం జరగాలనే విషయంలో స్పష్టత ఉండాలి. విధాన రూపకల్పన ఎంత బాగున్నా, దాన్ని అమలు చేసే క్రమంలో సరైన దృక్పథం లేకుంటే పథకాలు సత్ఫలితాలు ఇవ్వవు. కాబట్టి ప్రాసెసింగ్ అప్రోచ్ చాలా ముఖ్యం. తెలంగాణలో మంచి పాలన అందించడానికి అవసరమైన పద్దతులు రూపొందించి, అమలు చేయగలిగితేనే ప్రజలకు పరిపాలనా సంస్కరణల ఫలితాలు అందుతాయి’’ అని సిఎం అన్నారు.
‘‘రాష్ట్రంలో ఏ శాఖ ద్వారా ఏ కార్యక్రమం అమలవుతున్నది? దాని లక్ష్యాలు ఉద్దేశాలేమిటి? జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా ఆశిస్తున్నదేమిటి? అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుకోసం కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలేమిటి? తదితర అంశాలపై చర్చించేందుకు త్వరలోనే కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తాం’’ అని సిఎం ప్రకటించారు.
Telangana cabinet will meet at 2 pm on Friday at Secretariat. The Council of Ministers will discuss Krishna River Water Dispute Tribunal's (Brijesh Kumar Tribunal) judgment on sharing of water, construction of new Secretariat, among other current issues.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం మధ్మాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్లో నిర్వహించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. కృష్ణా జలాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు, కొత్త సెక్రటేరియట్ నిర్మాణం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
Source: Telangana CMO
A special state-level control room has been set up to coordinate relief measures. It can be reached at: 040-23454088.
| Monday | 9am - 5pm |
| Tuesday | 9am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Friday | 9am - 5pm |
| Saturday | 10am - 5pm |
| Sunday | 9am - 5pm |