31/03/2026
అంతర్జాతీయ ఆటీజం దినోత్సవం ఏప్రిల్ 2 సందర్బంగా నేను రాసిన ఆర్టికల్ ఈ రోజు ప్రజాశక్తి దినపత్రికలో వచ్చింది
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from NPRD Telangana, Social service, Hyderabad.
31/03/2026
అంతర్జాతీయ ఆటీజం దినోత్సవం ఏప్రిల్ 2 సందర్బంగా నేను రాసిన ఆర్టికల్ ఈ రోజు ప్రజాశక్తి దినపత్రికలో వచ్చింది
18/03/2026
NPRD డైరీని మెదక్ జిల్లా DWO హేమ భార్గవి గారికి అందుచేస్తున్న NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య, మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు టి యాదగిరి
12/03/2026
10/03/2026
పెన్షన్ పెంపు కోసం మార్చి 13 న ఇందిరా పార్క్ వద్ద జరిగే నిరాహార దీక్షలను జయప్రదం చేయాలని NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక మెదక్ జిల్లా కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కే మల్లేష్, జిల్లా ఉపాధ్యక్షులు టి యాదగిరి, సహాయ కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు
06/03/2026
జయప్రదం చేయండి
28/02/2026
పత్రిక ప్రకటన 28.02.2026
*వికలాంగుల హక్కులను తిరస్కరిస్తున్న మానుధర్మశాస్త్రన్ని తిరస్కరించాలి*
*ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా వ్యవహారిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం*
*కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం*
*అవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్బాస్*
*బడ్జెట్, పెన్షన్ పెంపు కోసం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం*
*NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య*
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(NPRD ) తెలంగాణ రాష్ట్ర కమిటీ 16 వ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల ముగింపు సందర్బంగా ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో *ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ - వికలాంగులపై ప్రభావం* అనే అంశంపై *సెమినార్* సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె వెంకట్ అధ్యక్షతన జరిగింది.
*ఈ సెమినార్ కు ముఖ్య అతిథిగా హాజరైన ఎండీ అబ్బాస్ మాట్లాడుతూ* ప్రజల ఓట్లను తొలగించేందుకే SIR అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అమలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 10.70 కోట్ల మంది ఒట్లు తొలగించారని అన్నారు.ఓట్ల వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న విధానం సమగ్రంగా లేదని అన్నారు.ఎన్నికల సంఘం అడిగిన డాక్యుమెంట్స్ ప్రజల దగ్గర లేవనే కారణంతో ఒట్లు తొలగించాలని చూస్తున్నారని అన్నారు.బీజేపీ ప్రభుత్వం తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దొంగ ఓట్లతో గెలవాలని చూస్తుందని అన్నారు.స్వతంత్రంగా వ్యవహారించాల్సిన ఎన్నికల సంఘం బీజేపీకి ఏజెంట్గా వ్యవహరించడం ఎంత వరకు సమంజసమని అన్నారు.సాంకేతిక అంశాల ఆధారంగా ఓట్లర్లను ఇబ్బంది పెట్టడం ఎంత వరకు సమంజసంమని అన్నారు. SIR ద్వారా పేద ప్రజలను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా కుట్రలు చేస్తుందని అన్నారు.సుప్రీం కోర్టు చూపిన ఆధార్ కార్డును ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.SIR అమలు చేయడం వలన మహిళల ఒట్లు తొలగించి, వారిని ఎన్నికల్లో పాల్గొనకుండా చేయడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు.
భారత రాజ్యాంగనికి తూట్లు పొడిచి పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తుందని అన్నారు.వలసలు వెళ్తున్న వారి పాలిట శాపంగా SIR మారుతుందని అన్నారు.బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఒట్లు తీసివేయాడమేనా SIR పని అని ప్రశ్నించారు. రాజ్యాంగ పరమైన హక్కులను తొలగించెందుకు SIR దోహదం చేస్తుందని అన్నారు.రోహింగ్యలను తరామికొట్టడమే తమ పని అని చెపుతున్న కేంద్ర ప్రభుత్వం 12 ఏండ్ల కాలంలో ఎంత మంది రోహింగ్యలను గుర్తించరని అన్నారు.వలసలు వచ్చి స్థిరపడిన వికలాంగులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఓటు హక్కు వినియోగించుకునే సందర్బంగా వికలాంగులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు అందుబాటులో లేవు. SIR అమలు అవుతున్న 12 రాష్ట్రాల్లో నమోదు అయిన వికలాంగుల ఓట్లలో సంగం మందికంటే ఎక్కువ మంది ఓటు కోల్పోయే ప్రమాదం ఉంది. దేశ వ్యాప్తంగా ఎన్నికల సంఘం ప్రకటిస్తున్న ఓటర్ల సంఖ్యలో వికలాంగుల ఓట్ల వివరాలు అందుబాటులో లేవు. దీని ద్వారా వికలాంగుల ఓట్ల వివరాల పట్ల సరైన అంచనా ఎలా వస్తుందని అన్నారు.
ప్రజాస్వామ్య పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పరిపాలన చేస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 53 లక్షల కోట్ల బడ్జెట్లో ప్రజల సంక్షేమనికి నిధులు ఎందుకు కేటాయించలేదని అన్నారు. 14.70 లక్షల కోట్లు అప్పులకు ఇంట్రెస్ట్ చెల్లీస్తున్నారని అన్నారు. ఆయుధాల కొనుగులు మీద ఉన్న ప్రేమ ప్రజల సంక్షేమoపై ఎందుకు లేదని అన్నారు.విద్యా, వైద్యం వంటి సంక్షేమ పథకాలకు నిధుల కోత విధించడం ఎంత వరకు సమాజంసమని అన్నారు. 5 ఏండ్ల లోపు పిల్లలో100 మందికి 68 మంది పోషకహారం లోపంతో బాధపడుతున్నారని అన్నారు.57 శాతం మంది మహిళలు రక్త హీనతో బాధపడుతుంటే మోడీకి కండ్లు కన్పించడం లేదా అని అన్నారు. భారత, అమెరికా దేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు.కోపెన్ హాగన్ ఒప్పందనికి భిన్నంగా మోడీ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడం సరైంది కాదని అన్నారు. పౌల్ట్రీ,డైరీ ఉత్పతులు తగ్గిపోవడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయన్ని దెబ్బ తీయాలని మోడీ చేస్తున్న ప్రయత్నలను అడ్డుకోవాలని అన్నారు. భారత దేశంపై ట్రంప్ పెత్తనం ఎందుకని అన్నారు.దేశాన్ని పరిపాలన చేస్తున్న మోడీ 12 ఏండ్ల కాలంలో ప్రజల ప్రయోజనాల కంటే పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సంస్థలను పెట్టుబడిదారులకు అమ్మివేయాడమేనా దేశ భక్తి అని అన్నారు.
*NPRD రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం అడివయ్య మాట్లాడుతూ* సంఘం ఏర్పడి 16 ఏండ్లు అవుతుందని అన్నారు. Nprd పోరాటాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలపై పోరాడి విజయాలు సాధించమని అన్నారు. 2016 RPWD చట్టంతో పాటు అనేక చట్టాలు పోరాడి సాధించందని అన్నారు. పోరాడి సాధించుకున్న వికలాంగుల చట్టాలను మార్చాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో వికలాంగులకు తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం 20 ఏండ్ల వయస్సు కలిగిన వికలాంగులు 1.89 కోట్ల మంది ఉన్నారు. SIR అమలు వలన 42.5 లక్షల మంది వికలాంగుల ఓటర్లు ప్రభావితం అయ్యారూ. 2024 పార్లమెంట్ ఎన్నికల వరకు వికలాంగులలో సగం కంటే ఎక్కువ మంది ఓటర్లుగా నమోదు కాలేదు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద సరైన సమాచారం లేకుండా SIR అమలు చేయడం వలన వికలాంగుల మధ్య అంతరాలు పెంచుతుంది. SIR అమలు చేయడంలో కీలక పాత్ర వహించే BLO లకు వికలాంగులలో వినికిడి లోపం, మేధో వైకాల్యం, ఆటీజం, సీరిబ్రాల్ పాల్సి వంటి వైకాల్యాలు కలిగిన ఓటర్లు అయిన వికలాంగులతో సంబశించడానికి అవసరమైన శిక్షణ ఇవ్వకుండా వికలాంగులను భాగస్వామ్యం చేయడం ఆచరణ సాధ్యం కాదనే విషయం ఎన్నికల సంఘం గమనించాలి. వికలాంగులు సంరక్షకులుగా ఉన్న కుటుంబ వివరాలు సేకరణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం SIR అమలు అవుతున్న 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 1.75 లక్షల మంది వికలాంగులకు గృహాలు లేవు. మానసిక లేదా మేధో వైకాల్యం కలిగిన వారిని ఓటర్ జాబితా నుండి మినహాహించకుండా, పూర్తిగా తొలగించే ప్రమాదం ఉంది.
SIR అమలులో డిజిటలైజేషన్పై ఆధారపడడం వలన వికలాంగులు తీవ్రంగా నష్టపోతారు. BLO లు ఉపయోగించే దరఖాస్తులో యాక్సెసిబిలిటీ కోసం ఎలాంటి చర్యలు లేవు. దీని ద్వారా SIR వెరిఫికేషన్ సందర్బంగా వికలాంగుల వద్ద భౌతికంగా సమాచారం అందుబాటులో లేకుంటే డిజిటల్ సమాచారాన్ని సేకరించడం వలన వికలాంగుల వద్ద సమాచారం అందుబాటులో ఉండదు.కేంద్ర ఎన్నికల సంఘం వికలాంగులైన ఓటర్లు ఎలాంటి అవరోధం లేకుండా స్వచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే విదంగా సౌకర్యాలు కల్పించడానికి చేస్తున్న కృషి SIR అమలు ద్వారా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కోసం పెన్షన్ 6000 లకు పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులు పెంచాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో NPRD కేంద్ర కమిటీ సభ్యులు ఆర్ వెంకటేష్, జె రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు యశోద,ఉపేందర్, బి స్వామీ, రాష్ట్ర కమిటీ సభ్యులు పి శశికల, పి చందు, సత్యనారాయణ, యం నర్సింహా, కవిత, సూరపంగా ప్రకాష్, చంద్రమోహన్, యాదయ్య,మల్లేష్,భుజంగా రెడ్డి, నగేష్, బంగారయ్య, మేరీ, రాజు లతో పాటు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
*యం అడివయ్య*
ప్రధాన కార్యదర్శి
27/02/2026
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న NPRD 16వ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు