Hyderabad Metropolitan Development Authority (HMDA

Hyderabad Metropolitan Development Authority (HMDA

Share

The Hyderabad Metropolitan Development Authority (HMDA) was formed by an Act (GO Ms. No. 570 MA dt: 25-08-2008) of the A.P. Legislature

26/08/2020
Photos from Hyderabad Metropolitan Development Authority (HMDA's post 28/08/2019

పత్రికా ప్రకటన
సంజీవయ్య పార్కుతో పాటుగా హర్బల్ పార్క్, బటర్ ప్లై పార్కు, రోజు గార్డెన్, జాతీయ జండా తదితర ప్రాంతాలన్నింటిని కలిపి సంజీవయ్య పిల్లల ఉద్యానవనంగా మార్చుతూ హెచ్ఎండీఎ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మహా నగర అభివృధ్ధి సంస్ధ ఆధ్వర్యంలో నిర్వహించే సంజీవయ్య పార్కు సంజీవయ్య పిల్లల పార్కు గా పేరు మార్చబడింది. ఈ మేరకు సంస్ధ కార్యదర్శి ఎం.రాంకిషన్ ఓ ప్రకటన జారీ చేశారు. తేదిః 29 ఆగస్టు, గురువారం నుంచి ఈ నిర్ణయం అమలు జరుగుతుంది. పద్నాలుగు ఏండ్ల లోపు పిల్లకు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులకు మరియు సంరక్షకులకు మాత్రమే ప్రవేశం కల్పించబడుతుంది. పిల్లలు వెంటలేని 14 ఏండ్లకు పైబడిన వారి ప్రవేశం నిషేదించబడినది. ప్రవేశరుసుము పది రూపాయలు మాత్రమే నిర్ణయించబడినది. అంతే కాకుండా అధ్యాపకుల నేత్త్వంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు బృందగా వస్తే ప్రవేశం ఉచితం. విద్యార్ధుల్లో మరింత విజ్ఞానాన్ని పెంచేందుకు లాభాపేక్షలేకుండా ఈ పార్కులను నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. సైన్సు పట్ల పిల్లల్లో మరింత జిజ్ఞాస పెంచే విధంగా ఈ పార్కును తీర్చిదిద్ది ముఖ్యంగా విద్యార్ధులు, అధ్యాపకులను ఆకర్శించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే ఈ ఉద్యాన వనంలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగం నిషేధించడంతో పాటు, పచ్చదనం-పరిశుభ్రత పట్ల విద్యార్ధుల్లో అవగాహన పెంచేందుకు చర్యులతో పాటు, పొగ త్రాగడం, మద్యపానం మరియు బయటి తినుబండారాలను లోనికి అనుమతించకుండా చర్యలు తీసుకోవడం జరిగింది.

ఫోటోలు జతచేయడం జరిగింది. . ...జారీ చేసిన వారు....పిఆర్ఓ, హెచ్ఎండీఎ

Photos from Hyderabad Metropolitan Development Authority (HMDA's post 21/06/2019

పత్రికా ప్రకటన
హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో నగరంలోని సంజీవయ్య పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవాని ఘనంగా నిర్వహించడం జరిగింది. అర్బన్ ఫారెస్టు విభాగం డైరెక్టర్ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరైనారు.ఆయన మాట్లాడుతూ యోగా అనేది మన భారతీయ సంస్కృతిలో భాగమని, వైదిక శాస్త్రాలలో యోగ సాధన పట్ల సవివరంగా వివరించబడిందని అన్నారు. వందల ఏండ్ల క్రితం పతంజలి ఈ యోగా సాధన ను ప్రారంభించారని, మన ప్రధాన మంత్రి నరేంద్రమోది యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సంధర్భంగా ఆయన యోగా భ్యాసం, వాటి పద్దతులపపై ఒక కరపత్రాన్ని విడుదల చేశారు. బిపిపి అధికారి విశ్వప్రసాద్ మాట్లాడుతూ డెన్మార్క్, అమేరికా, జపాన్ లాంటి దేశాలలో రోజూ పాఠశాలల్లో పిల్లలచేత యోగాభ్యాసం అలవాటు చేస్తున్నారని చెప్పారు. మన దేశంలో కూడా పాఠశాలల్లో యోగా తప్పనిసరి పాఠ్యాంశంగా చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కార్యక్రమంలో యోగా గురువు గోపాలకృష్ణ యోగా అభ్యాసాలు చేయించగా,
రామకృష్ణ, దేవజ, గోపాల్ రెడ్డి, ప్రదీప్, అపర్ణ తదితర హెచ్ఎండీఎ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు ప్రసాద్, సిద్దు మరియు 60మంది ఉద్యోగులు పాల్గొన్నారు.
..........................................

05/10/2018

పత్రికా ప్రకటన
అంతర్జాతీయ శిక్షణ కు ఎంపికైన డా.బి.జనార్ధన్ రెడ్డ


అమెరికా లోని డ్యూక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఈ-పాలనాధారిత పౌరసేవలు ( ఈ-గవర్నెన్స్ బేస్డ్ సిటిజెన్-సెంట్రిక్ సర్వీస్ డెలివరి) విషయంపై నిర్వహించబోయే అంతర్జాతీయ విదేశీ శిక్షణా కార్యక్రమానికి హెచ్ఎండీఎ కమీషనర్ డా. బి.జనార్ధన్ రెడ్డికి ఎంపికయ్యారు.
నవంబర్ 26 నుండి 30 వరకు అమెరికా లోని డర్హమ్ పట్టణంలోని డ్యూక్ విశ్వవిద్యాలంలోని అంతర్జాతీయ అభివృధ్ధి కేంద్రం లో ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది. భారత దేశం లోని అత్యున్నత ప్రతిభా వంతులైన, ప్రధాన మంత్రి అవార్డు గ్రహీతలు, జాతీయ ఈ-గవర్నెన్స్ అవార్డు గ్రహీతలు తదితర అత్యున్నత పురస్కారాలు పొందిన అధికారులలో 15 మందిని ఈ అంతర్జాతీయ శిక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎంపికచేయగా, అందులో మన రాష్ట్రానికి చెందిన డా.బి. జనార్ధన్ రెడ్డి ఒకరుగా ఎంపికయ్యారు.

పాలనా పరమైన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో ప్రస్థుత పాలనా పద్దతులలో మరింత పారదర్శకత, జవాబుదారీ తనంనమరియు సత్వర పరిష్కారాలందించడంలో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి విదేశాలలో అవలంబించే పద్దతులు, , పరస్పర అనుభవాలను పంచుకుని, నూతన పద్దతుల అమలు, సాధ్యాసాధ్యాలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ అంతర్జాతీయ స్ధాయి శిక్షణా కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రమవారం కేంద్ర ప్రభుత్వం నుండి ఆయనకు శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశాలందాయీ

➢ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవెలప్ మెంట్ అధారిటీ (హైదారాబాద్ మహానగరాభివృధ్ధి సంస్ధ) లో మెట్రోపాలిటన్ కమీషనర్ గా ప్రస్థుతం విధులు నిర్వర్తస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయిన డా.బి. జనార్ధన్ రెడ్డి, తన 29 ఏండ్ల సర్వీసు కాలంలో పలు విభాగాలలో పని చేసి పలు సార్లు ప్రతిభా పురష్కారాలందుకున్నారు. ప్రధాన మంత్రి అవార్డు కూడా అందుకున్నారు.

➢ హెచ్ఎండీఎ పరిధిలోకి 7 జిల్లాలు, 70 మండలాలు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ కు తో కూడిన 1032 గ్రామాలు వస్తాయి.

➢ దూరదృష్టితో పాటు, సామాన్యుల వరకు ప్రభుత్వ ఫలాలను అందించాలని, వాస్తవ దృక్పదంతో పాలనలో ఎప్పటి కప్పుడు నూతన, ఆవిష్కారిక పద్దతులు అవలంబించి, ఆధునిక విజ్ఞానాన్ని జోడించి, ప్రభుత్వ విధానాలు సరళీకృతం చేసే నిరంతర కృషీవలుడు.

➢ సామాన్యులకోసమే కాకుండా తన వద్ద పనిచేసి సిబ్బందిలోనూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, ఎప్పటి కప్పుడు వారిలో నూతనోత్సాహం కలిగేలా స్ఫూర్తి కలిగిస్తుంటారు.

➢ సుపరిపాలనందించడానకి సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి పాలనా పద్దతులను మరింత సరళీకృతం చేయాలని అభిప్రాయపడ్తారు. ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రజల ప్రవర్తనలో మార్పు రావాలని, మరింత చైతన్య వంతులు కావాలని ఆశిస్తారు.

➢ ఒంటరి ప్రయత్నం కంటే సామూహిక కృషి వల్ల మరిన్ని ఫలితాలు సాధించవచ్చని నమ్ముతారు.

➢ జీహెచ్ఎంసీ కమీషనర్ గా పనిచేసే సమయంలో 100 కూ పైగా నూతన ఆవిష్కారిక పధకాలను ప్రవేశపెట్టి పరిపాలనలో నూతన ఒరవడిని శృష్టించి, తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. ఆయన కృషి ఫలితంగా వ్యాపారులు, పౌరులు మరియు గృహిణుల్లో విప్లవాత్మక మార్పు వచ్చింది. అత్యుత్తమ పౌర సేవలందించే మహా నగరాలలో హైదరాబాద్ పేరు ను చేర్చడంలో విజయం సాధించారు. అలాగే జిహెచ్ఎంసీ పట్ల నగర ప్రజల్లో విశ్వసనీయత పెంచడంలో సఫలీకృతులయ్యారు.

➢ జీహెచ్ఎంసీ కమీషనర్ గా ఇతర విభాగ అధికారులను కూడా సమన్వయ పరుస్తూ పౌర సేవలందించడంలో ఆయన కనబరిచిన విశేష కృషికి ఫలితంగా పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మరియు ప్రయివేటు సంస్ధల నుంచి జీహెచ్ఎంసీ కి 19 పురష్కారాలు లభించాయి.

➢ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఎక్సలెన్స్ (సమర్ధవంతమైన ప్రజా పాలన)లో ప్రధానమంత్రి పురష్కారం పొందారు. 12 వ పౌర సేవల దినోత్సవం ( 12 వ సివిల్ సర్వీస్ డే) సంధర్భంగా ఆయన స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పురష్కారాన్ని అందుకున్నారు.

➢ డబుల్ బెడ్ రూం పధకం కోసం భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్ ) లో పౌర భాగస్వామ్యం పెంచడంలో ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోశించారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులును పటిష్ట పరచడం, మురికి వాడల్లో నివసించే వారిని స్రాకో ( సొసైటీ ఫార్ రిహాబిలిటేషన్ మరియు కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్) లాంటి స్వచ్ఛంధ సంస్ధ సహకారంతో చైతన్య పరచడం, మీడియా సహకారంతో చేతన కార్యక్రమాన్ని నిర్వహించడం, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి ప్రజలను అభివృధ్ధి కార్యక్రమాలలో భాగస్వాములను చేశారు.

➢ వివిధ విభాగాల అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ భూ సమీకరణలో సునామీ కన్వర్జెంట్ మోడల్(అత్యంత వేగనంతంగా అందరిని కలుపుకుని పోయే) ను ప్రవేశపెట్టి అనూహ్య పరిణామాలు రాబట్టారు.

➢ కేంద్ర ప్రభుత్వ పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం(డిఎఆర్ పిజీ) ద్వారా ప్రతిష్టాత్మక ప్రధాన మంత్రి (ఎక్స్ లెన్స్ అవార్డ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ) పురష్కారానికి ఎంపికయ్యారు.

➢ పాలనా పరమైన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం ఆధ్వర్యంలో ప్రస్థుత పాలనా పద్దతులలో మరింత పారదర్శకత, జవాబుదారీ తనం మరియు సత్వర పరిష్కారాలందించడంలో గుణాత్మక మార్పులు తీసుకురావడానికి విదేశాలలో అవలంబించే పద్దతులు, పరస్పర అనుభవాలను పంచుకుని, నూతన పద్దతుల అమలు, సాధ్యాసాధ్యాలపై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అంతర్జాతీయ విదేశీ శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వం నుండి శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలని ఆయనకు ఆదేశాలందాయి.

➢ అమెరికా లోని డ్యూక్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఈ-పాలనాధారిత పౌరసేవలు ( ఈ-గవర్నెన్స్ బేస్డ్ సిటిజెన్-సెంట్రిక్ సర్వీస్ డెలివరి) విషయంపై నవంబర్ 26 నుండి 30 వరకు ఈ శిక్షణా కార్యక్రమం నిర్వహించబడుతుంది. కేంద్ర ప్రభుత్వ పాలనా పరమైన సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల విభాగం మరియు కేంద్ర సహ మంత్రి అనుమతి తో డా. జనార్ధన్ రెడ్డి ని తెలంగాణా రాష్ట్రం నుంచి ఎంపిక చేయడం జరిగింది.
..........................పిఆర్ఓ, హెచ్ఎండీఎ.

30/09/2018

పత్రికా ప్రకటన

ఈ-వేలం ప్రక్రియ లో సాంకేతిక కారణాలు తలెత్తటంతో ఉప్పల్ భగాయత్ మరియు ఇతర లే-అవుట్ల వేలం ప్రక్రియను హెచ్ఎండీఎ రద్దు చేసింది.. ఈ మేరకు కమీషనర్ డా. బి. జనార్ధన్ రెడ్డి నేడిక్కడ జారిచేసిన పత్రికా ప్రకటనలో వేలం రద్దుచేయడానికి దారితీన పరిస్ధితులను వివరిస్తూ ఈ ప్రోక్యూర్ మెంట్ లిమిటెడ్ మరియు ఐసిఐసిఐ బ్యాంకుల సంయుక్త సహకారంలో ఈ-వేలం నిర్వహణకు ఒప్పందకుర్చుకున్నారు. అయితే 29 నాడు జరిగిన ఈ-వేలం ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యలతో ఈ-వేలం లో పాల్గొన్న కొనుగోలు దారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే 30 నాడు (అనగా ఈ-రోజు) ఈ-వేలం ప్రక్రియ కొనసాగుతుండగా ప్లాటు దక్కించుకోలేని కొనుగోలుదారుల ఖాతాలలో తిరిగి 10 శాతం ఈఎండీ నగదును బదిలీ చేయాల్సి వచ్చినప్పుడు సాంకేతిక సమస్యలు ఎదురవ్వడంతో కొందరి ఖాతాలలోని నగదు బదిలీ జరుగలేదని చెప్పారు. దాంతో కొందరు కొనుగోలుదారులు ఈ-వేలం పాటలో పాల్గొనలేక పోయారని చెప్పారు. ఆదివారం ఉదయం 10 గంటలకే (అనగా 30 న) ఈ సమస్య తలెత్తటంతో హుటాహుటిన కమీషనర్ ఆధ్వర్యంలో ఉన్నతాదికారులు సమీవేశమై పరిస్థితిన సమీక్షించారు. సాంకేతిక సహకారం కల్పించిన ఈటీఎల్ కంపినీ కూడా వెంటనే సమస్యను పరిష్కరించక పోవడంతో ఈ-వేలం పాటలో పాల్గొన్న కొనుగోలుదారుల ఇబ్బందుల దృష్ట్యా కమీషనర్ డా.బి. జనార్ధన్ రెడ్డి మొత్తం ఈ-వేలం ప్రక్రియను రద్దు చేస్తూ నిర్ణయంతీసుతున్నారు.
కాగా ఈ నెల 28 నుండి 1 వరకు నాలుగు రోజులు వరుసగా హెచ్ఎండీఎ ఉప్పల్ భగాయత్ మరియు ఇతర వే-అవుట్లలోని 95 ప్లాట్ల వేలం పాటకు ఏర్పాట్లు చేసిన విషయం విదితమే. ఈఎండీ చెల్లించిన కొనుగోలుదారులకు వారి ఈఎండీ నగదును త్వరలో తిరిగి చెల్లించాలని ఆయన అదికారులను ఆదేశించారు. కొనుగోలుదారులకు కలిగిన అసౌకర్యానికి ఆయన చింతించారు.

పి.ఆర్.ఎ, హెచ్ఎండీఎ.

21/06/2018

హెచ్ఎండీఎ కు ఉద్యాన వనాల నిర్వహణ లో అవార్డుల పంట

హైదరాబాద్ మహానగర అభివృధ్ధి సంస్ధకు ఉద్యానవన మహోత్సవ పోటీలో అత్యధిక అవార్డులు గెలుచుకుని అగ్ర భాగాన నిలిచింది. . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన వన విభాగం వారు రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించే సంస్ధలను ప్రోత్సహించాలన్న ఉద్యేశ్యంతో ఈ ఏడాది జనవరి 25 నుంచి 31 వరకు ఏర్పాటు చేసిన ఉద్యానవన మహోత్సవ పోటీ లో18 బహుమతులు సాధించి హెచ్ఎండీఎ మొదటి స్ధానంలో నిలిచింది. మొత్తం 26 కేటగిరీల్లో హెచ్ఎండీఎ పోటీ పడగా, అందులో 11 ప్రధమ బహుమతులు, 5 ద్వితీయ బహుమతులు, 2 తృతీయ బహుమతులు పొందింది. పోటీ పడిన అన్ని సంస్ధల కన్నా అత్యధిక బహుమతులు పొంది ఓవరాల్ ఛాంపియన్ గా రోలింగ్ కప్పును హెచ్ఎండీఎ పొందింది. అవుటర్ రింగ్ రోడ్ అవెన్యూ ప్లాన్టేషన్ కు తెలంగాణ హరిత హారం- పచ్చదనం (గ్రీన్ బెల్ట్) విభాగంలో ప్రధమ బహుమతి పొందింది. అలాగే స్మారక ఉద్యానవనం(పార్క్)–రాష్ట్ర నాయకులు విభాగం లో ఎన్.టి.ఆర్. మెమోరియల్ పార్క్, జాతీయ నాయకులు విభాగంలో పి.వి.ఘాట్, థీమ్ పార్క –నేచురల్ విభాగంలో బటర్ ఫ్లై గార్డెన్ కు, థీమ్ పార్క్ ఇన్నోవేటివ్ విభాగంలో రోజ్ గార్డెన్, బిగ్గెస్ట్ థీమ్ పార్క్ విభాగంలో రాక్ గార్డెన్, ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్ లాండ్ స్కేపింగ్ విభాగంలో జాతీయ జెండా, పార్క్స్ విత్ ఎంటర్టేయిన్మెంట్ షో విభాగంలో లేజర్ షో, అత్యధిక ప్రజలు సందర్శించే పార్కుల కేటగిరీ లో లుంబినీ పార్కు, ప్రభుత్వ కార్యాలయాల్లో పార్కుల నిర్వహణ కేటగిరీ లో ముఖ్యమంత్రి కేంప్ కార్యాలయం మరియు నివాస గృహం, హర్బల్ గార్డెన్ రాజ్ భవన్, పిల్లల వైజ్ఞానిక పార్క్ విభాగంలో సంజీవయ్య పార్క్ లోని సైన్స్ పార్క్, తెలంగాణా నేటివిటి పార్క్ కేటగిరి లో బతుకమ్మ ట్రైల్స్- నెక్లేస్ రోడ్డు, బోన్సాయి గార్డెన్ కేటగిరి లో ఎన్.టి.ఆర్. గార్డెన్- బోన్సాయి గార్డెన్, జపనీస్ గార్డెన్ కేటగిరిలో ఎన్.టి.ఆర్. గార్డెన్ లోని జపనీస్ గార్డెన్, రోటరీసే విత్ ప్లవర్ ప్లాంట్స్ ప్లాంటేషన్ కేటగిరీ లో ఇందదిరా రోటరీ, బెస్ట్ ఐ లాండ్ పార్క్ కేటగిరి తెలుగు తల్లి ఐ లాండ్ కు ప్రధమ బహుమతులు వచ్చాయి. అలాగే హర్బల్ గార్డెన్ కేటగిరిలో సంజీవయ్య పార్కులోని హర్బల్ గార్డెన్ మరియు మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ ఏరియా పార్క్ కేటగిరి లో ఉప్పల్ భగాయత్ లే అవుట్ కు 2 వ బహుమతి, మరియు ప్రభుత్వ కార్యాలయాల్లో పార్కుల నిర్వహణ కేటగిరిలో సచివాలయం కు మూడవ బహుమతి లభించింది. ఈ పోటీలో హెచ్ఎండీఎ తో పాటు జిహెచ్ఎంసి, మెట్రో రైల్, డిఆర్ డీఓ, డీఆర్ డీఎల్, ఇన్ఫోసిస్, రైల్వేస్, ప్రగతి రిసార్ట్స్, ఉద్వాన శాఖ, మిలటరీ తదితర 24 సంస్ధలు పాల్గొన్నాయి. శాస్త్రవేత్తలు, ఉద్యాన వన విభాగానికి చెందిన రిటైర్డ్ ఉన్నతాధికారులు, లాండ్ స్కేప్ నిపుణులతో కూడిన 18 మంది సభ్యులు కలిగిన కమిటీ వ్యక్తిగతంగా పరిశీలించి విజేతలను నిర్ణయించారు.
నేడిక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండీఎ కమీషనర్ టి. చిరంజీవులు బహుమతులను ఆందుకున్నారు. పార్కులలో పచ్చదనం, నాణ్యత, పూల దిగుబడి, ప్రజల స్పందన, వినూత్న ప్రయత్నాలు తదితర 24 విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఈ సంధర్భంగా పిన్స్ పల్ సెక్రటరీ అరవింద్ కుమార్ హెచ్ఎండీఎ ఆధ్వర్యంలో పట్టణ అటవీ విభాగం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించటం చేస్తున్న కృషి పట్ల హెచ్ఎండీఎ కమీషనర్ టి.చిరంజీవులు ను అభినందించారు. ఇతర న్యాయనిర్ణేతలు కూడా హెచ్ఎండీఎ, పట్టణ ఉద్యాన వన విభాగం ద్వారా నగరంలో పచ్చదనాన్ని పెంచడంపై చూపిస్తున్న ప్రత్యేక శ్రధ్ధను పోటీ నిర్వహణాదారులు కొనియాడారు.
...............హెచ్ఎండీఎ....

Photos from Hyderabad Metropolitan Development Authority (HMDA's post 05/02/2018
05/02/2018

ప్రెస్ నోటు
​జంటనగరాల చుట్టుప్రక్కల అక్రమ కట్టడాలను నియంత్రించడానికి ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని వినుయోగించుకుంటూ పారదర్శకతను పెంచడానికి హెచ్ఎండీఎ తయారు చేసిన ఆన్ లైన్ వ్యవస్ధ సోమవారంనుంచి ప్రజలకు అందుబాటులోనికి వచ్చింది. ఇందుకోసం తయారు చేసిన అనాధరైజ్డ్ కన్ స్ట్రక్చన్ లేఅవుట్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం పేరిట ఒక వెబ్ బేస్డ్ ఆన్ లైన వ్యవస్ధను హెచ్ఎండీఎ కమీషనర్ శ్రీ టి.చిరంజీవులు సోమవారం ప్రారంభించారు. తార్నాకాలోని కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కమీషనర్ ఆన్ లైన్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ హెచ్ఎండీఎ ద్వారా అక్రమ కట్టడాలను నియంత్రించడాని ప్రత్యేకంగా 6 టీం లను నియమించడం జరిగిందన్నారు. సామాన్యు లెవరైనా హెచ్ఎండీఎ పరిధులో అక్రమ నిర్మాణాలపై వెబ్ సైట్ ద్వారా( అనాధరైజ్డ్ కన్ స్ట్రక్చన్ లేఅవుట్స్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం) సంబంధించిన సమాచారం ఉం ఫిర్యాదు చేయవచ్చని తెలపారు.. ఫిర్యాదు అందిన వెంటనే అక్రమ కట్టడాన్ని హెచ్ఎండీఎ అధికారులు తనిఖీ చేసి, నిర్మాణాలను పరిశీలించి పంచనామా కాపీని అక్కడి నించే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తారని చెప్పారు. అక్రమ కట్టడమని తేలిన వెంటనే స్ధానిక సంస్ధల అధికారులతో సహా సంబంధిత విభాగపు అధికారులను నోటీసులు పంపి చర్చలు తీసుకోవాలని సూచిస్తామని, వారం పది రోజుల్లో స్ధానిక సంస్ధల వారు ఆ యా కట్టడాలను తొలగించకపోయినా , అవసరమైన చర్యలు తీసుకోనట్లయితే స్వయంగా హెచ్ఎండీఎ ఆ అక్రమ కట్టడాన్ని కూల్చడానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఆన్ లైన్ వ్యవస్ధ ద్వారా ప్రజలిచ్చిన తమ ఫిర్యాదు పై ఏం చర్య తీసుకున్నారు, దాని స్టేటస్ ఏమిటన్న విషయం కూడా స్వయంగా పరిశీలించుకోవచ్చని అన్నారు. ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం ఆన్ లైన్ వ్యవస్ధ ద్వారా సంబంధిత జిల్లా స్ధాయి పర్యవేక్షణాధికారులకు వెళ్ళిపోతుందిని. అంతే కాకుండా కూల్చివేసిన అక్రమ కట్టడాల పై తరువాత కూడా నిఘా ఏర్పాటు చేయడానికి స్ధానిక సంస్ధల అధికారులకు వెంటనే సమాచారం వెల్తుందని చెప్పారు. అంతే కాకుండా కూల్చివేసిన కట్టడాలపై ఎవరైన న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తే తదుపరి కేసు విచారణ విషయాలు సైతం మానిటరింగ్ వ్యవస్ధలో ఎప్పటికప్పుడు పొందుపర్చబడుతుంది. ఈ ఆన్ లైన్ వ్యవస్ధ పూర్తయిన తరువాత అధికారుల్లో జవాబు దారీతనంతో పాటు, పారదర్శకత పెరుగుతుందని, అలాగే అక్రమ కట్టడాలని నియంత్రించడానికి పకడ్బందీ వ్యవస్ధ ఏర్పడుతుందని ఆయన అన్నారు.

Photos from Hyderabad Metropolitan Development Authority (HMDA's post 01/02/2018

హెచ్‌ఎండీఏకు జెమ్స్ ఆఫ్ డిజిటల్ తెలంగాణ అవార్డు

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Block 'A', HMDA Complex, Tarnaka
Hyderabad
500007

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10:30am - 5pm
Saturday 10:30am - 5pm