ఇది సాధ్యమా?
1. నేను సమాజాన్ని, ప్రకృతిని ప్రేమిస్తాను సమస్యలపై స్పందిస్తాను, ఎటువంటి మత్తు పానియాలకు, చెడు అలవాట్లు కు బానిసను కాను.
2. నేను నిత్యం పుస్తకాలు చదువుతాను, హేతుబద్ధంగా ఆలోచిస్తాను, శాస్త్రీయంగా జీవిస్తూ నిత్యం విజ్ఞానాన్ని ప్రచారం చేస్తాను.
3. నేను మూఢనమ్మకాలను సామాజిక అసమానతలను తొలగించడానికి రాజ్యాంగం ఆర్టికల్ 51 A/h ప్రకారం కృషి చేస్తాను.
4. నేను నన్ను నేను గొప్పగా తీర్చి దిద్దుకుంటాను, నా కుటుంబాన్ని బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ల ఆశయాలతో నడిపిస్తాను.
5. నేను చార్వాక లోకాయుతుల వారసుడిగా MNS సంఘం సభ్యుడిగా నాయకుడిగా సమాజ చైతన్యం కోసం పాటు పడతాను.
ఏప్రిల్ 14, 2025 మనమంతా కలిసి HYD పెద్ద అంబేద్కర్ వద్ద పై 5 ప్రతిజ్ఞలు చేద్దామా?
MNS సభ్యులారా, నాయకులారా రండి, కలిసి కాసేపు hyd పెద్ద బాబాసాహెబ్ విగ్రహం వద్ద గడుపుదాం. ఎటువంటి ర్యాలీ ఉండదు. ప్రభుత్వంపై డిమాండ్ లు ఉండవు. నిరసన కార్యక్రమం కాదు. బాబాసాహెబ్ జయంతి ఉత్సవం గొప్ప పండుగ. శాంతి యుతంగా మనమంతా కుటుంబాలతో స్నేహితులతో సందర్శించుదాం, సరదాగా గడుపుదాం.
మీతో వాటర్ బాటిల్ 2 బిస్కెట్ ప్యాకెట్ లు, వీలైతే ఫ్రూట్స్ తెచ్చుకోండి.
ఆరోజు ఏప్రిల్ 14 సోమవారం ప్రభుత్వ సెలవు. అంతేకాదు ముందు రోజు ఆదివారం.
నేను నా భార్య పిల్లలతో స్నేహితులతో వస్తున్నాను.
ఇంతకీ మీరు వస్తున్నారా?
ఏ అతిధులు, వక్తలు, వీఐపీలు లేరు. జెండాలు బ్యానర్లు కరపత్రాలు పోస్టర్లు ఉండవు. ప్రసంగాలు ఉండవు. MNS సభ్యులు నాయకులు అంతా ఒక కుటుంబం. మన కుటుంబ కలయిక ఓ పెద్ద పండుగ అంతె.
ఉదయం ఎటువంటి ట్రాఫిక్ లేని సమయంలోనే తెల్లవారు జామున చేరుకుందాం. కొద్దిమందికి వాటర్ మరియు ఉప్మా ఉంటుంది.
ఇట్లు
డాక్టర్ బైరి నరేష్, గాండ్ల సుజాత టీచర్ ప్రశ్న ఉదయ్, జ్ఞాన ఉదయ్
వచ్చేవారు "నేను వస్తున్నా" అని 94415 45550 వాట్సాప్ చేయండి. ఆ కార్యక్రమానికి సంబంధించిన వాట్సాప్ లో ఆడ్ చేస్తా.
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం "MNS"
MNS వ్యవస్థాపకులు డాక్టర్ భైరి నరేష్ మరియు సుజాత టీచర్
ఈ నెంబర్ 9441545550 కి నేను ఏప్రిల్ 14 ఉదయం 6:00 గంటలకు హైదరాబాద్ పెద్ద అంబేద్కర్ విగ్రహం వద్దకు వస్తాను అని పెట్టిన అందరికీ ఇ కార్యక్రమం సంబంధించిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ లింక్ పెట్టాను. ఇంకా ఎవరికైనా పెట్టలేదా?
కేవలం వస్తాను అనే వారికి మాత్రమే ఆ గ్రూప్.
వచ్చే వారు 944 154 5550 కి నేను వస్తున్నాను అని పెట్టగలరు.
MNS ఆద్వర్యంలో హైదరాబాద్ లో 4 రోజుల మ్యాజిక్ ట్రైనింగ్
రిజిస్ట్రేషన్ చివరి తేది 24.03.2025
ఆసక్తి గలవారు వెంటనే MNS యూత్ సెక్రెటరీ గొమాస సందీప్ +91 81848 88626 కి కాల్ చేసి పేరు నమోదు చేసుకోగలరు.
శిక్షణ తేదీలు: మార్చి 28,29,30,31
శుక్రవారం నుండి సోమవారం వరకు
4 రోజులు HYD కూకట్పల్లి లో.
సమాజంలోని మూఢనమ్మకాలను పోగొట్టడానికి ప్రజలను ఆలోచింజేయడానికి మ్యాజిక్ చక్కటి మార్గం. మంచి శిక్షణ పొందాలి అనుకునేవారు వెంటనే మీ పేరును నమోదు చేసుకోగలరు.
శిక్షణ పూర్తిగా ఉచితం
భోజనము వసతి & మ్యాజిక్ మెటీరియల్ కోసం పాల్గొనే వారే ఒక జట్టుగా ఏర్పడి అతి తక్కువ ఖర్చులో మంచి ఇంటి భోజనము ఏర్పాటు చేసుకుంటున్నారు. మంచి కామన్ హాల్స్, రూమ్ లు, మ్యాజిక్ సామాగ్రి సమకూర్చుకోవడం జరుగుతుంది.
ఆసక్తి గలవారు MNS యూత్ సెక్రెటరీ గొమాస సందీప్ +91 81848 88626 కి వెంటనే కాల్ చేసి పేరు నమోదు చేసుకోగలరు.
ఇట్లు
డాక్టర్ బైరి నరేష్ 7013160831
మార్చి 23 అన్ని జిల్లాలలో భగత్ సింగ్ వర్థంతి తప్పకుండా నిర్వహించగలరు
ఏప్రిల్ 14 హైదరాబాద్ పెద్ద అంబేద్కర్ విగ్రహం ఉదయం 6:00 గంటలకు సందర్శంచుదాం మన యూనిఫాంలో రండి.
గెట్ రెడీ
23/03/2025
భగత్ సింగ్ అమర దినాన్ని ప్రతి ఒక్కరూ నిర్వహించండి.
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులకు నాయకులకు MNS వ్యవస్థాపకులు డాక్టర్ బైరి నరేష్ సుజాత టీచర్ పిలుపు.
మార్చి 23న భగత్ సింగ్ రాజ్ గురు సుఖదేవ్ లని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసిన రోజు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలని తృణప్రాయంగా వదిలిన త్యాగదనలు వీరు. ఉరి తీయడానికి ముందు మీ ఇష్టమైన మతాన్ని దైవాన్ని పూజించుకోండి అని అవకాశం ఇస్తే భగత్ సింగ్ నేను ఏ దేవుడిని విశ్వసించను అని దేవుడు లేడు అని తాను నాస్తికుడను అని ఉరితాడును ముద్దాడుతూ నాస్తికత్వాన్ని బోధించాడు. తాను ఎందుకు ఎలా నాస్తికుడిగా మారాడో వివరిస్తూ " నేను ఎందుకు నాస్తికున్ని అయ్యాను ?" అనే పుస్తకాన్ని మనందరికీ అందించాడు.
త్యాగానికి పోరాటానికి ధైర్యానికి విజ్ఞానానికి ప్రతిరూపం భగత్ సింగ్. నేటికీ యువతకు భగత్ సింగ్ పేరు చెప్పగానే ఒక రకమైన స్ఫూర్తి కలుగుతుంది.
భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి యువత నేడు మన సమాజం ఎదుర్కొంటున్న, మన దేశం ఎదుర్కొంటున్న, మన చుట్టూ ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై పోరాటం చేయవలసిన అవసరం, చైతన్య పరచవలసిన అవసరం, యువత ముందుండి నడిపించవలసిన అవసరం ఎంతో ఉంది. అవినీతి, లంచగొండితనం, నిరక్షరాస్యత, పేదరికం, మద్యపానం, పర్యావరణ కాలుష్యం, ఆకలి చావులు, మహిళలపై దాడులు, తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఇల్లు లేని బతుకులు, కుల వివక్ష, మూఢనమ్మకాలు, అశ్లీలత, చెడు వ్యసనాలు, నేర ప్రవృత్తి పెరగడం బాధ్యతారాహిత్యం ఇలా ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. నేటి యువత దేశభక్తి అంటే మతభక్తి అని దైవభక్తి అని పరాయి దేశాన్ని ద్వేషించడమే దేశభక్తిగా భావిస్తున్నారు ఇది దేశానికి ఎంతో ప్రమాదకరం. నేటి యువత దేశభక్తిని తన చైతన్యంలో పులుముకొని దేశం ఎదుర్కొనే సమస్యల పరిష్కారం దిశగా తన ఆలోచన ఉండాలని అందుకు స్ఫూర్తి భగత్ సింగ్ కావాలని ఆశిస్తున్నాము.
అందుకే ఊరురా ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో భగత్ సింగ్ పూర్తి దినాన్ని జరపాలని పిలుపునిస్తున్నాం. ఎక్కడ పదిమంది ఉంటే అక్కడే జరపాలని సూచిస్తున్నాం.
1. భగత్ సింగ్ విగ్రహాం వద్ద/భగత్ సింగ్ ఫోటో వద్ద కొవ్వత్తులు వెలిగించి జోహార్లు అర్పించడం. రోజంతా ఎవరి ఉద్యోగాలు ఎవరి పనులు వారు చేసుకుని సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల సమయంలోనే ఈ కార్యక్రమం నిర్వహించగలరు. మీ ఊరిలో మీ గల్లీలో మీ కాలనీలో మీ పట్టణంలో మీ స్నేహితుల సమక్షంలో జరపండి.
2. పది మంది గుండ్రంగా నిలబడి పిడికిలి బిగించి చేయి ముందుకు చాచి ప్రతిజ్ఞ చేయించడం.
"నేను ఒక నాస్తికుడిగా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యుడిగా నాయకుడిగా ఈ సమాజం ఎదుర్కొనే సమస్యల పైన ప్రజలను చైతన్య పరుస్తానని నా వంతు పాత్ర పోషిస్తానని భగత్ సింగ్ అమర దినం సందర్భంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను."
3. ఈ క్రింది నినాదాలు ఇవ్వగలరు.
1. జోహార్ భగత్ సింగ్ రాజు గురు సుఖదేవులకు
జోహార్ జోహార్
2. జోహార్ స్వతంత్రపోరాట అమరవీరులకు
జోహార్ జోహార్
3. వృధా కాదు మీ త్యాగం
వృధా కాదు వృధా కాదు
4. కొనసాగిస్తాం మహనీయుల ఆలోచన విధానాన్ని
కొనసాగిస్తాం కొనసాగిస్తాం
5. జీనా హై తో మరణా సీకో
కదం కదం పర్ లడ్నాసికో.
6. జై బోలో స్వతంత్ర భారత్ కి
జై
7. ప్రజాస్వామ్యం
వర్ధిల్లాలి
8.నశించాలి కులమతాలు
నశించాలి నశించాలి
9. నమ్మొద్దు మూఢనమ్మకాలనీ
నమ్మొద్దు నమ్మొద్దు
10.జోహార్ నాస్తిక అమరవీరులకు
జోహార్ జోహార్
11. జోహార్ అమర సైంటిస్టులకు
జోహార్ జోహార్
12. చారువాక లోకాయుతుల ఆలోచన విధానం
వర్ధిల్లాలి వర్ధిల్లాలి
13. బుద్ధుడు పూలే పెరియార్ భగత్ సింగ్ అంబేద్కర్ ఆలోచన విధానం
వర్ధిల్లాలి వర్ధిల్లాలి
14. కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని
కొనసాగిద్దాం కొనసాగిద్దాం
15. ఓ యువత మేలుకో
నీ బాధ్యత తెలుసుకో
16. కొనసాగిద్దాం స్వాతంత్ర్య అమరవీరుల స్పూర్తి ని
కొనసాగిద్దాం కొనసాగిద్దాం
17. బానిస కావద్దు యువత చెడు వ్యసనాలకు
బానిస కావద్దు బానిస కావద్దు.
18. MNS జిందాబాద్
జిందాబాద్ జిందాబాద్
19. వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి
వర్ధిల్లాలి వర్ధిల్లాలి
20. స్వర్గాలు నరకాలు
నేనే లేవు.
ఒక్కో నినాదాన్ని వరుసగా రెండు మూడు సార్లు పలకడం మంచిది. ఇంకా మీ వీలును బట్టి మరికొన్ని నినాదాలని జత చేసుకోవచ్చు. మన నినాదాలు ప్రజలను ఆలోచింప చేయడానికి ఉపయోగపడాలి తప్ప మన పట్ల ప్రజలకు వ్యతిరేక భావం వచ్చే నినాదాలను ఇవ్వకపోవడం మంచిది.
*ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో మూడు రోడ్ల కూడలిలో ఒక కుర్చీలో భగత్ సింగ్ ఫోటో పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు.
*నలుగురు ఉన్న నిరాశ పడవలసిన అవసరం లేదు నిర్వహించి తీరాలి.
*ఎటువంటి అనవసరపు ఖర్చు చేయకూడదు.
*కార్యక్రమం ఎక్కడ ఎప్పుడు ఎలా జరుపుతున్నామో మీమీ ప్రాంతంలో ఉన్న ప్రతి సభ్యుడికి వాట్సాప్ ద్వారా ఫోను ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం మర్చిపోకండి.
*భగత్ సింగ్ ఫోటో లేకపోయినా ఆయన ఫోటోతో ఉన్న పుస్తకాన్ని పెట్టుకొని అయినా కార్యక్రమాన్ని జరపడం మర్చిపోకండి.
* స్థానికంగా సహజంగా లభించే పువ్వులను ఉపయోగించండి.
* నాలుగు నుండి పది మందిని కలిసి జరుపుతున్నాము మీరు తప్పకుండా రండి అని మీకు తెలిసిన వారందరికీ ఆహ్వానించండి.
*ఇకమీదట ప్రతి సంవత్సరం మార్చి 23న దేశభక్తి దినం యువత స్పూర్తి దినం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో జరుపుకుంటాం.
*ఫోటోలు దిగటం వీడియోలు తీయడం స్టేటస్ పెట్టుకోవడం వాట్సప్ చేసుకోవడం లక్ష్యంగా జరగకూడదు. వీలైనంత మంది ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయడం పాల్గొన్న వారందరినీ ప్రేమగా ఆప్యాయంగా పలకరించడం పాల్గొన్న వారందరూ ఒకరికొకరు పరిచయం కావడం. మీమీ స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు భావ సారుప్యత గలిగిన వారి గురించి తెలుసుకోవడం, పరిచయం పెంచుకోవడం, స్థానిక ప్రజా సమస్యలు, సమిష్టిగా చేయవలసిన కార్యక్రమాలు, మూఢనమ్మకాల వల్ల జరుగుతున్న నష్టాలు, వాటి నిర్మూలనకు చేయవలసిన కార్యక్రమాలు, మన సంఘ నిర్మాణము, ఇతర సంఘాలతో నిర్వహించవలసిన స్నేహం పై దృష్టి పెట్టాలి.
1. ఒక నోట్బుక్ లో పాల్గొన్న వారి పేరు వివరాలు సమగ్రంగా రాసుకోవాలి
2. కనీసం 10 మంది వచ్చే వరకు అందరి చేత వారి అనుభవాలను మాట్లాడించాలి. అనంతరం అందరినీ అందరికీ పరిచయం చేయాలి.
3. భగత్ సింగ్ గురించి అవగాహన ఉన్న వారిని ప్రసంగించమని కోరాలి. లేదా నిర్వాహకులే భగత్ సింగ్ గురించి వివరించాలి.
4. వరుసగా నినాదాలు ఇవ్వడం అందరినీ భాగస్వాములను చేయడం చేయాలి.
5. భగత్ సింగ్ ఫోటో వద్ద అందరి చేత వరుసగా పువ్వులను పెట్టించాలి.
6.కొవ్వొత్తులతో వీలైనంత మేరకు చిన్న ర్యాలీ చేయాలి. లేదా భగత్ సింగ్ ఫోటో ముందు వెలిగించడం లేదా ఏదైనా మహానీయుడు విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిపితే అక్కడ కొవ్వొత్తులను వెలిగించడం చేయవచ్చు.
7. భగత్ సింగ్ రాసిన నేను ఎందుకు నాస్తికుడను అయ్యాను అనే పుస్తకాలు లేదా భగత్ సింగ్ జీవిత చరిత్ర పుస్తకాలను లేదా భగత్ సింగ్ కు సంబంధించిన విషయాలను ఒకటి రెండు పేజీలలో కరపత్రం రూపంలో ప్రింట్ చేసిన కాగితాలు అందుబాటులో ఉంటే వాటిని పాల్గొన్న వారిలో పిల్లలకు యువతకు బహుమతిగా ఇవ్వవచ్చు.
8. అందరూ వచ్చారు అని భావించిన తర్వాత ప్రతిజ్ఞ చేయించాలి.
9. నినాదాలు ఇస్తూ అందరూ వరుసగా నిలుచుని ఫోటో గాని వీడియో గాని తీసుకోవాలి.
10. MNS సభ్యులలో ఒకరు నాయకులలో ఒకరు పాల్గొన్న వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమం ముగిసినట్టుగా ప్రకటించాలి.
భగత్ సింగ్ వర్ధంతి ఇలా కూడా చేయవచ్చు:
--ఉదయం మీ దగ్గరలోని గ్రౌండ్లో అందరూ కలిసి వాకింగ్ చేస్తూ అందరూ చేరుకున్న తర్వాత వాక్ ఫర్ భగత్ సింగ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. అనంతరం వర్ధంతి జరపవచ్చు.
--దగ్గర్లోని విద్యాసంస్థలో భగత్ సింగ్ అమర దినం సందర్భంగా ఉపన్యాస, వ్యాసరచన పోటీలను నిర్వహించి బహుమతులను అందించవచ్చు.
--ఏదైనా కమ్యూనిటీ హాలులో స్థానిక యువజన సంఘాలను సమీకరించి భగత్ సింగ్ స్ఫూర్తి దినాన్ని ఒక సదస్సు లాగా నిర్వహించవచ్చు.
--ఏదైనా ఒక విశ్వవిద్యాలయంలో విద్యార్థి యువత సామాజిక బాధ్యత అనే అంశంపై చర్చ కార్యక్రమం నిర్వహించవచ్చు.
--ఏదైనా విద్యార్థులు ఉండే హాస్టల్లోనూ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు.
--కార్మికులైన కర్షకులైన ఉద్యోగస్తులైన ఉద్యమకారులైన మనుషులు ఎక్కడ ఉన్నా నలుగురు ఉంటే చాలు నిర్వహించాలనే తపన ఉంటే చాలు ఏదో ఒక రకంగా నిర్వహించవచ్చు.
ఈ కార్యక్రమం నిర్వాహణ నీ నాయకత్వానికి, నిర్వహణ నైపుణ్యాలకు ఒక సామాజిక కార్యకర్తగా మీకు ఒక పరీక్ష వంటిది. మంచి అవకాశం ఇది. చక్కగా ఆలోచించి, మన వారితో చర్చించి, ఒక ప్రణాళిక వేసుకొని, అందరిని సమీకరించుకొని చక్కగా నిర్వహించగలరు. మీరు ఒక మంచి కార్యకర్తగా, నాయకుడిగా, సామాజిక ఉద్యమకారుడిగా ముందుకు సాగాలని కోరుతూ...
ఇట్లు
డాక్టర్ బైరి నరేష్ సుజాత టీచర్
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం
7013160831
కార్యక్రమం నిర్వహించవలసిన తేదీ: మార్చి 23, 2025 ఆదివారం
ప్లాన్ చేసుకోండి నిర్వహించండి.
ఆల్ ది బెస్ట్.
మ్యాజిక్ శిక‌్షణ అప్ డేట్స్,
లక్ష్యం: సమాజ చైతన్యం కోసం పాటుపడే వంద మందికి మ్యాజిక్ నేర్పించడం డాక్టర్ బైరి నరేష్ లక్ష్యం.
మూఢనమ్మకాలపై ప్రజలను విద్యార్థులను చైతన్యపరిచే మెజీషియన్స్ తయారు చేయడం కోసం మార్చి చివరి 4 రోజులు. గెట్ రెడీ ఫ్రెండ్స్. అందులో ఆదివారం మరియు రంజాన్ రెండు సెలవు రోజులు ఉన్నాయి.
మ్యాజిక్ చూపించడం కాదు, మ్యాజిక్ వివరించడం కాదు, మ్యాజిక్ నేర్పించడం.
ఎదురుగా ఎంతమంది ఉన్నా ఎక్కడైనా ఎప్పుడైనా గంట నుండి రెండు గంటలపాటు మ్యాజిక్ చేస్తూ మూఢనమ్మకాలపై ప్రసంగించేలా తయారు చేయడమే ఈ శిక్షణ.
మ్యాజిక్ కు అవసరమైన సామగ్రిని ఎలా సమకూర్చుకోవాలి? ఒక్కో మ్యాజిక్ వస్తువును ఎలా తయారు చేసుకోవాలి? ప్రదర్శన ఎలా చేయాలి? రహస్యాన్ని సమయస్పూర్తి వాక్చాతుర్యాలను ఎలా అందిపుచ్చుకోవాలో నేర్పించడం.
4 రోజులలో 25 మ్యాజిక్ ఐటెంలు తయారుచేయడం నేర్పించి ప్రదర్శించడం నేర్పించి ప్రాక్టీస్ చేయించి పర్ఫెక్ట్ చేయడం. ఆ తర్వాత 100 ఐటెం లు సొంతంగా నేర్చుకునేలా చేయడం ఈ కార్యక్రమం లక్ష్యం.
మార్చి 28,29,30,31 నాలుగు రోజులు
హైదరాబాద్ కూకట్ పల్లిలో.
ఉదయం 7:00 నుండి రాత్రి 11:00 వరకు. పూర్తి వివరాలు ఆ శిక్షణ కోసం పెట్టిన వాట్సాప్ గ్రూప్ లో ఉంటాయి.
తనను తాను ఒక నాయకుడిగా, ఒక నిర్వహకుడిగా, ఒక వక్తగా, ఒక మెజీషియన్ గా తీర్చిదిద్దుకోవాలి అని భావించే చురుకైన ఆసక్తి గలవారు ముఖ్యంగా సమాజంలోని మూఢనమ్మకాలను పోగొట్టడానికి పనిచేస్తా అనుకునే వారు సంప్రదించండి.
ఎవరిని బలవంత పెట్టడం లేదు బ్రతిమిలాడటం లేదు.
శిక్షణ పూర్తిగా ఉచితం
కానీ
భోజనము వసతి మ్యాజిక్ సామాగ్రి కోసం పాల్గొనే వారే ఒక బృందంగా ఏర్పడి అతి తక్కువ ఖర్చులో సమకూర్చుకోవలసి ఉంటుంది. ఆ భాద్యతలు పూర్తిగా MNS యూత్ కమిటీ నిర్వహిస్తుంది.
నాలుగు రోజులు 24 గంటలు డాక్టర్ బైరి నరేష్ అక్కడే ఉండి నేర్పిస్తూ, ప్రాక్టీస్ చేయిస్తూ, సరిచేస్తూ, అనుభవాలు వివరిస్తూ అందుబాటులో ఉంటారు.
100 మంది రిజిస్ట్రేషన్ కోసం ఇంచార్జి గొమాస సందీప్ MNS యూత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి +91 81848 88626 ను సంప్రదించండి.
మ్యాజిక్ ట్రైనింగ్ ఇంచార్జి : బైరి అచ్చుత్ రాజ్ యూత్ ప్రెసిడెంట్ +91 93908 68211
ఇట్లు,
డాక్టర్ బైరి నరేష్ 7013160831,
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం,
15.03.2025.
15/03/2025
*ముత్తిరెడ్డిగూడెంలో క్షుద్ర పూజలు కలకలం .... వెంటనే స్పందించిన మూడ నమ్మకాలు నిర్మూలన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల నాగరాజు*
గ్రామంలోని అయ్యప్ప టెంట్ హౌజ్ ఆవరణలో అరెంజ్ రంగు బట్టలో పసుపు, కొబ్బరికాయ,నిమ్మకాయలు వేసిన వైనం
ఒక పేపర్ లో నేనే రాశాను అని పేరు రాయడంతో ఘటనపై చర్చ
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తి రెడ్డి గూడెం గ్రామంలో అయ్యప్ప టెంట్ హౌజ్ ఆవరణలో శుక్రవారం క్షుద్ర పూజల కలకలం రేగింది, గుర్తు తెలియని వ్యక్తి ఒక ఎర్ర బట్ట లో పసుపు,ఉల్లిపాయ,ఎల్లిగడ్డ, కాటన్, అగరు బత్తి లాంటి పదార్థాలు ఒక మూటలో కట్టి టెంట్ హౌజ్ ముందూ వేసి వెళ్ళిపోయారు.విషయం గమనించిన టెంట్ హౌజ్ యజమాని వెంకన్న వెళ్లి చూడగా ఒక ఆరెంజ్ కలర్ బట్టలో ఏళ్ళిగడ్డ,అగర్ బత్తి,పసుపు,ఒక పేపర్, పత్తి ఉన్నాయి,వెంటనే అతడు స్థానికులకు, పోలీసు వారికి సమాచారం అందించాడు,అయితె ఈ ఘటన సుమారుగా శుక్రవారం 3 నుండి 4 గంటల మధ్యన జరిగివుంటుందని స్థానికులు తెలుపగా అంతకు ముందు ఉదయం 9 గంటల సమయంలో టెంట్ హౌజ్ పక్కన ఇంటి ముందూ ఒక కొబ్బరికాయ,నిమ్మకాయలు పసుపు కుంకుమ వేసి వదిలి వెళ్ళారు.అధి జరిగిన కొద్ది గంటల్లోనే ఈ ఘటన జరగడంతో అందరు ఆశ్చర్య పోతున్నారు .అలాగే రెండు రోజుల ముందు టెంట్ ముందు నిమ్మకాయలు కూడా వేసి వెళ్లారని, తరువాతా టెంట్ హౌజ్ లో రెండు టెంట్ లు మరియు ఒక ఫర్నిచర్ తగలబడి పోయాయని టెంట్ హౌజ్ యజమాని గాధగాని వెంకన్న మీడియాకు తెలిపారు.అయితె ఈ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి ఒక పేపర్ పై ఒక పేరు రాసి నేనే కావాలని చేశాను అని రాయడంతో ఇంకా ఘటన చర్చ కు దారి తీసింది.పేపర్ లో ఉన్న పెరు ఉన్న వ్యక్తి గ్రామస్థుడే కావడంతో గ్రామస్తులు అతన్ని పిలిచి అడగ్గా నాకు ఏమీ తెలియదని చెప్పడంతో ఎవరో కావాలని విషయాన్ని దారి తప్పించడానికి అల చేశారా లేదా నిజం ఎంటి అని పోలీసు విచారణలో తేల్చాల్సి ఉంది.పేపర్ లో పెరు ఉన్న వ్యక్తికి అస్సలు రాయడం కూడా రాదని అతని కుటుంబ సభ్యులు మిడియా కు తెలిపారు .ఇవన్నీ పరిణామాలు బట్టి చూస్తే ఇదంతా ఎవరో కావాలని చేశారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఉపేందర్ యాదవ్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు ,దర్యాప్తు చెసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
*మూడ నమ్మకాలు ఎవ్వరూ నమ్మొద్దు భయభ్రాంతులకు గురి కావోద్దు*
*మూడ నమ్మకాలు నిర్మూలన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల నాగరాజు*
ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో జరిగిన ఘటన స్థలానికి మూడ నమ్మకాలు నిర్మూలన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల నాగరాజు చేరుకొని అక్కడి పరుస్తితులు పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సైన్సు ఇంత అభివృద్ధి చెంతుతున్న కాలంలో కూడా ఇలాంటి నమ్మకాలు నమ్మి బయపడ వద్దని అన్నారు.అందులో పెట్టిన పదార్థాలు ఏళ్లిగడ్డ,పసుపు,బట్ట, అగరుబత్తి, కొబ్బరికాయలు,నిమ్మకాయలు ఇవన్నీ రోజు మనం ఇంట్లో వాడే పదార్థాలే అని వాటికి ఎలాంటి మహిమలు,శక్తులు ఉండవని అన్నారు.ఇలాంటి ఘటనలతో ఎవ్వరూ బయపడవద్దు అని మూడ నమ్మాకాలను ప్రోత్స హించవద్దని తెలిపారు.ఇలాంటివి ఎవరో కావాలని ఆకతాయిలు చేస్తూ ఉంటారని అన్నారు.దానికి కారణాలు ఏదైనా కానీ ప్రజలు ఇలాంటి నమ్మకాలని పూర్తిగా నమ్మడం మానేస్తే వారి ఆటలు సాగవని తెలిపారు.
MNS ఫౌండర్స్ నాలుగు రోజుల యాత్ర వివరాలు:
(11.03.20225 మంగళవారం స్కూల్ అయిపోయినాక సాయంత్రం 4:30 కి బయలుదేరి తిరిగి మార్చి 15 శనివారం ఉదయం 8:00 గంటలకు స్కూల్ చేరే వరకు)
11.03.2025
1.ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశం
2.మాధవి నరసింహారావుల గృహ సందర్శన గుర్రాలపాడు గ్రామం
12.03.2025
3.గాంధీ రజినిల గృహ సందర్శన LB కాలని
4.మేఘన రాకేష్ ల కులాంతర వివాహం ఖమ్మం టౌన్
5.చెన్నేశ్వర రావు, నిర్మల ల గృహ సందర్శన (కొణిజర్ల లక్ష్మిపురం)
13.03.2025
6.కొత్తగూడెం కుటుంబ సమ్మేళనం రామవరం
7.సుజాతనగర్ లో జ్ఞాన ప్రచార సదస్సు
8.పాల్వంచలో సింగరేణి అధికారులతో చర్చ గోష్టి
14.03.2025
9.బిక్కులాల్ అజ్మ ల గృహ సందర్శన చుంచుపల్లి
10.అరుణ హరిలాల్ గృహ సందర్శన ఇల్లందు
11.మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో యూతతో ముఖాముఖి
12.నాగరాజు శ్రీకాంత్ గృహ సందర్శన తొర్రూరు
నాలుగు రోజులు నాలుగు వేరు వేరు గృహాలలో నిద్రించాము. ఆయా కుటుంబాలతో నేరుగా మానవ సంబంధాలు ఏర్పరచుకున్నాము కుటుంబస్థితిగతులు తెలుసుకున్నాను. ఈ ప్రయాణంలో దాదాపు 100 మంది కొత్తవారు పరిచయం అయ్యారు. మూడు జిల్లాలు కవర్ అయ్యాయి. మా కుటుంబానికి 5000 రూపాయల ప్రయాణ ఖర్చు వచ్చింది. ఈ ప్రయాణంలో ఎవరి సహాయము అడగలేదు తీసుకోలేదు.
ఇట్లు,
డాక్టర్ బైరి నరేష్ గాండ్ల సుజాత టీచర్,
7013160831.
13/03/2025
11.03.2025 ఖమ్మం రిపోర్ట్:
ప్రియమైన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులారా నాయకులారా!
నిన్న అనగా మార్చి 11 2025 మంగళవారం రోజు ఎంఎన్ఎస్ ఫౌండర్ జాతీయ సమన్వయకర్త గాండ్ల సుజాత టీచర్ మరియు నేను కలిసి ఖమ్మం జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చాము. తాను స్కూల్ టీచర్ గా డ్యూటీ అయిపోయిన తర్వాత బయలుదేరి 150 కిలోమీటర్లు ప్రయాణించి సాయంత్రం ఏడు గంటలకు ఖమ్మం చేరుకున్నాం. నిన్న సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు సమావేశం చాలా బాగా జరిగింది.
మేము వచ్చేసరికి పరిచయ కార్యక్రమం ఎజెండా అంశాలపై చాలా లోతుగా చర్చిస్తూ ఉన్నారు. 30 మంది పెద్దవారు పదిమంది పిల్లలు. 40 మందితో జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల నరసింహారావు అన్న గారి ఇల్లు సామాజిక ఉద్యమకారులతో సందడిగా కనిపించింది. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న పూలతో మాకు వెల్కం చెప్పారు. మూడు గంటల పాటు ప్రయాణించిన రాగానే వారందరినీ చూడగానే ఒక్కసారిగా మా అలసట మాయమైంది. 90% మన సంఘం యూనిఫామ్ నల్ల చొక్కాలలో రావడం నాకెంతో సంతోషాన్ని కలిగించింది. మేం చేరుకునే సమయానికే పరిచయ కార్యక్రమం పూర్తి చేస్తున్నారు.
జిల్లా అధ్యక్షురాలు ఎమ్మటి ప్రీతి సంఘర్షణ సభాధ్యక్షుత వహించగా, జిల్లా కార్యదర్శి కందుల నరసింహా రావు ప్రారంభించి మాకు స్వాగతం పలుకుతూ మాట్లాడమని ఆహ్వానించారు.
మితృలారా!
ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో శాతవాహన యూనివర్సిటీలో పరిచయమైన ప్రవీణ్ గౌడ్, కాకతీయ యూనివర్సిటీ జాతీయ సేవా పథకం క్యాంపు ద్వారా పరిచయమైన పండగ శ్రీనివాస్, చెన్నేశ్వర రావు, ఖమ్మంలో రకరకాల విద్యా సంస్థలలో పలు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎంతోమంది పరిచయమయ్యారు. గురుకుల పాఠశాలల్లో కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు మరికొందరు పరిచయం అయ్యారు. ఫేస్బుక్ ద్వారా మరికొందరు పరిచయమయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి మండలంలోనూ నేను ప్రయాణించాను. అనేక మారుమూల గ్రామాలు తిరిగాను చైతన్య కార్యక్రమాలను నిర్వహించాను. భద్రాచలం ఏజెన్సీలో జరిగిన అనేక మూఢనమ్మకాల సంఘటనపై నిజనిర్ధారణకు వెళ్లి సంబంధిత అధికారులకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. హరికిరణ్ ఐఏఎస్ భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు ఆఫీసర్ గా ఉన్నప్పుడు 10 రోజులపాటు ప్రభుత్వ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ అతిథిగా ఉండి అక్కడ పని చేశాము. గతంలో ఖమ్మం టౌన్ లో ఉన్న అన్ని విద్యాసంస్థలు పాఠశాలలు కళాశాలలు హాస్టల్లు గురుకులాలు అన్నింటిని వరుసబెట్టి విజ్ఞాన సదస్సులు నిర్వహించాము. ఆ క్రమంలో అంబేద్కరిస్టులు కమ్యూనిస్టులు మనకు తోడుగా నిలిచారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇల్లందు మణుగూరు పాల్వంచ కొత్తగూడెం రుద్రంపూర్, సత్తుపల్లి వరకు అనేక ప్రసంగాలు ఇస్తున్నప్పుడు వామపక్ష కార్మిక నాయకులందరూ ఆదరించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోరుకునే ప్రతి వ్యక్తి నన్ను ఆదరించి అక్కును చేర్చుకున్నారు. ఆ క్రమంలో నాడు కొత్తగూడెం శాసనసభ్యులుగా ఉన్న కూనంనేని సాంబశివరావు గారితో అనేక వేదికలు పంచుకున్నాం. ఇదే ఖమ్మం నుంచి నా జీవిత భాగస్వామి ఉండటం ఈ జిల్లాతో నాకు మరింత అనుబంధాన్ని పెంచింది. కొత్తగూడెం కేంద్రంగా వీరు, రాజసమ్మయ్య, హరిప్రసాద్ జిమ్ సంతోష్, రేడియో సత్యనారాయణ, విక్రాంత్, జంపన్న, సుమన్ చారువాక ఇలా చాలామంది పరిచయం అవుతూ నాకు తోడుగా నిలుస్తూ ఈ జిల్లాలో మూఢనమ్మకాలు నిర్మూలన కోసం తమదైన పాత్ర పోషించారు. ఉమ్మడి ఖమ్మం రెండు జిల్లాలుగా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లాలో మన భావజాల ప్రసారము తక్కువ అయింది అని భావించాను. మనందరికీ ఎన్నో రచనలు అందించిన గొప్ప సాంఘిక విప్లవ రచయిత క్రాంతికార్ ఖమ్మం వారే. నిరంతరం స్ఫూర్తినిస్తూ సహాయ సహకారాలు అందించే డా. భాను ప్రసాద్ గారు భద్రాచలం. వీరిద్దరి ప్రభావం నాపై ఎంతో ఉంది.
మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పెట్టిన తర్వాత మనకు ఖమ్మం నుండి పూలే అంబేడ్కర్ అధ్యయనం వేదిక వారు పరిచయం అయ్యారు. రాంబాబు గారు పలు కార్యక్రమానికి అతిథిగా పిలిచి ఇక్కడ మిత్రులను మనకు పరిచయం చేశారు. పిడిఎస్యు మహాసభల్లో అతిథిగా పాల్గొనడం మనకు ఎంతో బలాన్ని ఇచ్చింది.
ఖమ్మంలో గతంలో MNS ఆద్వర్యంలో ఒక్కరోజు శిక్షణ తరగతులు పెట్టుకోవడం, అలాగే ప్రకృతి దర్శనం కార్యక్రమం కోసం నేలకొండపల్లికి వెళ్లడం మధ్యలో ఒకటి రెండు సార్లు జ్ఞాన గుహ సందర్శనలు చేయడం జరిగింది.
విశాఖపట్నం మూడు రోజుల మహాసభలు, బెంగళూరు శిక్షణ తరగతులు, మోకిల శిక్షణ తరగతులు, హైదరాబాద్ వరంగల్ సమావేశాలలో ఉమ్మడి ఖమ్మం నుంచి ఒక్కొక్కరు పాల్గొనడం మొదలై నేడు అటు భద్రాద్రి కొత్తగూడెంలో 60 మందితో జిల్లా కమిటీ బలోపేతం అయ్యింది. ఇటు ఖమ్మం జిల్లాలో 50 మందితో సంఘం బలోపేతం అయింది.
ఈ ఉద్యమ ప్రయాణంలో ఎంతోమంది తమ తమ వీలు మేరకు తమ పాత్ర పోషించి మన ఉద్యమానికి సానుభూతిపరులుగా మిగిలిపోయారు. యూట్యూబ్ ద్వారా పరిచయమైన అనేకమందిని ఇంకా నేరుగా కలవనే లేదు. వారిని నేరుగా కలవవలసిన అవసరం ఎంతో ఉంది.
ఇలా అనేక అనుభవాలని అందరితో పంచుకోవడం జరిగింది. మన గతం మన చరిత్ర వర్తమానానికి ఎంతో స్ఫూర్తి ఇస్తుంది భవిష్యత్తుపై ఆశలు కలిగిస్తుంది అందుకే వివరించడం జరిగింది.
తర్వాత మార్చి 23 ఆదివారం రోజు భగత్ సింగ్ వర్ధంతిని రోజంతా స్ఫూర్తి దినం గా జరపాలని భార్యా పిల్లలతో భగత్ సింగ్ పుస్తకాన్ని చదివించాలని ఆయన రాసిన పుస్తకాలపై ఆయన జీవితంపై ముగ్గురు వక్తలు మనలోనే తయారై ప్రసంగించాలని రోజంతా ఒకే చోట గడిపి భగత్ సింగ్ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని నిర్ణయించడం జరిగింది.
గతంలో అధ్యక్ష కార్యదర్శులు మరియు ఒకటి రెండు బాధ్యతలు పలువురికి ఇచ్చాము. ఈసారీ పూర్తిస్థాయి కమిటీని వేసుకోవడం జరిగింది. MNS యూత్ అధ్యక్ష కార్యదర్శులను కూడా నియమించుకున్నాను. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర కార్యవర్గంలోకి విజయ్ కుమార్ గారిని తీసుకున్నాము. ఖమ్మం జిల్లా కమిటీలో ముగ్గురు మహిళలు కీలక పాత్రను తీసుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నాము. ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన సంఘ సభ్యుడు కులాంతర వివాహం చేసుకొని మొదటిసారిగా భార్యతో మన కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా MNS ఫౌండర్స్ గా వారిని శాలువాతో సన్మానించి పెరియార్ చిత్రపటంతో సత్కరించి,బాబాసాహెబ్ పుస్తకాన్ని బహుకరించడం జరిగింది.
2025 మార్చి చివరి నాలుగు రోజులు హైదరాబాదులో జరిగే మ్యాజిక్ శిక్షణ తరగతులకు ఖమ్మం నుండి నలుగురు వ్యక్తులు రావడానికి ఆసక్తి చూపించడం జరిగింది.
ఈరోజు జరిగిన సమావేశానికి ఐదు మంది తమ భార్యలను తీసుకొని వచ్చి పాల్గొన్నారు. ఆ జంటలకు పెరియార్ చిత్రపటాలు బహుకరించడం జరిగింది. ఎనిమిది మంది చదువుకునే విద్యార్థులు పాల్గొన్నారు. వారికి బాబాసాహెబ్ అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని కానుకగా ఇచ్చాము. అనంతరం ఆ కమిటీని ఆమోదిస్తూ ఫౌండర్స్ గా సంతకం చేయడం జరిగింది అలాగే నూతన కమిటీని ప్రకటిస్తూ వీడియో చేయటం జరిగింది.
కందుల నరసింహారావు మాధవిలు పాల్గొన్న అందరికీ చక్కని టమాటా పచ్చడి, సాంబారు మరియు పప్పుతో అందరికీ కడుపునిండా భోజనం పెట్టారు.
సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కార్యక్రమం జరిగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవడం జిల్లా కమిటీలో బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరి చేత ప్రసంగింపజేయడం జరిగింది.
అనంతరం మూడు కుటుంబాల వారిమి అర్ధరాత్రి వరకు సరదాగా కుటుంబ విశేషాలు విద్య, విలువలు, ఆదాయం అలవాట్లు పొదుపు గురించి ముచ్చట్లు పెట్టడం జరిగింది.
ఇట్లు
డాక్టర్ బైరి నరేష్
7013160831
మార్చి 12.03.2025
11/03/2025
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతరామరాజు జిల్లా MNS కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ మహిళా దినోత్సవం
ఈ రోజు సాయంత్రం ఖమ్మం టౌన్ లో డాక్టర్ బైరి నరేష్ ప్రసంగం.
మార్చి 11, 2025 మంగళవారం
సాయంత్రం 6:00 నుండి 10:00 వరకు
MNS ఖమ్మం జిల్లా కార్యదర్శి: కందుల నర్సింహారావు +91 99858 85605
స్థలం: MNS జ్ఞాన గృహం, ఖమ్మం, పెద్దతండ గ్రౌండ్ దగ్గర, గుర్రాలపాడు గ్రామం, అభయ టౌన్ షిప్.
కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొనే వారు మాత్రమే ఈ ప్రత్యేక గ్రూప్ లో ఆడ్ కాగలరు.
08/03/2025
మార్చి 9 ఆదివారం జనగాం
మితృలారా మార్చి 9 తేదీన నేను ఒక సోదరుడి పెళ్ళి కోసం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం ధర్మాపురం గ్రామం వస్తున్నాను.
ఆ తమ్ముడి పెరు దౌపాటి ప్రశాంత్ తాను మన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మరియు ఇరువైపుల బంధుమిత్రులను ఒప్పించి బుద్దుడు పూలే పెరియార్ అంబేద్కర్లు చూపిన మార్గంలో మన సంఘం బ్యానర్ తో పెళ్లి చేసుకుంటున్నాడు.
అతనిని అతని కుటుంబాన్ని అభినందించడం కోసం నేను వస్తున్నాను. మీలో వీలైన వారు రాగలరు. ముఖ్యంగా జనగామా జిల్లా సూర్యాపేట జిల్లా యాదాద్రి జిల్లా మహా బాద్ జిల్లా, హన్మకొండ జిల్లా, వరంగల్ జిల్లాల ముఖ్య నాయకులు రాగలరు. మరియు తొర్రూర్, పాలకుర్తి, జనగాం టౌన్, తిరుమలగిరి ప్రాంత మితృలు సభ్యులు నాయకులు వీలు చేసుకుని బ్లాక్ షర్ట్ లో రాగలరు.
మార్చి 9, ఆదివారం నేను నా భార్య పిల్లలతో వస్తున్నాను. ఉదయమే వస్తాను. ఎందుకంటే ఆ ఊరికి దగ్గరలో కడవెండి అనే చారిత్రక గ్రామం ఉంది. దొడ్డి కొమురయ్య ఉద్యమ స్మృతి చిహ్నాలను సందర్శించడం ఉంటుంది.
ఉదయం పెండ్లి వద్ద కలుసుకుని పెళ్ళి తర్వాత మధ్యాహ్నం భోజనం చేసి కడవెండి గ్రామం చూసి కాసేపు అక్కడ దొడ్డి కొమురయ్య భవన్ లో గడిపి నూతనంగా ఆసక్తిగల వారిని జిల్లా కమిటీలోకి తీసుకుని తిరిగి ప్రయాణం అవుతాం.
ఆదివారం పెళ్ళికి 236 వ పెళ్ళికి వచ్చేవారు. జనగాం జిల్లా అద్యక్షులు గట్టగల్ల రమేష్ +919177624126 కి ఫోన్ చేయగలరు.
ఆ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తారు అప్డేట్స్ ఇస్తారు.
MNS 2025 మార్చి నెల ప్రణాళిక
డియర్ MNS మెంబెర్స్ & లీడర్స్..
మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం,
మార్చి 23 భగత్ సింగ్ అమరదినం,
మార్చి 28,29,30,31 నాలుగు రోజులు హైదరాబాద్ లో మ్యాజిక్ శిక్షణ
పై మూడు కార్యక్రమాలలో మొదటి కార్యక్రమం మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం.
ఈ సందర్భంగా మన సంఘ సభ్యులు నాయకులు వారి వారి జిల్లాలలో వారి వారి మండలాలలో ఎక్కడ వీలైతే అక్కడ ప్రపంచ మహిళా దినోత్సవాన్ని నిర్వహించగలరు. ఎన్ని చోట్ల ఐనా నిర్వహించాలి.
"మహిళలు వారి సమస్యలు ఆ సమస్యలకు కారణాలు ఏమిటి?" అనే టైటిల్ తో మీకు వీలైన చోట పదిమందికి తగ్గకుండా ఒకచోట కూర్చుని చర్చించగలరు. మన సంఘం నాయకుల్లో ఒకరు వారి వారి అభిప్రాయాలని మోబైల్ లో వీడియో రికార్డు చేయగలరు. ఒకరు మన రిజిస్టర్ బుక్ లో వాళ్ళ అభిప్రాయాలని మినెట్స్ గా రాయగలరు. చక్కగా ఒక గ్రూప్ ఫోటో దిగి పెట్టగలరు. ఈ కార్యక్రమానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకూడదు. మన సంఘం పరిమినెంట్ బ్యానరు మీ వద్ద ఉంటే దానినే వెనకాల దారాలతో కట్టగలరు. బ్యానర్ లేకపోయినా పర్వాలేదు నిర్వహించండి. పది మంది మహిళలు అంతకంటే ఎక్కువ మంది మహిళలు పాల్గొనడం, మహిళలు ఎదుర్కొనే సమస్యలు ఏమేమి ఉన్నాయి వాటికి గల కారణాలు ఏమిటి అనేది సమగ్రంగా చర్చించడం మాత్రమే ఈ కార్యక్రమం ప్రధాన ఆశయం. బ్యానర్లు ఫ్లెక్సీలు కరపత్రాలు హాలు కుర్చీలు సౌండ్ బాక్స్ స్నాక్స్ టీ భోజనము శాలువాలు బొకేలు మెమొంటోలు ఫోటోలు దండలు బహుమతులు ఇవేవీ లేకపోయినా పర్వాలేదు. మన సంఘం నాయకులు ప్రసంగించడం ప్రధానం కాదు మహిళల అందరి చేత మాట్లాడించడం దానిని రికార్డు చేయడం ప్రధానం. వీలుంటే ఆ కార్యక్రమం రిపోర్ట్ మన జిల్లా వాట్సాప్ గ్రూప్ లో పెట్టగలరు.
ఈ కార్యక్రమాన్ని
ఈ కింది తేదీల్లో నిర్వహించగలరు.
1.మార్చి 8 రెండవ శనివారం
2. మార్చి 9 ఆదివారం
3.మార్చి 13/14 హోలి పండుగ ఒక సెలవు ఉంది
4.మార్చి 16 ఆదివారం ఉంది.
ఈ రోజుల్లో పెట్టుకోగలరు.
కనీసం 10 మంది మహిళలు ఉండాలి. వీలైనంత ఎక్కువ మంది ఉండేలా చూడండి.
మన సంఘం సభ్యులు నాయకులు అనుకునే వారు ఆ రోజు అందుబాటులో ఉండాలి.
కార్యక్రమం 3గంటలకు తక్కువ ఉండకూడదు. ఏదో నామమాత్రపు కార్యక్రమం కాదు. ఓం ఫోటో దిగాం చాలు అనుకోవద్దు. ఎవరిదైన ఇంట్లో జరిపినా పరవాలేదు.
ముందుగా తేది స్థలం సమయం నిర్ణయం చేసుకుని మన గ్రూప్ లలో ప్రకటీంచాలి. ఇంచార్జి గా ఒకరిద్దరి ఫోన్ నెంబర్ ఇవ్వాలి. భాద్యతగా మీమీ ప్రాంతంలో ఉన్న MNS సభ్యులకు నాయకులకు స్వయంగా ఫోన్ చేసి పిలవాలి. వచ్చే వారితో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవాలి.
చక్కగా కూర్చునే ఏర్పాటు చేసుకోవాలి, మంచినీరు, వాష్ రూం ఉండేలా చూడండి. అవకాశం ఉంటే టీ బిస్కెట్స్ ఇచ్చుకోవచ్చు. పాల్గొన్న వారి పేరు ఊరు వయసు ఫోన్ నెంబరు వృత్తి మీ జిల్లా రిజిస్టర్ లో రాసుకోగలరు. కొత్త వారు ఎవరైనా పరిచయమైన వారికి ఇంకా ఏదైనా బాధ్యతలు ఇవ్వండి. సభ్యత్వం ఇవ్వండి. అలాగే పాల్గొన్న వారి వివరాలన్నీ కేంద్ర కమిటీకి పంపించండి.
మీ కార్యక్రమం అనంతరం గ్రూప్ ఫోటో పత్రికలు పంపండి చర్చించిన సమాచారం కూడా పంపండి. ఒక వెళ పత్రికల్లో రాకపోయినా నిరాశ పడకండి.
రెండవ కార్యక్రమం :
మార్చి 23 భగత్ సింగ్ అమరదినం.
ఈ కార్యక్రమాన్ని మార్చి 23 ఆదివారం రోజు వస్తుంది. ఆతేదీ రోజుననే కనీసం 20 మందితో నిర్వహించండి.
ప్రతి జిల్లా కమిటి తప్పకుండా నిర్వహించండి. ఏదో ఒక గ్రామంలో లేదా జిల్లా కేంద్రంలో ప్లాన్ చేసుకోండి.
స్థలం ఎక్కడైనా పరవాలేదు, ఏదైనా పబ్లిక్ ప్లేస్ లో లేదా మన నాయకుల ఇంటిముందు కాస్త స్థలం ఎక్కువ ఉన్నచోట పెట్టుకున్న పర్వాలేదు సమయం మీ ఇష్టం.
కాని మార్చి 23 రోజు ఆదివారం రోజు మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఒకే రోజు అన్ని జిల్లాలలో నిర్వహించాలి. ఆరోజు జిల్లా కమిటీ సమావేశం పెట్టుకోవచ్చు. నూతన సభ్యులకు సభ్యత్వ కార్యక్రమం పెట్టుకోవచ్చు, కుటుంబాలు కలుసుకునే కార్యక్రమం పెట్టుకోవచ్చు, ప్రకృతి దర్శనం కార్యక్రమం పెట్టుకోవచ్చు, ఏదైనా ఒక ప్రకృతి ప్రదేశానికి వెళ్లవచ్చు, లేదంటే మన ముఖ్య నాయకుల ఇంట్లో పరిచయ కార్యక్రమం పెట్టుకోవచ్చు.
సాయంత్రం 5:00 నుండి 6:00 వరకు కొవ్వొత్తులతో చిన్న ర్యాలీ చేసి దగ్గరలోని భగత్ సింగ్ విగ్రహం వద్ద ఆ విగ్రహం లేకపోతే బాబాసాహెబ్ విగ్రహం వద్ద అది మీకు దగ్గరలో లేకపోతే కుర్చీలో భగత్ సింగ్ ఫోటో పెట్టి భగత్ సింగ్ కి నివాళులు అర్పించాలి. మానవహారం గా ఏర్పడి ప్రకృతిని రక్షించడం గూర్చి మూఢనమ్మకాలను నిర్మూలించడం గూర్చి ప్రతిజ్ఞ చేయాలి. అందరితో భగత్ సింగ్ గురించి తమకు తెలిసిన విషయా లని మాట్లాడించాలి. ఈ కార్యక్రమంలో కూడా బ్యానర్లు జెండాలు కరపత్రాలు భగత్ సింగ్ ఫోటోలు ఏవీ లేకపోయినా పర్వాలేదు చేతిలో కొవ్వొత్తి ఒంటిపై నల్ల చొక్కా భగత్ సింగ్ నినాదాలతో కొద్ది దూరం నడిచి భగత్ సింగ్ విగ్రహం లేదా బాబాసాహెబ్ విగ్రహం వద్ద వాటిని పెట్టి మనం మన బాధ్యతను నిర్వహిస్తే సరిపోతుంది.
ర్యాలీ అనంతరం చక్కగా గ్రూప్ ఫోటో దిగి కేంద్ర కమిటీ కి పంపగలరు. ఇలా నిర్వహించారు ఏమేమి మాట్లాడారు ఏమని ప్రతిజ్ఞ చేశారు ఆ వివరాలు పత్రికా సోదరులకు పంపించగలరు. కార్యక్రమానికి ముందే పత్రిక సోదరుల ఫోన్ నెంబర్లు సేకరించి పలానాచోట పదిమందితో ఒక కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పండి. ఎక్కువమంది పాల్గొంటున్నారు అని చెప్పడం అవసరం లేదు.
ఈ కార్యక్రమం కోసం ముందస్తుగా చేయవలసిన పని. తేదీ స్థలము సమయము నిర్ణయించుకొని ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మన వారందరికీ సమాచారం ఇచ్చి మన వారిని సమీకరించడం నిర్వహించడం.
తేది ఫిక్స్ : 23.03.205 ఆదివారం
సమయం: ర్యాలీ సాయంత్రం 5:00 నుండి 6:00 వరకు ఫిక్స్ కాని మీ పరిచయం కార్యక్రమం లేదా సభ్యత్వం లేదా జిల్లా కార్యవర్గ సమావేశ సమయాన్ని మీరు నిర్ణయించుకోవలసి ఉంది.
స్థలం: ఏ గ్రామంలో లేదా ఏ పట్టణంలో ఎక్కడ ఈ కార్యక్రమం నిర్వహించాలి అనుకుంటున్నారో దానికి దగ్గరలోని పబ్లిక్ ప్లేస్ లో గ్యాదర్ ఐతే సరిపోతుంది. లేదా దగ్గరలోని మన నాయకుల ఇంటి వద్ద అందరూ చేరుకోగలరు. కొవ్వొత్తులు మరియు చేతులు కాలకుండా పేపర్ కప్స్ తీసుకోగలరు. భగత్ సింగ్ ఫోటో ఒకటి ఉంటే జాగ్రత్తగా ఉపయోగించుకోగలరు. మళ్లీ వచ్చే సంవత్సరం ఉపయోగించుకోవచ్చు. అవకాశం ఉంటే 2 ఇంటూ త్రీ సైజ్ బ్యానర్ ఫ్లెక్సీ పై ప్రింట్ చేయించుకోగలరు. ఇంత మన సంఘం పేరు వచ్చేలా చెప్పండి. మన పర్మినెంట్ బ్యానరు పట్టుకొని ర్యాలీ చేస్తే బాగుంటుంది. అన్ని జిల్లాల వారు 180 రూపాయలతో 3×6 బ్యానర్ మన సంఘం శాశ్వత బ్యానర్ ఒకటి ప్రింట్ తీసుకొని పెట్టుకోగలరు.
ఈ కార్యక్రమానికి కొవ్వొత్తులు పేపర్ కప్స్ ఒక బ్యానరు చాలు. తప్పనిసరి అయితే చాయ్ బిస్కెట్స్ పెట్టుకోగలరు. కనీసం 20 మంది పాల్గొనడం తప్పనిసరి అని టార్గెట్ అనుకోండి.
ముందుగా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పాల్గొనే వారిని మాత్రమే దాంట్లో జత చేసుకోండి. తేదీ స్థలము సమయము నిర్ణయం అయ్యాక ఒకరిద్దరు బాధ్యత తీసుకొని అందరికీ ఫోన్ చేసి ఆహ్వానించండి. మీకు వీలు పడితేనే పత్రికలకు సమాచారం ఇవ్వండి. పత్రికల కోసం మీ కార్యక్రమాన్ని ఆగమాగం చేయకండి. కొవ్వొత్తులు నిప్పు చాలా జాగ్రత్తగా ఉండండి. భగత్ సింగ్ గురించి మన సంఘం గురించి మాత్రమే నినాదాలు ఇవ్వండి. ఆ నినాదాలలో ఇతర ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనుకున్న వాటిని ఇవ్వకండి. మంచి అర్థవంతమైన నినాదాలతోనే ర్యాలీ చేయండి. ర్యాలీ ఎక్కువ దూరం చేయాలి అని ఎలాంటి రూల్ లేదు. 10 లేదా 20 మందే కాబట్టి ఎటువంటి అనుమతి అవసరం లేదు. మీకు వీలైతే మళ్లీ చెబుతున్న మీకు వీలైతే నే అవకాశం ఉంటే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి వెళ్లి దేశభక్తుడు స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ గారి వర్ధంతి సందర్భంగా మేము శాంతియుతంగా కొవ్వొత్తులతో చిన్న ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణ గురించి యువత చెడు అలవాటులకు దూరంగా ఉండడం గూర్చి ఒక ప్రతిజ్ఞ చేస్తాము అని చెప్పి ఎస్ఐ గారిని కూడా ఆహ్వానించండి. దగ్గరలో భగత్ సింగ్ విగ్రహము, శ్రీశ్రీ విగ్రహము, త్రిపురనేని రామస్వామి విగ్రహము, ఎవరైనా స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహం ఉంటే అక్కడే చేయండి. ఇవి లేని చోట అంబేద్కర్ విగ్రహం వద్ద చేయండి. ఈ కార్యక్రమము చేయలేని జిల్లా కమిటీని ప్రక్షాళన చేసి నూతన కమిటీ వేసే ప్రయత్నం చేస్తాను.
మూడవ కార్యక్రమం:
100 మందికి నాలుగు రోజుల మ్యాజిక్ శిక్షణ
ఈ కార్యక్రమం కేంద్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది.
దీనికి ఇంచార్జి యూత్ కమిటీ సెక్రెటరీ గోమాస సందీప్. రిజిస్ట్రేషన్ కూడా తానే నిర్వహిస్తాడు.
మ్యాజిక్ శిక్షణ డాక్టర్ బైరి నరేష్ ఇస్తారు శిక్షణ పూర్తిగా ఉచితం.
ఈ కార్యక్రమం సమన్వయ కర్త యూత్ ప్రెసిడెంట్ బైరి అచ్యుత్ రాజ్ .
నాలుగు రోజులు కేవలం శిక్షణ మాత్రమే ఉచితం. నాలుగు రోజులు భోజనము, వసతి, శిక్షణా మెటీరియల్ వీటి ఖర్చుల కోసం పాల్గొనే వారే ఒక టీం గా ఏర్పడి సమకూర్చుకోవాలి. ఆ వివరాలు యూత్ సెక్రెటరీ సందీప్ వివరిస్తారు.
ఈ శిక్షణ కేవలం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు నాయకులకు మాత్రమే. కేవలం 100 మందికి మాత్రమే.
గొమాస సందీప్ నెంబర్ +91 81848 88626.
తప్పకుండా 4 రోజులు పాల్గొని మ్యాజిక్ నేర్చుకుని మామా ప్రాంతంలో మూఢనమ్మకాల పై ప్రజలను చైతన్యం చేస్తాను అనుకునే వారు వెంటనే సందీప్ కి వాట్సాప్ ద్వారా పేరు నమోదు చేసుకోగలరు.
100 మంది అయ్యాక ఇతర విషయాలు ఆ గ్రూప్ లో చర్చిస్తారు.
ప్రతి జిల్లా నుంచి ఒకరిద్దరు మ్యాజిక్ నేర్చుకునేందుకు శిక్షణకు వచ్చేలా చూడగలరు. ఖర్చు అంచనా తలా ఓ వేయి రూపాయలు కావచ్చు. ఆ విషయాలు పాల్గొనే వారు ఒక జట్టుగా ఏర్పడి నిర్ణయం తీసుకుంటారు.
ఇట్లు
డాక్టర్ బైరి నరేష్ 7013160831
ఫౌండర్ & జాతీయ అధ్యక్షుడు
మీరు మహిళా దినోత్సవం, భగత్ సింగ్ వర్ధంతి ఎప్పుడు ఎక్కడ ఎలా నిర్వహిస్తారో నాకు రిప్లై ఇవ్వండి.
చూస్తూ కూర్చుంటే కేవలం అనుకుంటె పనులు కావు చేస్తేనే అవుతాయి.
నేను సభ్యుడిని అనుకుంటే సభ్యుడివి కావు పాల్గొంటే నిర్వహిస్తేనే అవుతావు.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Ramulapalle, Kannur, Kamalapur
Hyderabad
505101
