Telangana Congress

Telangana Congress

Share

01/06/2026

తెలంగాణలోని తండాలు, గూడేల్లో నివసించే ఆదివాసి కుటుంబాలకు 100 శాతం ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు గూడేలను సందర్శించి అర్హులైన పేద కుటుంబాల వివరాలను సేకరించండి, వారికి ఇళ్లు మంజూరు చేసే బాధ్యత ప్రభుత్వానిదే. వివక్షలేని సంక్షేమం, అభివృద్ధే ప్రజా ప్రభుత్వ లక్ష్యం.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
Anumula Revanth Reddy





01/06/2026

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వారసురాలు చిట్యాల శ్వేతను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.





01/06/2026

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం, ఉపాధి, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇందిరమ్మ, కొత్త రేషన్ కార్డులు, అర్హులందరికీ పెన్షన్లు, కార్మికులకు కనీస వేతనాల పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంది. అలాగే అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుండగా, పరిశ్రమలు, సింగరేణి విస్తరణ ద్వారా వేలాది ఉద్యోగాల సృష్టికి చర్యలు చేపడుతోంది.
శ్రీ వివేక్ వెంకటస్వామి గారు,
రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాలు, గనులు& భూగర్భ శాస్త్ర మంత్రివర్యులు.
Vivek Venkatswamy







01/06/2026

కొమరం భీం ఆశయాలకు అనుగుణంగా పేదలు, ఆదివాసీలకు గూడు కల్పించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విస్తృతంగా అమలు చేస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా ఇళ్లు మంజూరు చేయడంతో ఆదివాసీ కుటుంబాల్లో ఆనందం నెలకొంది. పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు.
శ్రీమతి దనసరి సీతక్క (అనసూయ) గారు,
పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు.
Danasari Seethakka



01/06/2026

ఎలివేటెడ్ కారిడార్ వంటి కీలక ప్రాజెక్టులు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పూర్తి చేయలేకపోయారు. సీఎం రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలివేటెడ్ కారిడార్ కు మంజూరు చేసుకున్నాం. భూసేకరణ పరిహారం చెల్లింపులు, అభివృద్ధి పనులకు నిధుల విడుదల వంటి చర్యలు వేగంగా జరుగుతున్నాయి. పదేళ్ల పాలనలో చేయలేని పనులను ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తుంటే విమర్శలు చేయడం తగదు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపైనే ప్రభుత్వం దృష్టి పెట్టింది.

శ్రీ గణేష్ గారు,
కంటోన్మెంట్ నియోజకవర్గ శాసనసభ్యులు.






01/06/2026

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించేవారు. ప్రజా ప్రభుత్వం వస్తే ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, మహిళా కమిషన్ సభ్యురాలుగా మమ్మల్ని నియమించింది.. ఈ నియామకం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




01/06/2026

పేద కుటుంబాల తరతరాల కల అయిన సొంతింటి స్వప్నాన్ని సాకారం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా లక్ష ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. గుడిసెలు లేని తెలంగాణ లక్ష్యంగా ఆదివాసీలు, చెంచులు, కొలాంలు, తోటీలు, కొండరెడ్డిలు సహా అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోంది.
శ్రీ జూపల్లి కృష్ణా రావు గారు,
ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రివర్యులు.
Jupally Krishna Rao



01/06/2026

కొమరం భీం స్ఫూర్తితో ఆదివాసీల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది. ఇంద్రవెల్లి సభలో ఇచ్చిన మాట ప్రకారం ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రాంతం నుంచే ప్రారంభిస్తున్నాం. ఆదిలాబాద్‌ను అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలతో కలిసి నిరంతరం కృషి చేస్తాం.
శ్రీ రేవంత్ రెడ్డి గారు,
ముఖ్యమంత్రివర్యులు.
Anumula Revanth Reddy




01/06/2026

పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్రవ్యాప్తంగా తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికి కనీసం 3,500 ఇళ్లు, ఐటిడిఏ ప్రాంతాలకు అదనంగా 1,000 ఇళ్లు కేటాయించింది. తొలి విడతతో ఆగకుండా రెండో, మూడో విడతల ద్వారా కూడా అర్హులైన ప్రతి పేదవాడికి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.

శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు,
రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు.
Ponguleti Srinivas Reddy



01/06/2026

LIVE: INAUGURATIONS/ FOUNDATIONS OF VARIOUS DEVELOPMENT WORKS and Address the PUBLIC MEETING

Want your business to be the top-listed Government Service in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Gandhi Bhavan Nampally
Hyderabad