29/06/2025
Zilla Grandhalaya Samstha jogulamba Gadwal
zgsgdl
29/06/2025
05/10/2024
గ్రంథాలయాలో వసతుల కల్పనకు చర్యలు చేపడుతాం
జిల్లా గ్రంథాలయాన్ని ఆధునీకరించి, అభివృద్దికి కృషి చేస్తాం
తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డాక్టర్ రియాజ్
గద్వాల: సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు గ్రంధాలయాలు ఎంతో దోహదం చేస్తాయని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ రియాజ్ పేర్కొన్నారు. శనివారం గద్వాల లోని జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రియాజ్ మాట్లాడుతూ మహబూబ్ నగర్ జిల్లా గ్రంధాలయం ఏ విధంగా అభివృద్ధి చెందిందో గద్వాల కేంద్ర గ్రంథాలయాన్ని కూడా ఆ విధంగా అన్ని వసతులతో, సరిపోనుగా వివిధ పోటీ పరీక్షల పుస్తకములు అన్ని వర్గాలకు అంబాటులో ఉండేటట్లు నా యొక్క సహాయ,సహకారాలు అందిస్తానని చెప్పి పాఠకులతో చర్చించారు. ఉమ్మడి జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి వెనుకబడిన జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అడుగులు పడేటట్టు కృషి చేస్తామన్నారు. గ్రంథాయాలయ భవనాలకు స్థలాలు ఉన్నట్లయితే నూతన భవన నిర్మాణాల కోసం కృషి చేస్తానని, భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని పెంపొందించేలా అందుబాటులో తెస్తామన్నారు. పాఠకులకు అన్ని పోటీ పరీక్షల పుస్తకాలు, సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోటానికి తనవంతు ప్రయత్నిస్తానని అన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో డాక్టర్ రియాజ్ గ్రంధాలయ వసతులు, సౌకర్యాల పై పాఠకులను ఆరా తీయగా గ్రంథాలయ భవనాన్ని విస్తరించాలని మరిన్ని పోటీ పరీక్షల పుస్తకాలు, మాసపత్రికలు అన్నిరకాలుగా సమకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గ్రంథాలయ కార్యదర్శి మనోజ్ కుమార్,వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సురేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ జోగులాంబ గద్వాల కార్యదర్శి శ్యాం సుందర్, తదితరులు పాల్గొన్నారు.
15/06/2023
💥 *జిల్లా కేంద్ర గ్రంధాలయాని సందర్శించిన జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి గారు*📘📙
నేడు ఆకస్మికంగా గ్రంధాలయాన్ని సందర్శించగా *జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ గారు కలెక్టర్ గారికి బొకేతో స్వాగతం పలకడం జరిగింది*🪴💐💐
ఇట్టి కార్యక్రమంలో BRS పార్టీ నాయకులు శ్రీనాథ్ ,మైలగడ్డ చంద్రశేఖర్ నాయుడు మరియు గ్రంథాలయ పాఠకులు ఉన్నారు
02/05/2023
*జిల్లా గ్రంధాలయంలో నూతన కంప్యూటర్లు ను ప్రారంభించిన ఎమ్మెల్యే గారు*
ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంధాలయం సంస్థ లో 6లక్ష వ్యయo తో నూతన కంప్యూటర్ విభాగం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు* హాజరయ్యారు.
*ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా నూతన కంప్యూటర్ విభాగాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించడం జరిగినది*.
*జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ ఎమ్మెల్యే గారికి, రాష్టవినియోగదారులఫోరం ఛైర్మన్ గారికి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.*
*ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ.....*
గ్రంధాలయంలో విద్యార్థులు e లైబ్రరీ ద్వారా వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధం అవడం కోసం నూతన కంప్యూటర్ విభాగoను ఏర్పాటు చేసీనారు ఈ సందర్భం గా విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలకు సంబందించిన మెటీరియల్ ను చదువుకోడానికి వివిధ అధ్యయన పుస్తకాలను, విద్యార్థి విద్యార్థులకు అందుబాటులో ఉంచడం జరిగిందని. అదేవిధంగా ప్రస్తుతం ప్రపంచంలోని పరిజ్ఞానం అంతా విద్యార్థులకు అందాలని విషయాలను త్వరగా తెలుసుకోవడానికి విద్యార్థిని విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండే విధంగా ప్రస్తుతం కంప్యూటర్ ఎంతో ఉపయోగమైనది. చిన్న చిన్న విషయాలని ఆన్ లైన్ ద్వార తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి గ్రంధాలయంలో పాఠకులకు పుస్తకాలతో పాటు కంప్యూటర్ అందించే విధంగా తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుంది.
*త్వరలోనే జిల్లా గ్రంధాలయ భవనాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం కృషి చేయడం జరుగుతుంది తెలిపారు*
*లైబ్రరీ చైర్మన్ మాట్లాడుతూ..*
ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గద్వాల విద్య వ్యవస్థలో నూతన శకం ప్రారంభమైందని గద్వాల విద్యార్థుల గురించి అనునిత్యం ఆలోచించే ఎమ్మెల్యే గారు కాలేజీలలో నూతన కోర్సులు, గురుకుల పాఠశాలలు, నర్సింగ్ కళాశాల, పాఠశాలలో వసతులు, కెసిఆర్ స్టడీ సర్కిల్ ద్వారా ఉచిత శిక్షణ, గద్వాల పట్టణంలో అన్ని వసతులతో నూతన లైబ్రరీ బిల్డింగ్ ను, మండల కేంద్రాల్లో లైబ్రరీ బిల్డింగ్ లను ఏర్పాటు చేయబోతున్నారని. లైబ్రరీలో అన్ని రకాల పోటీ పరీక్షలకు నాణ్యమైన మెటీరియల్ ను అందుబాటులో ఉంచుతున్నామని దానితో పాటు e లైబ్రరీ ని కూడా అందుబాటులోకి తెచ్చామని అందుకే 6లక్షల వ్యయంతో నూతన కంప్యూటర్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
👉*ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ విజయ్,జిల్లా గ్రంథాలయ సoస్థ డైరెక్టర్ (కౌన్సిలర్స్) శ్రీమతి అరుణజనార్దన్ రెడ్డి ,కౌన్సిలర్ నరహరి గౌడ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు జనార్ధన్ రెడ్డి, శేఖర్, జిల్లా గ్రంథాలయం సంస్థ కార్యదర్శి శ్యామ్ సుందర్ ,లైబ్రేరియన్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
16/04/2023
*📚మానవత్వం చాటుకున్న గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ....*🪴🌹🙏🏻📒
*గ్రంథాలయానికి రిఫ్రిజిరేటర్ వితరణ*
*గద్వాలలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల దాహార్తిని తీర్చేందుకు గాను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబురామన్ గౌడ కూలింగ్ రిఫ్రిజిరేటర్ ను తెప్పించారు. తన సొంత ఖర్చులతో 80 లిటీర్ల ఫ్రిడ్జ్ ను గ్రంథాలయానికి గ్రంథాలయ చైర్మన్ అందజేశారు*.
*కార్యక్రమంలో గ్రంథాలయపాఠకులు*,
*గట్టు ఎంపిపి విజయకుమార్*
, *కెటీదొడ్డి జడ్పిటిసి రాజశేఖర్ ,బి ఆర్ఎస్ నాయకులు, గాండ్ల శ్రీధర్, శ్రీనాథ్ తదితరులు,పాల్గొన్నారు*
*🙏కృతఙ్ఞతలు తెల్పిన పాఠకులు...*
*గ్రంథాలయ పాఠకుల కోరిక మేరకు*...
*వేసవికాలం దృష్టి ఉంచుకొని*...
*గ్రంధాలయం లో ప్రిపరేషన్ అవుతున్న అభ్యర్థుల కోసంఒక చక్కని కూలింగ్ వాటర్ ఫ్రీడ్జిని ఏర్పాటు చేసిన*
*గ్రంధాలయం చైర్మన్ జంబు రామన్ గౌడ గారికి,జిల్లా కార్యదర్శి వై. శ్యాంసుందర్ గారికి గ్రంథాలయఅధికారి రామాంజనేయులు గారికి*
*గ్రంథాలయ సిబ్బంది కి జిల్లా కేంద్ర గ్రంథాలయ గద్వాల పాఠకులు ధన్యవాదాలు తెలియజేశారు*
,💐🙏
13/04/2023
*ఘనంగా జిల్లా గ్రంథాలయంలో కవి సమ్మేళనం*
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారి సూచన మేరకు జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం *జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ*
ఆధ్వర్యంలో
*కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు*.
అన్ని అంశాలపై కవులు తమ కవితల ద్వారా ప్రజల్లో మరింత చైతన్యాన్ని నింపాలన్నారు. ఈ సందర్భంగా కవులు తెలుగు భాష విశిష్టతను చాటేలా కవిత్వాలు చదివి వినిపించారు. అనంతరం కవి సమ్మేళన కార్యక్రమానికి హజరైన 20 మంది కవులను చైర్మన్ శాలువా, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో *గట్టు ఎంపీ విజయకుమార్, జిల్లా గ్రంథాలయ పాలక వర్గ సభ్యురాలు& కౌన్సిలర్, అరుణ వికాస భారతి జిల్లా అధ్యక్షులువెంకట్రామయ్యశెట్టి బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనాథ్*
ఇట్టి కార్యక్రమానికి *వ్యాఖ్యాతగా అంబటి భాను ప్రకాష్ గారునిర్వహించడం జరిగింది మరియు లైబ్రేరియన్ రామాంజనేయులు*,సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు
15/03/2023
*గ్రంథాలయ పాఠకుల హామీ నెరవేర్చిన జిల్లా గ్రంథాలయ చైర్మన్*🙏
గద్వాలలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగులు గ్రంథాలయంలో తమకు సరిపడా కుర్చీలు కావాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడను మంగళవారం కోరారు. దీనికి గాను స్పందించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జంబురామన్ గౌడ బుధవారం రూ.20వేలు ఖర్చులతో మొత్తం32 కుర్చీలను తెప్పించి గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగులకు ఆయన సమకూర్చాడు. కార్యక్రమంలో బీ ఆర్ యస్ సీనియర్ నాయకులు గట్టు శ్రీనాథ్ మరియు గ్రంథాలయ పాఠకులు గ్రంథాలయ అధికారి రామాంజనేయులు,పార్ట్ టైం స్వీపర్స్ గోపాల్, భరత్ బాబు తదితరులు పాల్గొన్నారు
08/02/2023
జిల్లా గ్రంథాలయ సoస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం*📕📗📙📚
📖📖గ్రంథాలయాల అభివృద్ధికి సహకరించండి*📒
జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలో పంచాయతీ కార్యదర్శులు ఇంటిపన్ను వసూలు చేసి అందులో ఎనిమిది శాతం సెస్ అమౌంట్ ని గ్రంథాలయాల అభివృద్ధి కోసం కేటాయించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ అన్నారు. బుధవారం గద్వాలలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గద్వాల మండలం అనంతపురంలో ఎమ్మెల్యే అభివృద్ధి నిధుల ద్వారా గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ క్రాంతి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని 10 కంప్యూటర్ల కోసం మంజూరు ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా మండలాల్లో జరిగే సర్వసభ్య సమావేశాలకు జిల్లా గ్రంథాలయాల డైరెక్టర్లకు కూడా అవకాశం కల్పించాలని కోరారు.జిల్లా కేంద్రం గద్వాలలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణం కోసం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రూ.1.50కోట్లు మంజూరు చేయడం పట్ల చైర్మన్ తో పాటు గ్రంథాయాల డైరెక్టర్లు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ డైరెక్టర్లు ప్రతాప్ గౌడ్,యం పి పి కృష్ణయ్య, లోకేశ్వర్ రెడ్డి, గుమ్మ గోవర్ధన్, సీఎం సురేష్, అరుణ, వయోజన విద్య ప్రాజెక్టు డైరెక్టర్ మహమ్మద్ నోమాన్, జిల్లా గ్రంథాలయ సoస్థ కార్యదర్శి ప్రతాప్, గ్రంథాలయ అధికారి రామాంజనేయులు పాల్గొన్నారు.
24/01/2023
*అయిజ శాఖ గ్రంధాలయం ను సందర్శించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్*📚📖📕📗📙📙
*అయిజ శాఖ గ్రంధాలయం ను సోమవారం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ జంబు రామన్ గౌడ గారు సందర్శించడం జరిగింది* 📗📘📗📕📒📙📚
*జిల్లా గ్రంధాయాల సంస్థ చైర్మన్ గారిని బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించడం జరిగింది*
గ్రంథాలయంలో నెలకొన్న సమస్యలను అక్కడ ఉన్న పాఠకులను విద్యార్థులను అడిగితెలుసుకున్నారు అలాగే గ్రంథాలయం కు నూతన భవనం ఉంటే అన్ని సమస్యలుతీరుతాయని చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం. జరిగింది చైర్మన్ గారు మాట్లాడుతూ తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారితో చర్చించి త్వరలోనే గ్రంధాలయ భవనానికి స్థలం కేటాయించుటకు హామీ ఇచ్చినట్లయితే నిర్మాణానికి అనుకూలంగా ఉంటుందని అలాగే స్థానిక ప్రజాప్రతినిదులు అందరి సహాయ సహకారాలు ఉండాలి అని తేలిపారు విరి వేంట *గట్టు mpp విజయ్ కుమార్ ,బీ ఆర్ యస్ సీనియర్ నాయకులు రంగు శ్రీధర్ పట్టణ అద్యక్షుడు మహేబుబ్ పాషా మరియు కేటు దొడ్డి బి ఆర్ యస్ మండలం పార్టీ అద్యక్షుడు ఉరుకుందు , యుగేందర్ గౌడు కాడలా శివరాజప్ప ,బి ఆర్ యస్ పార్టీ నాయకులు రామదాస్ పాల్గొన్నారు*
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the business
Telephone
Website
Address
Hyderabad
Opening Hours
| Monday | 8am - 5pm |
| Tuesday | 8am - 5pm |
| Wednesday | 9am - 5pm |
| Thursday | 9am - 5pm |
| Saturday | 9am - 5pm |
| Sunday | 9am - 5pm |
