CPI Hayathnagar

Directions

CPI Hayathnagar Hayathnagar Mandal Council

దసరా సెలవుల్లోనూ క్లాసులా? విద్యార్థుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదు! ✊ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించినా నిబ...
10/10/2026

దసరా సెలవుల్లోనూ క్లాసులా? విద్యార్థుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదు! ✊

ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించినా నిబంధనలకు విరుద్ధంగా హయత్‌నగర్‌లోని సెయింట్ ఆన్స్ హైస్కూల్, శ్రీ నారాయణ జూనియర్ కళాశాలల్లో చాటుగా నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఏఐఎస్‌ఎఫ్ (AISF) మండల సమితి ఆధ్వర్యంలో అడ్డుకోవడం జరిగింది. పండుగ పూట పిల్లలకు కనీస విశ్రాంతి లేకుండా చేసి వారిని మానసిక ఒత్తిడికి గురిచేస్తే సహించేది లేదు.
సెలవుల్లో ఎలాంటి స్పెషల్ క్లాసులు కానీ, పరీక్షలు కానీ నిర్వహించవద్దని యాజమాన్యాలను తీవ్రంగా హెచ్చరిస్తున్నాము.

మండల విద్యాశాఖ అధికారి (MEO) గారు తక్షణమే స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా అన్ని విద్యాసంస్థలకూ కఠిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం!

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల కార్యవర్గ సభ్యులు రవితేజ తదితరులు పాల్గొన్నారు.

నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం.. కానీ ఈ నియంతృత్వ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు విచిత్రంగా తమకు అన...
10/10/2026

నిజమైన ప్రజాస్వామ్యం అంటే ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం.. కానీ ఈ నియంతృత్వ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు విచిత్రంగా తమకు అనుకూలమైన ఓట్లను ఎంచుకుంటోంది....

స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం నేడు అధికార పార్టీ చేతిలో పూర్తిగా కీలుబొమ్మగా మారిపోయింది.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ కనుసన్నల్లోనే దొంగచాటుగా ప్రతిపక్షాలకు పడే ఓట్లను గల్లంతు చేస్తూ.. సామాన్యుల ఓటు హక్కును నిర్దాక్షిణ్యంగా కాలరాస్తున్నారు.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ నియంతృత్వ విధానాలను, ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిని ప్రతి ఒక్కరూ ఖండించాలి ప్రశ్నించాలి.

ఈ కుట్రలను తిప్పికొట్టి మన ఓటు హక్కును కాపాడుకుందాం.. ప్రమాదంలో ఉన్న భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం! 🚩

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో జేఏసీ కూటమి అభ్యర్థులదే ఘన విజయం! 🚌టీజీఎస్‌ఆర్టీసీలో (TGSRTC) అత్యంత ప్రతిష్టాత్మకంగా ...
09/10/2026

ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో జేఏసీ కూటమి అభ్యర్థులదే ఘన విజయం! 🚌

టీజీఎస్‌ఆర్టీసీలో (TGSRTC) అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా హయత్‌నగర్-1 మరియు 2 డిపోల పోలింగ్ ఊపందుకుంది.
TGS RTC - EU - TMU - NMU జేఏసీ కూటమి ఆధ్వర్యంలో కార్మికుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ ఎన్నికల ప్రచారంలో సీపీఐ హయత్‌నగర్ మండల నిర్మాణ బాధ్యులు, ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు మరియు ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు పబ్బతి లక్ష్మణ్ గారు పాల్గొని కార్మికులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర గుర్తింపు సంఘం క్లాజ్-3 కింద కేటాయించిన 'బస్సు' గుర్తుకు, స్థానిక గుర్తింపు సంఘం క్లాజ్-6 కింద కేటాయించిన 'నిచ్చెన' గుర్తుకు కార్మికులంతా భారీ సంఖ్యలో ఓట్లు వేసి జేఏసీ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

కార్మికుల కష్టాలను తీర్చి, వారి హక్కుల కోసం నిరంతరం పోరాడే ఏఐటీయూసీ అనుబంధ జేఏసీ కూటమి విజయం తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్మికుడు తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కన్వీనర్ అంబల రాములు, ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు అమనుగంటి వెంకన్న, డిపో అధ్యక్ష కార్యదర్శులు ఎం. చంద్రయ్య, డి. వెంకటేష్ ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి శాగంటి వీరన్న తదితర నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజాస్వామ్య పరిరక్షణకై ఉధృతంగా సాగిన 'చలో లోక్ భవన్' ముట్టడి! 🚩కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన ...
08/10/2026

ప్రజాస్వామ్య పరిరక్షణకై ఉధృతంగా సాగిన 'చలో లోక్ భవన్' ముట్టడి! 🚩

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, 'SIR' ప్రక్రియలో జరుగుతున్న ఓట్ల గల్లంతును నిరసిస్తూ నిర్వహించిన 'చలో లోక్ భవన్' మహా ప్రదర్శన మరియు ముట్టడి కార్యక్రమం విజయవంతమైంది.

ఈ పోరాటంలో సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ పల్లా వెంకట్ రెడ్డి గారు, రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కామ్రేడ్ కూనంనేని సాంబశివరావు గారు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఈటీ నరసింహ గారు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పాలమాకుల జంగన్న గారు, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పానగంటి పర్వతాలు గారు, ఎల్బీనగర్ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారు మరియు ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కామ్రేడ్ సామిడి వంశీ వర్ధన్ రెడ్డి గారు అలాగే వీరితో పాటు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బొంగు అరుణ్ కుమార్ గౌడ్, ఏఐటీయూసీ మండల అధ్యక్షులు పట్టేటి శేఖర్, బీఓసీ మండల కార్యదర్శి పెరుమాళ్ల సామెల్, నాయకులు ఉపేందర్, ఏఐఎస్‌ఎఫ్ మండల సంయుక్త కార్యదర్శి జూనోతల భాను ప్రకాష్, గౌరవ అధ్యక్షులు జిన్నే బన్నీ అలాగే సిపిఐ హయత్ నగర్ మండల సమితి తో పాటు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కదలిచ్చి ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ప్రజాస్వామ్యాన్ని, ఓటు హక్కును కాపాడుకునే వరకు ఈ పోరాటం ఆగదు.

08/10/2026

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కదం తొక్కిన సీపీఐ! ✊🚩

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల పిలుపుమేరకు ఈరోజు నిర్వహించిన 'చలో లోక్ భవన్' కార్యక్రమం ఉధృతంగా సాగింది.

ఈ భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) హయత్‌నగర్ మండల సమితి.
ElectionCommission VoteRights LalSalam LeftParties

08/10/2026

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కదం తొక్కిన సీపీఐ! ✊🚩

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష పార్టీల పిలుపుమేరకు ఈరోజు నిర్వహించిన 'చలో లోక్ భవన్' కార్యక్రమం ఉధృతంగా సాగింది.

ఈ భారీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) హయత్‌నగర్ మండల సమితి.

04/10/2026

హయత్‌నగర్ లోని కార్మికులకు త్వరలో శాశ్వత లేబర్ అడ్డా!

హయత్‌నగర్‌లో సరైన స్థావరం లేక ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికుల కోసం శాశ్వత షెల్టర్ నిర్మించాలని సీపీఐ, ఏఐటీయూసీ సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి.

మా అభ్యర్థన మేరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారితో కలిసి ఈరోజు లేబర్ అడ్డాను స్వయంగా సందర్శించారు.

నేరుగా కార్మికులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. రేడియో స్టేషన్ సమీపంలో కార్మికుల కోసం ఒక పక్కా షెడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని నిర్మాణానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి సీపీఐ, ఏఐటీయూసీ, బీఓసి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కన్వీనర్ అంబల రాములు, బీఓసి నాయకులు సామెల్, ర�

హయత్‌నగర్ లోని కార్మికులకు త్వరలో శాశ్వత లేబర్ అడ్డా! ✊హయత్‌నగర్‌లో సరైన స్థావరం లేక ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన తీవ్ర ఇబ...
04/10/2026

హయత్‌నగర్ లోని కార్మికులకు త్వరలో శాశ్వత లేబర్ అడ్డా! ✊

హయత్‌నగర్‌లో సరైన స్థావరం లేక ఎన్నో ఏళ్లుగా రోడ్డు పక్కన తీవ్ర ఇబ్బందులు పడుతున్న కార్మికుల కోసం శాశ్వత షెల్టర్ నిర్మించాలని సీపీఐ, ఏఐటీయూసీ సుదీర్ఘకాలంగా పోరాడుతున్నాయి.

మా అభ్యర్థన మేరకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే శ్రీ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి కామ్రేడ్ సామిడి శేఖర్ రెడ్డి గారితో కలిసి ఈరోజు లేబర్ అడ్డాను స్వయంగా సందర్శించారు.

నేరుగా కార్మికులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. రేడియో స్టేషన్ సమీపంలో కార్మికుల కోసం ఒక పక్కా షెడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలను అర్థం చేసుకుని నిర్మాణానికి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి సీపీఐ, ఏఐటీయూసీ, బీఓసి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కన్వీనర్ అంబల రాములు, బీఓసి నాయకులు సామెల్, రమేష్, సౌజన్య, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when CPI Hayathnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share