08/09/2025
టిపిసిసి అధ్యక్షులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన మరియు ఇన్చార్జ్ జనరల్ సెక్రెటరీ మీనాక్షి నటరాజన్ గారి సమక్షంలో జరిగిన "తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో" Bhatti Vikramarka Mallu Ponnam Prabhakar సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్ గారు మరియు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారు ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Mahesh Goud BommaMeenakshi NatarajanP Vinay KumarTelangana Congress Anil Eravathri
27/08/2025
గాంధీ భవన్‌లో బీసీ రిజర్వేషన్ల న్యాయ సలహా సంప్రదింపుల కమిటీ సమావేశంలో… Meenakshi Natarajan Bhatti Vikramarka Mallu Mahesh Goud BommaPonnam Uttam Kumar Reddy P Vinay Kumar Anil Eravathri Danasari Seethakka
26/08/2025
తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రివర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి శ్రీ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని భేటీ కావడం జరిగింది.
అలాగే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం కోసము న్యాయ సలహాలు తీసుకోవడం జరిగింది,
ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు, సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్, బీసీల హక్కుల నాయకులు డాక్టర్ పి వినయ్ కుమార్, ఈరవత్రి అనిల్ గారు తదితరులు పాల్గొన్నారు.
Meenakshi Natarajan Telangana Congress Anumula Revanth Reddy P Vinay Kumar Ponnam Prabhakar Mahesh Goud Bomma
26/08/2025
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని న్యాయ సలహా కొరకు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం మరియు కాంగ్రెస్ బీసీ నాయకులతో కలిసి రాజ్యసభ సభ్యుడు శ్రీ అభిషేక్ సింఘ్వీ గారితో సమావేశం కావడం జరిగింది.
ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్, బీసీల హక్కుల నాయకులు డాక్టర్ పి వినయ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వీహెచ్ గారు, ఈరవత్రి అనిల్ గారు తదితరులు పాల్గొన్నారు.
Telangana Congress P Vinay Kumar Ponnam Prabhakar Meenakshi Natarajan
16/08/2025
నిన్న గాంధీ భవన్‌లో సంవిధాన్ బచావో కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సంవిధాన్ బచావో కమిటీ సభ్యులతో మరియు వివిధ సివిల్ సొసైటీ సభ్యులతో కలిసి నిన్న గాంధీ భవన్ లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశంలో సంవిధాన్ బచావో కమిటీ భవిష్యత్తు కార్యాచరణ మరియు జిల్లా కమిటీల విస్తరణ మరియు వివిధ సివిల్ సొసైటీలతో అనుసంధానమై రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేయాలని, రాజ్యాంగ హక్కులను ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని కార్యక్రమంలో చర్చించడం జరిగింది.
అలాగే ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్ కుమార్ గారు మాట్లాడుతూ రాజ్యాంగము ప్రతి విషయంలోనూ బలహీనపడుతూ, ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ విధానాలతో బలహీన పడుతూ వస్తుంది, అలాంటి మన భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం &బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాహుల్ గాంధీ గారు ఒకవైపు బీసీల లెక్కలు దేశవ్యాప్తంగా తేల్చాలని పోరాటం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో బీసీ లెక్కలను బయట పెట్టించి, వారికి దక్కవలసిన రిజర్వేషన్లను చట్టబద్ధంగా అందించడం కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతూ, మరోవైపు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల అవకతవకలో జరుగుతున్న అక్రమాలను బయటపెడుతూ వాటిపై పోరాడుతూ రాజ్యాంగ హక్కులను కాపాడుతున్నారని మాట్లాడారు.
అలాగే డాక్టర్ వినయ్ కుమార్ గారు మాట్లాడుతూ గతంలో భారత ఎలక్షన్ కమిషన్ ని ఎన్నుకోవడానికి ఒక నిర్ణీష్టమైన వ్యవస్థ ఉండేది దానిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని మాట్లాడుతూ..గతంలో ఎలక్షన్ కమిషన్ ని ఎన్నుకోవడానికి ఒక విధానం ఉండేది దానిలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, అలాగే చీఫ్ జస్టిస్ ద్వారా ఎన్నుకునే విధానం ఉండేది కానీ దానిని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వము ఆ వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ..ప్రస్తుత విధానంలో చీఫ్ జడ్జిని తొలగించి, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు అలాగే కేంద్రమంత్రి ద్వారా ఎన్నుకునే నూతన విధానాన్ని తీసుకొచ్చి, బిజెపి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే 2:1 రేషియోలో వారికి అనుకూలంగా ఉండే విధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా భారత రాజ్యాంగం ప్రకారం న్యూట్రల్ వ్యవస్థని కేంద్ర బిజెపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు.
అలాగే గతంలో ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ వంటి వ్యవస్థలని ఏ విధంగా నిర్వీణ్యం చేసిందో అలాగే ప్రస్తుతము భారత ఎన్నికల వ్యవస్థని కూడా వారికి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం బిజెపి చేస్తుందని ఆరోపించారు.
భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసము బలపరచడం కోసము కాంగ్రెస్ పార్టీ విధానాలతో, రాహుల్ గాంధీ గారి ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రంలో సంవిధాన్ బచావో కమిటీ ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను చేస్తూ ప్రజలను అవేర్నెస్ చేస్తూ నవంబర్ 26 భారత రాజ్యాంగం దినోత్సవం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాలు మరియు ప్రజా సంఘాల సహకారంతో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపడతామని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఏఐసిసి నాయకులు జుబేర్ ఖాన్, సివిల్ సొసైటీ నాయకులు డాక్టర్ ఇస్మాయిల్, పురుషోత్తం రెడ్డి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.
P Vinay KumarTelangana CongressMeenakshi NatarajanMahesh Goud BommaDr Addanki DayakarRahul GandhiIndian National Congress
09/07/2025
రాజ్యాంగ పరిరక్షణ కమిటీ (సంవిధాన్ బచావో కమిటీ) చైర్మన్ డాక్టర్ వినయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన '75 ఏళ్ల రాజ్యాంగ ప్రస్థానం' సదస్సులో టీపీసీసీ అధ్యక్షులు శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ శాంతా సిన్హా, రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్,డాక్టర్ ఇస్మాయిల్ తదితరులు హాజరయ్యారు.
Indian National Congress Telangana Congress Rahul Gandhi Meenakshi Natarajan Anumula Revanth Reddy P Vinay Kumar Mahesh Goud Bomma Madhu Yaskhi Goud Mahesh Goud Bomma
03/07/2025
కుట్రల గురించి వీళ్ళు మాట్లాడుతున్నరు!
Telangana Congress Indian National Congress Meenakshi Natarajan Mahesh Goud Bomma P Vinay Kumar